Autonagar Surya in rfc |autonagar surya details


'ఆటోనగర్ సూర్య' గా అభిమానులను అలరించడానికి నాగ చైతన్య సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్  సిటీలో జరుగుతోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను దర్శకుడు దేవ కట్టా  తెర కెక్కిస్తున్నారు. ఇంత వరకూ ఈ సినిమా 80% షూటింగ్ ని పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.
        కె. అచ్చిరెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా నాగ చైతన్య పక్కా మాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఓ రకంగా చైతన్యకి మాస్ హీరో ఇమేజ్ ని కట్టబెట్టడానికే ఈ సినిమాని రూపొందిస్తున్నారు. 'దడ' ... 'బెజవాడ' చిత్రాలు అందించిన ఫలితాలతో డీలా పడిపోయిన చైతన్య అభిమానులకి, ఈ సినిమా అయినా ఊరట కలిగిస్తుందేమో చూడాలి.

Post a Comment

Previous Post Next Post