Latest Post

Devaki Nandana Vasudeva Shooting Completed

అశోక్ గల్లా, అర్జున్ జంధ్యాల, లలితాంబిక ప్రొడక్షన్స్ 'దేవకీ నందన వాసుదేవ' షూటింగ్ పూర్తి



సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ 'దేవకి నందన వాసుదేవ' లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం డివైన్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్.  హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.


తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలై టీజర్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ అల్బం ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన ఏమయ్యిందే, జై బోలో సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరించి మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.  


రసూల్ ఎల్లోర్‌తో పాటు ప్రసాద్ మూరెళ్ల ఈ చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో చాలా గ్రాండ్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.


త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.


నటీనటులు: అశోక్ గల్లా, వారణాసి మానస


సాంకేతిక సిబ్బంది:

కథ: ప్రశాంత్ వర్మ

దర్శకత్వం: అర్జున్ జంధ్యాల

నిర్మాత: సోమినేని బాలకృష్ణ

బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్

సమర్పణ: నల్లపనేని యామిని

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

డీవోపీ: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్

ఎడిటర్: తమ్మిరాజు

డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్

పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే

పీఆర్వో: వంశీ-శేఖర్

 

Great Response to Vijay Deverakonda's America Tour with family

 విజయ్ దేవరకొండ అమెరికా టూర్ కు హ్యూజ్ రెస్పాన్స్



హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి అమెరికా టూర్ లో ఉన్నారు. ఈ పర్యటనకు విజయ్ ఫాదర్ గోవర్థన్, మదర్ మాధవి, సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా వెళ్లారు. విజయ్ దేవరకొండ యూఎస్ టూర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. విజయ్ దేవరకొండ తన కుటుంబ  సభ్యులతో కలిసి అమెరికాకు రావడం పట్ల అక్కడి తెలుగువారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ను కలిసేందుకు, ఆయనతో కలిసి ఫొటోస్ తీసుకునేందుకు తెలుగువారు పోటీపడ్డారు. ఆమెరికాలో విజయ్ దేవరకొండ క్రేజ్ కు ఈ టూర్ నిదర్శనంగా నిలుస్తోంది.


అమెరికా తెలుగు ఆసోసియేషన్ (ఆటా) ఏర్పాటు చేసిన ఈవెంట్ గెస్ట్ గా పాల్గొన్నారు విజయ్ దేవరకొండ. శ్రీముఖి ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించింది. ఆ తర్వాత వుమెన్ ఆర్గనైజేషన్ మీటింగ్ కు కూడా విజయ్ దేవరకొండ అతిథిగా వెళ్లారు. ఆటా ఈవెంట్ లో విజయ్ హీరోగా నటించిన సినిమాలతో పాటు ఆయన ప్రొడ్యూస్ చేసిన మూవీస్ పోస్టర్స్ ప్లే చేశారు. ఆటా కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ఆటా ఈవెంట్ కు గెస్ట్ గా రావడం సంతోషంగా ఉంది. ఇక్కడి మన తెలుగువాళ్లను కలుసుకుని మాట్లాడటం హ్యాపీ ఫీల్ కలిగిస్తోంది. వాళ్లు నాపై చూపిస్తున్న లవ్ అండ్ అఫెక్షన్ కు థ్యాంక్స్. మన తెలుగువారు చదువుల కోసం, ఉద్యోగాల కోసం యూఎస్ వచ్చారు. ప్రస్తుతం రెసిషన్ టైమ్ నడుస్తోంది. మీరంతా స్ట్రాంగ్ గా ఉండండి. మళ్లీ మంచి రోజులు వస్తాయి. తమ పిల్లల కోసం అమెరికా వచ్చిన అత్తమ్మలు, మామయ్యలకు కూడా హాయ్ చెబుతున్నా. అన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ తో విజయ్ దేవరకొండ అమెరికా టూర్ సందడిగా సాగుతోంది. విజయ్ యూఎస్ టూర్ ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Director Gnanasagar Dwaraka Interview About Harom Hara

 'హరోం హర' న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా. యాక్షన్, క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా వుంటుంది. డెఫినెట్ గా ఆడియన్స్ కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: డైరెక్టర్  జ్ఞానసాగర్ ద్వారక  



హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'హరోం హర'. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ హైప్ క్రియేట్ చేశాయి. జూన్ 14న హరోం హర గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక విలేకరుల సమావేశంలో మూవీ విశేషాలని పంచుకున్నారు.


హరోం హర సినిమా ఎలా మొదలైయింది ?

-సెహరి సినిమాని సుధీర్ గారి వైఫ్ చూడటం, డైరెక్టర్ ని కలవమని సజెస్ట్ చేయడం, అదే టైంలో నేను హీరో గారి మ్యానేజర్ ని అప్రోజ్ అవ్వడం, స్టొరీ పిచ్ చేయడం జరిగింది. ఫస్ట్ సిట్టింగ్ లోనే సుధీర్ గారు ఓకే చేశారు. ఇందులో చాలా యాక్షన్ సీన్స్ వుంటాయి. అవి ఎలా వర్క్ అవుట్ చేయాలనే దానిపై మాట్లడుకున్నాం. ప్రొడ్యూసర్ సుమంత్ నా ఫ్రెండ్.  ఇదే సమయంలో తను ఫోన్ చేసి ఏం చేస్తున్నానని అడిగారు. 'సుధీర్ గారితో డిస్కర్షన్ జరుగుతుందని చెప్పాను. మనం చేద్దామని చెప్పారు. అలా సినిమా మొదలైయింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ చాలా ఇంటెన్స్ గా చేశాం. పిరియాడిక్ ఫిల్మ్ ఇది. ప్రొడక్షన్ డిజైన్, లోకేషన్స్, కాస్ట్యుమ్స్ ఇలా అన్నిట్లో చాలా ఎఫర్ట్ పెట్టాం. దాదాపు ఆరు నెలలపాటు ప్రీప్రొడక్షన్ చేశాం.


హరోం హర స్టొరీ ఏంటి ?

-ట్రైలర్ చెప్పాం. ఇదొక అండర్ డాగ్ స్టొరీ. కుప్పంలో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేసే సుబ్రహ్మణ్యం మామూలు కుర్రాడు. తను గన్ మేకింగ్ లో ఇన్వాల్ అయి పవర్ ఫుల్ సుబ్రహ్మణ్యగా ఎలా ఎదిగాడనేది థ్రెడ్‌. దీంతో పాటు చాలా థ్రెడ్స్ వున్నాయి. ఇందులో స్పిర్చువల్ ఎలిమెంట్ కూడా వుంది. హరోం హర మేకింగ్ లో కూడా మేము ప్రతి లొకేషన్ లో నెమలి చూశాం. అదొక పాజిటివ్ షైన్. కర్నాటకలో దాదాపు 17 డిఫరెంట్ లోకేషన్స్ లో షూట్ చేశాం. ప్రతి లొకేషన్ కి నెమలి వచ్చేది. హైదరాబాదు లో షూట్ చేసిన లోకేషన్స్ లో కూడా నెమలి వచ్చేది. సుబ్రహ్మణ్య స్వామికి నేను పెద్ద భక్తుడిని. ఈ సినిమాకి హరోం హర అనే టైటిల్ పెట్టాం. ఇందులో హీరో పేరు కూడా సుబ్రమణ్యం. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు వున్నాయని నమ్ముతున్నాను.


ఈ కథకు రియల్ లైఫ్ స్ఫూర్తి ఉందా ?

-కొన్ని ఆర్టికల్స్ వున్నాయి. ఓ కామన్ మ్యాన్ గన్ తయారు చేశాడనే ఆర్టికల్ చదివాను. అయితే అది సినిమా కథకి సరిపోదు. దీని కోసం నా నేటివిటీ రూట్స్ లో ఏం చేయాలో అవన్నీ చేశాను. మాది కుప్పం పక్కన ఓ చిన్న వూరు. ఆ మట్టి వాసన కనిపించేలా కేర్ తీసుకున్నాం. కుప్పం తమిళనాడు, కర్నాటక బోర్డర్స్ లో వుంటుంది. అక్కడ మిక్స్డ్ కల్చర్ వుంటుంది. అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని బాగా కొలుస్తారు. అవన్నీ ఇందులో ఎక్స్ ఫ్లోర్ చేశాం. ఇందులో మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్ అన్నీ వుంటాయి. సినిమా చాలా ఆర్గానిక్ గా వుంటుంది. ఈ సినిమా యాక్షన్ లవర్స్ కి, మాస్ ఆడియన్స్ కి, సినిమాని ఇష్టపడే ప్రేక్షకులు అందరికీ నచ్చుతుంది. టెక్నికల్ గా చాలా బావుటుంది.


హరోం హర కి పార్ట్ 2 ఉందా ?

-ప్రత్యేకంగా పార్ట్ 2 ని స్క్రీన్ మీద వేయడం నాకు ఇష్టం లేదు. ఈ సినిమాని చాలా హై తో ఎండ్ చేశాం. సినిమా చూసిన తర్వాత ఆడియన్సే పార్ట్ 2 కావాలని అడుగుతారనే నమ్మకం వుంది.


గన్స్ మేకింగ్ కోసం ఎలాంటి రిసెర్చ్ చేశారు ?

-దీని కోసం బుక్స్ చదవడం, డాక్యుమెంటరీలు చూడటం జరిగింది. బుక్స్ నుంచి చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాం. గన్ మేకింగ్ ని సినిమాకి కావలసినంత స్టయిలీష్ గా చూపించడం జరిగింది.


రెండో సినిమాకే ఇలాంటి యాక్షన్ జోనర్ ఎంచుకోవడానికి కారణం ?

-నాకు ఇష్టమైన జోనర్ ఇది. అయితే ఫస్ట్ సినిమాకే ఇలాంటి కథ చెబితే అంత ఈజీగా యాక్సప్టెన్సి రాదు. అందుకే ఈ కథ నా దగ్గర ఉన్నప్పటికీ తొలి సినిమాగా లవ్ స్టొరీ సెహరి చేయడం జరిగింది. హరోం హర మై కైండ్ అఫ్ ఫిల్మ్.  


సెహరి కి ముందు మీ ఎక్స్ పీరియన్స్ ఏమిటి ?

-నేను యాడ్ ఫిల్మ్ మేకర్ ని. దాదాపు వందకుపైగా యాడ్ ఫిల్మ్స్ చేశాను.


హరోం హర కలర్ పేలెట్ చాలా ఎట్రాక్టివ్ గా వుంది. దిని గురించి ?

-హరోం హర ఇంటెన్సిటీ వున్న కథ. ఆ ఇంటెన్సిటీ ఫ్రేం లో కనిపించడానికి ఆ కాంట్రాస్ట్ ని ఎంచుకున్నాం. ముందే మా డీవోపీకి దీని గురించి క్లారిటీ చెప్పాను.  


-ఇప్పటివరకూ సినిమా చూసిన అందరికీ పిచ్చిపిచ్చిగా నచ్చింది. మైత్రీమూవీ మేకర్స్ వారు, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ చూశారు. అందరికీ చాలా నచ్చింది. వారు చెబుతున్న ఒకొక్క ఎలిమెంట్ నాకు చాలా కిక్ ఇచ్చింది.  


హరోం హరలోని ఎమోషన్ ఏమిటి ?

-హరోం హరలో మంచి ఫాదర్ ఎమోషన్ వుంటుంది. ఆ ఎమోషన్ చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. దాన్ని ఇప్పుడే ఎక్కువ రివిల్ చేయడం లేదు.


మహేష్ బాబు గారికి సినిమా చూపించారా ?

మహేష్ బాబు గారికి ట్రైలర్ చాలా నచ్చింది. రిలీజ్ డే సినిమా చూస్తానని చెప్పారు.


సుధీర్ బాబు గారు ఎలా చేశారు ?

-సుధీర్ బాబు గారు ఎక్స్ ట్రార్డినరీ గా పెర్ఫార్మ్ చేశారు. యాక్షన్, ఎమోషన్ టెర్రిఫిక్ గా చేశారు. ఆయనలో ఒక స్వాగ్ వుంటుంది. అది బెస్ట్ గా డెలివెరి అయ్యింది. ఇందులో కుప్పం యాస కూడా అద్భుతంగా మాట్లాడారు. నాలుగు రోజుల్లో డబ్బింగ్ పూర్తి చేశారు.  


-సినిమాలో ప్రతి క్యారెక్టర్ కుప్పం యాస మాట్లాడారు. ఇందులో సునీల్ గారు లెన్తీ క్యారెక్టర్ చేశారు. చాలా మంచి క్యారెక్టర్. మాళవిక, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మన్, అక్షర గౌడ క్యారెక్టర్స్ కూడా బావుంటాయి.


కుప్పం అంటే చంద్రబాబు గారు గుర్తొస్తారు. ఇందులో పొలిటికల్ టచ్ ఉందా?

-పొలిటికల్ టచ్ ఏమీ లేదు. సుధీర్ బాబు గారు చంద్రబాబు గారిని కలిశారు. హైదాబాద్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ కలిసిన వ్యక్తి చంద్రబాబు గారే.  


ఇది 90s బ్యాక్ డ్రాప్ లో వుంటుంది కదా. ఎలాంటి కేర్ తీసుకున్నారు ?

-అట్మోస్ట్ కేర్ తీసుకున్నాం. కర్ణాటక, ఉడిపి, ద్రాక్షారామం.. ఇలా డిఫరెంట్ లోకేషన్స్ లో షూట్ చేశాం. కుదరదనే వాటిని సెట్స్ వేసి షూట్ చేశాం. సినిమా చాలా అర్గానిక్ గా వుంటుంది. హరోం హర న్యూ ఏజ్ కమర్షియల్ ఎంటర్ టైనర్. మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. క్లైమాక్స్ మతిపోతుంది.  


ప్రొడ్యూసర్స్ గురించి ?

-నా ఫ్రెండ్ అని చెప్పడం కాదు. హై బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. చాలా పాషన్ వున్న ప్రొడ్యూసర్. మేకర్స్ గా చాలా ఇంప్రస్ అయ్యాను.


ఫైనల్ గా సినిమా గురించి ఆడియన్స్ కి ఏం చెబుతారు ?


-హరోం హర న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమాలోని ఎలిమెంట్స్ అన్నీ వుంటాయి, ఆర్గానిక్ అప్రోచ్ వుంటుంది. మ్యూజిక్, విజువల్స్ అద్భుతంగా వుంటాయి. సుధీర్ బాబు గారి నుంచి ఎవరూ ఊహించిన సినిమా హరోం హర అవుతుందనే గట్టినమ్మకం వుంది. హరోం హర మాస్ సంభవం అవుతుంది. సుధీర్ బాబు గారి పెర్ఫార్మెన్స్ చూసి ఓ ట్యాగ్ లైన్ ఇచ్చాం. అది సినిమా చివర్లో వస్తుంది. ఈ ట్యాగ్ లైన్ పర్మినెంట్ గా వుండిపొతుందని నమ్ముతున్నాను.  


నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ?

ఇదే ప్రొడక్షన్ హౌస్ లో వుంటుంది. త్వరలోనే టైటిల్ తో పాటు ఎనౌన్స్ చేశాం.


ఆల్ ది బెస్ట్

-థాంక్ యూ

Yevam Pre Release Event Held Grandly

 యేవ‌మ్ టీమ్‌ను చూస్తుంటే ముచ్చ‌ట‌గా వుంది:

మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్


యేవ‌మ్ సినిమా డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌: ద‌ర్శ‌కుడు సందీప్ రాజ్




చాందిని చౌద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవ‌మ్‌. ప్రకాష్‌ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఈ నెల 14న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మాస్ క‌దాస్ విశ్వ‌క్‌సేన్, ద‌ర్శ‌కుడు సందీప్‌రాజ్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా

విశ్వ‌క్‌సేన్ మాట్లాడుతూ హీరో న‌వ‌దీప్ యాక్టింగ్ చేస్తే రొమాన్ష్ ఎక్కువ, నిర్మాతగా చేస్తే వాయిలెన్స్ ఎక్కువ అని అర్థ‌మైంది. ఈ

సీస్పెస్ అనే సంస్థ‌తో నిర్మాత‌గా  టాలెంట్ యంగ్ పీపుల్‌కు

న‌వ‌దీప్ మంచి ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేశాడు. సాధారణంగా అందరూ సినిమాలు చేసిన  త‌రువాత అంద‌రూ ఆ సినిమాలోని చాలా

 త‌క్కువ మందితో ట‌చ్‌లో వుంటారు. ఇక నేను న‌టించి  రెస్పెక్ట్ చేసే వాళ్ల‌లో చాందిని చౌద‌రి ఒక‌రు. టెన్ష‌న్ ప‌డే క్యాండేట్ చాందిని. ఈ సినిమాతో చాందిని కి ఆ భ‌యం పోయింది. ఈ సినిమా ద్వారా ఫీమేల్ సంగీత ద‌ర్శ‌కురాలు,  

ఫీమేల్ ఎడిట‌ర్‌, ఫీమేల్ ఓరియెంటెడ్  చిత్రానికి ప‌నిచేయడం చాలా ఆనందంగా  వుంది. అన్ని రంగాల్లో అమ్మాయిలు వుండాల‌నేది నా కోరిక‌. ఈ టీమ్‌ను చూస్తుంటే ముచ్చ‌టేసింది. త‌ప్ప‌కుండా ఈ చిత్రం అంద‌రికి మంచి బ్రేక్‌నివ్వాలి  అన్నారు.


చాందిని చౌద‌రి మాట్లాడుతూ ఈ సంవ‌త్స‌రం నా సినిమాలు వ‌రుస‌గా వ‌స్తాయ‌ని ఊహించ‌లేదు. అన్ని సినిమాలు అనుకోకుండా ఒకేసారి విడుద‌ల అవుతున్నాయి. నా ఇన్నేళ్ల కృషి ఇప్పుడు ఫ‌లితం చూపిస్తుంది. నా లైఫ్‌లో మెమెర‌బుల్ సినిమాను ఇచ్చిన సందీప్ రాజ్ నా కోయాక్ట‌ర్ విశ్వ‌క్‌సేన్‌కు థ్యాంక్స్‌.  ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా కోసం ఎద‌రుచూస్తున్న త‌రుణంలో ఈ సినిమా వ‌చ్చింది. పోలీస్ పాత్ర అన‌గానే యాక్ష‌న్ ఓరియెంటెడ్‌గా నా పాత్ర వుంటుంద‌ని అనుకున్నాను. అయితే యాక్ష‌న్‌తో పాటు అన్ని షేడ్స్ నా పాత్ర‌లో వున్నాయి. త‌ప్ప‌కుండా యేవ‌మ్ అంద‌ర్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాను. అన్నారు.


సందీప్‌రాజ్ మాట్లాడుతూ ఈ సినిమా చూశాను. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా థ్రిల్ల‌ర్‌లు చూసి వుంటాం. అందులో ఇది చాలా డిఫరెంట్‌గా వుంటుంది. నాకు బాగా న‌చ్చింది. ఇంట‌ర్వెల్‌, ప‌తాక స‌న్నివేశాలు మైండ్ బ్లోయింగ్ వుంటాయి. ఈ సినిమాలో ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ క‌నిపించింది. ఈ సినిమాకు టెక్నిక‌ల్‌గా అన్ని బాగా కుదిరాయి. సినిమాలో అన్ని ఎమోష‌న్స్‌, వెరియేష‌న్స్ వున్నాయి. చాలా మంచి సినిమా అంద‌రికి త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. ప్ర‌తి  చిన్న సినిమాకు విశ్వ‌క్ స‌పోర్ట్ వుంటుంది. ఈ సినిమాకు కూడా ఆయ‌న ప్రోత్సాహం అందించ‌డం ఆనందంగా వుంది అన్నారు.


న‌వ‌దీప్ మాట్లాడుతూ  కంటెంట్ బెస్‌డ్ సినిమాల‌కు విశ్వ‌క్‌సేన్ లాంటి హీరోలు ప్ర‌మోష‌న్ విష‌య‌లో స‌పోర్ట్ వుంటుంది. ఈ విష‌యంలో విశ్వ‌క్ సూప‌ర్‌స్టార్ లాంటి వాడు. మంచి ఇంటెన్స్‌తో నిజాయితీగా చేసిన సినిమా ఇది. సినిమా మీద పిచ్చి త‌ప‌న వున్న హీరోయిన్ చాందిని చౌద‌రి, ఎప్పుడూ సినిమాల గురించే ఆలోచిస్తుంది. రెగ్యుల‌ర్ సినిమాలు కాకుండా ఎప్పుడూ డిఫ‌రెంట్ సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల కోసం త‌ప‌న ప‌డుతుంది.త‌ప్ప‌కుండా ఈ చిత్రం చాందిని కెరీర్‌లో దిబెస్ట్‌గా వుండాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.  


ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ దంతులూరి మాట్లాడుతూ నా క‌థ‌ను, నా పాత్ర‌ను న‌మ్మి ఈ సినిమా చేసింది చాందిని. నాకు ఈ సినిమా విష‌యంలో నవ‌దీప్ స‌పోర్ట్ వుంది. ప్ర‌తి విష‌యంలో ఆయ‌న నాతో వున్నాడు. ఈ సినిమా చూసి సందీప్‌రాజ్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ మాలో ధైర్యాన్ని నింపింది. కీర్త‌న్ నేప‌థ్య సంగీతం ఈ చిత్రానికి ఎంతో ప్ల‌స్ అవుతుంది. ఈ సినిమా న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు నేను ఊహించిన దానికంటే బెట‌ర్ అవుట్‌పుట్ ఇచ్చారు. అంద‌రి స‌హ‌కారంతో ఓ మంచి సినిమా తీశాం. ఇదొక ఇంట్రెస్టింగ్ ఎంట‌ర్‌టైనింగ్ థ్రిల్ల‌ర్. త‌ప్ప‌కుండా అంద‌రికి న‌చ్చుతుందే న‌మ్మ‌కం వుంది అన్నారు.


Mass Maharaja Ravi Teja Sithara Entertainments RT75 Launched Grandly

 మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం



మాస్ మహారాజా రవితేజ ఎందరో ఔత్సాహిక దర్శకులకు, నటీనటులకు స్ఫూర్తి. తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన రవితేజ, యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. అలా యువ దర్శకులతో పని చేసి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను, గుర్తుండిపోయే పాత్రలను అందించారు. 


తెలుగు చిత్రసీమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి రవితేజ 75వ చిత్రాన్ని ప్రొడక్షన్ నంబర్ 28 గా నిర్మిస్తోంది. యువ రచయిత భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.


మాస్ మహారాజా రవితేజ పేరు వినగానే గుర్తొచ్చేది మాస్, కామెడీ. తనదైన మాస్ యాటిట్యూడ్, కామెడీ టైమింగ్ తోనే ఆయన ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు రవితేజ తన 75వ చిత్రంలో హాస్యంతో కూడిన మాస్ పాత్రలో కనిపించనున్నారని చిత్రబృందం వెల్లడించింది. వినోదంతో కూడిన పూర్తిస్థాయి మాస్ పాత్రలో రవితేజను చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంతో అభిమానుల కోరిక నెరవేరుతుందని చిత్ర బృందం హామీ ఇచ్చింది.


బ్లాక్ బస్టర్ చిత్రం 'వాల్తేరు వీరయ్య'కి మాటల రచయితగా, మరో బ్లాక్ బస్టర్ 'సామజవరగమన'కు కథ, స్క్రీన్‌ప్లే రచయితగా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు భాను బోగవరపు. నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా తెరకెక్కుతోన్న 'NBK109'కి సంభాషణలు అందిస్తున్నారు. ఇలా రచయితగా అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసిన భాను బోగవరపు, ఇప్పుడు రవితేజ కెరీర్ లో ఓ  మైలురాయి లాంటి ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్రంతో అదిరిపోయే మాస్ ఎంటర్‌టైనర్‌ను అందించడానికి సిద్ధమవుతున్నారు.


ఈ సినిమాలో యువ సంచలనం శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రవితేజ-శ్రీలీల జోడి గతంలో "ధమాకా"తో బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. అలాగే "ధమాకా" విజయంలో కీలకపాత్ర పోషించిన సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.


ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుడు విధు అయ్యన్న ఛాయాగ్రాహకుడిగా వ్యవరిస్తున్న ఈ చిత్రానికి, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భాను కథ-కథనం అందించిన ఈ చిత్రానికి నందు సవిరిగాన సంభాషణలు రాస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.


జూన్ 11వ తేదీన ఉదయం 07:29 గంటలకు పూజా కార్యక్రమంతో మేకర్స్ అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు షాట్ కి శ్రీలీల క్లాప్ కొట్టగా, భాను బోగవరపు దర్శకత్వం వహించారు. నేటి నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.


శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.


తారాగణం: రవితేజ, శ్రీలీల

కథ, కథనం, దర్శకత్వం: భాను బోగవరపు 

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

ఛాయాగ్రహణం: విధు అయ్యన్న

కూర్పు: నవీన్ నూలి 

సంభాషణలు: నందు సవిరిగాన

కళ: నాగేంద్ర తంగాల

పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్

బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్

సమర్పణ: శ్రీకర స్టూడియోస్

Varadaraja Govindam Teaser Launched

'కాంతారా 'హనుమాన్' చిత్రాల కోవలోనే ఆరు భాషల్లో  రూపొందిన  పాన్ ఇండియా చిత్రం "వరదరాజు గోవిందం" కూడా పెద్ద హిట్ అయి సముద్ర కి మంచి బ్రేక్ అవ్వాలి.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ హీరో సుమన్!!



సింహరాశి, శివరామరాజు, ఎవడైతే నాకేంటి, లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి సముద్ర తాజాగా రవి జంగు హీరోగా ప్రీతి కొంగన హీరోయిన్ గా శివమహాతేజ ఫిలిమ్స్, వి.సముద్ర మూవీస్ బ్యానర్లు పై విజయలక్ష్మీ సమర్పణలో వి.సాయి అరుణ్ కుమార్ నిర్మాతగా "వరదరాజు గోవిందం" చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమాకీ భాష పరిమీదులు లేవు. ఎవరితోనైనా  ఎక్కడైనా నిమా తీసి పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయొచ్చు. అందుకే ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కు సిద్ధం అవుతోంది. కాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం జూన్ 9న హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో చిత్ర ప్రముకులు.. శ్రేయోభిలాషులు మధ్య ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో సుమన్, నటుడు శుభలేఖ సుధాకర్, హీరో రవి జంగు, హీరోయిన్ ప్రీతి కొంగన, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహరావు, ముప్పలనేని శివ, చంద్రమహేష్, రవికుమార్ చౌదరి, శివనాగు, నగేష్ నారదాసి, గోసంగి సుబ్బారావు, అమ్మరాజశేఖర్ నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, ఛాంబర్ కార్యదర్శి కె.యల్. దామోదర ప్రసాద్, నిర్మాతలు కేకే రాధామోహన్, డిఎస్ రావు, శోభారాణి, నటులు దాసన్న, ఖదీర్, జోహార్, సంగీత దర్శకుడు డా. రవి శంకర్, కెమెరామెన్ శ్రీ వెంకట్, కో-ప్రొడ్యూసర్స్ శ్రీహరి తుమ్మెటి, జింఖాన కోటేశ్వరావు, తదితరులు పాల్గొనగా దర్శక,నిర్మాత వి.సముద్ర బొకేలతో స్వాగతం పలికారు. అనంతరం దర్శకులంతా కలిసి 'వరదరాజు గోవిందం' మోషన్ పోస్టర్ లాంచ్ చేయగా... నిర్మాతలందరూ కలిసి టీజర్ ను రిలీజ్ చేశారు. 


ప్రముఖ నిర్మాత కేకే రాధ మోహన్ మాట్లాడుతూ.. " మా బ్యానర్లో ఫస్ట్ మూవీ సముద్రతో అధినేత ఫిల్మ్ తీశాను.. అక్కడనుండి ఇప్పటివరకు 14సినిమాలు నిర్మించాను. సముద్ర కి సినిమా అంటే ఫ్యాషన్, కసి. ప్రతిదీ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేస్తాడు. ప్రొడక్షన్ అన్నింటిలో ఇన్వాల్వ్ అయి చేస్తాడు. ఈ సినిమాని తానే నిర్మాతగా మారి రూపొందించాడు. టీజర్ చాలా బాగుంది. సినిమా కూడా మంచి హిట్ అవుతుంది.. సముద్రతో మా సంస్థలో ఇంకో సినిమా చేయాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 


హీరో సుమన్ మాట్లాడుతూ.. సినిమా హిట్ అవ్వాలని బలంగా కోరుకుంటే అది కచ్చితంగా జరుగుతుంది. ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరు సముద్ర మీద ప్రేమతో వచ్చారు. అందరూ సినిమా హిట్ అవ్వాలని దీవించారు. అది గ్యారెంటీగా హిట్ అవుతుంది. ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాను. అలుపెరగని శ్రామికుడిలా సముద్ర ఎప్పుడూ సెట్లో నవ్వుతూ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. హీరో రవి హీరోయిన్ ప్రీతి బ్యూటిఫుల్ గా చేశారు. పోస్టర్స్, టీజర్ సూపర్బ్ గా ఉంది. కాంతారా, హనుమాన్ తరహాలోనే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అన్నారు. 


శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ.. " భగవత్ గీత అంటే భారతదేశం .. భారతదేశం అంటే భగవత్ గీత అదే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం.. ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. సముద్ర అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి.. డెఫినెట్ గా ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నారు. 


దర్శక నిర్మాత వి. సముద్ర మాట్లాడుతూ.. కృష్ణుడు బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందించాం.  యన్టీఆర్, రవితేజ లాగా హీరో రవి జంగు ఫుల్ ఎనర్జిటిక్ గా చేశాడు. ఈ సినిమా తనకి మంచి బ్రేక్ అవుతుంది. హీరోయిన్ ప్రీతి చక్కగా కోపరేట్ చేస్తూ.. అద్భుతంగా చేసింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు వారందరికీ నా ధన్యవాదాలు.  చాలా గొప్ప కథ ఇది.. భారతదేశం గర్వించతగ్గ సినిమా అవుతుంది.. నా కెరియర్ లో సింహరాశి, శివరామ రాజు, ఎవడైతే నాకేంటి ఎంత పెద్ద హిట్ అయ్యాయో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. అన్నారు. 


కేయల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.." ఇప్పుడొచ్చే సినిమాలు అన్నీ కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి.. అది కాకుండా చూసుకుంటే బాగుంటుంది. సముద్ర కి 24 క్రాఫ్ట్స్ మీద మంచి పట్టుంది. వెస్టేజీ లేకుండా సినిమా తీసే దర్శకుడు సముద్ర. టీజర్ పెంటాస్టిక్ గా ఉంది. విజువల్స్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా సముద్రకి మంచి హిట్ కావాలి అన్నారు. 


హీరో రవి జంగు మాట్లాడుతూ.. " హిందీ, హార్యాని, అస్సాంలలో మూవీస్ చేశాను. తెలుగులో సినిమా చేయాలని నా డ్రీమ్. సముద్ర గారు నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా హీరోగా నాకు మంచి బ్రేక్ అవుతుంది.. అన్నారు. 


హీరోయిన్ ప్రీతి కొంగన మాట్లాడుతూ.." ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ చేశాను. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన సముద్ర గారికి థాంక్స్.. అన్నారు. 


సంగీత దర్శకుడు డా.రవి శంకర్ మట్లాడుతూ.. బాలీవుడ్, టాలీవుడ్ లలో సినిమాలు చేసే నాకు సముద్ర గారు ఈ సినిమాకీ మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చారు. కథకి తగ్గట్లుగా సాంగ్స్ కంపోజ్ చేయడం జరిగింది. ఆర్ ఆర్ కి మంచి స్కోప్ వుంది.. ఈ చిత్రం నాకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది.. అన్నారు. 


దర్శకులంతా మాట్లాడుతూ.. వరదరాజు గోవిందం సినిమా టీజర్ చాలా బాగుంది.. సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. సముద్ర చాలా కష్టపడి ఈ చిత్రం తీశాడు.. అందరికీ ఈ సినిమా  మంచి బ్రేక్ అవ్వాలి అని అతిధులంతా కోరుకున్నారు.. 

Bewarsgadu In Last Schedule

 చివరి షెడ్యూల్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ "బేవార్స్ గాడు"                                                                          



శ్రీ శోభా క్రియేషన్స్ పతాకంపై హర్షవర్ధన్ ,నిహారిక హీరో హీరోయిన్లుగా బి వి అంజనీ ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం "బేవార్స్ గాడు" చిత్రం రెండు షెడ్యూల్ కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ పరిసరప్రాంతాలలో  పూర్తి చేసుకొని  ప్రస్తుతం హైదరాబాద్ పరిసరప్రాంతాలో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకొంటుంది 


ఈ సందర్భంగా దర్శకుడు బి వి అంజనీ ప్రసాద్ మాట్లాడుతూ... ఈ షెడ్యూల్ తో పాటల చిత్రీకరణ  మినహా.టాకిపార్ట్ పాటు పూర్తవుతుందని కీలక పాత్రలో సుమన్ నటిస్తున్నారు

గత జన్మలో కన్నతల్లి చావుకు కారకుడైన కొడుకు. ప్రస్తుత జన్మలో ఆ కొడుకు మళ్లీ జన్మించి  కన్నతల్లి రుణాన్ని ఎలా తీర్చుకున్నాడు అన్నదే  ముఖ్య కథాంశం సోషియో ఫాంటసీగా  చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఉంటుంది ఈ చిత్రంలో నాలుగు పాటలు ,నాలుగు ఫైట్లు ఉన్నాయన్నారు'  


ఇంకా చిత్రంలో వాసాల శ్రీధర్. బేబీ మహిత వివరెడ్డి, ఆకుల రాజు, సునీత రెడ్డి, సుద్దాల చంద్రయ్య, సీతామహాలక్ష్మి తదితరులు నటిస్తున్న ఈ చిరానికి కెమెరా జవహర్ లాల్ రాజు  సంగీత రాము

Balagam Producer Harshith Reddy Launched Trailer Of Seetha Kalyana Vaibhogame

 సీతా కళ్యాణ వైభోగమే’ సినిమాను థియేటర్లో చూసి ఆదరించండి.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హర్షిత్ రెడ్డి



సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ సినిమాను జూన్ 21న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి విడుదల చేశారు. సోమవారం నాడు నిర్వహించిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో

 హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ. ‘ఓ మై ఫ్రెండ్ టైంలోనే సతీష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ మూవీ ఐడియాను ఏడాదిన్నర క్రితమే చెప్పాడు. సుమన్ అనే కొత్త కుర్రాడు, యంగ్ టాలెంట్‌తో చేస్తున్నానని అన్నాడు. సుమన్ ఫస్ట్ ఫిల్మ్, సతీష్ రెండో చిత్రానికి ఆల్ ది బెస్ట్. నీరూస్ సంస్థకు ఆల్ ది బెస్ట్. రాచాల యుగంధర్‌కు ఆల్ ది బెస్ట్. జూన్ 21న ఈ చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.

 బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ. ‘టైటిల్ చాలా బాగుంది. మన తెలుగు సంప్రదాయాన్ని చాటేలా ఉంది. మంచి చిత్రం తీసిన యుగంధర్ గారికి మంచి విజయం దక్కాలి. సతీష్ చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. ఊరికి ఉత్తరాన సినిమా నాకు నచ్చింది. ఈ సినిమాతో సతీష్‌కు పెద్ద విజయం దక్కాలి. సుమన్, గరిమ ఇద్దరూ చక్కగా నటించారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. వారిద్దరికీ ఆల్ ది బెస్ట్. గగన్ విహారి మంచి నటుడిగా ఎదుగుతున్నారు. 21న రాబోతోన్న ఈ సినిమాను అందరూ చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు.

దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ. ‘మా సినిమా పాటలు టీ-సీరిస్ ద్వారా రిలీజ్ అయ్యాయి. మా ట్రైలర్ అందరికీ నచ్చింది. హర్షిత్ రెడ్డి గారు బలగం సినిమాతో బలాన్ని ఇచ్చారు. హర్షిత్ రెడ్డి గారి కజిన్ సుమన్ తేజ్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు. చరణ్ అర్జున్ గారు మంచి పాటలు ఇచ్చారు. నిర్మాత యుగంధర్ గారికి సినిమా మీద ఎంతో ప్యాషన్ ఉంది. రాముడి గుడి లేని ఊరు ఉండదు. ఆయన బతికిన విధానం వల్లే అందరికీ గుర్తుండిపోయారు. కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమాను తీశాను. నీరూస్ సంస్థ వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ఈ చిత్రం కోసం యూనిట్‌లోని ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

హీరో సుమన్ తేజ్ మాట్లాడుతూ. ‘మా ఈవెంట్‌కు వచ్చిన హర్షిత్ అన్నకి థాంక్స్. ఈ చిత్రం 90s కిడ్స్ అందరికీ నచ్చుతుంది. ఈ మూవీ ప్రయాణంలో మాకు అన్ని రకాల ఎమోషన్స్ ఎదురయ్యాయి. మా ఈ ప్రయాణంలో మేం రెండు చిత్రాలు చేశాం. ఆ రెండూ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. మేం పడిన కష్టాన్ని చూసేందుకు థియేటర్‌కు రండి. నీరూస్ సంస్థ ఇచ్చిన ప్రోత్సాహాన్ని మర్చిపోలేమ’ని అన్నారు.

నిర్మాత రాచాల యుగంధర్ మాట్లాడుతూ. ‘మా ఈవెంట్‌కు వచ్చిన హర్షిత్ గారికి, బెక్కం వేణుగోపాల్ గారికి థాంక్స్. చిన్న చిత్రంగా మొదలైనా.. పెద్ద సినిమాగా మారింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో గగన్ విహారి అద్భుతంగా నటించారు. ఊరికి ఉత్తరాన సినిమాతో సతీష్ గారు విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేశారు. సుమన్ తేజ్, గరిమలకు ఈ చిత్రంతో మంచి పేరు రాబోతోంది. పూర్ణాచారి గారు పాటలు అద్భుతంగా రాశారు. జూన్ 21న మా సినిమా రాబోతోంది.ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

గగన్ విహారి మాట్లాడుతూ.. ‘సతీష్ గారు నాకు మంచి కారెక్టర్ ఇచ్చారు. పాత్రల మధ్య జరిగే కథ ఇది. చాలా బలమైన ఎమోషన్స్ ఉంటాయి. అందరూ థియేటర్లో చూడాల్సిన సినిమా. ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ రేకెత్తిస్తుంది. మా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా లాంటి కొత్త వారిని నమ్మి సినిమా తీసిన యుగంధర్ గారికి థాంక్స్. సుమన్, గరిమలతో నటించడం ఆనందంగా ఉంది.  జూన్ 21న రాబోతోన్న మా చిత్రాన్ని అందరూ వీక్షించండి’ అని అన్నారు.

గరిమ చౌహాన్ మాట్లాడుతూ..‘మాలాంటి కొత్త వాళ్లని నమ్మి, ఛాన్స్ ఇచ్చిన నిర్మాత యుగంధర్ గారికి థాంక్స్. సతీష్ గారు ప్రతీ సీన్‌ను ఎంతో బాగా వివరించేవారు. పరుశురామ్ గారు మా అందరినీ అద్భుతంగా చూపించారు. చరణ్ గారు మంచి పాటలు ఇచ్చారు. సుమన్ తేజ్‌తో నటించడం ఆనందంగా ఉంది. గగన్ విహారి అద్భుతంగా నటించారు. మా సినిమా జూన్ 21న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.


 చరణ్ అర్జున్ మాట్లాడుతూ..టీ-సిరీస్ ద్వారా మా సినిమా పాటలు రిలీజ్ అయ్యాయి. ప్రతీ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సతీష్ గారు తీసిన ఈ మంచి చిత్రం హిట్ అవ్వాలి. నిర్మాత యుగంధర్ గారి పేరు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించాలి. జూన్ 21న మా సినిమా విడుదల అవుతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.


 సత్య నారాయణ మాట్లాడుతూ.. ‘ఈ మూవీ టైటిల్ చాలా బాగుంది. సతీష్ గారు చాలా మంచి డైరెక్టర్. యేలా యేలా అనే పాట కోసమే ఇక్కడకు వచ్చాను. రాసిన పూర్ణాచారి, పాటను కంపోస్ చేసి చరణ్ అర్జున్ గారికి ఆల్ ది బెస్ట్. ఈ ప్రయాణంలో సినిమా టీం పడ్డ కష్టం నాకు తెలుసు. సుమన్ అద్భుతమైన నటుడు. గరిమ, గగన్ విహారి చక్కగా నటించారు. ఈ చిత్రం జూన్ 21న విడుదల కాబోతోంది. మీడియా సపోర్ట్ చేసి ఆడియెన్స్‌కు రీచ్ అయ్యేలా చేయాలి. మా నిర్మాత యుగంధర్‌కు మంచి విజయం దక్కాలి’ అని అన్నారు.


 నీరూస్ ప్రతినిధి ఆసిం మాట్లాడుతూ..‘సతీష్‌తో మాకు మంచి అనుబంధం ఏర్పడింది. యుగంధర్ గారు చాలా మంచి వ్యక్తి. సుమన్, గరిమ, గగన్ చాలా అద్భుతంగా నటించారు. జూన్ 21న ఈ చిత్రం రాబోతోంది. అందరూ ఈ సినిమాను చూడండి’ అని అన్నారు.


 దేవరాజ్ పాలమూరి మాట్లాడుతూ.. ‘సీతా కళ్యాణ వైభోగమే సినిమా బాగా వచ్చింది. టైటిల్‌తోనే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. టీజర్, ట్రైలర్‌ ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. జూన్ 21న ఈ చిత్రం రానుంది. అందరూ ఆదరించండి’ అని అన్నారు.


 నటుడు రమణా రెడ్డి మాట్లాడుతూ..‘సీతా కళ్యాణ వైభోగమే సినిమాను చూశాను. చాలా బాగుంది. అందరూ అద్భుతంగా నటించారు. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించబోతోంది. జూన్ 21న ఈ మూవీ రాబోతోంది. కుటుంబ సమేతంగా అందరూ చూడదగ్గ చిత్రమిద’ని అన్నారు.

Kalki 2898 AD’ Trailer Unveiled




కల్కి 2898 AD’ ట్రైలర్: ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్, ఎక్స్ ట్రార్డినరీ VFX తో ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ విజువల్ మాస్టర్ పీస్


మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’, మ్యాసీవ్ అంచనాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ ఫైనల్లీ రిలీజ్ అయ్యింది. 'కల్కి 2898 AD' సినిమాటిక్ యూనివర్స్ ని ఎక్స్ ట్రార్డినరీగా పరిచయం చేస్తూ రెండు నిమిషాల యాభై ఒక్క సెకన్ల నిడివి గల ట్రైలర్ ప్రేక్షకులను ఇండియన్ మైథాలజీ వరల్డ్ లోకి తీసుకెళ్ళింది. టాప్ క్లాస్  సైన్స్ ఫిక్షన్, VFXతో అత్యద్భుతం అనిపించింది. సినిమా ట్రైలర్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్ తో సహా పలు భాషల్లో చూడటానికి అందుబాటులో ఉంది.


ఎలక్ట్రిఫైయింగ్ ట్రైలర్‌లో, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన యాక్షన్ పవర్ ని ప్రజెంట్ చేసి, అశ్వత్థామ పాత్రకు ప్రాణం పోశారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ తన అద్భుతమైన పాత్రలో నిజంగా గుర్తుపట్టలేనంతగా కనిపిస్తున్నారు. ఎక్సయిట్మెంట్ ని మరింతగా పెంచుతూ ఫ్యూచర్ వెహికల్, బెస్ట్ ఫ్రెండ్ 'బుజ్జి'తో ప్రభాస్ తన పవర్-ప్యాక్డ్ యాక్షన్, కెమిస్ట్రీతో అదరగొట్టారు. దీపికా పదుకొనే ప్రతి ఫ్రేమ్‌లో ఎమోషన్స్ తో నెరేటివ్ కి డెత్ ని జోడిస్తుంది. దిశా పటాని తన అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. ట్రెయిలర్ హోరిజోన్‌లో 'నయా యుగ్' (కొత్త యుగం) రాబోయే బాటిల్ గురించి రిఫరెన్స్ లతో నిండి ఉంది.


పవర్-ప్యాక్డ్ డైలాగ్‌లు, అద్భుతమైన బీజీఎం, టాప్ క్లాస్  VFXతో, 'కల్కి 2898 AD' ట్రైలర్ ప్రేక్షకులు ఆడ్రినలిన్-ఫ్లూయిడ్ తో కూడిన సినిమాటిక్ జర్నీని హామీ ఇస్తుంది. ప్రతి అంశంలోనూ అద్భుతం అనిపిస్తూ, బెస్ట్ ఇంటర్ నేషనల్ సినిమా ఎక్స్ పీరియన్స్ ని అందిస్తూ, మేకర్స్ ఎక్స్ ట్రార్డినరీ ట్రైలర్‌ను అందించారు. ట్రూ పాన్-ఇండియన్ మూవీ ‘కల్కి 2898 AD’ భారతదేశంలోని అత్యుత్తమ ప్రతిభావంతులను ఒకచోట చేర్చింది. బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్, టెక్నికల్, మ్యూజిక్, విజువల్స్ మైండ్స్ పని చేస్తున్న కల్కి వివిధ పరిశ్రమల నుండి దేశంలోని అత్యుత్తమ వ్యక్తులకు రిప్రజెంట్ చేస్తోంది.


ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ “ఈ రోజు నా మనసు చాలా ఎమోషన్స్ తో నిండి ఉంది. ఒక ఫిల్మ్ మేకర్స్ గా ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ పట్ల నాకు చాలా పాషన్. 'కల్కి 2898 AD'లో ఈ రెండు ఎలిమెంట్స్ ని మెర్జ్  చేయడం మా ఆర్టిస్ట్ లు. టీం అద్భుతమైన ప్రతిభ, అంకితభావం వల్ల సాధ్యమైంది. ఈ కలని సాకారం చేసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. మా నిర్మాతలు, స్టార్ కాస్ట్ నుంచి అద్భుతమైన కక్రియేటివ్ మైండ్స్, 'కల్కి 2898 AD' మొత్తం సిబ్బంది,  ప్రతి వ్యక్తి ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పని చేశారు. ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను, యావత్ దేశాన్ని గర్వించేలా చేస్తుందని, సినిమా కోసం వారిని ఎక్సయిట్ చేసేలా ఉంటుందని మేము ఆశిస్తున్నాము' అన్నారు.


'కల్కి 2898 AD' లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్  సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ఫ్యూచర్ లో సెట్ చేయబడింది. ఈ చిత్రం 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.


Maharaja Pre Release Event Held Grandly

'మహారాజ'ని తెలుగు ఆడియన్స్ డెఫినెట్ గా ఇష్టపడతారనే నమ్మకం వుంది: ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో విజయ్ సేతుపతి

 


మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మోస్ట్ ప్రెస్టీజియస్ 50వ మైల్ స్టోన్ మూవీ 'మహారాజ'రిలీజ్ కి రెడీ అయ్యింది. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనురాగ్ కశ్యప్ పవర్ ఫుల్ రోల్ లో నటించారు. విజయ్ సేతుపతికి ఇది 50వ సినిమా కావడంతో మెమరబుల్ హిట్ అందించడం కోసం దర్శకుడు చాలా కేర్ తీసుకున్నాడు. నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌ని హ్యుజ్ బడ్జెట్ తో లావిష్ గా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎన్‌విఆర్ సినిమా ఈ మూవీని ఏపీ, తెలంగాణలలోమ్యాసీవ్ గా రిలీజ్ చేయనుంది. ఈ సినిమా జూన్ 14న థియేట్రికల్ రిలీజ్‌ కానున్న నేపధ్యంలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 


ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా రామోజీరావు గారికి అంజలి ఘటిస్తున్నాను. ఆయన మృతి ఎంతో బాధకలిగించింది. హైదరాబాద్‌తో కంటే రామోజీ ఫిల్మ్‌సిటీతోనే నాకు మోమోరిస్ ఉన్నాయి. 2005లో ధనుష్‌ సినిమా కోసం తొలిసారి ఫిల్మ్‌సిటీకి వెళ్లాను. సినిమాకు సంబంధించి ఏం కావాలో అవన్నీ ఫిల్మ్‌సిటీలో కనిపించడం చూసి స్టన్ అయిపోయాను. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది దర్శకులు మంచి సినిమాలు తీస్తున్నారంటే అందులోని సదుపాయాలే కారణం. రామోజీరావు గారి విజన్‌కు ఫిల్మ్‌సిటీనే నిదర్శనం. సినిమా పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు. 


పిజ్జా ప్రమోషన్స్ కి ఇక్కడికి వచ్చాను. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ హైదరాబాద్ ప్రమోషన్స్ కి రావడం ఆనందంగా వుంది. మహారాజ 50వ సినిమా. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ తో వున్నాం. ఈ సినిమాని చాలా మందికి చూపించాం. చూసిన అందరికీ నచ్చింది. తెలుగు ప్రేక్షకులందరూ సినిమాని ఇష్టపడతారనే నమ్మకం వుంది. జూన్ 14న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమాని చూడాలి' అని కోరారు. 


హీరోయిన్ మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ.. తమిళ్ లో కొంత బ్రేక్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో భాగం కావడం గర్వంగా వుంది. చాలా మంచి స్క్రిప్ట్ ఇది. యూనిక్ స్క్రీన్ ప్లే. ఇలాంటి సినిమా ఈ మధ్య కాలంలో చూడలేదు. ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. సేతు గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా వుంది. అలాగే అనురాగ్ గారితో వర్క్ చేయడం కూడా గ్రేట్ ఎక్స్ పీరియన్స్. డైరెక్టర్ చాలా యునిక్ గా తీశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.  


డైరెక్టర్ నితిలన్ సామినాథన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మాది చిత్తూరు పక్కన చిన్న విలేజ్. చిన్నప్పటినుంచి చిరంజీవి సర్, బాలకృష్ణ సర్, నాగార్జున సర్ ఇలా అందరి సినిమాలు చూస్తూ పెరిగాను. విజయ్ సేతుపతి గారి యాభైవ సినిమాతో మీ అందరినీ కలుసుకోవడం ఆనందంగా వుంది. తెలుగు ప్రేక్షకులు సినిమా అంటే చాలా ఇష్టం, పాషన్. ఎన్వీ ప్రసాద్ గారితో పాటు అందరికీ థాంక్స్' చెప్పారు.  


అభిరామి మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తర్వాత తెలుగు సినిమాతో ఇక్కడి రావడం ఆనందంగా వుంది. మంచి కథ, మాస్ ఎలిమెంట్స్, ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో వున్నాయి. అన్నిటికిమించి విజయ్ సేతుపతి గారు వున్నారు. డైరెక్టర్ అద్భుతంగా తీశారు. ఇందులో మంచి పాత్ర చేశాను. ఇంత మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం ఆనందంగా వుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలి' అని కోరారు. 


డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన ఎన్వీ ప్రసాద్ గారికి, సురేష్ గారికి, విజయ్ సేతుపతి గారి థాంక్స్. ఈ సినిమా చూశాను. ఇందులో విజయ్ సేతుపతి గారి నటవిశ్వరూపం చూస్తారు. సినిమా అద్భుతంగా వుంటుంది. తప్పకుండా ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. మీ అందరి ఆశీస్సులు కావాలి' అన్నారు. 


నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. మీడియా దిగ్గజం, సినిమా పరిశ్రమకు ఎన్నో గొప్ప సినిమాలు అందించిన రామోజీరావు గారికి మా యూనిట్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన సినిమాకి అందించిన సేవలు మరువలేని. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటు. 

'మహారాజ'లో ఫ్యామిలీ ఎమోషన్ వుంది. మాస్ వుంది క్లాస్ వుంది. విజయ్ సేతుపతి గారి నటన మరోస్థాయిలో వుంటుంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యే సినిమా. ఖచ్చితం సినిమాని ఆదరిస్తారనే నమ్మకం వుంది. మంచి సినిమా చుశామనే తృప్తిని ఇస్తుంది. విజయ్ సేతుపతి గారి నటవిశ్వరూపం వుంటుంది' అన్నారు.


నటీనటులు: విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి (నటరాజ్), భారతీరాజా, అభిరామి, సింగంపులి, అరుల్దాస్, మునిష్కాంత్, వినోద్ సాగర్, బాయ్స్ మణికందన్, కల్కి, సచన నమిదాస్ 


టెక్నికల్ సిబ్బంది:

రచన & దర్శకత్వం: నితిలన్ సామినాథన్

నిర్మాతలు : సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి

అసోసియేట్ ప్రొడ్యూసర్: కమల్ నయన్

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్

తెలుగు రిలీజ్: NVR సినిమాస్

మ్యూజిక్: బి అజనీష్ లోక్‌నాథ్

ఎడిటర్: ఫిలోమిన్ రాజ్

ప్రొడక్షన్ డిజైనర్ : వి.సెల్వకుమార్

స్టంట్ డైరెక్టర్: అన్ల్ అరసు

డైలాగ్స్: నితిలన్ సామినాథన్, రామ్ మురళి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎ. కుమార్

తెలుగు డబ్బింగ్: పోస్ట్‌ప్రో వసంత్

సౌండ్ డిజైన్: అరుణ్ ఎస్ మణి (ఓలి సౌండ్ ల్యాబ్స్)

సౌండ్ మిక్సింగ్: M.R రాజకృష్ణన్ (R.K స్టూడియోస్)

కాస్ట్యూమ్ డిజైనర్: దినేష్ మనోహరన్

మేకప్ ఆర్టిస్ట్: AR అబ్దుల్ రజాక్

కాస్ట్యూమర్: S. పళని

కలరిస్ట్: సురేష్ రవి

స్టిల్స్ : ఆకాష్ బాలాజీ

సబ్ టైటిల్స్ : ప్రదీప్ కె విజయన్

స్టోరీబోర్డింగ్: స్టోరీబోర్డ్ చంద్రన్

VFX: పిక్సెల్ లైట్ స్టూడియో

DI: మంగో పోస్ట్

పబ్లిసిటీ డిజైనర్: చంద్రు (తండోరా)

పీఆర్వో(తమిళం): సురేష్ చంద్ర, రేఖ డి’వన్

పీఆర్వో (తెలుగు): వంశీ-శేఖర్

మార్కెటింగ్ టీమ్ (తెలుగు) - ఫస్ట్ షో

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : కె. శక్తివేల్, సుసి కామరాజ్

 

Saripodhaa Sanivaaram First Single on June 15th

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం' ఫస్ట్ సింగిల్ జూన్ 15న రిలీజ్ 



నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోద శనివారం'లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ అడ్రినలిన్‌తో కూడిన యూనిక్ అడ్వంచర్ ని భారీ కాన్వాస్‌పై హై బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 


తాజాగా మూవీ టీం మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసింది. సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ జూన్ 15 రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. జేక్స్ బిజోయ్ ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్ కంపోజ్ చేశారు. మేకర్స్ రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ వీడియోలో నాని స్లో మోషన్ లో నడుచుకుంటూ వచ్చి క్లాత్ ని తొలగించాక టేప్ రికార్డ్ రివిల్ కావడం, పవర్ ప్యాక్డ్ మ్యూజిక్ వినిపించడం చాలా క్రియేటివ్, ఇంట్రస్టింగ్ గా వుంది.  


ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. మురళి జి డివోపీగా పని చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.


ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. 


నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ

నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి

బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్

సంగీతం: జేక్స్ బిజోయ్

డీవోపీ: మురళి జి

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

ఫైట్స్: రామ్-లక్ష్మణ్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్

 

14 Reels Plus #BB4 Announced

మ్యాసీవ్ ఎపిక్ కాంబినేషన్ ఈజ్ బ్యాక్ అగైన్- గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, రామ్ ఆచంట, గోపీ ఆచంట, 14 రీల్స్ ప్లస్, ఎం తేజస్విని నందమూరి ప్రజెంట్స్ #BB4 అనౌన్స్ మెంట్



గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను పూర్తి చేసి ఇండియన్ సినిమా క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటిగా నిలిచారు. అత్యధిక వసూళ్లు రాబట్టిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన తర్వాత ఈ మ్యాసీవ్ ఎపిక్ కాంబో మళ్లీ చేతులు కలిపింది. 


వీరిద్దరూ నాలుగోసారి జత కడుతున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో #BB4 చిత్రం ఈ రోజు NBK పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. 'లెజెండ్' సినిమా నిర్మాణ భాగస్వాములైన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై #BB4ని భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఎం తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.


అనౌన్స్‌మెంట్ పోస్టర్ డివోషనల్ వైబ్ తో నిండి ఉంది. పోస్టర్ లో ఒక మ్యాసీవ్ రథచక్రం పవర్ ఫుల్ గా కనిపించింది, నెంబర్ 4ని రుద్రాక్ష బ్రాస్‌లెట్‌ను కట్టిబడివుంది. పోస్టర్ లో ఎర్రటి సూర్యుడు, పడుతున్న తోకచుక్కలు చూస్తుంటే నందమూరి హీరోతో మాస్ డైరెక్టర్ ఈసారి ఎలాంటి సినిమా తీయబోతున్నాడో తెలుసుకోవాలనే క్యురియాసిటీని కలిగిస్తుంది.


బాలకృష్ణ, బోయపాటి తెలుగు సినిమాలో బెంచ్‌మార్క్‌ను సెట్ చేశారు. ఈ డెడ్లీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ హై బడ్జెట్, టాప్ క్లాస్ టెక్నికల్ వ్యాలుస్ తో రూపొందించబడుతుంది. బాలకృష్ణకు మోస్ట్ ఎక్స్పెన్సివ్ సినిమా ఇదే. #BB4 సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.


నటీనటులు: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను

నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట

బ్యానర్: 14 రీల్స్ ప్లస్

ప్రజెంట్స్: ఎం తేజస్విని నందమూరి

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

 

Rajadhani Rowdy Releasing on June 14

జూన్ 14న వస్తున్న  "రాజధాని రౌడీ".



సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సంతోష్ కుమార్ నిర్మాణంలో, సంచలన విజయం సాధించిన కెజియఫ్ ఫేమ్ యశ్ హీరోగా, షీనా హీరోయిన్ గా, కె.వి రాజు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం" రాజధాని రౌడీ". ఈ చిత్రం జూన్ 14న విడుదల కు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత సంతోష్ కుమార్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు, మద్యపానం బారినపడి, నలుగురు యువకులు తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారు అనే కధాంశంతో తెరకెక్కిన చిత్రం "రాజధాని రౌడీ". వినోదానికి, సందేశాన్ని జోడించి రూపొందిన చిత్రమిది. చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ, ఆలోచన రేకెత్తించే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీస్ గా అద్భుతమైన నటన ప్రదర్శించారు. ముమైత్ ఖాన్ తన అందాలతో కనువిందుచేస్తారు. అర్జున్ జన్య అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇలాంటి మంచి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది.  అత్యధిక థియేటర్లలో ఈనెల 14న విడుదల చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

 

Star Producer Dil Raju Launched the M4M teaser in the USA

 M4M (మోటివ్ ఫర్ మర్డర్) టీజర్‌ను రిలీజ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు


సస్పెన్స్, క్రైమ్, త్రిల్లర్ జానర్‌ సినిమాలకు ఇప్పుడు థియేటర్, ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది. దర్శక నిర్బాత మోహన్ వడ్లపట్ల M4M (మోటివ్ ఫర్ మర్డర్) అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు M4M టీజర్‌ను అమెరికాలో  లాంచ్ చేశారు. టీజర్‌తో చిత్రంపై అందరిలోనూ అంచనాలను అమాంతం పెంచేశారు.  


సంబీత్ ఆచార్య, జో శర్మ జంటగా నటించిన M4M (మోటివ్ ఫర్ మర్డర్) టీజర్‌ను గమనిస్తుంటే హై స్టాండర్డ్ విజువల్స్‌తో, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. కాలీఫొర్నియా ఫ్రీమాంట్‌లో ఉన్న సినీలాంజ్ సినిమాస్ వెండితెరపై ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు విడుదలచేసి అభినందించారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగా ఉందని, ప్రేక్షకులకు రీచ్ అవుతుందని చిత్రయూనిట్‌ని అభినందించారు.


ఇక ఈ టీజర్‌లో సంబీత్ యాక్షన్, జో శర్మ గ్లామర్ ప్లస్ యాక్టింగ్ హైలెట్ అవుతోంది. వీరిద్దరి పర్ఫామెన్స్, సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయని, జో శర్మ యాక్షన్ మరింత అట్రాక్షన్‌గా నిలవనున్నట్టు టీజర్ చెబుతోంది.


M4M చిత్రాన్ని మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై అమెరికన్ కంపెని ‌మెక్‌విన్ గ్రూప్‌తో కలిసి నిర్మించింది. త్వరలోనే ఈ చిత్రం తెలుగు, హింది, తమిళ్, కన్నడ, మలయాళం ఐదు భాషలలొ విడుదలకు సిద్ధం కానుంది. 

Euphoria Features Kaala Bhairava as the Music Director

సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖ‌ర్  యూత్‌ఫుల్ సోష‌ల్ డ్రామా ‘యుఫోరియా’ చిత్రానికి సంగీత దర్శ‌కుడిగా కాల భైర‌వ‌.. స్పెష‌ల్ వీడియో రిలీజ్ చేసిన టీమ్‌



కాల భైర‌వ‌.. భార‌త‌దేశానికి ఆస్కార్ సాధించి పెట్టిన ‘నాటు నాటు ..’ పాటను పాడి ఆస్కార్ వేదిక‌ను ఓ ఊపు ఊపారు. ఆయ‌న‌ ఓ వైపు సింగ‌ర్‌గా, మ‌రో వైపు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ యంగ్ మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగ‌మ‌య్యారు. ఆ క్రేజీ సినిమాయే ‘యుఫోరియా’. వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్ష‌న్‌లో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.


‘యుఫోరియా’కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా కాల‌భైర‌వ టీమ్‌తో జాయిన్ అవుతున్నారంటూ ఓ స్పెష‌ల్ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్  బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందనుంది. ఈసినిమాలో న‌టించబోయే న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని  టీమ్ తెలియ‌జేసింది.

 

YVS Chowdary To Introduce Shri Janaki Ram’s Son Nandamuri Taraka Ramarao As Hero

నందమూరి జానకి రామ్ గారి తనయుడు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేయడం నా అదృష్టం. నందమూరి నాలుగో తరాన్ని పరిచయం చేసే అవకాశం రావడం గొప్ప భాగ్యం: డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి



-నందమూరి జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తున్న డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి- న్యూ టాలెంట్ రోర్స్ @ బ్యానర్‌పై సినిమాని నిర్మిస్తున్న యలమంచిలి గీత 


తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ శ్రీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని "న్యూ టాలెంట్ రోర్స్ @" బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. రమేష్ అత్తిలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.


నందమూరి తారక రామారావు ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకొని, హీరోగా ఎదగడానికి కావాల్సిన స్కిల్స్ అన్నీ నేర్చుకున్నారు. తన అద్భుతమైన కెరీర్‌లో ఎందరో నటీనటులను పరిచయం చేసిన వైవిఎస్ చౌదరి తన కమ్‌బ్యాక్ మూవీతో నందమూరి తారక రామారావును లాంచ్ చేసే బాధ్యతను తీసుకున్నారు.


డైరెక్టర్ వైవిఎస్ చౌదరికి నందమూరి హీరోలతో గొప్ప అనుబంధం వుంది. ఆయన హరికృష్ణ, బాలకృష్ణతో సినిమాలు చేశారు. ఇప్పుడు నందమూరి తారక రామారావుని పరిచయం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. 


అనౌన్స్ మెంట్ ఈవెంట్ లో డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ.. సభకు నమస్కారం. ఈ రోజు మీ అందరిముందు నిల్చోగలిగానంటే అది నా దైవంగా భావించే నందమూరి తారకరామారావు గారి దివ్య మోహన రూపం చలువ. ఆయన దివ్య మోహన రూపం నన్ను సినిమాల వైపు నడిపించింది. పరిశ్రమలోకి వచ్చిన తర్వాత అసిస్టెంట్ గా, అసోసియేట్ గా, కో డైరెక్టర్ గా, డైరెక్టర్, నిర్మాతగా ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్ని శాఖలు నిర్వహించిన కూడా ఇప్పటికీ నేను ఎన్టీఆర్ వీర అభిమానిని అని చెప్పుకోవడంలో నాకు ఆనందం వుంటుంది. 


అంకితభావంతో నమ్మిన సిద్దాంతం కోసం కష్టపడి పని చేస్తే కన్నకలలు సాకారం అవుతాయనే ఎన్టీఆర్ గారి సిద్ధాంతాన్ని ఆచరించి ప్రపంచం వ్యాప్తంగా ఏందరో వున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. నేను సంపాదించిన పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు కూడా ఆయన సిద్ధాంతాలనే పెట్టుబడిగా పెట్టి పరిశ్రమలోకి వచ్చాను. అక్కినేని నాగార్జున గారు దర్శకుడిగా నాకు తొలి అవకాశం ఇచ్చారు. హీరో గా ఎవరు కావాలని ఆయన అడిగినప్పుడు కొత్తవారిని పరిచయం చేద్దామని అనుకుంటున్నానని చెప్పాను. ఆ సమయంలో కొత్త వారితో సినిమాలు చేసే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో ఆయన ఎలాంటి సంకోచం లేకుండా కొత్తవారిని పరిచయం చేస్తూ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా నాకు తొలి అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి రుణపడి వుంటాను. 


చదువుకునే రోజుల్లోనే రామారావు గారి అభిమాని నుంచి ఎన్టీఆర్ టౌన్ వైడ్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప పదవి ఇదని భావించాను. ఆ సమయంలో విడుదలైన వేటగాడు సినిమా చూసి దర్శకుడు రాఘవేంద్రరావు గారికి కూడా వీర అభిమాని అయ్యాను. తదనంతరం రామారావు గారి అబ్బాయి హరికృష్ణ గారు కృష్ణావతారం సినిమాలో చిన్న కృష్ణుని గా నటించారు. తదనంతరం బాలకృష్ణ గారు తాతమ్మ కల సినిమాలో అరంగేట్రం చేశారు. రామారావు గారి తర్వాత బాలకృష్ణ గారిని ఫాలో చేసుకోవాలని అభిమానాల సంఘాలుగా మేమంతా అనుకున్న సమయంలో బాలకృష్ణ గారు ఓ యువ కెరటంలా కనిపించారు. గుడివాడ లో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోషియేన్ మొట్టమొదటిగా స్టార్ట్ చేశాం. తదనంతరం బాలకృష్ణ గారి పట్టాభిషేకం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేరే అవకాశం రావడం ఓ అదృష్టం. నేను ఎదిగిన క్రమంలో నందమూరి బాలకృష్ణ గారితో, హరికృష్ణ గారితో, మహేష్ బాబు గారితో, నాగార్జున గారితో సినిమాలు చేయడంతో పాటు నందమూరి, అక్కినేని హీరోలతో కలసి ఒక కాంబినేషన్ చేయడం, తొలి సినిమాకే నాగేశ్వరరావు గారితో పని చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టం. 


ఎంతోమంది కొత్తవారి పరిచయం చేస్తూ సక్సెస్ ఫుల్ గా సినిమాలు చేయడం జరిగింది. 'దేవదాస్' తో అఖండ విజయం సాధించడం, సాయి ధరమ్ తేజ్ ని పరిచయం చేయడం.. ఇలా కొత్తవారిని పరిచయం చేయడానికి కేరాఫ్ అడ్రస్ అనే పేరొచ్చింది. తర్వాత ఎవరితో సినిమా చేయాలని అలోచించినప్పుడు న్యూ టాలెంట్ రోర్స్ @ బ్యానర్ ని స్థాపించడం, యాద్రుచ్చికంగా బ్యాంకర్ కి NTR పేరు కలిసి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి కొత్త ప్రతిభగా ఎవరిని ఎన్నుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు.. తమ్ముల ప్రసన్న కుమార్ గారు ఓ వ్యక్తిని చూపించారు. ఆయన ఎవరో కాదు.. మా దైవం నందమూరి తారకరామారావు గారి ముని మనవడు, మా కథానాయకుడు హరికృష్ణ గారి మనవడు, నందమూరి జానకి రామ్ గారి పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావు. నందమూరి నాలుగో తరాన్ని పరిచయం చేసే అవకాశం రావడం నాకు దక్కిన గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. తన కుమారుడు పుట్టినప్పుడే ఓ కలకని కుమారుడికి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టారు. ఆ కలని సాకారం చేసుకునే తపన నందమూరి తారక రామారావులో వుంది. తను అద్భుతంగా వున్నాడు. మంచి రూపం. చాలా బావుంటాడు. మంచి నడవడిక వుంది. తనని చూసినప్పుడు ఎన్టీఆర్ పేరుని నాలుగో తరం కొనసాగించేందుకు దేవుడు ప్రక్రుతి శాసిస్తుందని అనిపించింది. అభిమానులకు ఓ ఆనందకరమైన వార్తలా ఫీలయ్యాను. తనకి తపన, దీక్ష పట్టుదల వున్నాయి. జానకి రామ్ కన్న కలని నడిపించడానికి వచ్చిన మధ్యామాన్ని నేను అని భావిస్తున్నాను. 


మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం. నందమూరి తారకరామారావు అనే నాలుగో తరం పేరుని ప్రపంచానికి పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా యువరత్న బాలకృష్ణ గారి బర్త్ డే రోజున ఈ విశేషాన్ని ప్రకటించడం మా అదృష్టం. ఇందులో తెలుగు అమ్మాయిని కథానాయికగా పరిచయం చేస్తున్నాం. తను అద్భుతంగా వుంటుంది. త్వరలోనే ఆమెను కూడా పరిచయం చేస్తాం. నా సినిమా ప్రతి సినిమాకి సంగీతం, సాహిత్యానికి పెద్దపీట వేస్తాను. ఈ సినిమా కూడా సంగీతం, సాహిత్యానికి చాలా ప్రాముఖ్యత వుంటుంది. మంచి వేడుకలో వారిని కూడా పరిచయం చేయడం జరుగుతుంది. వారి నాలెడ్జ్ ఈ సినిమా కొండంత అండగా ఉంటుందని భావిస్తున్నాను' అన్నారు. 


నిర్మాత యలమంచిలి గీత మాట్లాడుతూ.. మా స్నేహితులు సన్నిహితులు అందరిఅండదండలతో న్యూ టాలెంట్ రోర్స్ @ ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. మీ అందరి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నాం'' అన్నారు.   


నందమూరి తారక రామారావు ను అద్భుతంగా ప్రజెంట్ చేసే విధంగా వైవిఎస్ చౌదరి కథ, స్క్రీన్‌ప్లే రాశారు. ఖచ్చితంగా, ఈ చిత్రం తెలుగు సినిమా ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది. సినిమా జానర్, హీరోయిన్, ఇతర కీలక అంశాలకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తారు.  


నటీనటులు: నందమూరి తారక రామారావు

సాంకేతిక సిబ్బంది:

కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: వైవిఎస్ చౌదరి

బ్యానర్: న్యూ టాలెంట్ రోర్స్ @

నిర్మాత: యలమంచిలి గీత

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ అత్తిలి

పీఆర్వో: వంశీ-శేఖర్

 

Telugu Film Producers Council pay tribute to Shri Ramoji Rao

 తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి మరియు తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అక్షర యోధుడు శ్రీ రామోజీరావు గారికి నివాళులర్పించిన సినీ ప్రముఖులు



సినీ దిగ్గజ నిర్మాత, ఈనాడు సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ రామోజీరావు గారు మృతితో శోకసంద్రంలో మునిగిన తెలుగు సినీ ఇండస్ట్రీ. నేడు ఆయన మృతికి నివాళులర్పిస్తూ  తెలుగు సినీ ప్రముఖులు టీ ఎఫ్ పి సి లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  నిర్మాత, దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు గారు, నిర్మాత కేఎస్ రామారావు గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రవి గారు, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీర శంకర్ గారు, డైరెక్టర్ అజయ్ కుమార్ గారు, డైరెక్టర్ అసోసియేషన్ సెక్రెటరీ సుబ్బారెడ్డి గారు TFPC ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు, సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, స్రవంతి రవి కిషోర్ గారు, అంబటి శ్రీను గారు, విజయేంద్ర రెడ్డి గారు, శివలింగ ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రామోజీరావు గారికి నివాళులర్పిస్తూ చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ : అతి సామాన్యుడి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి రామోజీరావు గారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఒక ముఖ్యమంత్రిని ఒక నిర్మాత తన భుజాల పైన మోయడం మామూలు విషయం కాదు. ఒక మనిషి చనిపోయిన కూడా జన హృదయాల్లో నిలిచిపోవడం అనేది సాధారణమైన విషయం కాదు. అలాంటి వ్యక్తుల్లో ఒక ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఎస్వీ రంగారావు గారు, కృష్ణంరాజు గారు ఇప్పుడు అదే కోవలో రామోజీరావు గారు కూడా ఉంటారు. ఒకరిని మోసం చేయకుండా ఒకరి దగ్గర సొమ్ము లాక్కోకుండా తన శక్తితో పైకి ఎదిగిన వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి ఆయన ఈరోజు మనతో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత కె. ఎస్. రామారావు గారు మాట్లాడుతూ : ఒక లెజెండ్రీ పర్సన్, నిర్మాత, బిజినెస్ మాన్ రామోజీరావు గారు ఈరోజు మనతో లేకపోవడం బాధాకరం. సినిమా ఇండస్ట్రీ గురించి అంతగా అవగాహన లేకపోయినా 1996లో అతిపెద్ద స్టూడియోగా రామోజీ ఫిలిం సిటీ నిర్మించడం సాధారణ విషయం కాదు. ఒక సినిమాకి కావాల్సిన ప్రతి సెట్ రామోజీ ఫిలిం సిటీ లో ఉండడం ప్రపంచవ్యాప్తంగా షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీకి రావడం మామూలు విషయం కాదు. అదేవిధంగా ఎంతోమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి కల్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుకుంటున్నాను అన్నారు.


పరుచూరి గోపాలకృష్ణ గారు మాట్లాడుతూ : 1989లో మేము రామోజీరావు గారికి మౌన పోరాటం సినిమాకి మాటలు రాశాం. కానీ మా అమ్మగారు, నాన్నగారు ఇద్దరూ ప్రియా పచ్చళ్ల కంపెనీలో పనిచేసేవారు. కానీ మాకు మాత్రం మౌన పోరాటం వరకు ఆ అవకాశం దొరకలేదు. ఆయన తీసిన సినిమాల్లో ప్రతిఘటన సినిమా వినోదం కోసమే కాదు విజ్ఞానం కోసం అని కూడా చెప్పినటువంటి సినిమా. ఎప్పటికీ నాశనం లేనిది అక్షరం. అలాంటి అక్షర యోధుడు రామోజీరావు గారు. సినీ ఇండస్ట్రీలో ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం అన్నారు.


విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ : రామోజీరావు గారితో నాకు డైరెక్ట్ గా ఎలాంటి అనుబంధం లేదు. కానీ ఆయన సమయానికి ఎంతో విలువ ఇచ్చే వ్యక్తి. సినిమా అంటే వినోదమే కాదు విజ్ఞానం కూడా అని చెప్పిన వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని దేవుని ప్రార్థిస్తున్నాను అన్నారు.


మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రవి గారు మాట్లాడుతూ : 24 క్రాఫ్ట్ నుంచి వచ్చి ఈ కార్యక్రమానికి రామోజీరావు గారికి నివాళులర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ. పరిస్థితులని మార్చడానికి ఒకరు ప్రింట్  మీడియా ఒకరు డిజిటల్ మీడియా వాడతారు కానీ అన్నిటినీ వాడి ప్రజలకు సత్యాన్ని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. ఇప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు పేపర్ చదవకపోతే రోజు గడవదా అనుకునే వారు చాలామంది ఉన్నారు. ఒక పత్రిక ద్వారా ఇంతటి సామాజిక చైతన్యాన్ని తీసుకురావడం సాధారణ విషయం కాదు. ఒక న్యూస్ పేపర్ ద్వారానే కాకుండా మంత్లీ పత్రికల ద్వారా ఎంతో మంది రచయితలకు అవకాశాన్ని కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము అన్నారు.


డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీర శంకర్ గారు మాట్లాడుతూ : ఆయన ఎంతో మానసిక ధైర్యం కలిగిన వ్యక్తి. ఆయన భౌతికంగా మనకు దూరమైన  పొద్దున్నే లేచి చదివే ఈనాడు న్యూస్ పేపర్ లో ఉంటారు చూసే ఈటీవీ ఛానల్ లో ఉంటారు తినే ప్రియా పచ్చళ్ళలో ఉంటారు ఆయన దూరమైన మనతో పాటే ఉన్నారు ఉంటారు. అదేవిధంగా సినిమా షూటింగులు అంటే మనకు గుర్తొచ్చేది రామోజీ ఫిలిం సిటీ సినిమా రిలీజ్ అవ్వాలంటే గుర్తొచ్చేది మయూరి డిస్ట్రిబ్యూషన్ సంస్థ. ఇలా ప్రతి దాంట్లో ఆయన ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని దేవుని ప్రార్థిస్తున్నాను అన్నారు.


దర్శకుడు అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ : మహాభారతంలో భీష్ముడికి అధర్మ యుద్ధం చేస్తూ ఎప్పుడు తను చాలించాలో తెలిసి ప్రాణాలు వదిలేస్తారు. అదేవిధంగా రామోజీరావు గారు ధర్మ యుద్ధం చేసి ప్రాణాలను విడిచారు. ఆయన అనుకున్నది నెరవేరి ధర్మం గెలిచింది అన్న ఆనందంతో ఆయన తను చాలించినట్టు అనిపిస్తుంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు.


తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ : ఫోర్త్ ఎస్టేట్ ని ఆయన నిలబెట్టినట్టు ఎవరూ నిలబెట్టలేదు. ఫోర్త్ ఎస్టేట్ అంటే మీడియా. మీడియా ద్వారా ఎన్నో మంచి పనులను చేసి ప్రజలకు సత్యాన్ని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన నిజంగా ట్రూ లెజెండ్. ఎన్నో సంస్థలు స్థాపించి ఎంతో మంది ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాలను నిలబెట్టిన వ్యక్తి. ఆయన ఈరోజు భౌతికంగా మనతో లేకపోయినా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు.


దర్శకుడు రేలంగి నరసింహారావు గారు మాట్లాడుతూ : రామోజీరావు గారితో నాకున్న అనుభవాన్ని చెప్పాలి. 1992 లో నాకు ఉషాకిరణ్ మూవీస్ నుంచి పిలుపు వచ్చింది. మీరు డైరెక్టర్ గా అనుకుని ఒక సినిమా అనుకుంటున్నాం చేస్తారా. రామోజీరావు గారు సంస్థలో చేయడం అదృష్టంగా భావించి బయలుదేరి వచ్చాం. ఆయన్ని సాయంత్రం 5.30ki కలవాలి 4.30 కి కారు వచ్చింది. కరెక్ట్ గా 5:30 కి ఆయన నుంచి పిలుపు వచ్చింది. ఆయన టైం పంచువాలిటీ బాగా పాటిస్తారు. కథ చెప్పిన తర్వాత ఆయనకు నచ్చి వెంటనే ఒప్పుకున్నారు. ఆయనతో అలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అక్షర యోధుడు ఆయన. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు.


ఆర్టిస్ట్ శివారెడ్డి గారు మాట్లాడుతూ : ఎన్నో కుటుంబాలకి ఉద్యోగం ఇచ్చి ఆసరాగా నిలిచిన మహా వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి కుటుంబాలలో మాది ఒకటి. నేను ఫస్ట్ కామెడీ చేయడానికి వచ్చినప్పుడు ఈటీవీలోనే చేయడం జరిగింది. నేను ఫస్ట్ నంది అవార్డు అందుకుంది కూడా ఆ సంస్థ నుంచి వచ్చిన సినిమా నుంచి. అంతేకాకుండా ఆయన చేతుల మీదుగా ఎన్నోసార్లు అవార్డులు అందుకోవడం జరిగింది. అదేవిధంగా నాకు ఎన్నో అవకాశాలు రావడానికి కారణమైన సినిమా ఉషాకిరణ్ సంస్థ నుంచి వచ్చిన ఆనందం. అలాంటి ఒక గొప్ప సినిమా ఇచ్చి మళ్లీ వెనుతిరిగి చూడకుండా చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు.


తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ : కొత్త టెక్నీషియన్స్ ని, కొత్త ఆర్టిస్టుల్ని తీసుకొచ్చి విభిన్న సినిమాలు నిర్మించిన వ్యక్తి రామోజీరావు గారు. అదేవిధంగా మయూరి డిస్ట్రిబ్యూషన్ ద్వారా మంచి సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం. పాడైపోయిన థియేటర్లను లీజుకు తీసుకుని రెనోవేట్ చేసి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం. అదేవిధంగా ఎన్నో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్ని దాచి భావితరాలకు ఆ సినిమాల్ని అందించి వాటి విలువల్ని తెలియజేయడం. అదేవిధంగా అక్షరమనే ఆయుధంతో సమాజానికి ఎంతో మేలు చేయడం సమాజంలోని చెడును తొలగించడం ప్రజలకు మంచి చేయడం వంటి ఎన్నో పనులు చేసిన వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు. 


Narne Nithin's 'Sri Sri Sri Rajavaru' completes its Censor formalities

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "శ్రీ శ్రీ శ్రీ రాజావారు"



శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై jr ntr బావమరిది నార్నె నితిన్ , సంపద హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "శ్రీ శ్రీ శ్రీ రాజావారు". అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U A సర్టిఫికెట్ పొందటం తో పాటు, సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ " jr ntr బావమరిది నార్నె నితిన్ నటించిన ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి. అలాగే మా  దర్శకులు సతీష్ వేగేశ్న  మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరుంది. ఆయన ఈ చిత్రాన్ని రూపొందించిన విధానం ప్రతి ఒక్కరిని ఎంటర్ టైన్ చేస్తుంది. అలాగే మా సినిమా ఇటీవలే సెన్సార్ సభ్యుల ప్రశంసలతో  U A సర్టిఫికెట్ పొందడం సంతోషం గా వుంది.. అన్ని హంగులతో మా చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నాం."అన్నారు.

 నార్నే నితిన్, సంపద, రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కైలాష్ మీనన్, కెమెరా: దాము నర్రావుల, ఎడిటర్: మధు, పాటలు: శ్రీమణి, పబ్లిసిటీ  డిజైనర్: ఈశ్వర్, పి అర్ ఓ:బి. వీరబాబు, సమర్పణ: రంగాపురం రాఘవేంద్ర, మురళీ కృష్ణ చింతలపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:CH. V. శర్మ, రాజీవ్ కుమార్, నిర్మాతలు: చింతపల్లి రామారావు, ఎమ్.సుబ్బారెడ్డి, కథ,స్క్రీన్ ప్లే దర్శకత్వం: సతీష్ వేగేశ్న 

Nandamuri Bala Krishna Birthday Celebration Held at Tirumala

 తిరుమలలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు..



తిరుమల లో  బాలకృష్ణ 64 జన్మదినం సందర్బంగా తిరుమలలోని అఖిలాండం దగ్గర 664 కొబ్బరికాయలు కొట్టి, 5 కిలోల  కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించి బాలయ్య సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలి అని వెంకటేశ్వర్లు స్వామిని ప్రార్ధించిన టీటీడీ ఎక్స్పోర్ట్ మెంబర్ ఎన్టీఆర్ రాజు గారు అండ్ ఫ్యామిలీ.


రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ : ఎన్టీఆర్ రాజు గారి కొడుకుగా నందమూరి అభిమానిగా నాకు చాలా గౌరవం లభించింది. నేడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మా కుటుంబం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నందమూరి బాలకృష్ణ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలి అని ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ సేవా కార్యక్రమాలు చేయాలని అని ఆయన ఏ పని చేసిన విజయవంతం కావాలి అని ఆ శ్రీవారిని కోరుకుంటున్నాను, ఆయన పుట్టినరోజు మాకు ఒక పండగ లాంటిది” అని చెప్పారు.



Thufaanu Hecharika First Look is Out Now

 శ్రీ పాద క్రియేషన్స్ బ్యానర్ రెండో చిత్రం గా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ "తుఫాను హెచ్చరిక" ఫస్ట్ లుక్ విడుదల



శ్రీ పాద క్రియేషన్స్ పతాకం , పై అల్లు రామకృష్ణ మరియు సుహానా ముద్వారి హీరో హీరోయిన్ గా జగదీష్ కె కె దర్శకత్వం లో డాక్టర్ శ్రీనివాస్ కిషన్ అనాపు, డాక్టర్ రజనీకాంత్ ఎస్, సన్నీ బాన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం "తుఫాను హెచ్చరిక". ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేసారు చిత్ర యూనిట్.


ఈ సందర్భంగా దర్శకుడు జగదీష్ కె కె మాట్లాడుతూ, "ఈరోజు మా 'తుఫాను హెచ్చరిక' మొదటి పోస్టర్ ను విడుదల చేస్తున్నాం. ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.  ఒక అందమైన హిల్ స్టేషన్ లో ఆహ్లాదంగా జీవించే ఒక అబ్బాయి జీవితంలోకి ఒక తుఫాను లాంటి విధ్వంసం జరిగితే, ఆ పరిస్థితులని ఎలా ఎదురుకున్నాడు మరియు ఎలా విజయం సాధించాడు అనేదే చిత్ర కథ.


ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాటిక్ విజన్ కి మా నటీనటులు మరియు టెక్నిషన్స్ ప్రాణం పోశారు. ఆ ఆర్టిస్ట్స్  అందరు అతి తక్కువ ఉష్ణోగ్రతలలో, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అద్భుతంగా నటించారు. లంబసింగి మరియు చింతపల్లి లాంటి అందమైన లొకేషన్స్ లో ప్రకృతి అందాల్లో సరైన విసువల్ కోసం ఏడాది కాలం ఓపికగా వేచి ఉంది సరైన అందాలను చిత్రీకరించాము.


హిల్ స్టేషన్ లో ఉండే ఆ ఫ్రెష్ నెస్ స్పష్టంగా ఫీల్ అయ్యేలా చేసిన మా సినిమాటోగ్రాఫర్ ఆర్ కె నాయుడు చాలా కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ పట్ల నా అభిరుచిని పంచుకుని చిత్రీకరణలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సపోర్ట్ చేసిన మా నిర్మాతలు డా.శ్రీనివాస్‌ కిషన్‌, డా.రజనీకాంత్‌, సన్నీ బన్సల్‌  లకి నా కృజ్ఞతలు. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్, మ్యూజిక్, మిగిలిన అన్ని క్రాఫ్ట్ ల టెక్నీషియన్లు చాలా చక్కగా సహకరించారు.


షూటింగ్ అంత పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. మా చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు.


హీరో అల్లు రామకృష్ణ (రాఖి)

హీరోయిన్ - సుహానా ముద్వారి


బ్యానర్ - శ్రీ పాద క్రియేషన్స్ లిమిటెడ్, వింటేజ్ పిక్చర్స్.


సమర్పణ - సరయు తలశిల


దర్శకుడు - జగదీష్ కె కె


నిర్మాతలు - డాక్టర్ శ్రీనివాస్ కిషన్ ఆనాపు, డాక్టర్ రజినీకాంత్ ఎస్, సన్నీ బన్సల్


మాటలు - అరుణ్ వీర్

సినిమాటోగ్రఫీ - వి ఆర్ కె నాయుడు

ఎడిటర్ - జగదీష్ కె కె

ఆర్ట్ డైరెక్టర్ - బత్తుల శివ సాయి కుమార్

ప్రొడక్షన్ కంట్రోలర్ - శ్రీను ఇర్ల

కొరియోగ్రాఫర్ - ఆది పొన్నస్

లిరిక్స్ - శ్రీమని, ధర్మ గూడూరు

కాస్ట్యూమ్స్ - రేణు కియారా

సౌండ్ ఇంజనీర్ - రాధా కృష్ణ

పోస్టర్, లిరికల్ వీడియోస్ - జె కె ఫ్రేమ్స్

పి ఆర్ ఓ - పాల్ పవన్