Narne Nithin's 'Sri Sri Sri Rajavaru' completes its Censor formalities

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "శ్రీ శ్రీ శ్రీ రాజావారు"



శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై jr ntr బావమరిది నార్నె నితిన్ , సంపద హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "శ్రీ శ్రీ శ్రీ రాజావారు". అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U A సర్టిఫికెట్ పొందటం తో పాటు, సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ " jr ntr బావమరిది నార్నె నితిన్ నటించిన ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి. అలాగే మా  దర్శకులు సతీష్ వేగేశ్న  మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరుంది. ఆయన ఈ చిత్రాన్ని రూపొందించిన విధానం ప్రతి ఒక్కరిని ఎంటర్ టైన్ చేస్తుంది. అలాగే మా సినిమా ఇటీవలే సెన్సార్ సభ్యుల ప్రశంసలతో  U A సర్టిఫికెట్ పొందడం సంతోషం గా వుంది.. అన్ని హంగులతో మా చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నాం."అన్నారు.

 నార్నే నితిన్, సంపద, రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కైలాష్ మీనన్, కెమెరా: దాము నర్రావుల, ఎడిటర్: మధు, పాటలు: శ్రీమణి, పబ్లిసిటీ  డిజైనర్: ఈశ్వర్, పి అర్ ఓ:బి. వీరబాబు, సమర్పణ: రంగాపురం రాఘవేంద్ర, మురళీ కృష్ణ చింతలపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:CH. V. శర్మ, రాజీవ్ కుమార్, నిర్మాతలు: చింతపల్లి రామారావు, ఎమ్.సుబ్బారెడ్డి, కథ,స్క్రీన్ ప్లే దర్శకత్వం: సతీష్ వేగేశ్న 

Post a Comment

Previous Post Next Post