Home » » Sri Kala Sudha Telugu Association Film Awards 2023

Sri Kala Sudha Telugu Association Film Awards 2023

 నందమూరి కళ్యాణ్ రామ్ కు శ్రీ కళాసుధ ఉత్తమ నటుడి ఉగాది పురస్కారం.



'మహా పురుషుడు NTR తెలుగువారి ఆరాధ్య దైవం తాత లాంటి వారితో నన్ను పోల్చవద్దు. ఆయన స్థాయిని నేను చేరు కోలేను' అని ఎన్టీఆర్ మనవడు, ప్రముఖ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొ న్నారు. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఉగాది రోజు చెన్నై మ్యూజిక్ అకాడమీ లొ వైభవంగా జరిగింది. కళ్యాణ్ రామ్, హాస్యనటుడు అలీ, D.V.V దానయ్య తదితరులు పాల్గొన్నారు. స్వాగతోపాన్యాసం చేసిన సంస్థ వ్యవస్థాపకుడు బేతిరెడ్డి శ్రీనివాస్ తమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా ప్రముఖ గాయని పి.సుశీల, నిర్మాత మైత్రి రవి శంకర్, వ్యాపారవేత్త మువ్వా పద్మయ్య తదితరులు పాల్గొని ఉగాది సత్కరము స్వీకరించిన అనంతరం అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

ముందుగా బాపూబొమ్మ పురస్కారాన్ని నటీ మణి ఈశ్వరీరావు, బాపురమణల పురస్కారాన్ని సినీ దర్శకుడు హను రాఘవపూడి, మహిళా రత్న పురస్కారాన్ని వైద్య రంగానికి చెందిన స్వర్ణలత, నృత్య కళాకారిణి మేనకా పి పి బోరా అందుకున్నారు. ఉత్తమ నటుడి అవార్డును బింబిసార చిత్రానికి నందమూరి కళ్యాణ్ రామ్, ఉత్తమ నటీ అవార్డును నటీమణి సమంత తరపున ఆమె బంధువులు స్వీకరించారు. ఉత్తమ చిత్ర అవార్డును బింబిసార ప్రతినిధులు అందుకు న్నారు. లతా మంగేష్కర్ పురస్కారాన్ని నటీ -మణి శ్రీలేఖ, వీఎస్ఆర్ స్వామి పురస్కారాన్ని సినిమాటోగ్రఫర్ వంశీ పచ్చిపులుసు స్వీకరించారు. ప్రముఖ వ్యాపారవేత్త వల్లేపల్లి శశి కాంత్, సుభాష్ చంద్ర విశిష్ట అవార్డులు, ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ ప్రధాన నిర్వాహకుడు రమేష్ జీవిత సాఫల్య అవార్డును స్వీకరించారు. అంతకుముందు అశ్విని శాస్త్రి, రోహిణి శాస్త్రి పంచాంగం వినిపించారు. తర్వాత జరిగిన మేనక పి పి బోరా బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.


 


Share this article :