యంగ్ హీరో నిఖిల్, చందూ మొండేటి ‘కార్తికేయ 2’కు వినూత్నమైన ప్రచారం.. కాంటెస్ట్ లో గెలిస్తే 6 లక్షలు..
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పై అద్భుతమైన స్పందన వచ్చింది. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యే కార్తికేయ 2 సెన్సార్ కార్యక్రమాలు ముగిసాయి. ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సినిమాలోని అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు.. కాన్సెప్ట్ చూసి సెన్సార్ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 12న విడుదల కానుంది కార్తికేయ 2.
తాజాగా ఈ సినిమాకు వినూత్నమైన ప్రచారం మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు. దీని కోసం సపరేటుగా ఒక కాంటెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతిలో ఈ కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. ఈ మిస్టికల్ టెస్ట్ లో గెలుపొందిన విజేతలకు ఆరు లక్షల విలువ గల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే హైదరాబాదులో మొదటి క్లూ విడుదల చేశారు. ఒక్కొక్కటిగా మరికొన్ని క్లూస్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ ప్రచారంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగిపోతుంది.
నటీనటులు:
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరులు
టెక్నికల్ టీం:
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్యం - చందు మెుండేటి
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరి& అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
కొ-ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్లనిర్మాతలు: టి.జి విశ్వ ప్రసాద్&అభిషేక్ అగర్వాల్
మ్యూజిక్: కాలభైరవ
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్
Post a Comment