Home » » Crazy Uncle's Releasing on August 19th

Crazy Uncle's Releasing on August 19th

 


ఈ నెల 19న  క్రేజీ అంకుల్స్ విడుద‌ల‌

గుడ్ సినిమా గ్రూప్‌ నిర్మాణంలో క్రేజీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం క్రేజీ అంకుల్స్‌. శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సారధ్యంలో, గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్ర‌ధాన పాత్ర‌లో ఇ. సత్తి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘క్రేజీ అంకుల్స్’ సినిమా ఈ నెల 19న అన్ని కేంద్రాల‌లో విడుద‌ల‌కాబోతోంద‌ని చిత్ర యూనిట్ తెలిపారు.

 సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో బండ్ల గణేష్, ప్రవీణ్, పోసాని కృష్ణ మురళి, గిరి నటిస్తున్నారు.  కామెడీ జానర్‌లో తెరకెక్కిన క్రేజీ అంకుల్స్‌ చిత్రం ఆగస్టు 19న‌ థియేటర్స్‌లో విడుదల కానుంది. గ‌తంలో  చిత్ర యూనిట్‌ క్రేజీ అంకుల్ టైటిల్ లిరిక‌ల్ సాంగ్‌ని విడుదల చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు రఘు కుంచే సంగీతం అందించగా.. లిప్సిక గానం చేసింది. కాసర్ల శ్యామ్ ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ పాటలో శ్రీముఖి తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది.శ్రీ‌ముఖి పాట‌కు  ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల‌నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. 50 లక్షల వ్యూస్ సాధించి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా కిర‌ణ్‌ కె తలశిల (యుఎస్‌) వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన శ్రేయాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మేలో విడుదల చేద్దాం అనుకున్నాం. కరోనా వచ్చింది. ఇప్పుడు ‘క్రేజీ అంకుల్స్‌’ను ఇదే నెల 19న విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నాం అన్నారు.



Share this article :