సినిమా వేడుకలకి ఎక్కువగా హాజరు కాని పవన్ కల్యాణ్ తాజాగా ఓ వేడుకకు విచ్చేయనున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'జులాయి' సినిమా ఆడియో వేడుకకు అతిధిగా రావడానికి పవన్ అంగీకరించాడట. మరో విశేషమేమిటంటే, ఈ వేడుకకు రామ్ చరణ్ కూడా మరో అతిధిగా విచేస్తున్నాడు. ఈ 'జులాయి' ఆడియో ఫంక్షన్ ఈ నెల 10 సాయంకాలం హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో భారీగా జరుగనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో ఈ సినిమాలోని పాటలు రూపొందిన సంగతి మనకు తెలిసిందే. పొతే, తమ అభిమాన నటులు పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ఇలా ఒకే వేదికపైకి విచ్చేయడం మెగా అభిమానులకు ఒక పండుగ లాంటిదే!

Post a Comment