Home » » Thufaanu Hecharika First Look is Out Now

Thufaanu Hecharika First Look is Out Now

 శ్రీ పాద క్రియేషన్స్ బ్యానర్ రెండో చిత్రం గా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ "తుఫాను హెచ్చరిక" ఫస్ట్ లుక్ విడుదల



శ్రీ పాద క్రియేషన్స్ పతాకం , పై అల్లు రామకృష్ణ మరియు సుహానా ముద్వారి హీరో హీరోయిన్ గా జగదీష్ కె కె దర్శకత్వం లో డాక్టర్ శ్రీనివాస్ కిషన్ అనాపు, డాక్టర్ రజనీకాంత్ ఎస్, సన్నీ బాన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం "తుఫాను హెచ్చరిక". ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేసారు చిత్ర యూనిట్.


ఈ సందర్భంగా దర్శకుడు జగదీష్ కె కె మాట్లాడుతూ, "ఈరోజు మా 'తుఫాను హెచ్చరిక' మొదటి పోస్టర్ ను విడుదల చేస్తున్నాం. ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.  ఒక అందమైన హిల్ స్టేషన్ లో ఆహ్లాదంగా జీవించే ఒక అబ్బాయి జీవితంలోకి ఒక తుఫాను లాంటి విధ్వంసం జరిగితే, ఆ పరిస్థితులని ఎలా ఎదురుకున్నాడు మరియు ఎలా విజయం సాధించాడు అనేదే చిత్ర కథ.


ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాటిక్ విజన్ కి మా నటీనటులు మరియు టెక్నిషన్స్ ప్రాణం పోశారు. ఆ ఆర్టిస్ట్స్  అందరు అతి తక్కువ ఉష్ణోగ్రతలలో, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అద్భుతంగా నటించారు. లంబసింగి మరియు చింతపల్లి లాంటి అందమైన లొకేషన్స్ లో ప్రకృతి అందాల్లో సరైన విసువల్ కోసం ఏడాది కాలం ఓపికగా వేచి ఉంది సరైన అందాలను చిత్రీకరించాము.


హిల్ స్టేషన్ లో ఉండే ఆ ఫ్రెష్ నెస్ స్పష్టంగా ఫీల్ అయ్యేలా చేసిన మా సినిమాటోగ్రాఫర్ ఆర్ కె నాయుడు చాలా కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ పట్ల నా అభిరుచిని పంచుకుని చిత్రీకరణలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సపోర్ట్ చేసిన మా నిర్మాతలు డా.శ్రీనివాస్‌ కిషన్‌, డా.రజనీకాంత్‌, సన్నీ బన్సల్‌  లకి నా కృజ్ఞతలు. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్, మ్యూజిక్, మిగిలిన అన్ని క్రాఫ్ట్ ల టెక్నీషియన్లు చాలా చక్కగా సహకరించారు.


షూటింగ్ అంత పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. మా చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు.


హీరో అల్లు రామకృష్ణ (రాఖి)

హీరోయిన్ - సుహానా ముద్వారి


బ్యానర్ - శ్రీ పాద క్రియేషన్స్ లిమిటెడ్, వింటేజ్ పిక్చర్స్.


సమర్పణ - సరయు తలశిల


దర్శకుడు - జగదీష్ కె కె


నిర్మాతలు - డాక్టర్ శ్రీనివాస్ కిషన్ ఆనాపు, డాక్టర్ రజినీకాంత్ ఎస్, సన్నీ బన్సల్


మాటలు - అరుణ్ వీర్

సినిమాటోగ్రఫీ - వి ఆర్ కె నాయుడు

ఎడిటర్ - జగదీష్ కె కె

ఆర్ట్ డైరెక్టర్ - బత్తుల శివ సాయి కుమార్

ప్రొడక్షన్ కంట్రోలర్ - శ్రీను ఇర్ల

కొరియోగ్రాఫర్ - ఆది పొన్నస్

లిరిక్స్ - శ్రీమని, ధర్మ గూడూరు

కాస్ట్యూమ్స్ - రేణు కియారా

సౌండ్ ఇంజనీర్ - రాధా కృష్ణ

పోస్టర్, లిరికల్ వీడియోస్ - జె కె ఫ్రేమ్స్

పి ఆర్ ఓ - పాల్ పవన్ 



Share this article :