‘వాంటెడ్ పండుగాడ్’ నుంచి ‘అబ్బా అబ్బా అబ్బబ్బ’ లిరికల్ సాంగ్ రిలీజ్..దర్శకేంద్రుడి స్టయిల్లో కలర్‌ఫుల్‌గా ఆకట్టుకుంటోన్న పాట
శతాధిక చిత్ర దర్శకుడు.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్. ఈ చిత్రం ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నుంచి శనివారం అబ్బా అబ్బా అబ్బబ్బ... అనే లిరికల్ సాంగ్‌ను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు.
దర్శకేంద్రుడు సినిమాల్లో ఆయన హీరోయిన్స్‌ని అందంగా చూపిస్తూనే ఆకర్షణీయంగా పాటను చిత్రీకరిస్తుంటారు. అలా ఆయన పాటలెన్నో ప్రేక్షకుల గుండెల్లో ఎవర్ గ్రీన్ పాటలుగా నిలిచిపోయాయి. ఇప్పుడు ఆయన సమర్పణలో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో రూపొందుతోన్న అబ్బా అబ్బా అబ్బబ్బ.. సాంగ్ కూడా కలర్‌ఫుల్‌గా ఆకట్టుకుంటోంది. పి.ఆర్ సంగీతం అందిస్తూ పాటకు సాహిత్యాన్ని అందించారు. హారిక నారాయణ్, శ్రీకృష్ణ పాటను పాడారు. సుడిగాలి సుధీర్, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, దీపికా పిల్లి, నిత్యా శెట్టి, విష్ణు ప్రియ, వాసంతి తదితరులపై పాటను చిత్రీకరించారు.
నటీనటులు:
సునీల్, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి, బ్రహ్మానందం, రఘుబాబు, అనంత్, పుష్ప జగదీష్, నిత్యా శెట్టి, వసంతి, విష్ణు ప్రియ, హేమ, షకలక శంకర్, తనికెళ్ల భరణి, ఆమని, థర్టీ ఇయర్స్ పృథ్వీ తదితరులు
సాంకేతిక వర్గం:
సమర్పణ : కె.రాఘవేంద్రరావు
బ్యానర్ : యునైటెడ్ కె ప్రొడక్షన్స్
నిర్మాతలు : సాయి బాబ కోవెలమూడి, వెంకట్ కోవెల మూడి
దర్శకత్వం : శ్రీధర్ సీపాన
కథ, మాటలు, స్క్రీన్ ప్లే : జనార్ధన మహర్షి
సినిమాటోగ్రఫీ : మహి రెడ్డి పండుగుల
మ్యూజిక్ : పి.ఆర్
ఎడిటర్ : తమ్మిరాజు