Nagarjuna shiridi sai release on september5th


నాగార్జున ప్రధాన పాత్రధారిగా రూపొందుతోన్న 'శిరిడీ సాయి' చిత్రం షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. కె.రాఘవేంద్ర రావు తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఈ నెలాఖరుకి  షూటింగ్ పూర్తి చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఆడియోని ఈ నెల 25 న విడుదల చేసి, సినిమాని సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
       ఈ సినిమా విడుదలకి ముందుగానే ముస్తాబు అవుతున్నప్పటికీ, జూలై లో 'డమరుకం' రిలీజ్ చేస్తుండటం వల్ల 'శిరిడీ సాయి' విడుదల సెప్టెంబర్ 5 కి వెళ్లినట్టు తెలుస్తోంది. ఏదేవైనా, నాగార్జున విభిన్నమైన పాత్రలను పోషించిన ఈ రెండు సినిమాలు ఒకదాని తరువాత ఒకటిగా వెంటవెంటనే వస్తుండటం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post