గుంటూరు పివిఆర్ లిమిటెడ్ ది సినిమాస్ లో ప్రేక్షకుల తో చిత్ర విజయానందాన్ని పంచుకున్న డిజె టిల్లు టీం
పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న డిజె టిల్లు ఇప్పుడు సక్సెస్ యాత్రలో ప్రేక్షకుల్ని కలుసుకుంటున్నాడు.
వాళ్ళతో నవ్వుల్ని పంచుకుంటున్నారు. గుంటూరులో దిసినిమాస్ లో సడన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లును చూసి కేరింతలు కొట్టారు ప్రేక్షకులు. థియేటర్ లో ప్రేక్షకుల తో కలసి చూసిన హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ నేహా శెట్టి, దర్శకుడు విమల్ ఆడియన్స్ మధ్య కేక్ కట్ చేసి సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకున్నారు..
ఈ సందర్భంగా
హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూః
డిజె టిల్లు సక్సెస్ మీతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. టిల్లు గాడు చేసే అల్లరి మీతో కలసి చూడటం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మీనవ్వులు కామెంట్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేసాను..రాధికాకు ఫుల్ సరెండర్ అయినా ఆమె ఎట్లా అంటే అట్లా అంటూ టిల్లు స్టయిల్ లో మాట్లాడి ఆకట్టుకున్నారు.
హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూః
సినిమా మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రాధిక క్యారెక్టర్ మీకు నచ్చిందా..? అంటూ ఆడియన్స్ తో కలసి సినిమా చూడటం చాలా సంతోషంగా ఉంది. మీ ఆదరణకు చాలా రుణ పడిఉంటాను అన్నారు.
దర్శకుడు విమల్ మాట్లాడుతూః
ఆడియన్స్ కి చాలా థ్యాంక్స్.. మీకు టిల్లు క్యారెక్టర్ ఎంతగా నచ్చిందో మీ కేరింతలు చెబుతున్నాయి అన్నారు..
Post a Comment