శ్రీజ ఎంటర్టైన్మెంట్స్- మిత్ర వింద మూవీస్- 'ఫస్ట్ డే ఫస్ట్ షో' సెప్టెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల
ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్టైన్మెంట్ బేనర్ లో నిర్మిస్తున్న చిత్రం`ఫస్ట్ డే ఫస్ట్ షో`. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.
సరికొత్త కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల తేది ఖరారైయింది. సెప్టెంబర్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన డేట్ అనౌన్స్ మెంట్ వీడియో ఆసక్తికరంగా వుంది. థియేటర్లో ఫ్యాన్స్ కోలాహలం, విజిల్స్, చప్పట్లు, తెరపై ఫ్యాన్స్ కురిపించిన కాగితాల వర్షం లాంటి సందడి వాతావరణంతో విడుదల చేసిన ఈ వీడియో ఆకట్టుకుంది.
ఇప్పటికే ఆసక్తికరమైన ప్రమోషన్స్ కంటెంట్ తో ఈ చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. టీజర్ తో పాటు మజ్జా మజ్జా, నీ నవ్వే పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, మాధవ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రాధన్ సంగీతం సమకూరుస్తున్నారు.
తారాగణం: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా
సాంకేతిక విభాగం
సమర్పణ: ఏడిద శ్రీరామ్
కథ: అనుదీప్ కెవి
నిర్మాత: శ్రీజ ఏడిద
దర్శకత్వం: వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పి
స్క్రీన్ ప్లే: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్, కళ్యాణ్
డైలాగ్స్: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్
సంగీతం: రాధన్
డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటర్: మాధవ్
పీఆర్వో : వంశీ-శేఖర్
Post a Comment