Home » » Nandamuri Bala Krishna Birthday Celebration Held at Tirumala

Nandamuri Bala Krishna Birthday Celebration Held at Tirumala

 తిరుమలలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు..



తిరుమల లో  బాలకృష్ణ 64 జన్మదినం సందర్బంగా తిరుమలలోని అఖిలాండం దగ్గర 664 కొబ్బరికాయలు కొట్టి, 5 కిలోల  కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించి బాలయ్య సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలి అని వెంకటేశ్వర్లు స్వామిని ప్రార్ధించిన టీటీడీ ఎక్స్పోర్ట్ మెంబర్ ఎన్టీఆర్ రాజు గారు అండ్ ఫ్యామిలీ.


రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ : ఎన్టీఆర్ రాజు గారి కొడుకుగా నందమూరి అభిమానిగా నాకు చాలా గౌరవం లభించింది. నేడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మా కుటుంబం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నందమూరి బాలకృష్ణ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలి అని ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ సేవా కార్యక్రమాలు చేయాలని అని ఆయన ఏ పని చేసిన విజయవంతం కావాలి అని ఆ శ్రీవారిని కోరుకుంటున్నాను, ఆయన పుట్టినరోజు మాకు ఒక పండగ లాంటిది” అని చెప్పారు.




Share this article :