Star Producer Dil Raju Launched the M4M teaser in the USA

 M4M (మోటివ్ ఫర్ మర్డర్) టీజర్‌ను రిలీజ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు


సస్పెన్స్, క్రైమ్, త్రిల్లర్ జానర్‌ సినిమాలకు ఇప్పుడు థియేటర్, ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది. దర్శక నిర్బాత మోహన్ వడ్లపట్ల M4M (మోటివ్ ఫర్ మర్డర్) అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు M4M టీజర్‌ను అమెరికాలో  లాంచ్ చేశారు. టీజర్‌తో చిత్రంపై అందరిలోనూ అంచనాలను అమాంతం పెంచేశారు.  


సంబీత్ ఆచార్య, జో శర్మ జంటగా నటించిన M4M (మోటివ్ ఫర్ మర్డర్) టీజర్‌ను గమనిస్తుంటే హై స్టాండర్డ్ విజువల్స్‌తో, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. కాలీఫొర్నియా ఫ్రీమాంట్‌లో ఉన్న సినీలాంజ్ సినిమాస్ వెండితెరపై ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు విడుదలచేసి అభినందించారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగా ఉందని, ప్రేక్షకులకు రీచ్ అవుతుందని చిత్రయూనిట్‌ని అభినందించారు.


ఇక ఈ టీజర్‌లో సంబీత్ యాక్షన్, జో శర్మ గ్లామర్ ప్లస్ యాక్టింగ్ హైలెట్ అవుతోంది. వీరిద్దరి పర్ఫామెన్స్, సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయని, జో శర్మ యాక్షన్ మరింత అట్రాక్షన్‌గా నిలవనున్నట్టు టీజర్ చెబుతోంది.


M4M చిత్రాన్ని మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై అమెరికన్ కంపెని ‌మెక్‌విన్ గ్రూప్‌తో కలిసి నిర్మించింది. త్వరలోనే ఈ చిత్రం తెలుగు, హింది, తమిళ్, కన్నడ, మలయాళం ఐదు భాషలలొ విడుదలకు సిద్ధం కానుంది. 

Post a Comment

Previous Post Next Post