Balakrishna went malaysia for srimannarayana


 రవి చావలి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'శ్రీమన్నారాయణ' చిత్రం రూపొందుతోన్న సంగతి విదితమే. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన పార్వతీ మెల్టన్ - ఇషా చావ్లా కథానాయికలుగా కనువిందు చేయనున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సింహ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, ప్రస్తుతం మలేసియాలో షూటింగ్ జరుపుకుంటోంది.
       ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన యాక్షన్ సీన్స్ తో పాటు, ఓ పాటని కూడా అక్కడ చిత్రీకరించేందుకు ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ఈ నెల 9 వ తేదీ వరకూ అక్కడ ఈ షూటింగ్ కొనసాగుతుందనీ ... దీంతో రెండు పాటల మినహా షూటింగ్ పార్ట్  పూర్తి అవుతుందని అన్నారు. 'అధినాయకుడు' సినిమాలో మూడు పాత్రలతో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకొన్న బాలకృష్ణ, ఈ సినిమాలో జర్నలిస్టుగా కనిపించనున్నారు. మరి, ఈ పాత్రని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది వేచి చూడాలి.

Post a Comment

Previous Post Next Post