నా కంఫర్ట్ జోనర్ నుంచి బయటకు వచ్చి డిఫరెంట్‌గా నేను చేసిన సినిమా `తిమ్మరుసు` - హీరో సత్యదేవ్
సత్యదేవ్... ప్రతి సినిమా ఓ డిఫరెంట్‌గా చేస్తూ విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న కథానాయకుడు. పాత్ర ఏదైనా అందులో ఒదిగి పోయే నేటి తరం అతి కొద్ది మంది నటుల్లో సత్యదేవ్ ఒకరు. బ్లఫ్ మాస్టర్‌లో మోసాలు చేసేవాడిగా, ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్యలో విలేజ్ కుర్రాడిగా మెప్పించిన సత్యదేవ్ ఇప్పుడు అన్యాయాలను ప్రశ్నించే లాయర్ ‘తిమ్మరుసు’గా కనిపించబోతున్నారు. జూలై 30న విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ...
- `ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య` సినిమా అనేది న్యూ ఏజ్ మూవీ కోరుకునే ప్రేక్షకులు చూసేలా చేశాం. ఆ సినిమా తర్వాత నేను నా కంఫర్ట్ జోన్ నుంచి(అంటే సాధారణంగా నేను ఫైట్స్‌లాంటివి చేయను) బయటకు వచ్చి, చిన్న మేకోవర్‌తో ఓ సినిమా చేయాలనుకున్నాను. నాకు కూడా డిఫరెంట్‌గా ఉంటుంది కదా అని అనిపించింది. అదే సమయంలో నిర్మాతల్లో ఒకరైన సృజన్ ఎరబోలు టచ్‌లోకి వచ్చాడు. తర్వాత శరణ్ కొప్పిశెట్టి, నేను.. ప్రాపర్ ఎగ్జిక్యూషన్ కోసం మహేశ్ కోనేరు కూడా యాడ్ కావడం.. ఇలా అందరం కలిసి ఓ టీమ్ ఏర్పాటైంది. కోవిడ్ టైమ్‌లో శరణ్ 39 రోజుల్లో పూర్తి చేశారు. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయడానికి నటీనటులు, ఇతర టీమ్, శరణ్ అండ్ టీమ్ ఎంత కష్టపడిందో, అంతే కష్టాన్ని ప్రొడక్షన్ టీమ్ కూడా ఫేస్ చేసింది. ఇంత తక్కువ టైమ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాను పూర్తి చేసిన మహేశ్ కోనేరు, సృజన్‌లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అలా ఓ చిన్న ఐడియాతో స్టార్ట్ అయిన ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- సాధారణంగా థ్రిల్లర్ యాక్షన్ సినిమా అంటే పోలీస్ బ్యాక్‌డ్రాప్‌తో ఎక్కువగా ఉంటాయి. లాయర్ కోణం నుంచి సాగే థ్రిల్లరే ఈ చిత్రం. ఉన్న డబ్బుని కూడా ఖర్చు పెట్టి న్యాయం వైపు నిలబడే లాయర్ సినిమా ఇది. ఇందులో కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుంది. దీంతో పాటు యాక్షన్ పార్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో వకీల్‌సాబ్, నాంది వంటి కోర్ట్ రూమ్ డ్రామా చిత్రాలు బాగా ఆడాయి.. కాబట్టి మేం కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.
- నా పాత్ర `అభిలాష`లో చిరంజీవిగారిలా ఉంటుంది. ఆ కథకు దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అభిలాష చిత్రంలో చిరంజీవిగారు ఉరిశిక్ష రద్దు కోసం పోరాడితే, ఇందులో నా పాత్ర, యావజ్జీవ కారాశిక్ష అనే పాయింట్‌పై ఫైట్ చేస్తుంది. న్యాయం కోసం ఎందాకైనా పోరాడే ఓ లాయర్ ఓ కేసులో చివరి వరకు ఎలా నిలబడ్డాడు. దానిలో ట్విస్టులు, టర్న్స్ ఏంటి? అనేదే తిమ్మరుసు సినిమా. సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో టేకాఫ్ అవుతుంది. క్రమంగా సీరియస్ మోడ్‌లోకి కథ రన్ అవుతుంది. అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి.
- ఓ పర్టికులర్ కోర్ట్ సెక్షన్ వల్ల సామాన్యుడు అందులో ఇరుక్కుంటాడు. సామాన్యుడికి న్యాయం జరగాలనుకునే ఓ లాయర్ దాన్ని టేకప్ చేసి దాన్నెలా పరిష్కరించాడు. ఆ క్రమంలో తనెలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేదే సినిమా.
- ఈ పాండమిక్ టైమ్‌లో ఓ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్, మరో సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న హీరో నేను. అయితే పరిస్థితులను ముందుగా ఊహించింది మాత్రం కాదు. ఓటీటీల హవా 2023, థియేటర్స్‌తో పాటు స్టార్ట్ అవుతుందని అనుకున్నాను. అయితే కోవిడ్ వల్ల ఓటీటీ వేల్యూ పెరిగిపోయింది. నిర్మాతలు నా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సహా కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఒకట్రెండు రోజులు సినిమా థియేటర్స్‌లో విడుదల కాలేదనే బాధ ఉండింది. అయితే దాని వల్ల నిర్మాతలు లాభపడ్డారు. వాళ్లు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తే, కోవిడ్ ప్రభావం తగ్గింది. తొలి వేవ్ తర్వాత థియేటర్స్‌లో వచ్చిన తెలుగు సినిమాలన్నీ పెద్ద హిట్స్ సాధించాయి. ప్రపంచంలో మరో సినీ పరిశ్రమలో ఇది జరగలేదు. అదే కాన్ఫిడెన్స్‌తో, మన తెలుగు ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారనే ఉద్దేశంతో వెయిట్ చేసి సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం.
- కోవిడ్ సమయంలో మాస్కులు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఐదు సినిమాలను కంప్లీట్ చేశాను. అంటే రెండు వందల రోజులు పని చేశాను. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాల్లో యాక్ట్ చేయాలా వద్దా.. అనే ఆప్షన్ నాకే ఉంది కదా. నేను చేయగలిగాను. థియేటర్స్ కూడా అంతే. నాని అన్న చెప్పినట్లు జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్‌గానే ఉంటాయి. అయితే థియేటర్స్‌కు రావాలా, వద్దా? అనే ఆప్షన్‌ను ఆడియెన్‌కు వదిలేద్దాం. పెద్ద సినిమాలు థియేటర్స్ విడుదలకు వెయిట్ చేస్తుంటే మేం ఎందుకు ముందుకొస్తున్నామని అడిగితే లాజిక్స్ లేవు. ఇప్పుడు మాకు స్పేస్ దొరికింది. మా బడ్జెట్ లెక్కల్లో ఇది వర్కవుట్ అయిపోతుంది. కొందరికీ ఇంకా ఎక్కువ స్పేస్ కావాల్సి ఉండొచ్చు.
- ఈ జర్నీని చూసుకుంటే బాగానే ఉంది. సినిమాపై ఉన్న పిచ్చి ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. అది నాలో ఉన్నంత కాలం సినిమాలు చేస్తుంటాను. ఎక్కడా మ్యాప్ వేసుకుని రాలేదు. ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయ్యింది. గుర్తుందా శీతాకాలం కంప్లీట్ లవ్‌స్టోరి, స్కైలాబ్ మూవీ ఓ పీరియడ్ మూవీ. గాడ్స్..మరో డిఫరెంట్ మూవీ. బాలీవుడ్‌లో చేస్తున్న రామ్‌సేతు, కృష్ణగారు, కొరటాలగారు నిర్మిస్తోన్న మరో సినిమా రా మూవీ.. ఇలా ప్రతిదీ డిఫరెంట్‌గా ఉంటుంది. ముందుగా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఎక్కడా క్లాష్ లేదు.
- రీమేక్స్ సినిమాలు చేయాలనేం ప్లాన్ చేసుకోలేదు. కథలు బావున్నాయని చేసుకుంటూ వచ్చాను. అయితే, అలా కంటిన్యూగా కుదిరాయి. అయితే మధ్యలో స్కైలాబ్, గాడ్స్, కొరటాలగారి సినిమాలున్నాయి. ఇప్పుడు రీమేక్స్ చేయకూడదని అనుకుంటున్నాను.
- డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి, సింపుల్‌గా ఉంటాను. ఆలోచనను క్లారిటీతో ఎగ్జిక్యూట్ చేస్తాడు. ప్రియాంక జవాల్కర్ మంచి కోస్టార్. అలాగే బ్రహ్మాజీగారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా పాజిటివ్ పర్సన్. ఆయనతో కలిసి సినిమాను ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేశాం.
- బాలీవుడ్ మూవీ రామ్‌సేతు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆ సినిమా గురించి ఇప్పుడే చెప్పలేను.