Home » » Kondaveedu Movie Review

Kondaveedu Movie Review

 ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో మెసేజ్ ఓరియెంటెడ్ "కొండవీడు"మూవీ రివ్యూ 



సినిమా : కొండవీడు

రివ్యూ రేటింగ్ : 3.25


నటీనటులు -

బిగ్ బాస్ ఫెమ్ శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ , నళినీకాంత్ , నవీన్‌రాజ్ తదితరులు 


సాంకేతిక నిపుణులు 

బ్యానర్ : బి. పి.ఆర్ సినిమా 

నిర్మాతలు: మధుసూధనరాజు, బోధన్ పల్లి ప్రతాప్ రెడ్డి

దర్శకుడు-సిద్ధార్థ్ శ్రీ

డిస్ట్రిబ్యూటర్ - రామకృష్ణ

DOP-రఘు రాయల్

సంగీతం-కనిష్క

ఎడిటర్ - శివ శర్వాణి

పి. ఆర్. ఓ : మధు వి. ఆర్



అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అక్రమ రవాణా నేపథ్యంలో ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాల‌తో తెర‌కెక్కిన చిత్రం `కొండవీడు' దసరాజు గంగాభవాని బోధన్ పల్లి అలివేలు సమర్పణలో  బి. పి. ఆర్ సినిమా పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ , నళినీకాంత్ , నవీన్‌రాజ్ నటీ నటులుగా సిద్దార్థ శ్రీ దర్శకత్వంలో ప్రతాప్ రెడ్డి నిర్మించిన చిత్రం "కొండవీడు" అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 8 న గ్రాండ్ గా థియేటర్స్ లలో  విడుదలైన ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ "కొండవీడు  చిత్రం  ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండీ



కథ 

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ స్టోరీ తో డిఫరెంట్ జోనర్ లో నలుగురు కథల సమ్మేళనమే 'కొండవీడు'.కొండవీడు అటవీ ప్రాతంలో వుండే బాకు బాబ్జి ఆ ఫారెస్ట్ లోని చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తుంటాడు.మానవాళికి ప్రాణవాయువు నిచ్చే చెట్ల జోలికి వెళ్ళద్దు అని అడ్డొచ్చిన ఆఫీసర్స్ ను చంపుతూ కనపడిన ఆడపిల్లలను రేప్ చేస్తూ ఉంటాడు. ఆలా చనిపోయిన వారిలో ఆచార్య యన్. జి. రంగా అగ్రికల్చర్ ప్రొఫెసర్ ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఒంటరివాడైన ప్రొఫెసర్ అడవితొ ఏంతో అటాచ్మెంట్ పెంచుకొని ఆ అటవీ ప్రాంతంలో ఉండే ప్రకృతికి హాని చేసే బాకు బాబ్జి మనుషులను చంపుతూ ఉంటాడు. చిన్నప్పుడే తల్లి తండ్రులను కోల్పోయి అనాధగా పెరిగిన వంశీ కృష్ణకు కరోనా వచ్చిందని కొండవీడు అటవీ ప్రాంతంలో వదిలేసి వెళ్తారు ఫ్రెండ్స్,కరోనా వచ్చిందని బయపడిన వంశీ అడవిలో చనిపోవాలని నిర్ణయించు కొంటాడు.మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్న శాండి (నవీన్) భార్య శ్రావణి చనిపోతే దానికి సామావేద (శ్వేతా వర్మ) కారణమని కిడ్నాప్ చేసి  కొండవీడు అడవీ ప్రాంతంలో చంపాలని  తీసుకువస్తే  వారినుండి తప్పించుకొని ఆ అడవిలోకి పారిపోతుంది.అయితే అనుకోకుండా సామవేద, వంశీ కృష్ణలు ఒకరికి తెలియకుండా ఒకరు కలుసుకుంటారు. చూసిన తొలి చూపులోనే సామవేద ప్రేమలో పడతాడు వంశీ .మరోవైపు చెట్లను నరుకుతున్న ప్రొఫెసర్ ను చంపితే తనకు అడ్డు తొలగిపోతుందని ప్రొఫెసర్ ను చంపాలని అడవికిలొకి వస్తాడు బాకు బాబ్జి. ఇలా ఇలా సాగుతున్న వీరి జర్నీలో  వీరు ముగ్గురు బాకు బాబ్జి కు దొరుకుతారు. చివరకు బాకు బాబ్జి వీళ్లను ఎం చేశాడు?, బాకు బాబ్జి నుండి వీరు తప్పించుకున్నారా? వంశీ ప్రేమను సామావేద అంగీకారించిందా లేదా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడవలసిందే...


 నటీ నటుల పనితీరు 

శ్రీ కృష్ణ హీరోగా ఎంచుకొన్న కథ బాగుంది. అన్ని రకాల ఎమోషన్స్ పండించే ఆస్కారం దొరికింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో అమిత్ అదరగొట్టాడు. శ్వేతా వర్మ గ్లామర్ పరంగా, హావ భావాల పరంగా ఆకట్టుకొంది. కొన్ని సీన్లలో శ్వేతా వర్మ  నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. పర్యావరణాన్ని కాపాడాలి లేకపోతె ముందు తరాలవారికి భవిష్యత్తు లేకుండా పోతుంది అనే ప్రొఫెసర్ పాత్రలో  చాలా చక్కగా నటించాడు.విలన్ గా నటించిన ప్రతాప్ రెడ్డి అద్భుతంగా నటించాడు .ఇంకా మిగిలిన నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.



సాంకేతిక నిపుణుల పనితీరు 

దర్శకుడు సిద్ధార్థ్ శ్రీ సొసైటీ లో ఉన్న వారందరిలో ఎవెర్నెస్ రావాలని  మంచి కథను సెలెక్ట్ చేసుకొని థ్రిల్లర్ జోనర్ లో సినిమా నిర్మిస్తూ పర్యావరణ లో భాగంగా చెట్లను నరికే వారికి నరికిస్తున్న వారికి గుణపాఠం ఉండేలా చేస్తూ ఒక వైపు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్మెంట్ ను మిస్ కాకుండా సోషల్ అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం చేయడం గ్రేట్ అని చెప్పచ్చు. మనుషుల ప్రాణాలను పదికాళాలపాటు చల్లగా చూసే చెట్లుంటే ముందు తరాలకు బాగుంటుందని పర్యావరణ ప్రేమికులైన మేము చెట్లను నాటుతుంటే  మీరంతా కలసి అక్రమంగా అన్యాయంగా ఆ చెట్లను నరికేస్తున్నారు. రాబోవు తరాలకు మనం ఆస్తులు ఇవ్వక పోయినా పరవాలేదు వారి ఆరోగ్యాన్ని ఆయుష్ ని తీసుకోవడం తప్పు. ఇలా చెట్లను నరుకుంటూ పొతే చివరకు న్యాచురల్ గా దొరికే ఆక్సిజన్ డబ్బుపెట్టి కొనుక్కోవలసి వస్తుంది. అలా కొనుక్కోవలసి వస్తే ఒక మనిషికి సుమారు సంవత్సరానికి 13 లక్షల ఖర్చు అవుతుంది. అప్పుడు పేదవాడికి, మధ్య తరగతి వారికి ఊపిరి తీసుకోవడం కూడా కస్టమవుతుంది అంటూ ఎంతో భావోద్వేగమైన పాయింట్‌ను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం చక్కగా కుదిరింది. దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినా ఎక్కడా ఆ ఫీలింగ్ కలగదు.ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా మంచి ప్రతిభను కనబరిచారు.ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇస్తూ మంచి ఎంటర్‌టైనర్‌ని ఎంచుకుని ఎక్కడా వల్గారిటీకి తావు లేకుండా క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా తీర్చిదిద్దారు దర్శక, నిర్మాతలు. ఇంకా ఈ సినిమాలో తెలిసిన ఆర్టిస్టులు ఉంటే ఇంకా పెద్ద సినిమా అయ్యేది. కనిష్క సంగీతం చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. "ఎదలో జరిగే ప్రణయాన్ని ఎలా ఆపడం"  అనే పాట తెర మీద కూడ అంతే ఎఫెక్టివ్‌గా కనిపించింది..ఆర్ ఆర్ అద్భుతంగా ఉంది. అటవీ అందాలను సినిమాటోగ్రాఫర్ రఘు రాయల్ తన కెమెరాలో చక్కగా బంధించాడు.విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి.శివ సర్వాణి ఎడిటింగ్  క్లాసీగా వుంది. కథ, కథనాలు, వాతావరణం, నేటివిటి సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా మరింత బాగా నచ్చుతుంది. చెట్లను నరుక్కుంటూ పొతే మనవాలికి భవిష్యత్తు లేకుండా పోతుంది. ఇలా పర్యావరణానికి హాని కలిగించేలా కత్తులు గొడ్డలు పట్టుకొని చెట్లను నరికితే మీ భవిష్యత్తు ను, మీ పిల్లల భవిష్యత్తు ను మీరే నరికేసుకున్న వారవుతారు అనే డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాల స్థాయిలో  పి.ఆర్ సినిమా బ్యానర్ పై ఫారెస్ట్ లోకానీ ఇతర లొకేషన్స్ లో ఫైట్స్, పాటల విషయంలో నిర్మాతలు   మధుసూధనరాజు,బోధన్ పల్లి ప్రతాప్ రెడ్డి లు ఈ సినిమాను రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారని చెప్పొచ్చు. కొండవీడు అనే టైటిల్  సినిమాకు కరెక్ట్ గా యాప్ట్ అయ్యిందని చెప్పవచ్చు.ఈ సినిమాను పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేయచ్చు. చూసిన వారందరికీ  ”కొండవీడు ” చిత్రం తప్పక నచ్చుతుంది.

పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పడే ప్రయత్నమే "కొండవీడు"



Share this article :