Home » » Paagal Pre Release Event held Grandly

Paagal Pre Release Event held Grandly

 పాగ‌ల్ ప్రీ రిలీజ్ ఈవెంట్...



విష్వ‌క్‌సేన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం `పాగ‌ల్‌`. నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ హీరోయిన్స్‌గా న‌టించారు.  సినిమా ఆగ‌స్ట్ 14న  ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో..


హీరో తేజ స‌జ్జ మాట్లాడుతూ - ``ఈ సినిమా యూనిట్ అంతా నాకు బాగా కావాల్సిన వారు. బెక్కం వేణుగోపాల్ గారు వ‌న్ ఆఫ్ మై వెల్ విష‌ర్‌. దిల్ రాజు గారు ఎంతోమంది టెక్నీషియ‌న్స్ ని ఇంట్ర‌డ్యూస్ చేశారు. రాజుగారి బ్యాన‌ర్‌లో సినిమా వ‌స్తుందంటే ఆ సెల‌బ్రేష‌న్స్ వేరు..విశ్వ‌క్  సేన్ ఈ సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాలి. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.


హీరోయిన్ నివేదా పేతురాజ్ మాట్లాడుతూ -  ‘‘ఎంటైర్ టీమ్ రెండేళ్లుగా ఈ సినిమా బాగా రావాల‌ని ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డారు. ఈ సినిమాను ‘పాగల్’లా చేశారు. క‌చ్చితంగా ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు.


హీరోయిన్ మేఘా లేఖ మాట్లాడుతూ - ``ఇది నా ఫ‌స్ట్ మూవీ..ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు థ్యాంక్స్`` అన్నారు.


హీరోయిన్ సిమ్రాన్ చౌద‌రి మాట్లాడుతూ - ``పాగ‌ల్ కంప్లీట్ ఫ్యామిలీ ప్యాక్డ్ మూవీ. అన్ని వ‌య‌సుల వాళ్లు సినిమాను చూడొచ్చు. ఆగ‌స్ట్ 14న వ‌స్తున్న మా సినిమాను ఎంక‌రేజ్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


హీరో కార్తికేయ మాట్లాడుతూ - ``ఈ కోవిడ్ ప‌రిస్థితుల త‌ర్వాత కూడా మేము థియేట‌ర్స్‌లోనే

సినిమాలు చూస్తాం అని తెలుగు ప్రేక్షకులు మ‌రోసారి నిరూపించారు. విశ్వ‌క్ చాలా జెన్యూన్ ప‌ర్స‌న్‌. అలాగే జెన్యూన్ యాక్ట‌ర్‌. ఫ‌స్ట్‌టైమ్ ల‌వ‌ర్‌బాయ్‌గా చేస్తున్నాడు. ట్రైల‌ర్ ఫెంటాస్టిక్‌..గూగుల్ సాంగ్‌లో డ్యాన్స్ కూడా అద‌ర‌గొట్టాడు. ఆగ‌స్ట్‌14న థియేట‌ర్స్‌లో క‌లుద్దాం`` అన్నారు.


హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ - ``పాగ‌ల్ స్టోరీ నాకు తెలుసు. క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను. త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్ థియేట‌ర్స్ వ‌స్తార‌ని న‌మ్ముతున్నాను. ఆగ‌స్ట్‌19న నా సినిమా రిలీజ‌వుతుంది. 14న నువ్వు బ్లాక్ బ‌స్ట‌ర్ తీసుకో బ్ర‌ద‌ర్..19న నేను క్లాసిక్ తీసుకుంటాను`` అన్నారు


చిత్ర ద‌ర్శ‌కుడు న‌రేశ్ కుప్పిలి మ‌ట్లాడుతూ -  ``దిల్‌రాజు ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట‌రైన ద‌గ్గ‌ర‌నుండి ఈ సినిమా స్పాన్ పెరిగింది. ఆ బ్యాన‌ర్‌లో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీ..బెక్కం వేణుగోపాల్ గారితో మూడెళ్ల నుండి ట్రావెల్ అవుతున్నాను. విశ్వ‌క్ స్టోరీ విన‌గానే షేక్ హ్యాండ్ ఇచ్చి మ‌నం సినిమా చేస్తున్నాం అని చెప్పారు. విశ్వ‌క్ కెరీర్‌లో బెస్ట్ బ్లాక్ బ‌స్టర్ అవుతుంది. నా ఫ‌స్ట్ మూవీకి స‌పోర్ట్ చేసిన ప్ర‌తిఒక్క‌రికీ థ్యాంక్స్‌`` అన్నారు.


చిత్ర నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ  - ``దిల్‌రాజుగారు ఇచ్చిన ధైర్యంతో రిస్క్ అయినా సినిమాను థియేట‌ర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. రాజుగారికి, శిరీష్‌గారి స‌పోర్ట్ మ‌రువ‌లేనిది. వారికి  ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను..నేను గ‌ర్వ‌ప‌డే, మీరు ఇష్ట‌ప‌డే సినిమా చేశాను అని అనుకుంటున్నా..మా టీమ్ అంద‌రికీ శుభాకాంక్ష‌లు.. అలాగే నివేదా పేతురాజ్, సిమ్రాన్‌, మేఘ‌లేఖ చ‌క్క‌గా స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.  


ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``కోవిడ్ వ‌చ్చిన త‌ర్వాత కూడా తెలుగు సినిమాలు రిలీజ‌య్యి వ‌కీల్‌సాబ్ వ‌ర‌కూ కంటిన్యూ అయ్యాయి. అందుకు తెలుగు ప్రేక్ష‌కుల‌కి మ‌న‌స్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. ఇప్పుడు సెకండ్ వేవ్ త‌ర్వాత కూడా తెలుగు సినిమాలే విడుద‌ల‌వుతున్నాయి. చాలా హ్యాపీ.. ఇంత మంది యంగ్ హీరోస్ ఈ ఈవెంట్ కి రావ‌డం చాలా మంచి విష‌యం. ఈ క‌థ విన‌గానే కొత్త‌గా అనిపించి ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట‌ర‌వ్వ‌డం జ‌రిగింది. ఇంత త‌క్కువ స‌మ‌యంలో ప్ర‌మోష‌న్స్‌ని త‌న బుజాల‌మీద వేసుకుని మ‌రీ విశ్వ‌క్ చేశాడు. విశ్వ‌క్ ని చూసి ప్రొడ్యూస‌ర్‌గా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. న‌రేష్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు.  పాగ‌ల్ టీమ్ అంద‌రకీ వెల్‌గుడ్ జ‌ర్నీ..ఆగ‌స్ట్ 14న  వ‌ర‌ల్డ్‌వైడ్ గా థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుంది. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.


విశ్వక్ సేన్ మాట్లాడుతూ - ``ఈ సక్సెస్ మీట్‌లో నేను ఎక్కువగా మాట్లాడతాను..నేను మధ్యాహ్నం ఈ సినిమా చూశాను. అందుకే సక్సెస్ మీట్ అంటున్నా.. నేను నా లైఫ్‌లో  చాలా మందిని లవ్ చేసా అంటారు. కానీ దానికి క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా ? ముందు అందంగా ఉందో లేదో చూస్తారు. డబ్బును చూస్తారు. ఆ తర్వాత మన కులమా కాదా అని చూస్తారు. ఇలా చాలా లెక్కలు వేసుకుని ప్రేమిస్తారు. కానీ ఇవేమి లేకుండా ప్రేమించే వాడే ప్రేమ్‌. తన తల్లి ప్రేమను వెతుక్కుంటూ స్టార్ట్ చేసిన జర్నీనే ఈ పాగల్.

ఈ సినిమాను దిల్ రాజు మేము.. రూ 5లో తీద్దాం అనుకుందాం. కానీ రాజుగారు పది మెట్లు ఎక్కించారు. న‌రేశ్‌ ఈ సినిమా కథ చెప్పినప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ మూవీతో పెద్ద హిట్టు కొట్టబోతున్నాము. బెక్కం వేణుగోపాల్, డైరెక్ట‌ర్, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం. హీరోయిన్స్ అందరూ చాలా బాగా చేశారు. మాములుగా  శుక్రవారం మూవీస్ రిలీజ్ చేస్తారు. కానీ మేము పాగల్ కదా.. అందుకే శనివారం రిలీజ్ చేస్తున్నాం. ఆ రోజున పార్టీలు, పబ్‏లలోనే కాదు… థియేటర్లలో కూడా జ‌రుగుతాయి. చాలా మంది ఈ సమయంలో సినిమా విడుదల చేయడం కరెక్టా అని అడుగుతున్నారు. నేను వాళ్లకు చెప్పేది ఒక్కటే. సర్కస్‏లో సింహంతో ఎవరైనా ఆడుకుంటారు. కానీ నేను అడవికి వచ్చే ఆడుకునే టైపు. మూసిన థియేటర్లను కూడా ఈ సినిమాతో ఓపెన్ చేపిస్తా.. తప్పైతే  నా పేరు మార్చుకుంటా. ఇండిపెండెన్స్ డే ఆగస్ట్‌15 కాని సినిమా థియేట‌ర్స్‌కి ఇండిపెండెన్స్ డే ఆగ‌స్ట్ 14`` అన్నారు.


న‌టీన‌టులు:  విష్వ‌క్ సేన్‌, నివేదా పేతురాజ్‌, సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ‌, రాహుల్ రామ‌కృష్ణ, మురళీ శర్మ, మహేశ్ అచంట, ఇంద్రజ శంకర్ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:


బ్యాన‌ర్స్‌:  శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా

స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు

నిర్మాత‌: బెక్కెం వేణుగోపాల్‌

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: న‌రేశ్ కుప్పిలి

సినిమాటోగ్రఫీ: మ‌ణికంద‌న్‌

మ్యూజిక్‌: ర‌ధ‌న్‌

ఎడిట‌ర్‌: గ్యారీ బి.హెచ్‌

పాట‌లు: చంద్రబోస్, రామ‌జోగ‌య్య శాస్త్రి, కెకె, అనంత శ్రీరాం

ఫైట్ మాస్ట‌ర్స్‌: దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌, రామ‌కృష్ణ‌

డాన్స్ మాస్ట‌ర్‌: విజ‌య్ బిన్ని

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ల‌తా త‌రుణ్‌

చీఫ్ కో డైరెక్ట‌ర్‌: వెంక‌ట్ మ‌ద్దిరాల‌

ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: అనిల్ భాను

ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌: సిద్ధం విజ‌య్ కుమార్‌


Share this article :