Latest Post

Karthikeya 2 Unique Contest

 యంగ్ హీరో నిఖిల్, చందూ మొండేటి ‘కార్తికేయ 2’కు వినూత్నమైన ప్రచారం.. కాంటెస్ట్ లో గెలిస్తే 6 లక్షలు..



ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పై అద్భుతమైన స్పందన వచ్చింది. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యే కార్తికేయ 2 సెన్సార్ కార్యక్రమాలు ముగిసాయి. ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సినిమాలోని అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు.. కాన్సెప్ట్ చూసి సెన్సార్ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 12న విడుదల కానుంది కార్తికేయ 2.

తాజాగా ఈ సినిమాకు వినూత్నమైన ప్రచారం మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు. దీని కోసం సపరేటుగా ఒక కాంటెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతిలో ఈ కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. ఈ మిస్టికల్ టెస్ట్ లో గెలుపొందిన విజేతలకు ఆరు లక్షల విలువ గల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే హైదరాబాదులో మొదటి క్లూ విడుదల చేశారు. ఒక్కొక్కటిగా మరికొన్ని క్లూస్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ ప్రచారంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగిపోతుంది.

 

నటీనటులు:

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు


టెక్నికల్ టీం:


క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్యం - చందు మెుండేటి

బ్యాన‌ర్:  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి& అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌

కొ-ప్రొడ్యూస‌ర్: వివేక్ కూచిభొట్లనిర్మాత‌లు: టి.జి విశ్వ ప్ర‌సాద్‌&అభిషేక్ అగ‌ర్వాల్‌

మ్యూజిక్: కాలభైరవ

సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని

ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Maatarani Mounamidhi Trailer Launched

 పాన్ ఇండియా స్టార్స్ బ్లెస్సింగ్స్ తో "మాటరాని మౌనమిది" ట్రైలర్ విడుదల




రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర  దర్శకుడు సుకు

పూర్వాజ్ రూపొందిస్తున్న సినిమా "మాటరాని మౌనమిది". మహేష్ దత్త, సోని

శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్

బ్యాక్ డ్రాప్ లో ముల్టి జోనర్ గా రూపొందుతున్నదీ సినిమా.  తుది హంగులు

అద్దుకుంటున్న "మాటరాని మౌనమిది" సినిమా ఆగస్టు 19న విడుదల కాబోతోంది.

తాజాగా చిత్ర ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్స్ అయిన చిరంజీవి, పవన్

కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ బ్లెస్సింగ్స్ తో రిలీజ్ చేశారు.


"మాటరాని మౌనమిది" మూవీ ట్రైలర్ చూస్తే లవ్, మిస్టరీ థ్రిల్లర్ గా ఈ

సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్నేహితుడిలా ఉండే బావ ఇంటికి

వెళ్తాడు హీరో. అక్కడ అతనికి మాటలు రాని క్లాసికల్ డాన్సర్ పరిచయం

అవుతుంది. ఈ అమ్మాయితో రిలేషన్ ఏర్పడుతుందిి. ఒకరోజు హీరో బావ ఇంట్లో

అనూహ్యమైన ఘటనలు జరుగుతాయి. అవి ఇప్పటిదాకా తను చూడని, వినని ఆ

ఇన్సిడెంట్స్ అందరినీ షాక్ కు గురిచేస్తాయి. ఆ ఘటనలు ఏంటి, అంతు చిక్కని

అదృశ్య శక్తి ఏం చేసింది అనేది ట్రైలర్ లో ఇంట్రెస్ట్  క్రియేట్

చేస్తోంది.



ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్, లిరికల్ పాటలకు మంచి స్పందన

వస్తోంది. సినిమా కొత్తగా ఉంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు

ట్రైలర్ ఆ ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగేలా ఉన్నాయి. ఆగస్టు 19న

"మాటరాని మౌనమిది"  సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.ప్రేక్షకుల

ముందుకు రాబోతోంది.



న‌టీ న‌టులు - మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి,

సంజీవ్ , శ్రీహరి తదితరులు.


సాంకేతిక వ‌ర్గం - , సినిమాటోగ్ర‌ఫీ చరణ్, మ్యూజిక్: అషీర్ లూక్, పిఆర్ఒ

ః జియ‌స్ కె మీడియా, నిర్మాతలు ః రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్, పీ బీ

వి శ్రీనివాసులు

ద‌ర్శ‌కుడు ః సుకు పూర్వాజ్.

Kalapuram First Look Launched Movie Releasing on August 26th

 క‌రుణ కుమార్ కామెడీ డ్రామా ‘కళాపురం’ ఫస్ట్ లుక్ .. ఆగస్ట్ 26న సినిమా విడుదల



రా మూవీగా ‘పలాస 1978’ను రూపొందించి ప్రేక్ష‌కులే కాదు.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్‌. ఆ త‌ర్వాత ‘శ్రీదేవి సోడా సెంటర్’  వంటి రా అండ్ ర‌స్టిక్ కాన్సెప్ట్ చిత్రంతో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్‌. ఇప్పుడు కామెడీ డ్రామా ‘క‌ళాపురం’ చిత్రంతో అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. జీ స్టూడియోస్‌స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్ 4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ర‌జనీ తాళ్లూరి సినిమాను నిర్మిస్తున్నారు.



స‌త్యం రాజేష్‌, చిత్రం శ్రీను, ర‌క్షిత్ అట్లూరి త‌దిత‌రులు న‌టించారు. క‌రుణ కుమార్ గ‌త రెండు చిత్రాల‌కు భిన్నంగా క‌ళాపురం సినిమాను రూపొందిస్తున్నారు. ఈ ఊరిలో అంద‌రూ క‌ళాకారులే అనేది సినిమా క్యాప్ష‌న్‌.


‘కళాపురం’ ఫ‌స్ట్ లుక్‌ను ఆదివారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఫ‌స్ట్ లుక్ గ‌మ‌నిస్తే.. సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ధారులంద‌రూ క‌నిపిస్తున్నారు. అన్నీ పాత్ర‌లు చాలా ఆస‌క్తిక‌రంగా అనిపిస్తున్నాయి. సిట్యువేష‌న‌ల్ కామెడీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌రుణ కుమార్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ సినిమాను ఆగ‌స్ట్ 26న విడుద‌ల చేస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.


Rudraksha Puram In Post Production Works

 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ‘రుద్రాక్షపురం’



మ్యాక్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మణి సాయితేజ, వైడూర్య, పవన్ వర్మ, వర్షిత, పూజ ప్రధాన తారాగణంగా.. ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో కొండ్రాసి ఉపేందర్, కనకదుర్గరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు శరవేగంగా జరుపుకుంటోంది. పక్కా యాక్షన్ థ్రిల్లర్ ఓరియంటెడ్‌ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నామని మేకర్స్ తెలిపారు.


ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.కె. గాంధీ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరు, వైజాగ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించాము. నూతన నటీనటులతో పాటు సీనియర్ నటులు నటించిన ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. నిర్మాతలు ఎంతగానో సపోర్ట్ ఇచ్చారు. త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తాము..’’ అని తెలిపారు.


మణిసాయితేజ, వైడూర్య, నాగమహేశ్, పవన్ వర్మ, రేఖ, రాజేశ్ రెడ్డి, తేజస్వి రాజు, శ్రీవాణి, ధీరజ్ అప్పాజీ, సంతోష్, తరుణ్, కృష్ణ, ఆటో రాజు, సురేష్ కొండేటి, పొట్టిమామ, అక్షరనిహా, సునంద, వెంకటేశ్వర్లు, శోభరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

సినిమాటోగ్రఫీ: ఎం. నాగేంద్ర కుమార్,

సంగీతం: గంటాడి కృష్ణ,

పాటలు: జయసూర్య,

డ్యాన్స్: అన్నారాజ్, కపిల్;

స్టంట్స్: బాజి, స్టార్ మల్లి, థ్రిల్లర్ మంజు;

పీఆర్వో: వీరబాబు,

నిర్మాతలు: కొండ్రాసి ఉపేందర్, కనకదుర్గరాజు

కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.కె. గాంధీ.


Masooda Teaser on August 2nd

 ఆగస్ట్ 2న ‘మసూద’ టీజర్




‘మ‌ళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ’ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో రాబోతోన్న మూడో చిత్రం ‘మ‌సూద‌’. కంటెంట్ రిచ్ ఫిల్మ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్ పోస్టర్ ట్రైమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.. ఇప్పుడు చిత్ర టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఆగస్ట్ 2న ఈ చిత్ర టీజర్‌ విడుదల కాబోతోంది. తొలి రెండు సినిమాలతో గౌతమ్ తిన్ననూరి, స్వరూప్‌లను టాలీవుడ్ కు పరిచయం చేసిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా..  హర్రర్ డ్రామా జోనర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంతో సాయికిరణ్ అనే మరో ప్రామిసింగ్ డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.


హీరోగా ‘జార్జిరెడ్డి’ ఫేమ్ తిరువీర్ (ల‌ల్లన్ సింగ్ పాత్రధారి) న‌టిస్తుండగా.. ‘గంగోత్రి’ చిత్రంలో బాల‌న‌టిగా అల‌రించిన కావ్య క‌ల్యాణ్‌రామ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిల రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాశ్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణ తేజ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి

ఆర్ట్: క్రాంతి ప్రియం

కెమెరా: నగేష్ బనెల్

స్టంట్స్: రామ్ కిషన్ అండ్ స్టంట్ జాషువా

సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి

ఎడిటింగ్: జెశ్విన్ ప్రభు

పీఆర్వో: బి. వీరబాబు

నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా

రచన, దర్శకత్వం: సాయికిరణ్


First Day First Show Releasing on September 2nd

శ్రీజ ఎంటర్టైన్మెంట్స్- మిత్ర వింద మూవీస్- 'ఫస్ట్ డే ఫస్ట్ షో' సెప్టెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల



ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్టైన్మెంట్ బేనర్ లో నిర్మిస్తున్న చిత్రం`ఫస్ట్ డే ఫస్ట్ షో`. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.


సరికొత్త కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల తేది ఖరారైయింది. సెప్టెంబర్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన డేట్ అనౌన్స్ మెంట్ వీడియో ఆసక్తికరంగా వుంది. థియేటర్లో ఫ్యాన్స్ కోలాహలం, విజిల్స్, చప్పట్లు, తెరపై ఫ్యాన్స్ కురిపించిన కాగితాల వర్షం లాంటి సందడి వాతావరణంతో విడుదల చేసిన ఈ వీడియో ఆకట్టుకుంది.


ఇప్పటికే ఆసక్తికరమైన ప్రమోషన్స్ కంటెంట్ తో ఈ చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. టీజర్ తో పాటు మజ్జా మజ్జా, నీ నవ్వే పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.  


వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, మాధవ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రాధన్ సంగీతం సమకూరుస్తున్నారు.


తారాగణం: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్,  సాయి చరణ్ బొజ్జా


సాంకేతిక విభాగం

సమర్పణ: ఏడిద శ్రీరామ్

కథ: అనుదీప్ కెవి

నిర్మాత: శ్రీజ ఏడిద

దర్శకత్వం: వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పి

స్క్రీన్ ప్లే: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్, కళ్యాణ్

డైలాగ్స్: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్

సంగీతం: రాధన్

డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి

ఎడిటర్: మాధవ్

పీఆర్వో : వంశీ-శేఖర్ 

Mrunal Thakur Interview About Sitharamam

 


అన్నీ ఎమోష‌న్స్ తో వున్న‌ సీతారామం లాంటి క‌థ‌లు రేర్‌ గా వ‌స్తుంటాయి - మృణాల్ ఠాకూర్‌


 



స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతారామం'.  హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులని మెస్మరైజ్ చేసి చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆగస్ట్5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో క‌థానాయిక మృణాల్‌ ఠాకూర్ శ‌నివారంనాడు విలేఖరుల సమావేశంలో ముచ్చటించారు. ఆమె పంచుకున్న 'సీతారామం' చిత్ర విశేషాలివి.


 


మీ  కెరీర్ సీరియ‌ల్‌ తో మొద‌లైంది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ చేయ‌డం ఎలా అనిపిస్తుంది?


నా మొద‌టి సీరియ‌ల్ బాలీవుడ్‌లో `కుంకుమభాగ్య‌.` అది అన్ని భాష‌ల్లో డ‌బ్ అయింది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇలా తెలుగులో వైజ‌యంతి మూవీస్ బేన‌ర్‌ లో హీరోయిన్‌ గా చేస్తాన‌ని అనుకోలేదు. అందులోనూ దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా, అశ్వ‌నీద‌త్ నిర్మాత‌గా చేస్తున్న సినిమా నాకు ఇదో గొప్ప అచీవ్ మెంట్‌.


 


సీత పాత్ర‌కు ద‌ర్శ‌కుడు మిమ్మ‌ల్ని ఎలా ఎంపిక‌ చేశారు?


హిందీ జ‌ర్సీ రీమేక్ షూటింగ్ జ‌రుగుతుండ‌గా నేను చంఢీగ‌ర్‌ లో వున్నాను. హ‌నుగారు ఫోన్ చేసి ఒక‌సారి క‌ల‌వాల‌న్నారు. అలా ముంబైలో కాఫీషాప్‌ లో క‌లిశాం. ఆ త‌ర్వాత పూర్తి క‌థ‌ను ఆఫీసులో విన్నా. ఆయ‌న నెరేష‌న్ చేసే విధానం నా ఎగ్జైట్‌మెంట్ చూసి వెంట‌నే ఫిక్స్ చేశారు.


 


మ‌హాన‌టి సినిమా చూశార‌ట‌ కదా?


నా మొద‌టి సినిమా ల‌వ్ సోనియా. ఫిలింఫెస్టివ‌ల్ మెల్‌బోర్న్‌లో జ‌రుగుతుండ‌గా అక్క‌డ నాగ్ అశ్విన్ గారు క‌లిశారు. అక్క‌డ మ‌హాన‌టి సినిమా గురించి నాగ్ వ‌చ్చారు. అందులో కీర్తిసురేష్ అద్భుతంగా న‌టించింది. అలా నాగ్ గారు ప‌రిచ‌యం  వైజ‌యంతి ఫిలింస్‌లో నేను భాగ‌మ‌య్యాను. 


 


ఆ త‌ర్వాత సినిమాలు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం?


ల‌వ్ సోనియా హిట్ త‌ర్వాత కొంత‌కాలం గ్యాప్ వ‌చ్చింది. మా అమ్మ‌గారు ఏదైనా సీరియ‌ల్ చేయ‌వ‌చ్చుగ‌దా అన్నారు. నాకు మంచి అవ‌కాశం వ‌స్తుంద‌నే న‌మ్మ‌కంతో వున్నాను. అలా న‌మ్మ‌కం నిజ‌మైంది. నా ల‌వ్ సోనీయా సినిమా అన్ని భాష‌ల్లోనూ వ‌చ్చింది.


 


సీత పాత్ర ఎలా అనిపించింది?


సీతా రామంలో సీత పాత్ర చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ప్ర‌తి న‌టికి సీత పాత్ర చేయాల‌నే డ్రీమ్ వుంటుంది. నేను ధైర్యంగా చెబుతున్నా. ఇది నా పుట్టిన‌రోజు గిఫ్ట్‌గా భావిస్తున్నాను. 


 


రొమాంటిక్ సినిమాలో చేయ‌డం ఎలా వుంది?


సీతారామం ఇండియ‌న్ సినిమాలో బేక్ త్రూ అవుతుంది. నాకు క‌థ‌క్ అంటే ఇష్టం. ఇందులో కొరియోగ్రాఫ‌ర్ బృంద‌గారు చాలా ఎక్సెప్రెష‌న్స్ చూపించారు. ఇది రొమాంటిక్ ప్రాజెక్ట్‌. సీతారామంలో నా పాత్ర‌లో ఐదు షేడ్స్ వుంటాయి. కెరీర్‌ లో అరుదుగా వ‌చ్చే పాత్ర ఇది. దుల్క‌ర్ స‌ల్మాన్‌ తో న‌టించ‌డం చాలా ఆనందంగా వుంది.


 


సీత పాత్ర‌ ఎంత రొమాంటిక్ గా వుంటుంది?


ట్రైల‌ర్‌లోనే మీకు క‌నిపిస్తుంది. సినిమాలో చూస్తే మీకు బాగా అవ‌గాహ‌న అవుతుంది.


 


ర‌ష్మిక‌తో న‌టించ‌డం ఎలా అనిపిస్తుంది. మీ ఇద్ద‌రి కాంబినేష‌న్ సీన్స్ వున్నాయా?


ర‌ష్మిక‌లో ఎన‌ర్జీ లెవ‌ల్ ఎక్కువ‌. త‌ను ఒక‌రోజు ముంబై, మ‌రో రోజు చెన్నై, ఫారిన్ ఇలా చలాకీగా తిరుగుతుంది. సెట్లో చాలా హుషారుగా వుంటుంది. అంద‌రినీ చాలా కేర్ తీసుకుంటుంది. త‌ను కేర్ ఫుల్ గా వుంటుంది. మా కాంబినేష‌న్ సీన్స్ సినిమాలో చూడాల్సిందే.


 


 క‌థ 1960లోనిది మీరు 2020 గాళ్‌ గ‌దా పాత్ర‌ను ఎలా బేలెన్స్ చేశారు?


ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఇన్‌పుట్స్‌తోపాటు స్వ‌ప్న‌గారి సూచ‌న‌లు తీసుకున్నాను. నేను కుంకుమ భాగ్య చేస్తుండ‌గా మా అమ్మ‌మ్మ‌నుంచి కొన్ని ఇన్‌పుట్స్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు సీత పాత్ర‌కూ తీసుకున్నాను. ఇందులో డైలాగ్ లు చాలా పొయిటిక్‌గా వుంటాయి. చిన్న చిన్న విష‌యాల్లోనూ ద‌ర్శ‌కుడు కేర్ తీసుకోవ‌డం విశేషం. నేను 2022 గాళ్ అయినా 1960 గాళ్‌ గా మీకు బాగా న‌చ్చుతాను.


 


మీరు ప‌ర్స‌న‌ల్‌ గా సీత ‌గా వుంటారా? స‌త్య‌భామ‌గానా, రుక్ష్మిణిగా వుంటారా?


ముగ్గురు మిక్స్ చేస్తే మృణాల్ ఠాకుర్ అవుతుంది. ఏది ఏమైనా ప్ర‌తి ఒక్క‌రిని నుంచి ఒక్కో విష‌యం నేర్చుకుంటాం. అలా ఈ సినిమాలో ప్ర‌తి వారినుంచి నేర్చుకుని బెట‌ర్ అయ్యాను.


 


పాన్ ఇండియా సినిమా క‌దా ఇండ‌స్ట్రీ స‌పోర్ ఎలా వుంది?


మా సినిమాకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌మ్ముట్టితోపాటు బాలీవుడ్‌ లో అంద‌రూ స‌పోర్ట్ చేశారు. ఇది నాకు చాలా సంతోషంగా వుంది.


 


సీతారామం సినిమాను ఎందుకు చూడాలంటారు?


సీతారామం వంటి క‌థ‌లు రేర్‌ గా వ‌స్తాయి. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కు అప్ప‌టి అనుబంధాలు, ఆప్యాయ‌త‌లు, అన్ని ఎమోష‌న్స్ క‌నిపిస్తాయి. ఇందులో కామెడీ కూడా వుంది. సుమంత్‌, త‌రుణ్ భాస్క‌ర్ వంటి న‌టుల న‌ట‌న‌, ర‌ష్మిక న‌ట‌న‌తోపాటు విశాల్ చంద్ర‌శేఖర్ సంగీతం సినిమాకు హైలైట్‌ గా వుంటుంది. యుద్ధం, మిస్ట‌రీ అన్నీ అంశాలు ఇందులో వున్నాయి. ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా.


 


సీత‌గా ట్రెడిష‌న్ దుస్తుల్లో ఎలా అనిపిస్తుంది?


ఇంత‌కుముందు నేను మోడ్ర‌న్ దుస్తులు వేసి చేశాను. తొలిసారిగా ఇండియ‌న్ ట్రెడిష‌న్ లో న‌న్ను నేను చూసుకోవ‌డం ఆనందంగా వుంది. సీత‌గా అంద‌రూ ఓన్ చేసుకుంటున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ చూశాక తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంలోనూ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఇందుకు అశ్వినీద‌త్‌, స్వ‌ప్న‌గారికి నేను రుణ‌ప‌డి వుంటాను.


 


తెలుగులో కొన‌సాగిస్తారా?


త‌ప్ప‌కుండా చేస్తాను. మంచి ఛాలెంజింగ్ పాత్ర‌లు రావాల‌ని కోరుకుంటున్నా. హిందీ, పంజాబీ, స్పానిష్, తెలుగు ఇలా అన్ని భాష‌ల్లో చేయాల‌నుంది. తెలుగులో క‌థ‌లు వింటున్నాను.


 


కొత్త  సినిమాలు?


`పీపా` అనే సినిమా బాలీవుడ్‌లో చేస్తున్నా. ఇండియా బంగ్లాదేశ్ వార్ చిత్రం. ఆదిత్య‌రాయ్ క‌పూర్‌ తో ఓ సినిమా పూజామేరీ జాన్ అనే సినిమా చేశాను.


 


సీతారామం లెట‌ర్ చుట్టూ తిరుగుతుంది గ‌దా. మీ లైఫ్ లో లెట‌ర్స్ వ‌చ్చాయా? అందులో స్వీట్ లెట‌ర్ వుందా?


నా స్నేహితుల‌నుంచి చాలా లెట‌ర్స్ అందుకున్నాను. అందులో రెండు ల‌వ్ టెల‌ర్స్ కూడా వున్నాయి. కానీ ఇప్పుడు నా ఫోక‌స్ అంతా సినిమాల‌వైపే.


 


హిందీ జెర్సీ సినిమా చేశారు ఎలా అనిపించింది?


తెలుగులో నాని, శ్ర‌ద్ద‌, బాల‌న‌టుడు అంద‌రూ బాగా న‌టించారు. అందులో శ్ర‌ద్ధ పాత్ర‌ను నేను పోషించ‌డం చాలా గ‌ర్వంగా వుంది. ఇలాంటి పాత్ర‌లు చేయ‌డం వ‌ల్ల కొత్త ద‌నం అనిపిస్తుంది. న‌న్ను నేను నిరూపించుకోవ‌డానికి ప‌నికి వ‌స్తుంది.


 


సీతారామం షూట్ ర‌ష్యా, క‌శ్మీర్ ల‌లో  మైన‌స్ డిగ్రీలో చేశారుక‌దా ఎలా అనిపించింది?


ర‌ష్యా, క‌శ్మీర్‌, స్విట్జ‌ర్లాండ్‌లో మైన‌స్ డిగ్రీలో చేయాల్సివ‌చ్చింది. స్ట‌డీ కామ్ తో షూట్ చేస్తుండ‌గా దుల్క‌ర్, ద‌ర్శ‌కుడుకూడా ప‌రుగెడుతూ చేశారు. నేనుకూడా చేశాను. అవ‌స‌ర‌మైతే ఇంకా చేస్తాన‌ని అని అడిగాను. ఒక ద‌శ‌లో డాన్స్‌లో ఓ ముద్ర చేయాల్సి వ‌చ్చింది. అంత చ‌లిలోనూ నేను చేయ‌గ‌లిగాను అంటే న‌టిగా చేయాలి కాబ‌ట్టి అందుకు నేను ప్రిపేర్ అయ్యాను.

Macherla Niyojakavargam Trailer Launched Grandly

 గుంటూరులో భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగిన నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ 



యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చార్ట్‌బస్టర్ పాటలు, 'మాచర్ల యాక్షన్ ధమ్కీ' ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. గుంటూరులోని బ్రోడీపేట్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ‘మాచర్ల నియోజకవర్గం’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి  అభిమానులు భారీగా హాజరయ్యారు. రారా రెడ్డి పాటలోని 'రానురాను అంటుంది చిన్నదోయ్' పాపులర్ బిట్ కి నితిన్ తో పాటు కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, అనిల్ రావిపూడి  స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం అభిమానులని అలరించింది. ఈ వేడుకలో నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, సముద్రఖని, కాసర్ల శ్యామ్, జానీ మాస్టర్ తదితరలు పాల్గొన్నారు. 


రెండు నిమిషాల యాభై సెకన్లు నిడివి గల ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మైండ్  బ్లోయింగ్ అనిపించింది. నితిన్, కృతి శెట్టిల లవ్లీ ఎంట్రీతో కూల్ గా మొదలైన ట్రైలర్.. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మల పంచిన హాస్యంతో పర్ఫెక్ట్ ఫ్యామిలీ వినోదం అందించింది. కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గా నితిన్ మాచర్లలోకి ఎంటరవ్వడంతో కంప్లీట్ యాక్షన్‌తో మాస్ ఫీస్ట్ గా మెస్మరైజ్ చేసింది. 


రాజప్ప గా సముద్రఖని విలన్ ఎంట్రీ టెర్రిఫిక్ గా వుంది. మాచర్ల లో రాజప్ప తిరుగులేని శక్తి. తన బలంతో ఎన్నికలే లేకుండా ఎమ్మెల్యే గా ఏకీగ్రీవంగా ఎన్నికౌతుంటాడు. ఐతే నియోజక వర్గంలో ఎన్నికలను నిర్వహించి తీరుతానని, కలెక్టర్ అది నా భాద్యతని నితిన్, రాజప్పతో ఛాలెంజ్ చేయడం పవర్ ఫుల్ గా వుంది.  


నితిన్ క్యాజువల్స్ లో స్టన్నింగా కనిపిస్తూనే ఇన్ బిల్ట్ ఊర మాస్ క్యారెక్టరైజేషన్ బ్రిలియంట్ అనిపించాడు. ముఖ్యంగా డైలాగ్స్ అదిరిపోయాయి. "నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పంచ్ లు, వీళ్ళేమో బోయపాటి శ్రీనుల యాక్షన్.. ఇప్పుడు నేనేం చెయ్యాలి..  రాజమౌళి హీరో లా ఎలివేషన్ ఇవ్వాలా"  ఈ ఒక్క డైలాగ్ వింటే సినిమా ఏ స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తోందో అర్ధమౌతుంది.


ట్రైలర్‌లోని యాక్షన్‌ షాట్‌లు అడ్రినాలిన్‌ రష్ ఎఫెక్ట్ ని ఇచ్చాయి. అద్భుతమైన విజువల్స్, మాస్ డైలాగ్స్ ,క్రాకింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కూడిన యాక్షన్ ట్రైలర్‌ సెన్సేషనల్ గా వుంది. శ్రేష్ట్ మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. మహతి స్వర సాగర్ ట్రైలర్ కి ఇచ్చిన నేపధ్య సంగీతం పవర్ ప్యాక్డ్ అనిపించింది.


మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ యాక్షన్ , ఎంటర్‌టైన్‌మెంట్ గా సినిమాపై భారీ అంచనాలని పెంచింది.  మాంచి యాక్షన్, ఎంటర్‌టైనర్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ‘మాచర్ల నియోజకవర్గం’ పర్ఫెక్ట్ బాక్సాఫీసు ఫీస్ట్ అని చెప్పాలి. 


ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి భారీ నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్న ఈ చిత్రానికి  ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.  


కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్  నంబర్‌ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. 


ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు.  


మాచర్ల నియోజక వర్గం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. 


ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ.. సై హిట్ తర్వాత గుంటూరు వచ్చాను. అప్పుడు ఇదే ప్రేమ ఇచ్చారు. తర్వాత అఆ హిట్ తర్వాత వచ్చాను. మళ్ళీ అదే ప్రేమ చూపించారు. ఈసారి సినిమా ముందే వచ్చాను. మీ ఎనర్జీ చూస్తుంటే  ‘మాచర్ల నియోజకవర్గం’  హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది. మీ ఆదరణ , ప్రేమ లేకపోతే ఈ ప్రయాణం జరిగేది కాదు. మీ ప్రేమ ఎప్పుడూ ఇలానే వుండాలి. ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ ఎలా వుందో సినిమా కూడా అంతే ఎంటర్ టైనర్ గా వుంటుంది. ఆగస్ట్ 12 సినిమా వస్తుంది. మీ అందరికీ నచ్చుతుంది.  సినిమాలో పాటలని హిట్ చేశారు. అలాగే సినిమాని కూడా చూసి పెద్ద హిట్ చేయండి. ఈ ఈవెంట్ ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి స్పెషల్ థాంక్స్. బాలయ్య బాబు గారి స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా వున్నప్పటికీ నా కోసం వచ్చారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా తో పని చేయడం ఆనందంగా వుంది. సంగీత దర్శకుడు సాగర్ మంచి పాటలు, నేపధ్య సంగీతం ఇచ్చారు. ఆగస్ట్ 12 థియేటర్ లో డైరెక్ట్ యాక్షనే'' అన్నారు. 


అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఇంత మాస్ యాక్షన్ చూడలేదు. అదిరిపోయే మాస్ వైబ్ ఇచ్చింది ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి మరో నిర్మాణ భాగస్వామి హరి.. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా మిగతా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. నితిన్ గారి ఇరవై ఏళ్ల ప్రయాణం అంటే మామూలు విషయం కాదు. కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలని చూసి తన హార్డ్ వర్క్ తో మళ్ళీ టాప్ లో నిలబడ్డారు. ఇలానే నితిన్  గారు ఇంకా మంచి సినిమాలు చేయాలి. భవిష్యత్ లో మేము కలసి పని చేయాలని కూడా కోరుకుంటున్నాను''అన్నారు 


కృతి శెట్టి మాట్లాడుతూ.. భారీగా తరలివచ్చి మీ ప్రేమని పంచని అభిమానులు కృతజ్ఞతలు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా  వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి థాంక్స్. నితిన్ రానురాను పాటకు డ్యాన్స్ చేయడం చూస్తుంటే ఇరవై ఏళ్ల క్రితం ఎలా వున్నారో ఇప్పటికీ అదే ఫ్రెష్ నెస్ తో వున్నారనిపిస్తుంది. ఆయన మంచి మనసు వలనే ఇది సాధ్యపడింది. సముద్రఖని, కేథరిన్ థ్రెసా తో పని చేయడం  అందాన్ని ఇచ్చింది. దర్శకుడు రాజశేఖర్ గారి ఫస్ట్ మూవీ ఇది. నా ఫస్ట్ మూవీ ఉప్పెన ఎంత సక్సెస్ అయ్యిందో ఆయని మాచర్ల ఆలాంటి సక్సెస్ ఇవ్వాలి, నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నికితాలకి థాంక్స్'' తెలిపారు. 


నికితారెడ్డి మాట్లాడుతూ  ‘మాచర్ల నియోజకవర్గం’  ట్రైలర్ గుంటూరు లో విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. అభిమానులు భారీ ఎత్తున ఈ వేడుకకు రావడం ఇంకా ఆనందంగా వుంది. డబుల్ హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చినందుకు ఆయన ధన్యవాదాలు. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. ఆగస్ట్ 12 తప్పకుండా ఈ సినిమా చూసి చాలా పెద్ద విజయాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను. 


సముద్రఖని మాట్లాడుతూ .. మాచర్ల నియోజక వర్గం ఎక్స్ ట్రార్డినరీ కమర్షియల్ మూవీ . ఇంత గొప్ప చిత్రంలో నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. నితిన్ గారితో గడిపిన ఒకొక్క రోజు మర్చిపోలేనిది'' అన్నారు 

 

కేథరిన్ థ్రెసా మాట్లాడుతూ .. చాలా రోజుల తర్వాత ఈ చిత్రంలో జాయ్ ఫుల్ , బబ్లీ గర్ల్ పాత్ర చేశాను. నితిన్ గారు ఈ చిత్రంలో మాస్ పవర్ ఫుల్ రోల్ కనిపిస్తారు. ఆగస్ట్ 12న సినిమా విడుదలౌతుంది. ప్రేక్షకులంతా థియేటర్ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి' అని కోరారు 


జానీ మాస్టర్ మాట్లాడుతూ.. నితిన్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. నాకు మొదట అవకాశం ఇచ్చిన హీరో నితిన్ అన్న. నితిన్ అన్న సాంగ్ అంటే ప్రాణం పెట్టి చేస్తాను. ఇందులో ఐటెం సాంగ్ మీ అందరినీ అలరిస్తుంది. నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి దర్శకుడు రాజశేఖర్, అంజలి , చిత్ర యూనిట్ కి థాంక్స్'' అన్నారు . 


తారాగణం: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, వెన్నెల కిషోర్, అంజలి(స్పెషల్ సాంగ్) తదితరులు

సాంకేతిక విభాగం : 

రచన, దర్శకత్వం:  ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి

నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి

బ్యానర్: శ్రేష్ట్ మూవీస్ 

సమర్పణ : రాజ్‌కుమార్ ఆకెళ్ల  

సంగీతం: మహతి స్వర సాగర్

డీవోపీ : ప్రసాద్ మూరెళ్ల

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

డైలాగ్స్ : మామిడాల తిరుపతి

ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్

ఫైట్స్: వెంకట్ 

పీఆర్వో: వంశీ-శేఖర్

Abba Abba Ababba Wanted Pandugod Lyrical Song Launched

 ‘వాంటెడ్ పండుగాడ్’ నుంచి ‘అబ్బా అబ్బా అబ్బబ్బ‌’ లిరిక‌ల్ సాంగ్ రిలీజ్‌..ద‌ర్శ‌కేంద్రుడి స్ట‌యిల్లో క‌ల‌ర్‌ఫుల్‌గా ఆక‌ట్టుకుంటోన్న పాట‌




శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు.. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్. ఈ చిత్రం ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నుంచి శ‌నివారం అబ్బా అబ్బా అబ్బ‌బ్బ... అనే లిరిక‌ల్ సాంగ్‌ను యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి విడుద‌ల చేశారు.


ద‌ర్శ‌కేంద్రుడు సినిమాల్లో ఆయ‌న హీరోయిన్స్‌ని అందంగా చూపిస్తూనే ఆక‌ర్షణీయంగా పాట‌ను చిత్రీక‌రిస్తుంటారు. అలా ఆయ‌న పాట‌లెన్నో ప్రేక్ష‌కుల గుండెల్లో ఎవ‌ర్ గ్రీన్ పాట‌లుగా నిలిచిపోయాయి. ఇప్పుడు ఆయ‌న స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న అబ్బా అబ్బా అబ్బ‌బ్బ‌.. సాంగ్ కూడా క‌ల‌ర్‌ఫుల్‌గా ఆక‌ట్టుకుంటోంది. పి.ఆర్ సంగీతం అందిస్తూ పాట‌కు సాహిత్యాన్ని అందించారు. హారిక నారాయ‌ణ్‌, శ్రీకృష్ణ పాట‌ను పాడారు. సుడిగాలి సుధీర్, స‌ప్త‌గిరి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్‌, దీపికా పిల్లి, నిత్యా శెట్టి, విష్ణు ప్రియ‌, వాసంతి త‌దిత‌రుల‌పై పాట‌ను చిత్రీక‌రించారు.



నటీనటులు:


సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్‌, దీపికా పిల్లి, బ్ర‌హ్మానందం, ర‌ఘుబాబు, అనంత్, పుష్ప జ‌గ‌దీష్‌, నిత్యా శెట్టి, వసంతి, విష్ణు ప్రియ‌, హేమ‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆమ‌ని, థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:


స‌మ‌ర్ప‌ణ :  కె.రాఘ‌వేంద్ర‌రావు

బ్యాన‌ర్ :  యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్‌

నిర్మాత‌లు :  సాయి బాబ కోవెల‌మూడి, వెంక‌ట్ కోవెల మూడి

ద‌ర్శ‌క‌త్వం :  శ్రీధ‌ర్ సీపాన‌

క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే :  జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి

సినిమాటోగ్ర‌ఫీ :  మ‌హి రెడ్డి పండుగుల‌

మ్యూజిక్ :  పి.ఆర్‌

ఎడిట‌ర్ :  త‌మ్మిరాజు

ML Luxury Liquor Store Launched Grandly in Hyderabad

 హైదరాబాద్‌లో ‘ML’ ఇండియాస్ మోస్ట్ లగ్జరీస్ లిక్కర్ సూపర్‌స్టోర్ ప్రారంభం


ప్రీమియర్ బ్రాండెడ్ స్పిరిట్‌ను అందించేందుకు కొత్త వైన్ మార్ట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ‘ML’ పేరుతో ఏర్పాటు చేసిన లిక్కర్ మార్ట్‌ను సంస్థ ఫౌండర్ మరియు ఛైర్మన్ రవి కుమార్ పనస తాజాగా ప్రారంభించారు. ఈ సూపర్‌స్టోర్‌లో నేషనల్, ఇంటర్నేషనల్‌కు చెందిన పలు లిక్కర్ బ్రాండ్స్ లభ్యం కానున్నాయి. హైదరాబాద్‌లో అతి పెద్ద లిక్కర్ మార్ట్‌గా పేరొందిన ఈ సూపర్‌స్టోర్‌లో‌ని బ్రాండ్స్‌కి పలు ప్రత్యేకతలు ఉన్నట్లుగా తెలుస్తుంది. 


ఈ స్టోర్ ప్రారంభం సందర్భంగా ‘ML’ ప్రీమియమ్ లగ్జరీ లిక్కర్ మార్ట్ సంస్థ ఫౌండర్ అండ్ ఛైర్మన్ రవి కుమార్ పనస మాట్లాడుతూ.. ‘‘ఇండియాస్ మోస్ట్ లగ్జరీస్ లిక్కర్ మార్ట్‌ ‘ML’‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సూపర్‌స్టోర్‌లో నేషనల్, ఇంటర్నేషనల్‌కు చెందిన పలు బ్రాండ్స్‌ను హైదరాబాద్ వాసులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఒక్కసారి ఈ స్టోర్‌ని సందర్శిస్తే.. ఒక టూర్ వేసినట్లే అనిపిస్తుంది. ఈ అవకాశాన్ని హైదరాబాద్ వాసులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము..’’ అని తెలిపారు.

Bimbisara Pre Release Event Held Grandly

 ‘బింబిసార’ సినిమాకు కళ్యాణ్ రామన్న తప్ప మరొకరు న్యాయం చేయలేరు.. సినిమా చూసినప్పుడు నేను ఎంత ఎగ్జ‌యిట్ అయ్యానో మీరూ అంతే ఎగ్జ‌యిట్ అవుతారు - ఎన్టీఆర్‌




నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్ర‌మ్ ఈవిల్ టు గుడ్ క్యాప్ష‌న్. వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హ‌రికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 5న ఈ మూవీ గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. స్టార్ హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో..


స్టార్ హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ‘‘రెండేళ్ల క్రితం కళ్యాణ్ అన్న ఫోన్ చేసి.. చాలా ఇంట్రెస్టింగ్ కథ విన్నాను.. నువ్ ఒకసారి వింటే బాగుంటుందని అని అన్నారు. ఇప్పుడు వశిష్ట అంటున్నారు.. అంతకు ముందే వేణు అనేవాళ్లు. నాకు కూడా తనని వేణు అని పిలిస్తే బావుంటుంది. ఆ రోజు ఒక ఐడియాగా బింబిసార కథ చెప్పడం జరిగింది. ఆ రోజు మొదలైన భయం.. ఎక్స్‌పీరియన్స్ లేదు.. ఇంత పెద్ద చిత్రాన్ని హ్యాండిల్ చేయగలిగుతాడా? లేడా? అనే భయం. ఎంత కసిగా కథను చెప్పాడో.. అంత కంటే గొప్పగా ఈ చిత్రాన్ని మలిచాడు. ఇదేం చిన్న విషయం కాదు.


మీ అందరి కంటే నేను అదృష్ట‌వంతుడిని. ఎందుకంటే ఈ సినిమాను నేను ముందుగానే చూశాను. కథ, కథనం తెలుసు. క‌థ‌లో ఏం జ‌ర‌గ‌బోతుందో కూడా తెలుసు. ఇంత తెలిసినా కూడా నేను సినిమా చూసేట‌ప్పుడు ఎంతో ఎగ్జైట్ అయ్యాను. మీరంతా కూడా ఆ ఎగ్జైట్మెంట్‌కు గురవుతారు. నమ్మినట్టుగా కథను మల్చడం మామూలు విషయం కాదు. తొలి సినిమానే ఇంత గొప్ప‌గా తెర‌కెక్కించాడంటే.. ఇక‌పై త‌ను ఎంత గొప్ప చిత్రాలను చేయగలడో అని చెప్ప‌డానికి ఇదొక టీజ‌ర్‌లాంటిది. త‌న భ‌విష్య‌త్తుకి ఇది టీజ‌రే కాదు.. త‌న‌ జీవితానికి ట్రైలర్ వంటిది. చోటా అన్నతో ఎన్నో సినిమాలు కలిసి చేశాం. ఎన్నో గొప్ప సినిమాలు ఆయన చేశాడు. బింబిసారకు కొత్త చోటా కనిపించారు. ఎంతో ఊపిరి పోశాడు. రేపు సినిమా థియేట‌ర్స్‌లో మీకు ఆ ఎక్స్‌పీరియెన్స్ క‌లుగుతుంది. చోటా నాయుడుగారు ఓ పిల్లర్‌గా నిలిచాడు.


ఈ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఆడియెన్స్ నుంచి వచ్చిన డిమాండ్‌కు తగ్గట్టుగా రాకపోతే సినిమాలు చూడటం లేదు. ఆడియెన్స్ మెచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించేందుకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. బింబిసార సినిమా గురించి మాట్లాడిన‌ప్పుడు మాకు ఓ వెలితి అనిపించేది. అదే కీరవాణి గారి సంగీతం. బింబిసార ఎప్పుడు విడుదలవుతందనే భయం లేదు.. ఎప్పుడు విడుదలవెతుందా? అనే ఎగ్టయిట్‌మెంట్ ఉంది.. దానికి కార‌ణం కీర‌వాణిగారు. ఆయన కొత్త పాటలు, కొత్త బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆయనే మా బింబిసారకు బ్యాక్ బోన్. ఆయ‌న బాధ్య‌త తీసుకోవడంతో మా కాన్ఫిడెన్స్ పెంచారు.


నేను ఇదే స్టేజ్ మీద.. నేను ఎప్పుడో ఒక మాట అన్నాను.. మీకు నచ్చేవరకు సినిమాలు చేస్తాం.. నచ్చక పోతే ఇంకోటి ఇంకోటి.. చేస్తామని చెప్పాను. బింబిసార సినిమా చూశాక నందమూరి కళ్యాణ్ రామ్ కాలర్ ఇంకా పైకి ఎత్తుతారు. అది మీరు చూస్తారు. కళ్యాణ్ అన్న‌ కెరీర్.. బింబిసారకు ముందు.. బింబిసారకు తరువాత అవుతుంది. ప్ర‌తి సినిమాకు ఓత‌మ్ముడిగా ఆయన ఎంత కష్టపడతారో నాకు తెలుసు. రక్తం ధార పోసి.. ఎంతో కష్టపడ్డారు. కళ్యాణ్ రామ్ తప్పా ఆ పాత్రకు ఇంకెవ్వరూ న్యాయం చేయలేరు. అలాంటి నటుడు ఉండడు కూడా.


థియేటర్లకు జనాలు రావడం లేదని అంటున్నారు. కానీ నేను నమ్మను. మంచి సినిమా వస్తే ఆదరించే తెలుగు ప్రేక్షక దేవుళ్లు మీరు. బింబిసారను ఆదరిస్తారని, సీతారామం సినిమా కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీకి తెలుగు ప్రేక్ష‌కులు ఓ ఊపు ఇవ్వాల‌ని,  ఇంకా చల్లగా మీ అందరినీ అలరించాలని కోరుకుంటున్నాను. వర్షాకాలాలు,కంగారు పడకండి.. జాగ్రత్తగా మీ ఇళ్లకు చేరాలి.. మీ కోసం తల్లిదండ్రులు, పిల్లాపాపలు, భార్యలు ఎదురుచూస్తుంటారు. నా కంటూ కళ్యాణ్‌ అన్నకంటూ ఆస్తిపాస్తులొద్దు.. మీరుంటే చాలు.. మా తాతగారు, నాన్నగారు వదిలిపోయిన అభిమానులు మీరు..మీకు రుణ‌ప‌డే ఉంటాం. మీరు ఆనందంగా ఉంచేందుకు మేం ప్రయత్నిస్తుంటాం. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి..జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ’’ అన్నారు.


నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘మన అందరికీ  చందమామ కథలు, అమరచిత్ర కథలు, జాన పద చిత్రాలంటే ఇష్టం. వాటిని మొదలు పెట్టింది మా తాత గారు. బాబాయ్ భైరవ ద్వీపం, చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలు మన ముందుకు వచ్చాయి. అదే పంథాలో మీ ముందుకు మంచి సోషియో ఫాంట‌సీ సినిమా తీసుకు రావాల‌నే మా ప్ర‌య‌త్న‌మే ఈ బింబిసార. ఆగ‌స్ట్ 5న మీ ముందుకు రాబోతుంది. త‌ప్ప‌కుండా థియేట‌ర్‌లో చూసి ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను. మిమ్మల్ని కచ్చితంగా ఈ సారి మిమ్మల్ని నిరాశపర్చను. సినిమా చూశాక మీరు గర్వపడతారు. 200 శాతం శాటిస్పై అవుతారు. ఎందుకంటే ఇది మా తాత గారి వందో జయంతి. తెలుగు సినిమాకు మూల కార‌కుడైన ఆయనకు ఈ సినిమాను అంకితం చేస్తున్నాను. సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఎంతో కష్టపడి పని చేశారు.


 సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే ఎడిటర్ తమ్మిరాజు, వీఎఫ్ఎక్స్ అద్వితా, అనిల్ పాడూరి అందరికీ థాంక్స్. మీరు లేకపోయి ఉంటే.. ఆ విజువల్స్ వచ్చి ఉండేవి కావు. వెంకట్, రామకృష్ణ ఫైట్ మాస్టర్లకు థాంక్స్. శోభి, యష్, విజయ్, రఘు మాస్టర్లకు థాంక్స్. మాటలు రాసిన వాసుదేవ్‌కు థాంక్స్. మా పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి వచ్చి రైటర్ అయ్యారు. టీజ‌ర్ క‌ట్ చేసిన సంతోష్‌కి థాంక్స్‌. చోటా గారికి థాంక్స్. ట్రైలర్ చూశారు కదా? టాలెంట్ అంతా వశిష్టదే. ఈ సినిమాకు లైఫ్ ఇచ్చింది కీరవాణి గారు. ఈ రోజు బింబిసారుడి కర్త కర్మ క్రియ ఒకే ఒక వ్యక్తి మా హరిబాబు. హరి లేకపోయి ఉంటే.. ఇంత వరకు వచ్చేవాళ్లం కాదు. ఇంత పెద్ద సినిమాను మాకు ఇచ్చినందుకు రుణపడి ఉంటాను. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చిన నా తమ్ముడికి థాంక్స్ చెప్పను. లవ్యూ నాన్న.. అదే మన రిలేషన్. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి.. వర్షాలు పడుతున్నాయి.. ఇంకా జాగ్రత్తగా వెళ్లండి.. ఆగస్ట్ 5న థియేటర్లోకి రాబోతోంది. అందరూ చూడండి’’ అని అన్నారు.


డైరెక్టర్ వశిష్ఠ్ మాట్లాడుతూ ‘‘బింబిసార సినిమా విషయంలో మా నిర్మాత హరిగారికి, హీరో క‌ళ్యాణ్ రామ్‌గారికి థాంక్స్‌. వారే బ్యాక్ బోన్‌గా నిల‌బ‌డ్డారు. వారి సాయాన్ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. డైలాగ్ రైట‌ర్ వాసు, ఫైట్ మాస్ట‌ర్ రామ‌కృష్ణ‌, అనిల్‌, శివ‌గారు, కిర‌ణ్‌గారు, కీర‌వాణిగారు, త‌మ్మిరాజుగారు, సంతోష్‌, ఛోటాగారికి థాంక్స్. వ‌రికుప్ప‌ల యాద‌గిరి, చిరంత‌న్ భ‌ట్‌గారికి థాంక్స్. కీర‌వాణిగారు మా సినిమాకు ప్రాణం పోశారు’’ అన్నారు.


ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ ‘‘నందమూరి అభిమానుల ఎన‌ర్జీకి త‌గ్గ‌ట్టే బింబిసార ఉంటుంది. ఇంత‌కు ముందు మీకు క‌నిపించిన బింబిసార వేరు.. బింబిసార‌లో క‌ళ్యాణ్ రామ్ వేరు. చింపి పడేశాడు. ఆగ‌స్ట్ 5న క‌ళ్యాణ్ రామ్ త‌న పెర్ఫా మెన్స్‌తో తొక్కి ప‌డేశాడు. తొలిసారి క‌ళ్యాణ్ రామ్‌తో చేశాను. సినిమా కోసం క‌ళ్యాణ్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. కొత్త డైరెక్ట‌ర్.. ఎలా ఉండాలో వ‌శిష్ట్‌ను చూసి నేర్చుకోవాలి. క్యాథిరిన్, సంయుక్త మీన‌న్ అద్భుతంగా న‌టించారు. ఫైట్స్‌ను రామ‌కృష్ణ అద్భుత‌మైన ఫైట్స్‌తో డిజైన్ చేశారు. ఇక అనిల్ ఫెంటాస్టిక్ గ్రాఫిక్స్ చేశారు. ఆగ‌స్ట్ 5న రిలీజ్ త‌ర్వాత మ‌ళ్లీ మాట్లాడుతాను’’ అన్నారు.


క్యాథరిన్ మాట్లాడుతూ ‘‘బింబిసార సినిమా న‌టిగా నాకెంతో ఇంపార్టెంట్ మూవీ. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఎప్ప‌టి నుంచో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నాను. బింబిసార‌తో కుదిరింది. వ‌శిష్ట్‌కు థాంక్స్. ఐరా అనే మంచి పాత్ర‌ను నాకు ఇచ్చినందుకు థాంక్స్‌. వండ‌ర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. వండ‌ర్‌ఫుల్ కో స్టార్స్‌తో వ‌ర్క్ చేశాను. క‌ళ్యాణ్ రామ్‌గారు కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అమేజింగ్ రోల్ చేశాడు. సినిమా కోసం ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశాడు. త‌న హార్డ్ వ‌ర్క్ స్క్రీన్‌పై క‌నిపిస్తుంది. క‌ళ్యాణ్‌గారితో క‌లిసి ప‌నిచేయ‌టం చాలా సంతోషానిచ్చింది. ఛోటాగారితో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ సూప‌ర్బ్‌. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు సూప‌ర్బ్ వ‌ర్క్ చేశారు. యూనిక్ మూవీ. క‌చ్చితంగా సిల్వ‌ర్ స్క్రీన్‌పై సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.


సంయుక్తా మీన‌న్ మాట్లాడుతూ ‘‘తెలుగులో నేను సైన్ చేసిన తొలి చిత్రం బింబిసార. చాలా ఇంపార్టెంట్ మూవీ. చాలా ఇంపార్టెంట్ పాత్ర చేశాను. క‌ళ్యాణ్ రామ్‌గారికి, వ‌శిష్ట్‌గారికి థాంక్స్‌. క‌ళ్యాణ్‌గారు చాలా మంచి కోస్టార్‌. థియేట‌ర్‌లో బింబిసార విజువ‌ల్ ఫీస్ట్‌గా ఉంటుంది’’ అన్నారు.


వ‌రికుప్ప‌ల యాద‌గిరి మాట్లాడుతూ ‘‘నేను ఇండ‌స్ట్రీలో వ‌చ్చిన ఇన్నేళ్ల త‌ర్వాత అంటే పాతికేళ్ల త‌ర్వాత మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా నా పేరు ప‌డింది. ఇంత మంచి అవ‌కాశాన్ని నాకు ఇచ్చిన క‌ళ్యాణ్ రామ్‌గారికి థాంక్స్‌’’ అన్నారు.


శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ‘‘అఖండ సినిమాలో చిన్న పాపతో బాలయ్య బాబు నటించాడు. అది సూపర్  హిట్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ చిన్న పాప‌తో నటిస్తే బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ సినిమాలోనూ క‌ళ్యాణ్ రామ్‌గారు కూడా చిన్న పాప‌తో న‌టించారు. ఇది కూడా సూప‌ర్ హిట్టే. వ‌శిష్ట‌గారు జుబేదా అనే క్యారెక్ట‌ర్ ఇచ్చారు. ఇక ఛోటాలాంటి టెక్నీషియ‌న్ ఉంటే సినిమాను ద‌డ‌ద‌డ‌లాడించాడు. క‌ళ్యాణ్ రామ్‌గారి ప‌క్క‌న్న జుబేదా క్యారెక్ట‌ర్లో న‌టించ‌టం చాలా  హ్యాపీ. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు.


చ‌మ్మ‌క్ చంద్ర మాట్లాడుతూ ‘‘ఇప్ప‌టికే బింబిసార్ ట్రైల‌ర్, పాట‌లు చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఇప్ప‌టికే ఓ ఊపు ఊపేశాయి. సినిమాలో నేను చిన్న పాత్ర చేశాను. ఆగ‌స్ట్ 5న సినిమా రిలీజ్ అవుతుంది. థియేట‌ర్స్‌లో సినిమాను చూసి ఆద‌రించాలి. క‌ళ్యాణ్ రామ్ గారితో క‌లిసి న‌టించిన రెండో చిత్ర‌మిది. ఎంటైర్ టీమ్‌కి అభినంద‌న‌లు’’ అన్నారు.


వైవా హ‌ర్ష మాట్లాడుతూ ‘‘నందమూరి కళ్యాణ్ రామ్‌గారితో ప‌ని చేయ‌టం వ‌ల్ల సినిమాను ఎంత బెస్ట్‌గా చేయాల‌ని నేర్చుకోవట‌మే కాదు. క్ర‌మ‌శిక్ష‌ణ కూడా నేర్చుకున్నాను. మంచి సినిమాలో న‌టించిన అవకాశం క‌ల్పించిన క‌ళ్యాణ్ రామ్‌గారు స‌హా అంద‌రికీ థాంక్స్’’ అన్నారు.


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో వరికుప్ప‌ల యాద‌గిరి, ఆర్ట్ డైరెక్ట‌ర్ కిర‌ణ్‌, శ్రీమ‌ణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Dochevarevarura Teaser Launched By SS Rajamouli

 దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేసిన శివ నాగేశ్వరరావు 'దోచేవారెవరురా' టీజర్‌



IQ క్రియేషన్స్ బ్యానర్ పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా 'దోచేవారెవరురా'. ఇప్పటికే దర్శకుడు రాంగోపాల్ వర్మ చేతల మీదుగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతోపాటు లిరికల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా  "దోచేవారెవరురా" సినిమా టీజర్ విడుదల చేశారు. 


దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘నేను శివ నాగేశ్వరరావు గారి సినిమాల్లోని కామెడీ, ఎంటర్‌టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఈయన తెరకెక్కిస్తున్న "దోచేవారెవరురా" కూడా అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమా టీజర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. 


అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టులో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు యూనిట్.


బ్యానర్: IQ క్రియేషన్స్ 

దర్శకుడు: శివనాగేశ్వరరావు

నిర్మాత: బొడ్డు కోటేశ్వరరావు

PRO: లక్ష్మీ నివాస్

Rechipodam Brother Movie Review

 యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ "రెచ్చిపోదాం బ్రదర్" మూవీ రివ్యూ 




సినిమా : "రెచ్చిపోదాం బ్రదర్"

నటీ నటులు 

అతుల్ కులకర్ణి,రవికిరణ్, దీపాలి శర్మ,భానుశ్రీ,శివాజీరాజా, పోసాని, శశాంక్, భానుచందర్, ఇంద్రజ, బెనర్జీ, అజయ్‌గోష్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు


సాంకేతిక నిపుణులు 

బ్యానర్ : ప్రచోదయ ఫిలిమ్స్ 

ప్రొడ్యూసర్స్:  హనీష్ బాబు ఉయ్యూరు, వివి లక్ష్మీ,

స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: ఏ. కె. జంపన్న.

సంగీతం: సాయి కార్తీక్,

లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, పూర్ణచారి;

డి.ఓ.పి: శ్యాం.కె. నాయుడు,

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్,

ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్,

ఆర్ట్: మహేష్ శివన్,

డాన్సు: భాను,

పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే,




ఒక దేశానికి అర్మీ ఎంత పవర్ ఫుల్లో మనం ఉండే సొసైటీ లో ఒక రిపోర్టర్ కూడా అంతే పవర్ ఫుల్. అలాగే దేశానికి రైతు ఎంతో ముఖ్యమని తెలుపుతూ రైతుల పడే కష్టాలను  వివరిస్తూ హ్యుమన్ ఎమోషన్స్ ను, సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను వివరిస్తూ ప్రస్తుత సమాజం పట్ల మనం ఉండాల్సిన బాధ్యతలను వివరిస్తూ మంచి ఎమోషన్స్‌తో కూడుకున్న వైవిధ్యభరితమైన కథ ను సెలెక్ట్ చేసుకొని తీసిన సినిమా "రెచ్చిపోదాం బ్రదర్". ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై రవికిరణ్. వి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో ఏ.కె. జంపన్న దర్శకత్వంలో  హనీష్ బాబు ఉయ్యూరు,వి.వి లక్ష్మీ,లు సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ‘రెచ్చిపోదాం బ్రదర్’.ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 29వ తేదీన  గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు

వచ్చింది 


కథ 

చంద్ర మౌళి (బాను చందర్),ఇంద్రజ లు భార్యభర్తలు.వీరి ముద్దుల కొడుకు అభి (రవి కిరణ్), మిల్ట్రీ ఆఫీసర్ అయిన బాను చందర్ కు బార్డర్ నుండి పిలుపు రావడంతో వెళ్లిన తను ఉగ్రవాదుల చేతుల్లో చనిపోతాడు , అయితే స్కూల్ లో అభి టీచర్ ను జవాన్, కు జర్నలిస్ట్ కు తేడా ఏంటి అని అడిగగా జవాన్ బార్డర్ లో గన్ను పట్టుకుని ఉగ్రవాదులను మట్టుపెడుతూ దేశాన్ని కాపాడితే జర్నలిస్ట్ పెన్ను పట్టుకుని దేశంలో అవినీతి జరగకుండా దేశాన్ని కాపాడుతాడు జరుగుతుంది. ఇలా ఇద్దరి లక్ష్యం ఒకటే.. దేశాన్ని కాపాడడం అని చెప్పిన టీచర్ మాటలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని జర్నలిస్ట్ అవుతాడు.అభి కి  కెమెరామెన్ గా (భానుశ్రీ ) ని నియమిస్తారు. భరణి స్పోర్ట్స్ అకాడమీ పెట్టి ఎందరినో ఛాంపియన్స్ గా తయారు చేస్తున్న నేషనల్  బాక్సింగ్ ఛాంపియన్ అయిన భరణి (అతుల్ కులకర్ణి )ని ఇంటర్వ్యూ చేసి మంచి పేరు తెచ్చుకుంటాడు. అలాగే ఛానల్ సి.ఈ.ఓ కృష్ణ ప్రసాద్ (కోటేశ్వరరావు ),యం.డి బాబురావ్ (బెనర్జీ) లకు అభి వర్క్ నచ్చడంతో పొలిటికల్ లీడర్ ఇంటర్వ్యూ లకు పంపుతారు . అయితే పొలిటికల్ లీడర్స్ చేసే మోసాల కవరేజ్ ను యం.డి కిస్తే వీరు ఆ న్యూస్ ను టెలికాస్ట్ చేయకుండా ఆ న్యూస్ తో పొలిటీసియన్స్ ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటుంటారు. అయితే ఫార్మర్ మినిష్టర్ అయిన అజయ్ ఘోష్ అసలైన విత్తనాలకు బదులు నకిలీ విత్తనాలు ఇస్తూ రైతులను మోసం చేస్తుంటారు దాంతో రైతులు ఆత్మ హత్యలు చేసుంటుంటారు. ఈ  రైతుల ఆత్మ హత్యల న్యూస్ ను ఛానెల్ యం.డి కిస్తే.. ఆ న్యూస్ న్యూస్  టెలికాస్ట్ కాదు. దాంతో అభి  ఛానల్ సి.ఈ. ఓ ను, యం. డి లను కలసి రైతు సమస్యల న్యూస్ వేయకుండా పనికి రాని న్యూస్ వేస్తున్నారని నిలదీస్తాడు .దాంతో వారు చెప్పిన మాటలకు షాక్ అయ్యిన అభి జర్నలిజం అంటే నిజాన్ని నిర్భయంగా తెలియజేయడం . అంతే కానీ డబ్బులకు అమ్ముడుబోయే మీలాంటి వారికి తలొగ్గి మీరు చెప్పిన పని చేయాలనేది జర్నలిజం కాదని నేను ఇందులోనే ఉంటే నా జీవితాన్ని కూడా మీరే తినేస్తారని ఛానెల్ నుండి బయటికివచ్చి ఒక యూట్యూబ్ ఛానెల్ పెడతాడు. అందులో రైతులను, సమాజానికి ఉపయోగపడే  విధమైన వారిని ఇంటర్వ్యూ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న తరుణంలో తోటి జర్నలిస్ట్ శశాంక్ కు చిన్న దెబ్బ తగిలితే హాస్పిటల్ కు తీసుకెళ్తారు.అయితే తను అనూహ్యంగా హాస్పిటల్ సిబ్బంది చనిపోయాడు అని చెప్తారు. షాక్ అయిన వీరు చిన్న దెబ్బకే ఎలా చనిపోయాడు అని ఎంక్వయిరీ చేయగా నమ్మలేని భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి. అయితే ఇదంతా చేస్తున్న గ్యాంగ్ కు నాయకుడెవరు ? ఆ గ్యాంగ్ ను అభి పట్టుకున్నాడా? దీని వెనుక ఉన్న అసలు సూత్ర దారులెవ్వరు ? ఈ ప్రాజెక్ట్ లో జరుగుతున్న ప్రాబ్లెమ్స్ ను అభి సాల్వ్ చేశాడా లేదా? అనే క్రమంలో అసలైన జర్నలిస్ట్ గా పని చేస్తే సమాజంలో ఎలాంటి మార్పు వచ్చింది అనేది తెలియాలంటే “రెచ్చి పోదాం బ్రదర్ ” సినిమా చూడాల్సిందే..



నటీ నటుల  పనితీరు 

మన ఎదుటి వ్యక్తికి ఏదైనా జరిగితే ప్రతి మనిషి రెస్పాన్ద్ అవ్వాలి అనే విధంగా అభి  పాత్రలో(రవికిరణ్) నటన అద్భుతంగా ఉంది.దీనికి తోడు ఈ సినిమాకు హీరో వాయిస్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.తనకిది మెదటి సినిమా అయినా ఎన్నో సినిమాలలో నటించినట్లు అద్భుతంగా నటించాడు. ముందు ముందు తను మంచి హీరో అవుతాడు, మంచి మనిషి లా (ముసుగు కప్పుకున్న ఉంటూ మేకవన్నె పులి)  భరణి  పాత్రలో (అతుల్ కులకర్ణి) విలనిజం చాలా బాగుంది. తను యంగ్ ఏజ్ లో బాక్సర్ గా ఏజ్ అయిన తరువాత బిజీనెస్ మెన్ గా రెండు పాత్రలలో  చాలా చక్కగా నటించాడు, సీనియర్ నటి ఇంద్రజ తల్లి పాత్రలో ఒదిగిపోయింది.  దీపాలి శర్మ  నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది.తను న్యాచురల్ గా చాలా బాగా నటించింది. రైతుగా శివాజీరాజా చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు , పోలీస్ ఆఫీసర్ గా పోసాని,హీరో కు ఫ్రెండ్ గా శశాంక్, హీరో కు ఫాదర్  గా భానుచందర్, ఛానల్ సి. ఈ. ఓ యం. డి గా, కోటేశ్వరరావు, బెనర్జీ, ఫార్మర్ మినిష్టర్ గా నకిలీ విత్తనాలు ఇస్తూ రైతులను మోసం చేసే పాత్రలో అజయ్‌గోష్,  షణ్ముఖం (అప్పాజీ), ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్  ఇలా ప్రతి ఒక్కరూ వారికీచ్చిన పాత్రలకు న్యాయం చేశారు అని చెప్పవచ్చు.


సాంకేతిక నిపుణుల పనితీరు 

‘‘నేటి వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఒక దేశానికి అర్మీ ఎంత పవర్ ఫుల్లో మనం ఉండే సొసైటీ లో ఒక రిపోర్టర్ కూడా అంతే పవర్ ఫుల్ అంటూ మంచి ఎమోషన్స్‌తో కూడుకున్న వైవిధ్యభరితమైన కథ ను సెలెక్ట్ చేసుకొని దర్శకులు ఏ. కే. జంపన్న తెరకెక్కించిన విధానం  చాలా స్టైలిష్‌గా, ఆలోచింప జేసే విధంగా ఉంది. ఈ సినిమాలో సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో పాటు డైలాగ్స్ పుష్కళంగా ఉన్నాయి. ఒక పోలీస్, జర్నలిస్ట్ తలచుకొంటే సమాజంలో ఉన్న రుగ్మతలు అన్నీ తొలగిపోతాయి అని చాలా చక్కగా చెప్పారు దర్శకుడు జంపన్న. అలాగే ఈ చిత్రం చూస్తున్నంత సేపు ఎక్కడా బోర్ కొట్టకుండా ఆడియన్స్ ను సీట్లోనే కూర్చోబెట్టడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు . సాయి కార్తీక్ సంగీతం చాలా బాగుంది.,ఇందులోని పాట చాలా ట్రెండీగా, కొత్తగా ఉంది . "యుద్ధం శరణం - తప్పదు ప్రళయం" అను సాంగ్ చాలా బాగుంది. శ్యాం.కె. నాయుడు కెమెరా అందాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’అని చెప్పచ్చు.తను మంచి ఔట్ పుట్ ఇచ్చాడు.కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, సమాకూరుర్చిన ఫైట్స్ చాలా డిఫరెంట్‌ గా ఉన్నాయి. ప్రొడక్షన్ లొకి కొత్తగా వచ్చినా  ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై  నిర్మాతలు  హనీష్ బాబు, వివి లక్ష్మీ, ఉయ్యూరు లు పెట్టిన ప్రతి పైసా తెరమీద కనిపిస్తుంది సినిమా బాగా రావాలని ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాని చాలా రిచ్ గా నిర్మించారు.నేటి యువత‌ను ఆలోచింపజేస్తూనే, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌తో  ప్రేక్షకుల ముందుకు  వచ్చిన ఈ చిత్రాన్ని నమ్మి థియేట‌ర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహ పరచకుండా అందరినీ “రెచ్చిపోదాం బ్రదర్ ” కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది..

స్టార్ ను నమ్మి కాకుండా కథను నమ్మి ఈ సినిమాకు వస్తే ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుంది.


Telugucinemas.in Rating 3/5

Sarasalu Chalu in Post Production works

 చక చక రూపుదిద్దుకుంటున్న సరసాలు చాలు !!!




సికె ఇంఫిని సమర్పించు సీకె ఇంఫిని ఎంటర్త్సైన్మెంట్స్ బ్యాన్సర్ లో భానూరి చంద్రకాంత్ రెడ్డి నిర్మాతగా నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో వస్తోన్న చిత్రం  'సరసాలు చాలు' షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది.


ఇటీవల విడుదలైన ఈ టైటిల్ గ్లిమ్ప్స్  అన్నివర్గాల ప్రేక్షకులను కనెక్ట్ అయ్యే విధంగా అందంగా వుందని మంచి స్పందన లభించింది. ముఖ్యంగా యూత్ బాగా ఎంజాయ్ చేశారు. ఈ ఏడాది దీపావళికి సినిమాను విడుదల చేయడానికి నిర్మాత బి.చంద్రకాంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. 


ఈ సందర్భంగా నిర్మాత బి.చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ...

సరసాలు చాలు ఒక డిఫరెంట్ లవ్ స్టొరీ. కామెడీ మరియు రొమాన్స్ కు ప్రాధాన్యత ఇస్తూ అందరిని ఆలోచింపజేసే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ప్రతి జంటకు కనెక్ట్ అయ్యే యూనిక్ పాయింట్ తో ఈ చిత్రం ఉండబోతోందని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న మా సినిమా ను దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము, మా బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్.2 చర్చల్లో ఉంది, త్వరలో ఆ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించబోతున్నాము అన్నారు.


నటీనటులు: 

నరేష్ అగస్త్య, సంజన సారధి, వెంకట్, దివ్యవాణి, వెంకటేష్ కాకమాను తదితరులు



టెక్నీషియన్స్:


క్రియేటివ్ ప్రొడ్యూసర్: జైకాంత్ (బాబి)

కెమెరామెన్: రోహిత్ బచ్చు

సంగీతం: భారత్ మాచిరాజు

ఎడిటర్: అశ్వత్ శివకుమార్

కో.డైరెక్టర్: నితిన్ లింగుట్ల

నిర్మాత: చంద్రకాంత్ రెడ్డి

డైరెక్టర్: డాక్టర్ సందీప్ చేగురి

Aakasa Veedhullo Releasing on September 2nd

గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ,  'ఆకాశ వీధుల్లో' సెప్టెంబర్ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల



గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ''ఆకాశ వీధుల్లో''. మనోజ్ డి జె, డా. మణికంఠ నిర్మాతలు.


ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం విడుదల తేది ఖరారైయింది. సెప్టెంబర్ 2 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.


దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి

 జూడా శాండీ సంగీతం అందిస్తుండగా,  విశ్వనాధ్ రెడ్డి సినిమాటోగ్రఫర్.


నటీనటులు : గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ, దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ తదితరులు ..


సంగీతం : జూడా శాండీ,

కెమెరా : విశ్వనాధ్ రెడ్డి,

ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్,

సౌండ్ మిక్సింగ్ : కన్నన్ గణపతి,

నిర్మాతలు : మనోజ్ జెడి , డా. డీజే మణికంఠ

రచన, దర్శకత్వం : గౌతమ్ కృష్ణ

పిఆర్ ఓ : వంశీ శేఖర్

Big Ben Cinemas Production 6 launched grandly

 Big Ben Cinemas Production 6 launched grandly!!



Passionate producer Yash Rangineni's Big Ben Cinemas have been coming up with path breaking films since their first film 'Pelli Choopulu'.


Continuing the zeal, Big Ben Cinemas 6th production starring Chaitanya Rao, Lavanya as the leads in 'O Pitta Katha' fame Chendu Muddhu's direction launched today.


Ace Producer Suresh Babu gave the clap to the film, new-gen filmmaker Tharun Bhascker switched on the camera and first shot directed by Vivek Athreya. Madhura Sreedhar Reddy, Sandeep Raj, Sai Rqzesh, Lakshmi Bhupal and other guests graced the event commenced in Ramanaidu Studios. Speaking on the occasion...


Producer Yash Rangineni says, "Our first production 'Pellichopulu' was released on this day July 29th. It feels exciting to start our 6th production on the same day. Everyone we invited has graced the event and wished success to the team. Filming with a village backdrop story, we've casted many new talents. Story itself is the crowd pulling star of this film. Regular shoot will commence from August 1st in the locations of Amalapuram and Araku for a month. Kerala schedule will begin from September. We'll make sure the First copy will be ready by October." 


Hero Chaitanya Rao says, "I thank my producer and director for this opportunity. I liked my dir Chendu Muddhu's previous film O Pitta Katha. As soon as he narrated the story when I met him I loved it and pretty sure that it's gonna be first blockbuster in my career. I strongly believe we'll definitely meet you in its success meet"


Heroine Lavanya says, "Helmed with a village backdrop story, it has all the commercial elements too. Our director Chendu's O Pitta Katha is my fvt film. I'm sure this will be another exciting flick from him. My character is very interesting in this project"


Actress Uttara says, "We've a good script for this film. I'm playing a crucial role in it. Thanks to producer Yash for encouraging new talents like us with opportunities"


Director Chendu Muddu says, "This film's story has village backdrop. We've young team in this project. Planning it differently with an experimental screenplay, making and locations. We're sure about presenting a hit film to our producer Yash."


Cast: Chaitanya Rao, Lavanya Rao, Mihira, Uttara, Raghava, Aditya etc.


Technicians:

Music director - Prince Henry

Cinematography - Pankaj Tottada

Editor - D. Venkat Prabhu

PRO - GSKMEDIA

Banner - Big Ben Cinemas

Producer - Yash Rangineni

Written & Directed by Chendu Muddu.

Megastar Chiranjeevi Salman Khan Godfather Song Shooting Started

 మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్, మోహన్ రాజా, కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్,  'గాడ్ ఫాదర్'- ప్రభుదేవా కొరియోగ్రఫీలో మెగా సాంగ్ షూటింగ్ ప్రారంభం



 


మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 'గాడ్ ఫాదర్' చిత్రం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు.


 


ప్రస్తుతం ముంబై లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి బ్లాస్టింగ్  న్యూస్ వచ్చింది. ఈ చిత్రంలో ఇద్దరు మెగాస్టార్లకు ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించే ఓ బాంబింగ్ సాంగ్ వుంది. ఈ స్పెషల్ డ్యాన్స్ నంబర్‌ కు ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు.


 


ఈ పాట చిత్రీకరణకు సంబధించిన ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘గాడ్‌ఫాదర్‌ కోసం భాయ్‌ సల్మాన్‌ తో కలిసి డ్యాన్స్‌ చేశా. ప్రభుదేవా కొరియోగ్రఫీ వండర్ ఫుల్. ఈ పాట అభిమానులకు ఖచ్చితంగా కన్నుల పండగ’ అని ట్వీట్‌ చేశారు మెగాస్టార్.


 


ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.  సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.


 


టాప్ టెక్నికల్‌ టీమ్‌ గాడ్ ఫాదర్  కోసం పని చేస్తున్నారు. వెటరన్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా, సంగీత సంచలనం ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. అనేక బాలీవుడ్ హిట్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి ఆర్ట్‌వర్క్‌ అందిస్తున్నారు.


 


ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.


 


స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా


నిర్మాతలు: ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్


సమర్పణ: కొణిదెల సురేఖ


బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్


సంగీతం: ఎస్ ఎస్ థమన్


డీవోపీ: నీరవ్ షా


ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్


ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు


పీఆర్వో: వంశీ-శేఖర్

The Vijay Deverakonda LIGER (Saala Crossbreed) Waat Laga Denge Released

 The Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s LIGER (Saala Crossbreed) Waat Laga Denge Released



Pan India star The Vijay Deverakonda’s highly anticipated film LIGER (Saala Crossbreed) directed by ace director Puri Jagannadh is releasing on August 25th. Mike Tyson is making his debut in Indian cinema with Liger. 


The recently released trailer had upped the hype and expectations on the film by many folds and makes it the most-anticipated film in Indian Cinema. The first single 'Akidi Pakdi' has become viral and is trending top on music charts. Both the first single and trailer are still trending nationwide even days after their release.


After the trailer success, the team released the theme song of the film, Waat Laga Denge. 


The song speaks about the aura and attitude of Liger. We get to see the visuals of slumdog who goes on to representing the country in MMA.


The song starts with a motivational speech of Vijay. The lines - "We are Indians. Hum Kisise Kam Nahi" and "Waat Laga Denge... Aag He Andar" are too impressive. The way Vijay's stammering problem is used to make the song is excellent.


Both musically and visually, Waat Laga Denge looks kickass.


In association with Puri connects, the film is being produced jointly by Bollywood's leading production house Dharma Productions. Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film on a grand scale.


Vishnu Sarma is the cinematographer, while Kecha from Thailand is the stunt director.


Being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages, the Pan India Movie is scheduled for release in theatres worldwide on 25th August, 2022.


Cast: Vijay Deverakonda, Ananya Pandey, Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Ali, Makarand Desh Pandey and Getup Srinu.


Technical Crew:

Director: Puri Jagannadh

Producers: Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta

Banners: Puri Connects and Dharma Productions

DOP: Vishnu Sarma

Art Director: Jonny Shaik Basha

Editor: Junaid Siddiqui

Stunt Director: Kecha

Producer Aswani Dutt Interview About Sitharamam

 'సీతారామం' ల్యాండ్ మార్క్ చిత్రంగా చరిత్రలో నిలుస్తుంది: అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఇంటర్వ్యూ  




స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతారామం'.  హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో నిర్మాత అశ్వినీదత్ విలేఖరుల సమావేశంలో ముచ్చటించారు. ఆయన పంచుకున్న 'సీతారామం' చిత్ర విశేషాలివి. 


సీతారామం మీ బ్యానర్ లో మరో 'మహానటి' అవుతుందని భావిస్తున్నారా ? 

చాలా మంచి సినిమా తీశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. ఎప్పటినుండో మంచి ప్రేమకథ తీయాలని అనుకుంటున్నాను. సీతారామంతో ఆ కోరిక తీరింది. బాలచందర్ గారి మరో చరిత్ర, మణిరత్నం గారి గీతాంజలి చరిత్రలో నిలిచిపోయాయి. సీతారామం కూడా ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం వుంది.  


ప్రేక్షకులు థియేటర్ కి రావడం తగ్గడానికి కారణం ఏమని భావిస్తున్నారు ? 

కరోనా ఒక కారణమని భావిస్తున్నాను. అలాగే టికెట్ రేట్లు ఒక క్రమ పద్దతి లేకుండా పెంచడం, తగ్గించడం కూడా ఒక కారణం కావొచ్చు. అలాగే చాలా థియేటర్లని చేతిలోకి తీసుకొని స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావాలంటే భయపడే స్థాయికి తీసుకెళ్ళారు. ఇదే సమయంలో ఓటీటీలు వచ్చాయి. ఇలా అనేక కారణాలు వున్నాయి. 


ప్రొడక్షన్ అంతా మీ పిల్లలకి అప్పగించినట్లేనా ? నిర్మాణంలో వారికి స్వేఛ్చ ఇచ్చినట్లేనా? 

ఎన్టీఆర్ గారు, రాఘవేంద్రరావు, చిరంజీవి గారితో సినిమాలు చేసినప్పుడు వారి రూపంలో నాకు కనిపించని బలం వుండేది. ఇద్దరు పిల్లలు చదువుపూర్తి చేసుకొని వచ్చి సినిమా నిర్మాణ రంగంలోకి వస్తామని చెప్పారు. ఇద్దరూ చాలా ప్రతిభావంతులు. స్వప్న ఆలోచనలు అద్భుతంగా వుంటాయి. ఒంటి చేత్తో నడిపిస్తుంది. నిర్మాణం దాదాపు గా వాళ్లకి అప్పగించినట్లే. అయితే సంగీతం, సాహిత్యం నేను చూస్తాను. అలాగే స్క్రిప్ట్ కూడా. మహానటి లాంటి సినిమా తీసినప్పుడు సెట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాను. హను ఈ సినిమాని దాదాపు అవుట్ డోర్ లో తీశారు. నేను షూటింగ్ కి వెళ్ళలేదు.  సీతారామం మొత్తం స్వప్న చూసుకుంది. ఈ సినిమా క్రెడిట్ స్వప్నకి దక్కుతుంది.


సీతారామంలో పాటలు అద్భుతంగా రావాడానికి కారణం సంగీతం పట్ల మీకున్న అభిరుచేనా? 

నిజానికి నాకు సరిగమలు కూడా రావు. కానీ మంచి ట్యూన్ ని పట్టుకొనే అభిరుచి దేవుడు ఇచ్చాడని భావిస్తాను. ''మీరు ఎదురుగా వుంటే సంగీత సరస్వతి చక్కగా పలుకుతుందండీ''అని మహదేవన్ గారు అన్నారు. సరిగ్గా అదే మాట ఇళయరాజా గారు కూడా అన్నారు. అలాగే మణిశర్మ, కీరవాణితో కూడా సంగీతం పరంగా మంచి అనుబంధం వుంది. సీతారామంకు విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విశాల్ ని తీసుకోవాలనేది హను ఛాయిస్. నేనూ విశాల్ మ్యూజిక్ విన్నాను. విశాల్ గారి భార్య కూడా సంప్రాదాయ సంగీత గాయిని. ఆమె సహకారం కూడా ఎక్కువ వుంటుందనిపించింది. వారిద్దరూ చాలా కష్టపడ్డారు. నేపధ్య సంగీతం కూడా చాలా గ్రాండ్ గా చేశారు. 


హను రాఘవపూడితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? 

హను రాఘవపూడి చాలా మంచి టెక్నిక్ తెలిసిన దర్శకుడు. చాలా గొప్ప కథ చెప్పాడు. అతనికి కెమారా పై అద్భుతమైన పట్టువుంది. సినిమాని ఒక విజువల్ వండర్ లా తీశారు. కాశ్మీర్ తో పాటు మిగతా చాలా అందమైన లొకేషన్ ఇందులో విజువల్ ఫీస్ట్ గా వుంటాయి.


తెలుగులో ఇంతమంది హీరోలు వుండగా దుల్కర్ సల్మాన్ ని తీసుకోవడానికి కారణం ? 

మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర చేసినప్పటి నుండి దుల్కర్ అంటే నాకు చాలా గౌరవం. అలాగే మమ్ముట్టి గారికి నేను పెద్ద అభిమానిని. జెమినీ గణేషన్ పాత్ర దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది. ఆ పాత్రని చాలా కన్వెన్సింగా చేశాడు. 'ప్రతి ఏడాది ఒక సినిమా దుల్కర్ తో తీద్దాం''అని స్వప్నతో అప్పుడే చెప్పాను.  హను ఈ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా నేరుగా దుల్కర్ కి చెప్పమని చెప్పాను. ఎందుకంటే నేషనల్ వైడ్ గా రీచ్ వుండే ఈ ప్రేమ కథకు దుల్కర్ అయితే సరైన న్యాయం చేయగలడు. 


సీతారామంలో నాగ్ అశ్విన్ కాంట్రిబ్యూషన్ ఉందా ?

 నాగ్ అశ్విన్ కాంట్రిబ్యూషన్ ఏమీ లేదండీ. అయితే కొన్ని సూచనలు ఇస్తుంటారు. తను సీతారామం చూసి అద్భుతంగా వుందని చెప్పారు.


సుమంత్ పాత్ర గురించి ? 

సుమంత్ పాత్ర అద్భుతంగా వుంటుంది. ఈ పాత్రతో ఆయన అన్ని భాషలకు పరిచయం అవుతారు. చాలా మంచి పేరు తీసుకొస్తుంది. 


సీతారామంలో ఎన్ని పాటలు వున్నాయి ? 

ఆరు పాటలు వున్నాయి. ఒకటి అర చిన్న బిట్ సాంగ్స్ నేపధ్యంలో వినిపిస్తాయి. సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాలు వుంటుంది. సినిమా ఫాస్ట్ గా వుంటుంది. తమిళ్, మలయాళం వెర్షన్ సెన్సార్ దుబాయ్ లో జరిగింది. అద్భుతమైన రిపోర్ట్స్ వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళంలో సినిమా ఏకకాలంలో విడుదలౌతుంది.


కొత్త గా చేయబోతున్న సినిమాలు 

ప్రాజెక్ట్ కె షూటింగ్ జనవరికి పూర్తవుతుంది. తర్వాత గ్రాఫిక్స్ వర్క్ వుంటుంది. నాగచైనత్య సినిమా, శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ తో ఒక సినిమా చర్చల్లో వున్నాయి. అన్నీ మంచి శకునములే అక్టోబర్ 5న విడుదలౌతుంది 


ఆల్ ది బెస్ట్ 

థాంక్స్

Venu Thottempudi Interview About Ramarao on Duty

 ''రామారావు ఆన్ డ్యూటీ'' నటుడిగా చాలా తృప్తిని ఇచ్చింది:  వేణు తొట్టెంపూడి ఇంటర్వ్యూ



మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ' జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ అవుతుంది. శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి సిఐ మురళి  పాత్రలో కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత వేణు ఈ చిత్రంతోనే రీఎంట్రీ ఇస్తున్నారు. 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదల నేపధ్యంలో విలేఖరుల సమావేశంలో ముచ్చటించారు వేణు. ఆయన పంచుకున్న 'రామారావు ఆన్ డ్యూటీ'

చిత్ర విశేషాలివి.    



''దమ్ము'' తర్వాత సినిమాలు చేయకపోవడానికి కారణం ?


నిజానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు. మాకు ఫ్యామిలీ బిజినెస్స్ చాలా వున్నాయి. బిజినెస్ లో బిజీ అయిపోయా. సినిమాల గురించి అలోచించే తీరికే లేకుండాపోయింది. కొంతమంది సినిమా కోసం సంప్రదించినా సున్నితంగా వద్దనే వాడిని. అయితే కరోనాకి థాంక్స్ చెప్పుకోవాలి. కరోనా సమయంలో ఇంట్లో కూర్చుని రకరకాల సినిమాలకు వెబ్ సీరిస్లు చూడ్డం మొదలుపెట్టాను. అప్పుడు మళ్ళీ సినిమాపై ఆసక్తి మళ్ళింది. మంచి పాత్రలు చేయాలనిపించింది. ఇలాంటి సమయంలో దర్శకుడు శరత్  మండవ రామారావు ఆన్ డ్యూటీ కథ చెప్పారు. కథ అద్భుతంగా వుంది. సిఐ మురళిగా నా పాత్ర గురించి చెప్పారు. చాలా బావుంది. ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి జోనర్ కూడా  ఫస్ట్ టైమ్. రవితేజ గారి లాంటి  మాస్ స్టార్ సినిమాతో మళ్ళీ నేను రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా వుంది.  


సిఐ మురళి పాత్ర చేయడనికి ఆసక్తి కలిగించిన అంశం ?

ఇలాంటి పాత్ర గతంలో ఎప్పుడూ చేయలేదు. అలాగే రామారావు ఆన్ డ్యూటీ  వైడ్ రీచ్ వున్న సినిమా. ఇలాంటి సినిమా చేస్తే నేను మళ్ళీ యాక్ట్ చేస్తున్నాననే విషయం ప్రేక్షకులకు రీచ్ అవుతుందనే ఆసక్తితో ఈ సినిమా చేశా. అలాగే చాలా సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినప్పటికీ నాకు నేనుడబ్బింగ్ చెప్పలేదనే చిన్న అసంతృప్తి వుండేది. కానీ రామారావు ఆన్ డ్యూటీలో నేనే డబ్బింగ్ చెప్పడం ఒక తృప్తిని ఇచ్చింది. ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్తా. రామారావు ఆన్ డ్యూటీ తో నాకు మళ్ళీ ఒక ఫ్లాట్ ఫామ్ ఇచ్చిన రవితేజ, సుధాకర్ చెరుకూరి, శరత్ మాండవకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు.


స్వయంవరం లో మీతో కలసి చేయాలనీ రవితేజ  గారు చెప్పారు కదా? దాని గురించి ?

నిజంగా దాని గురించి అంతకుముందు నాకు తెలీయదండీ. మొత్తానికి రామారావు ఆన్ డ్యూటీతో మా కాంబినేషన్ కుదిరింది.  మొదటి నుండి నేను మల్టీ స్టారర్ కి మొగ్గు చూపేవాడిని.  'చిరునవ్వుతో' లాంటి సూపర్ హిట్ ఇచ్చినప్పటికీ  వెంటనే హనుమాన్ జంక్షన్ చేశాను. చాలా మంది నటీనటులతో కలసి నటించడం అంటే అదొక పండగ. హనుమాన్ జంక్షన్ కూడా ఒక పండగలా గడిచింది.


మీ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా చేశారు.. తర్వాత ఆయన స్టార్ దర్శకుడయ్యారు..  ఆయన సినిమాల్లో పాత్రల కోసం మిమ్మల్ని ఎప్పుడైనా సంప్రదించారా?


తన సినిమాల్లో నాకు సరిపడే పాత్ర వుంటే ఖచ్చితంగా చెప్తారు. అతడు సినిమాలో సోనూ సూద్ పాత్ర మొదట నాకే చెప్పారు. నేను చేయకపోతే తర్వాత సోను సూద్ చేశారు. ఈ పాత్రకి వేణు బావుంటాడని అనిపిస్తే తప్పకుండా చెప్తారు.


రవితేజ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?

రవితేజ గారితో పని చేయడం గొప్ప అనుభవం. ఆయన చాలా సింపుల్. డౌన్ టూ ఎర్త్ వుంటారు.


మొదటి సినిమాకి ఇప్పటికీ ఒకేలా వున్నారు.. మీ ఫిట్ నెస్ సీక్రెట్ ?

మంచి ఆహరం తినడం తప్ప మరో అలవాటు లేదు. శరీరాన్ని పాడుచేసే ఏ అలవాటు లేదు. సాధ్యమైనంత వరకూ బయట ఫుడ్ కు దూరంగా వుంటాను. ఇక మిగతాది తల్లితండ్రుల ఆశీర్వాదం.


సినిమాలని కంటిన్యూ చేస్తారా ?

ఖచ్చితంగా సినిమాలని చేస్తా. అలాగే వెబ్ కంటెంట్ పై కూడా ప్రత్యేకంగా ద్రుష్టి వుంది.


కొత్తగా చేయబోతున్న ప్రాజెక్ట్స్ ?

ఛాయ్ బిస్కెట్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నా. అలాగే ఒక వెబ్ సిరిస్ కూడా చర్చల్లో వుంది.


ఆల్ ది బెస్ట్

థాంక్స్