Latest Post

Powerstar Pawan Kalyan Bheemla Nayak Trailer Out Now and Smashing All Records

Bheemla Nayak's swashbuckling trailer sets the tone for a tantalising face-off between Pawan Kalyan and Rana Daggubati



Pawan Kalyan and Rana Daggubati's action entertainer Bheemla Nayak, produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments, is one of the most anticipated Telugu films, slated to release on February 25. Trivikram pens the screenplay and dialogues for the film directed by Saagar K Chandra. Ahead of its theatrical release this weekend, a swashbuckling trailer from the film was released today.


The trailer opens with an incident near a forest, where Pawan Kalyan as Bheemla Nayak and Rana Daggubati as Daniel Shekar are pitted against one another. While Pawan Kalyan plays a fierce cop, Sarhad Bheemla Nayak, SI, Srisailam tahsil, Hatakeswaram Mandal, Andhra Pradesh, his nemesis Daniel Shekar warns the former of stern action if he arrests him. The face-off gets uglier and messier over time with the involvement of the characters' families.


This is a glimpse that is sure to satiate the hunger of fans of Pawan Kalyan, set to arrive in a never-seen-before avatar in a film that promises to be an action spectacle. The terrifying screen presence of the star breathes fire into the trailer. Rana Daggubati channelises the beast in him like never before as Daniel Shekar. The likes of Samuthirakani, Nithya Menen, Samyuktha Menon make their mark amid an equal contest between two strong characters. S Thaman's music adds a lot of bite to the terrific impact.


Bheemla Nayak has wrapped its censor formalities and the film's pre-release event will be held on February 23 at Yousufguda Police Grounds, Hyderabad amid chief guest, politician KT Rama Rao, cinematography minister Talasani Srinivas Yadav, cast and the crew. 


Cast & Crew


Starring - Pawan Kalyan, Rana Daggubati, Nithya Menen and Samyuktha Menon play the female leads in the film whose ensemble cast comprises suneel, Rao Ramesh, Murali Sharma, Samuthirakani, Raghubabu, Narra Srinu, Kadambari Kiran, Chitti, Brahmanandam and Pammi Sai. 


Banner - Sithara Entertainments

Producer - Suryadevara Naga Vamsi

Art - A S Prakash

DOP - Ravi K Chandran(ISC)

Music - Thaman S

Screenplay & Dialogues - Trivikram

Director - Saagar K Chandra

Presenter - PDV Prasad

Editor - Navin Nooli

PRO - LakshmiVenugopal

Keerthy Suresh Musical Video Gandhari Launched


 


కీర్తి సురేష్ మ్యూజిక‌ల్ వీడియో ‘గాంధారి’ విడుద‌ల‌


నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ న‌టించిన మొట్ట మొద‌టి తెలుగు పాప్  సాంగ్ ‘గాంధారి’. సోనీ మ్యూజిక్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, ది రూట్ అసోషియేష‌న్‌లో ఈ సాంగ్ రూపొందింది. సోమ‌వారం గాంధారి మ్యూజిక‌ల్ వీడియోను విడుద‌ల చేశారు. కీర్తి సురేష్ అద్భుత‌మైన డాన్స్ మూమెంట్స్ చూప‌రుల‌ను క‌ట్టి ప‌డేశాయి. డైరెక్ట‌ర్‌, కొరియో గ్రాఫ‌ర్ బృంద మాస్ట‌ర్, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ ప‌వ‌న్ సి.హెచ్‌, పాట‌ల ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ‌, సింగ‌ర్ అన‌న్య భ‌ట్ ‘గాంధారి’మ్యూజికల్ వీడియో రిలీజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ‘గాంధారి’ పోస్ట‌ర్‌ను కీర్తి సురేష్ రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్ంగా..


రూట్ ప్ర‌తినిధి ఐశ్వ‌ర్య మాట్లాడుతూ ‘‘కీర్తి సురేష్, బృంద‌గారితో క‌లిసి ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా గొప్ప‌గా ఉంది. కీర్తి సురేష్ వంటి అమేజింగ్ యాక్ట‌ర్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం మెమొర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌. బృంద‌గ మాస్ట‌ర్‌గారు వారి అమూల్య‌మైన స‌మ‌యాన్ని వెచ్చింది ఈ ప్రాజెక్ట్ చేశారు. ద‌క్షిణాదిన ఓ కొత్త ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టారు. సోనీ మ్యూజిక్ వారికి ధ‌న్య‌వాదాలు. ఎక్స‌లెంట్ టీమ్‌తో క‌లిసి ప‌నిచేశాం’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సి.హెచ్ మాట్లాడుతూ ‘‘నాపై నమ్మకంతో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన సోనీ మ్యూజిక్‌, రూట్ సంస్థ‌కు కృత‌జ్ఞ‌త‌లు. కీర్తి సురేష్‌గారు, బృంద‌గారు ఓ అద్భుత‌మైన సాంగ్‌ను ఇచ్చారు. ముఖ్యంగా కీర్తి సురేష్‌గారు పెద్ద స్టార్ అయిన‌ప్ప‌టికీ ఓ సాంగ్ చేయ‌డానికి ఒప్పుకున్నారు. ఇది భ‌విష్య‌త్తులో మ‌రింత మందికి ఇన్‌స్పైరింగ్‌గా నిలుస్తుంది. నాకు స‌పోర్ట్ చేసిన టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు.


కొరియోగ్రాఫర్, డైరెక్ట‌ర్ బృంద మాస్ట‌ర్ మాట్లాడుతూ ‘‘మాట్లాడటం కంటే, నాకు డాన్స్ చేయడం, చేయించడమే కష్టమైన పని. తొలిసారి తెలుగు వీడియో ఆల్బమ్‌కు కొరియోగ్ర‌ఫీ చేస్తూ డాన్స్ చేయడం ఇదే తొలిసారి. కీర్తి సురేష్ రియ‌ల్లీ సూప‌ర్బ్ డాన్స‌ర్‌. త‌న‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. త‌ను మ్యూజిక్ ఆల్బ‌మ్ చేయ‌డానికి ఒప్పుకోవ‌డం గొప్ప విష‌యం. త‌ను ఓ రోజు మాత్ర‌మే రిహార్స‌ల్ చేసింది. త‌న‌లాంటి క‌మిట్‌మెంట్ ఉన్న న‌టి అరుదు. రెండు రోజుల్లో ఈ పాట‌ను షూట్ చేశాం. సింపుల్‌గా ఓ ప‌దంలో చెప్పాలంటే త‌న డాన్స్‌తో సాంగ్‌ను చింపేసింది. కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట్‌గా ఎంజాయ్ చేస్తూ చేశాను. నాకు స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.


కీర్తి సురేష్ మాట్లాడుతూ ‘‘‘గాంధారి’ లాంటి మ్యూజికల్ వీడియోలో యాక్ట్ చేయడం ఇదే తొలిసారి నాకు కూడా ఓ ఎక్స్‌పెరిమెంట్‌గా అనిపించింది. రూట్, సోనీ మ్యూజిక్‌కి థాంక్స్. సారంగ ద‌రియా త‌ర్వాత గాంధారితో వ‌ప‌న్ మ‌రో హిట్ అందుకున్నారు. సుద్దాల‌గారు అద్భుతంగా పాట రాశారు. బృంద‌గారితో, నేను ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్న్ప‌పుడు వ‌ర్క్ చేశాను. అలాగే ఆమె కొరియోగ్ర‌ఫీలో వ‌ర్క్ చేశాను. అలాగే ఆమె డైరెక్ష‌న్‌లోనూ ప‌నిచేయ‌డం కొత్త అనుభూతినిచ్చింది.రెండు రోజుల్లో ఈ సాంగ్ షూట్ చేశాం.  ఈ ఆల్బ‌మ్‌లో భాగ‌మైన టెక్నిక‌ల్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.


Pushpa The Film of the Year -DadasahebPhalke International Film Festival Awards 2022

 దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో అల్లు అర్జున్ ‘పుష్ప’కు అరుదైన గౌరవం.. ఫిలిం ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక



ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సంచలన దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా వైడ్‌గా అన్ని భాషల్లోనూ అద్భుతం చేసింది పుష్ప. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనకు అంతా ఫిదా అయిపోయారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బన్నీ మేనరిజమ్స్ ఫాలో అవుతున్నారు. ఈ సినిమాలో బన్నీ నటనకు ఇప్పటికే ప్రశంసల జల్లు కురుస్తుంది. తాజాగా మరో అరుదైన గౌరవం పుష్ప సినిమాకు దక్కింది. తాజాగా ఈ చిత్రం దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 అవార్డ్స్‌లో ఫిలిం ఆఫ్ ద ఇయర్ గా నిలిచింది. ఈ అవార్డ్ రావడంపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. త్వరలోనే పుష్ప 2 షూటింగ్ మొదలు కానుంది.

1000 Moons Infra Launched By Nara Rohit and Sree Vishnu

 నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం



2022, ఫిబ్రవరి 21న హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో సరికొత్త రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన 'థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా' యొక్క లాంచ్ వైభవంగా జరిగింది. ఈ  కార్యక్రమాన్ని జ్యోతిష్యశాస్త్ర ప్రముఖులు, శ్రీ బాలు మున్నంగి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇక ప్రముఖ నటులు నారా రోహిత్ గారు, శ్రీ విష్ణు గారు ముఖ్య అతిథులుగా వీచ్చేసి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ యొక్క ప్రారంభోత్సవం చేశారు.


ఒక వ్యక్తి తన జీవితంలో వెయ్యి పౌర్ణమి చంద్రులను చూస్తే అది ఒక సంపూర్ణ జీవితం అవుతుంది, అనగా 81 ఏళ్ళు జీవితాన్ని అనుభవించినట్టు. అలా మీ సహస్ర పూర్ణ చంద్రోదయాల వరకు గుర్తుండిపోయే ఒక చక్కటి జ్ఞాపకాన్ని అందించడమే ఈ థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా యొక్క ప్రధాన ఉద్దేశ్యం.


'1000 మూన్స్ ఇన్ఫ్రా' స్థాపకులు 15 ఏళ్ళ అపారమైన వ్యాపార అనుభవం కలిగి, ఎన్నో రకాల వ్యాపారాలలో సృజనాత్మకమైన పనితీరుతో విజయాలు సాధించడం జరిగింది. కాగా, ఇప్పుడు ఈ రంగంలో కూడా తమదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రాతో ప్రతీ ఒక్కరి అనుభవం ఎంతో కళాత్మకంగా, ఆనందాయకంగా ఉండాలనేది ఈ కంపెనీ యొక్క ముఖ్య ధ్యేయం. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ యొక్క అతిపెద్ద ప్రాజెక్టు మోమిన్ పేట సమీపంలో మొదటగా మీకు అందుబాటులోకి వస్తుంది. 

 

ఈ ప్రారంభోత్సవానికి అతిథులుగా వచ్చిన శ్రీవిష్ణు మాట్లాడుతూ, "వీరితో నాది చాలా ఏళ్ళ పరిచయం. వీరి పనితీరు చాలా క్రియేటివ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు వాళ్ళు పట్టిందల్లా బంగారమే అయింది, ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా' కూడా అంతకుమించి లెవెల్ లో ఉంటుందనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు" అని అన్నారు. ఇక నారా రోహిత్ మాట్లాడుతూ, "థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా అనే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు రానున్న రోజుల్లో గట్టిగా వినిపించే పేరు అవుతుంది, ఎందుకంటే, దాని వెనుక ఉన్నవారి అనుభవం గానీ, స్కిల్ గానీ అలాంటిది. వాళ్ళు ఏది చేసినా కొత్తగా ఉంటుంది, సర్వీస్ ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఆల్ ది బెస్ట్ టూ ద టీమ్" అని ముగించారు.

Hero Nithiin Launched Raj Tarun Stand Up Rahul Lyrical Song

 హీరో నితిన్ విడుద‌ల చేసిన రాజ్ తరుణ్, శాంటో మోహన్ వీరంకి, డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ `స్టాండప్ రాహుల్`లోని త‌ప్పా..? లిరిక‌ల్ వీడియో సాంగ్‌



యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్ `స్టాండప్ రాహుల్` సినిమాతో శాంటో మోహన్ వీరంకి  దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల మీద నంద కుమార్ అబ్బినేని,  భరత్ మాగులూరి నిర్మించారు.


 


ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌, పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. తాజాగా ఈ చిత్రంలోని త‌ప్పా? లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను హీరో నితిన్ విడుద‌ల చేశారు.


 


స్వీకర్ అగస్తి స్వ‌ర‌ప‌రిచిన ఈ పాట‌ను ప్ర‌ముఖ సింగ‌ర్ బెన్నీ దయాల్  హుషారు గా పాడారు. ర‌ఘురామ్ సాహిత్యం ఆక‌ట్టుకుంటుంది. ఈ పాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.


 


జీవితంలో ఏ విషయానికి కూడా నిల్చోవడానికి ఇష్టపడని వ్యక్తి.. స్టాండప్ కమెడియన్‌గా మారుతాడు. అలాంటి యువకుడి జీవితంలోకి నిజమైన ప్రేమ ఎదురవుతుంది. తన తల్లిదండ్రుల గురించి, ప్రేమ గురించి, తన స్టాండప్ కామెడీ గురించి కష్టపడాల్సి వస్తుంది.


 


వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.


 


నటీనటులు: రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ తదితరులు


 


సాంకేతిక బృందం


 


ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శాంటో మోహన వీరంకి


ప్రొడక్షన్ కంపెనీ: డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్, హైఫైవ్ పిక్చర్స్


సమర్ఫణ: సిద్దు ముద్ద


నిర్మాతలు: నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి


సంగీతం: స్వీకర్ అగస్తి


సినిమాటోగ్రఫర్: శ్రీరాజ్ రవీంద్రన్


ఎడిటర్: రవితేజ గిరిజెల్లా


కొరియోగ్రఫర్: ఈశ్వర్ పెంటి


ఆర్ట్: ఉదయ్


పీఆర్వో : వంశీ-శేఖర్

"Manasanamaha" short film wins BEST FILM Award in Dada saheb phalke international festival

 దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివెల్ లో  బెస్ట్ షార్ట్

ఫిలింగా "మనసానమః", ఈ ఘనత సాధించిన ఏకైక తెలుగు లఘుచిత్రం



విరాజ్ అశ్విన్ నటించిన షార్ట్ ఫిలిం మనసానమః తన రికార్డుల పరంపర

కొనసాగిస్తోంది. పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు సహా

ఆస్కార్ క్వాలిఫైకు వెళ్లిన ఈ లఘు చిత్రం తాజాగా ప్రతిష్టాత్మక

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివెల్ లో బెస్ట్ షార్ట్

ఫిలింగా ఎంపికైంది.


ఈ ఫిలిం ఫెస్టివెల్ లో పురస్కారం పొందిన ఏకైక తెలుగు లఘుచిత్రంగా

రికార్డు సాధించింది. ఉత్తమ చిత్రం పుష్పతో పాటు తెలుగు నుంచి ఈ ఘనత

అందుకుంది. మనసానమః ఇంత గొప్ప గుర్తింపు తీసుకొచ్చిన ప్రేక్షకులకు చిత్ర

టీమ్ కృతజ్ఞతలు తెలిపారు


మనసానమఃలో ధృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ హీరోయిన్లుగా

నటించారు. గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్ రెడ్డి తన తొలి

ప్రయత్నంగా మనసానమహా షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. గతేడాది యూట్యూబ్ లో

రిలీజైన ఈ షార్ట్ ఫిలిం ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై 900కు పైగా

జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెల్చుకుంది. ఆస్కార్, బప్టా లాంటి

ప్రతిష్టాత్మక అవార్డులకు క్వాలిఫై అయ్యింది.

Take Diversion Trailer Launched by Producer Lagadapati Sridhar

 నిర్మాత లగడపాటి శ్రీదర్ విడుదల చేసిన 'టేక్‌ డైవర్షన్‌' ట్రైలర్.



పేట’, ‘చదురంగవేట్టై’ వంటి చిత్రాల్లో విలన్‌గా నటించిన రామచంద్రన్‌ ప్రధాన పాత్రలో, శివకుమార్‌ హీరోగా పరిచయమవుతూ,  హీరోయిన్‌గా పాటినీకుమార్‌, రెండో హీరోయిన్‌గా గాయత్రి నటిస్తున్నా చిత్రం టేక్ డైవర్షన్. శివానీ సెంథిల్‌ దర్శకత్వంలో  ప్రేమ కథాచిత్రంగా ఇది రూపొందుతోంది. జాన్‌ విజయ్‌ ప్రధాన విలన్‌ పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ టీవీ ఫేం జార్జ్‌ విజయ్‌, బాలా జె.చంద్రన్‌, శ్రీనివాసన్‌ అరుణాచలం తదితరులు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. జోస్‌ ఫ్రాంక్లిన్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం ఈశ్వరన్‌ తంగవేల్‌. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక సోమవారం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీదర్ ట్రైలర్ విడుదల చేశారు.. ఈ కార్యక్రమంలో రాజేష్ సూరిశెట్టి, రామ్ మద్దాల, చందు మద్దాల, వెంకట్ మద్దాల, సురేష్ కొండేటి, డాక్టర్ గౌతం కశ్యప్, ఉమర్జీ అనురాధ పాల్గొన్నారు. 


పోస్టర్ లాంచ్ అనంతరం  లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. టేక్ డైవర్షన్ చాలా మంచి టైటిల్. ముక్యంగా ముగ్గురు అన్నదమ్ములు కలిసి నిర్మిస్తున్న సినిమా కాబట్టి చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అన్నదమ్ములు అన్నాకా ముగ్గురు మూడు రంగాల్లో కాకూండా అందరు కలిసి సినిమా నిర్మాతలుగా మారడం మంచి పరిణామం. ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి మద్దాల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చేస్తున్న టేక్ డైవర్షన్ సినిమా మంచి విజయం సాదించాలి. ట్రైలర్ బాగుంది. తప్పకుండా ఈ సినిమా హిట్టై మరిన్ని మంచి చిత్రాలు తెలుగులో వీళ్ళు నిర్మించాలని కోరుకుంటున్నాను అన్నారు. 


అనురాధ మాట్లాడుతూ .. టేక్ డైవర్షన్ అనే సినిమాని నిర్మిస్తున్న నిర్మాతలు  రామ్ మద్దాల, చందు మద్దాల, వెంకట్ మద్దాల గార్లకు అభినందనలు తెలుపుతున్నాను.  చాలా తపన ఉన్న టీమ్ ద్వారా ఈ సినిమా రెడీ అయింది.  నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించారు. ఇది భిన్నమైన కథతో తెరకెక్కిన సినిమా. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది. అలాగే ఇందులో మ్యూజిక్ కు చాలా మంచి స్కోప్ ఉంది అన్నారు.  


లిరిక్ రైటర్ డాక్టర్ గౌతం కశ్యప్ మాట్లాడుతూ ..మద్దాల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమా నిర్మాతలతో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. వాళ్ళు చాల మంచి వాళ్ళు, పైగా సినిమా అంటే తపన ఉన్న వాళ్ళు. ముఖ్యంగా ఈ ముగ్గురు అన్నదమ్ములకు అండగా ఉన్న వాళ్ళ నాన్న సపోర్ట్ ఉంది. నిజానికి సినిమా రంగంలోకి వెళ్తున్నాము అంటే ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయరు.. కానీ వీళ్ళ ఫాదర్ సపోర్ట్ చేస్తూ డబ్బులు కూడా పెట్టడం నిజంగా గొప్ప విషయం.  ఇలాంటి వాళ్ళు సినిమా రంగంలోకి రావడం చాలా మంచిది. అలాంటి వారు వస్తే మంచి సినిమాలు వస్తాయి.  డైరెక్టర్ కూడా చాలా సెన్సిబిలిటీ ఉన్న వ్యక్తి. ఈ కథలో మ్యూజిక్ కు చాలా స్కోప్ ఉంది.  తప్పకుండా మ్యూజికల్ హిట్ అవుతుంది. ఈ సినిమాకు  సురేష్ కొండేటి సపోర్ట్ ఉంది . అయన సపోర్ట్ ఉందంటే ఇక సినిమా విషయంలో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అన్నారు.  


నిర్మాతల్లో ఒకరైన చందు మద్దాల మాట్లాడుతూ.. తెలుగు తమిళ భాషల్లో ఈ టేక్ డైవర్షన్ అనే సినిమా చేస్తున్నాం. ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పాలి. దర్శకుడు సెంథిల్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండ తెలుగు , తమిళ్ ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. ఈ సినిమా విషయంలో మాకు మొదటి నుండి సపోర్ట్ చేస్తున్న అనురాధ గారికి థాంక్స్ చెప్పాలి అన్నారు. 


నిర్మాత వెంకట్ మద్దాల మాట్లాడుతూ .. మద్దాల ప్రొడక్షన్స్ బ్యానర్ ని మొదలెట్టి మంచి సినిమాలు చేయాలన్న సంకల్పంతో ముగ్గురు అన్నదమ్ముల కలిసి ఈ బ్యానర్ ని స్థాపించాం. మంచి కథ, కథనాలతో తెరకెక్కిన టేక్ డైవర్షన్ సినిమా పూర్తయింది. త్వరలోనే విడుదల డేట్ ప్రకటిస్తాం. ముక్యంగా ఈ సినిమా ట్రైలర్ విడుదలకు వచ్చిన లగడపాటి శ్రీధర్ గారికి థాంక్స్ చెబుతున్నాను. అలాగే ఈ సినిమాలో మెయిన్ లీడ్ అనాలా, విలన్ అనాలా అని చెప్పే జాన్ విజయ్ గారి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. అయన మాకు అందించిన సపోర్ట్ కు ధన్యవాదాలు అన్నారు.  


రామ్ మద్దాల మాట్లాడుతూ .. మద్దాల ప్రొడక్షన్స్ బ్యానర్ మొదలెట్టి చేస్తున్న మొదటి సినిమా ఇది. తెలుగు, తమిళ్ భాషల్లో చేస్తున్నాం. శివాని సెంథిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయం అందుకుంటుంది అన్న నమ్మకం ఉంది.  ఈ సినిమాకు జోసెఫ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు అన్నారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. అలాగే సురేష్ కొండేటి గారు మాకు బ్యాక్ బోన్ గా నిలిచి సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు సపోర్ట్ అందిస్తున్నారు అన్నారు.

Radhika Sarathkumar Interview About Aadavaallu Meeku Johaarlu

 ఫ్యామిలీ అంతా క‌ల‌సి హ్యాపీగా చూసే సినిమా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు - రాధిక శ‌ర‌త్ కుమార్



యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. రాధిక‌, ఊర్వ‌శి, కుష్బు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చ్ 4 న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ న‌టి రాధిక శ‌ర‌త్‌కుమార్ చెప్పిన విశేషాలు..


ఆడ‌వాళ్లు మీకు జోహార్లు స్టోరీ న‌రేట్ చేస్తున్న‌ప్పుడు మీకు ఎలా అనిపించింది?

- నేను చాలా భాష‌ల్లో సినిమాలు చేశాను. అందులో ఎన్నో డిఫ‌రెంట్ రోల్స్ ఉన్నాయి. తెలుగులో కూడా విభిన్న పాత్ర‌ల్లో న‌టించే అవ‌కాశం రావ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్ట‌ర్ కిశోర్ ఈ క‌థ న‌రేట్ చేస్తున్న‌ప్పుడే చాలా ఢిప‌రెంట్ గా అనిపించింది. ఎందుకంటే ఒక హీరో క్యారెక్ట‌ర్‌ను సెంట్రిక్‌గా పెట్టుకుని ఆయ‌న చుట్టూ ఉన్న ఆడ‌వాళ్ల పాత్ర‌ల‌కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ క‌థ రాసుకున్నారు. ఆ పాయంట్ నాకు చాలా యూనిక్‌గా అనిపించింది. క‌థ వింటున్న‌ప్పుడే చాలా హ్యాపీగా త‌ప్ప‌కుండా ఒక ఫీల్‌గుడ్ మూవీ అవుతుంది అనిపించింది. షూటింగ్ అయ్యాక స్క్రీన్ మీద చూస్తున్న‌ప్పుడు కూడా అదే ఫీలింగ్ క‌లిగింది.


మీ పాత్ర గురించి చెప్పండి?

- ఈ సినిమాలో నేను శ‌ర్వానంద్ త‌ల్లి పాత్ర‌లో క‌నిపిస్తాను. నా పాత్ర గురించి ఎక్కువ చెప్ప‌లేను కాని

క్రికెట్ టీమ్ లో ధోనిలా అన్న‌మాట‌. చాలా కామ్‌గా ఉంటాను కాని ఎప్ప‌టిక‌ప్పుడు క‌థ‌ను ముందుకు న‌డిపిస్తుంటాను. నా పాత్ర ఇంట్ర‌డ‌క్ష‌న్‌తోనే ఎలా ఉండ‌బోతుంది అనేది ఆడియ‌న్స్‌కి తెలుస్తుంది. ఎక్కువ కామెడీ చేయ‌ను. ఒక సెటిల్డ్ ప‌ర్స‌న్‌. ఇంకో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే ఈ సినిమాలో శ‌ర్వాకి ఐదుగురు త‌ల్లులు ఉంటారు. ఒక్కో త‌ల్లి ఒక్కో మెంటాలిటీతో ఉంటుంది. వారంద‌రినీ పెళ్లికి ఎలా ఒప్పించాడు అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే..


ఊర్వ‌శి, కుష్బుతో క‌లిసి న‌టించ‌డం ఎలా అనిపించింది?

- ఊర్శ‌శితో ఇప్ప‌టికే చాలా సినిమాల్లో క‌లిసి న‌టించాను. కుష్బుతో కూడా చేశాను కాని మ‌రీ ఎక్కువ సినిమాలు కాదు. మేం అంద‌రం త‌ర‌చుగా క‌లుస్తూనే ఉంటాం. అన్ని విష‌యాలు షేర్ చేసుకుంటాం. ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే షూటింగ్ వాతావ‌ర‌ణ‌మే చాలా ప్లజంట్ గా ఉండేది. మా రోజుల్లో క్యారీవ్యాన్ ఉండేది కాదు అంద‌రం ఒక చెట్టుక్రింద కూర్చొని మాట్లాడుకునే వాళ్లం. అంద‌రం క‌లిసే భోజ‌నం చేసే వాళ్లం. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత అలాంటి వాతావ‌ర‌ణం మ‌ళ్లీ క్రియేట్ అయింది. మొద‌టి రోజు నుండి చాలా హ్యాపీగా షూటింగ్ లో పాల్గొనే వాళ్లం. టీమ్ అంతా ఒక యూనిట్‌లా కూర్చుని ప్ర‌తి సీన్ గురించి మాట్లాడుకుంటూ షూటింగ్ చేశాం. చాలా హ్యాపీగా అనిపించింది.


శ‌ర్వానంద్, ర‌ష్మిక గురించి చెప్పండి?

- శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న ఇద్ద‌రూ వెరీ వెరీ డెడికేటెడ్‌. అంత యంగ్ ఏజ్‌లోనే ఇంత డెడికేష‌న్‌, ప్రొఫెష‌న‌లిజం చూడ‌డం చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. వారిద్ద‌రికీ మంచి భ‌విష్య‌త్ ఉంది.  ఈ చిత్రం లో శర్వా పాత్ర మరియు పెర్ఫార్మన్స్ ప్రేక్షుకులను బాగా ఆకట్టుకుంటాయి


కిశోర్ తిరుమ‌ల  మేకింగ్ గురించి?

- డైరెక్ట‌ర్ కిశోర్ తిరుమ‌ల చాలా డీసెంట్‌.. అండ్ కామ్‌. సెట్లో అంత‌మంది ఆర్టిస్టుల‌ని ఎలా హ్యాండిల్ చేసేవాడో ఇప్ప‌టికీ అర్ధంకావ‌డం లేదు. అది నిజంగా స్పెష‌ల్ టాలెంట్‌. ప్ర‌తి విష‌యాన్ని చాలా కూల్‌గా తీసుకునేవాడు..ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చిన ముందుకు తీసుకెళ్లేవారు. అది నిజంగా అభినందించాల్సిన విష‌యం అలాగే నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా చాలా స‌పోర్ట్ చేశారు, ప్రతీ ఫ్రేమ్ ఇంత గ్రాండ్ గా కనిపిస్తుంది అంటే అది ఆయనకి సినిమా మీద ఉన్న ప్యాషన్ యే.


ప్ర‌స్తుతం సినిమా రంగంలో మీరు ఎలాంటి మార్పులు గ‌మ‌నించారు?

-  తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి 350కి పైగా చిత్రాల్లో న‌టించాను అని చెప్పారు. కాని నేను ఫాలోఅప్ చేయ‌డం లేదు. అప్ప‌టి ఇప్ప‌టికీ మేకింగ్ ప‌రంగా ఎన్నో చేంజెస్ వ‌చ్చాయి. టెక్నాల‌జీ, నాలెడ్జి అంతా మారిపోయింది. ఎప్ప‌టికైనా మార్పే మ‌న‌ల్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్ర‌స్తుతం నేను కొత్త డైరెక్ట‌ర్స్‌, కొత్త ఆర్టిస్టుల‌తోనే ఎక్కువ‌గా సినిమాలు చేస్తున్నాను. వారు మంచి టాలెంట్‌తో ముందుకు వ‌స్తున్నారు. చాలా హ్యాపీ. అలాగే నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన క్యారెక్ట‌ర్స్ త‌ప్ప‌కుండా చేస్తాను. తెలుగు సినిమా అంటే నాకు గ్రేట్ ప్యాష‌న్‌. తెలుగు సినిమాల్లో న‌టించ‌డం నాకు చాలా ఇష్టం.


మార్చ్ 4 న సినిమా విడుద‌ల‌వుతుంది క‌దా ఆడియ‌న్స్‌కి ఏం చెప్తారు?

- ఈ కోవిడ్ త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ కొంత డౌన్ అయిపోయారు. ప్ర‌పంచంలోనే చాలా మార్పులు వ‌చ్చాయి. అవ‌న్ని మ‌ర్చిపోవ‌డానికి ఒక మంచి సినిమా, ఫ్యామిలీ అంతా క‌ల‌సి హ్యాపీగా చూసే సినిమా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు. అన్ని స‌మ‌స్య‌ల‌ను మ‌ర్చిపోయి హ్యాపీగా న‌వ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. ప్ర‌తి ఒక్క ఫ్యామిలీ త‌ప్ప‌కుండా వెళ్లి సినిమా చూడండి.

Nikhil Takes Live Weapon Training For Action Spy Film

 Nikhil Takes Live Weapon Training For Garry BH, Ed Entertainments Action Spy Film, Second Schedule Begins In Manali From Next Month



Young and promising hero Nikhil Siddhartha’s 19th film being directed by Pacy editor Garry BH of Goodachari, Evaru and HIT fame and produced by K Raja Shekhar Reddy on Ed enterinaments  with Charan Tej Uppalapati as CEO will have its next shooting schedule begins from next month in Manali.


As the team will be filming some high-octane action sequences in the schedule, Nikhil is getting trained to perform some breath-taking stunts. Nikhil is taking live weapon training and he shared a picture to reveal the same.


 “Live Weapons Training... For one Adrenaline Pumping Project with @Garrybh88 @Ishmenon @tej_uppalapati @EdEntertainments ,” posted Nikhil on his Twitter page.


Iswarya Menon is playing the leading lady opposite Nikhil in this yet to be titled flick billed to be a complete action-packed spy thriller being made on a large scale.


The film’s first shooting schedule took place in Hyderabad.


This high budget entertainer will have association of some prominent technical crew. Director Garry BH also takes care of editing, while Julian Amaru Estrada is the cinematographer. Sricharan Pakala renders soundtracks for the film.


Anirudh Krishnamurthy is the writer. Arjun Surisetty handles art department, while Ravi Anthony is the production designer where as Charantej uppalapati is handling the entire production as CEO of banner Ed entertainments which is bankrolling the project. Along with this project Ed entertainments is planing to do 2 more projects this year.


Cast: Nikhil Siddhartha, Iswarya Menon


Technical Crew:

Director & Editor: Garry BH

Producer: K Raja Shekhar Reddy

CEO: Charan Tej

Presents: Ed entertainments

Writer: Anirudh Krishnamurthy

Music Director: Sricharan Pakala

DOP: Julian Amaru Estrada

Art Director: Arjun Surisetty

Costumes : Raaga Reddy, Akhila Dasari

Production Designer: Ravi Anthony

PRO: Vamsi-Shekar

Nandamuri Balakrishna’s First Look From NBK107 Unveiled

 Nandamuri Balakrishna’s First Look In Gopichand Malineni, Mythri Movie Makers #NBK107 Unveiled



Natasimha Nandamuri Balakrishna and successful director Gopichand Malineni who both delivered blockbusters with their last respective films are working on a mission to treat masses with a never seen before action-packed entertainer. Gopichand Malineni is presenting Balakrishna in a mass loaded avatar in the film which went on floors recently.


Interim, Balakrishna’s first look in the film has been released. Balakrishna appears in a rugged look with intensity in his face, flaunting rudraksha mala on his neck, as he walks stylishly alongside Land Rover Defender. He wears black shirt and brown panche in the poster that also shows us things like watch, rings, shades etc. which give more elevation to the character. Overall, Balakrishna’s look is more than satisfying and masses will certainly love this.


Billed to be a pucca mass and commercial film, Tollywood’s leading production house Mythri Movie Makers is bankrolling the project prestigiously. The shoot is presently taking place in Sircilla and the poster is from the fight sequence being taken care by Ram-Lakshman masters.


Shruti Haasan plays heroine opposite Balakrishna in the movie, that will have a powerful antagonist to be played by Sandalwood Star Duniya Vijay on his Tollywood debut. Varalaxmi Sarathkumar will play a powerful role in #NBK107.


Naveen Yerneni and Y Ravi Shankar will be producing the film on massive scale. Gopichand Malineni’s films are technically high in standard and #NBK107 has some top-notch technicians working for it.


S Thaman renders soundtracks, while Rishi Punjabi will handle the cinematography. Acclaimed writer Sai Madhav Burra provides dialogues, while National Award-Winning Craftsman Navin Nooli takes care of editing and AS Prakash is the production designer. Chandu Ravipati is the executive producer for the film that has fights by Ram-Lakshman duo.


Cast: Nandamuri Balakrishna, Shruti Haasan, Duniya Vijay, Varalaxmi Sarathkumar


Technical Crew:

Story, Screenplay & Direction: Gopichand Malineni

Producers: Naveen Yerneni, Y Ravi Shankar

Banner: Mythri Movie Makers

Music Director: Thaman S

DOP: Rishi Punjabi

Editor: Navin Nooli

Production Designer: AS Prakash

Dialogues: Sai Madhav Burra

Fights: Ram-Lakshman

CEO: Chiranjeevi (Cherry)

Co-Director: Kurra Ranga Rao

Executive Producer: Chandu Ravipati

Line Producer: Bala Subramanyam KVV

Publicity: Baba Sai Kumar

Marketing: First Show

PRO: Vamsi-Shekar

Puri Jagannadh International Project After Jana Gana Mana

Dashing director Puri Jagannadh delivered huge blockbuster with his last directorial and production venture iSmart Shankar. The director wrapped up shoot of the much-awaited Pan India project Liger starring Pan India star Vijay Deverakonda. This action drama is gearing up for release on August 25th.



As announced by Puri himself, he will next be doing his dream project Jana Gana Mana under the home production banner of Puri Connects. Like Liger, Jana Gana Mana will also be a Pan India project and he will be taking good time to complete and release this project. Interestingly, Puri will be making an International Project, after Jana Gana Mana.


Although details of this project aren’t disclosed for now, the international project will also be made under Puri Connects. Puri Jagannadh will produce all these movies, in association with Charmme Kaur.


Puri Jagannadh who has completed script works of these two projects will be spending his next years on them.

Samantha Starrer Director Guna Shekhar's visual wonder ‘Shakunthalam’ to Release as Pan India Film

 First look release of Creative Director Guna Shekhar's visual wonder ‘Shakunthalam’ with Samantha in the lead role; beautiful visual poetry preparing for release as pan-Indian movie



Creative Director Guna Shekhar's visual wonder 'Shakuntalam' stars Samantha, who has become a synonym for women-centric films with successful movies like U Turn and Oh Baby, in the lead role.


The pan-Indian movie is all set to release worldwide in Telugu, Hindi, Kannada, Malayalam and Tamil. Filming is completed and the project is undergoing post-production works. The film's unit released the first look from the movie on Monday.


Director Guna Shekhar is making 'Shakuntalam' as a beautiful, stunning and marvelous visual epic that has never been seen before in Tollywood. Guna Shekhar is one of the pioneers of Telugu cinema as a director and maker. His habit is to show something different in every film. If we look at his films and the way he made them, we can understand that. 


He is making the movie 'Shakuntalam' as the new love poem that the Telugu audience has never seen before. The first look of the ‘Shakuntalam’ we are seeing now is a testimony to that.


Big jungle films produced by the famous Hollywood production company Disney will have green surroundings and our children are amazed to see the animals in them. Such dazzling scenes can be viewed in 'Shakuntalam'. At first glance, Samantha (in the look of a sage), peacocks, deer, swans and other wildlife are sitting in the ashram. What is she waiting for is the question raised by the poster. At first glance it looks very cool and impressive. The first look is very poetic and touching. After a historical wonder like Rudramadevi, the Guna Teamworks is doing the film without any compromise in the making.


Guna Shekhar is directing the upcoming film 'Shakuntalam' on the DRP-Guna Teamworks banner and the movie will be presented by hit producer Dil Raju. Producer is Neelima Guna. Music is by Manisharma. Shekhar V Joseph is providing the cinematography. The members of the unit said that they will announce more updates on the film soon.


Cast:


Samantha


Technical Department:


Direction: Dil Raju

Banners: DRP - Guna Team Works

Writing, Direction: Guna Shekhar

Producer: Neelima Guna

Music: Manisharma

Cinematography: Shekhar V Joseph

Dialogues: Sai Madhav Burra

Editing: Praveen Pudi

Production Designing: Ashok

Costume Designing: Neeta Lulla

P.R.O: Vamsi Kaka 

Superstar Krishna Launched Sharan's Mr King First Look

 విజ‌య‌నిర్మల గారి మ‌న‌వ‌డు శరణ్ హీరోగా న‌టిస్తున్న `మిస్టర్ కింగ్`ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించిన సూప‌ర్ స్టార్ కృష్ణ



విజ‌య నిర్మ‌ల గారి మ‌న‌వుడు శరణ్ కుమార్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సీనియ‌ర్ న‌రేశ్ అల్లుడు (న‌రేశ్ క‌జిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా `మిస్టర్ కింగ్`చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని హన్విక క్రియేషన్స్ ప‌తాకంపై బి.ఎన్.రావు నిర్మిస్తున్నారు. శశిధర్ చావలి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇప్ప‌టికే `మిస్టర్ కింగ్`షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో వుంది. ఈ సంద‌ర్భంగా `మిస్టర్ కింగ్`పోస్ట‌ర్‌ను ఆదివారంనాడు  విజ‌య నిర్మ‌ల గారి జ‌యంతి సంద‌ర్భంగా నాన‌క్ రూమ్ గూడాలోని సూప‌ర్ స్టార్ కృష్ణ స్వ‌గృహంలో కృష్ణ గారు ఆవిష్క‌రించారు.


అనంత‌రం సూప‌ర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ, విజ‌య నిర్మ‌ల గారి జ‌యంతి సంద‌ర్భంగా `మిస్టర్ కింగ్`పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించ‌డం ఆనందంగా వుంది. ఈ సినిమా ద్వారా హీరోగా శ‌ర‌ణ్ మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నా. సినిమా సూప‌ర్ హిట్ కావాలి. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాన‌ని పేర్కొన్నారు.


సీనియ‌ర్ న‌రేశ్ మాట్లాడుతూ, నిర్మాత‌లు నాగేశ్వ‌ర‌రావు, ర‌వికిర‌ణ్‌లు నిర్మిస్తున్నారు. శ‌శిధ‌ర్ ద‌ర్శ‌కుడు. హీరో శ‌ర‌ణ్ నా అల్లుడు. నా క‌జిన్ రాజ్ కుమార్ కొడుకు. మా ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న 8వ హీరో. మంచి టీమ్‌తో ముందుకు వ‌స్తున్నారు. మా అమ్మ‌గారి ప్ర‌తి పుట్టిన‌రోజునాడు అభిమానులు ఇక్క‌డ‌కు వ‌చ్చి ఆశీర్వ‌చ‌నాలు తీసుకునేవారు. ఈ సంద‌ర్భంగా `మిస్టర్ కింగ్`పోస్ట‌ర్‌ను నేడు ఆవిష్క‌రించ‌డం జ‌రిగింది. ఎట్రాక్టివ్ టైటిల్‌తో అల‌రించేట్లుగా వుంది. ఈ సినిమాలో స‌హ‌న‌టులు సీనియ‌ర్స్ ముర‌ళీశ‌ర్మ‌, సునీల్ వంటివారు న‌టిస్తున్నారు. చ‌క్క‌టి నిర్మాణ విలువ‌ల‌తో కూడిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఈ సినిమా. శ‌ర‌ణ్ మంచి హీరో అవ్వాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపారు.


నిర్మాత బి.ఎన్.రావు మాట్లాడుతూ, మంచి కేరెక్ట‌ర్ వుంటే రాజుతో స‌మానం. అందుకే క‌థా ప‌రంగా `మిస్టర్ కింగ్`అనే పేరు పెట్టాం. మా అమ్మ‌గారు కూడా విజ‌య‌నిర్మ‌ల‌గారి అభిమాని. ఈరోజు మా సినిమా పోస్ట‌ర్ ఆవిష్క‌రించిన కృష్ణ‌గారికి, న‌రేశ్ గారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను అని తెలిపారు.


చిత్ర ద‌ర్శ‌కుడు శశిధర్ చావలి తెలుపుతూ, చ‌క్క‌టి కుటుంబ‌క‌థా చిత్రంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో సాగే సినిమా ఇది. షూటింగ్ పూర్త‌యింది. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని అన్నారు.


చిత్ర హీరో శరణ్ మాట్లాడుతూ, తాత‌గారు కృష్ణ‌, న‌రేశ్ అంకుల్, నాని ఆశీర్వాదాల‌తో నేను హీరోగా ముందుకు వ‌స్తున్నాను. న‌రేశ్ అంకుల్ నా రోల్ మోడ‌ల్‌. తాత‌గారి సినిమాలు, న‌రేశ్ అంకుల్ సినిమాలు చూస్తూ పెరిగాను. అలా ఇంట్రెస్ట్ తో హీరో అవ్వాల‌నుకున్నాను. ఈ సినిమా యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇందులో నా పాత్ర పేరు శివ‌. యూత్ కు బాగా క‌నెక్ట్ అవుతుందని న‌మ్ముతున్నా. మ‌ణిశ‌ర్మ‌గారు చ‌క్క‌టి బాణీలు స‌మ‌కూర్చార‌ని తెలిపారు.

 

న‌టీన‌టులుః

శరణ్ కుమార్, నిష్కల, ఊర్వీ సింగ్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, సునీల్, వెన్నెల కిషోర్, SS కంచి, శ్వేత ప్రగటూర్, ఐడ్రీమ్ అంజలి, శ్రీనివాస్ గౌడ్, మిర్చి కిరణ్, జబర్దస్త్ ఫణి, రోషన్ రెడ్డి, రాజ్‌కుమార్ సమర్థి, శ్రీనిధి గూడూరు


సాంకేతిక సిబ్బందిః

నిర్మాణం: హన్విక క్రియేషన్స్, ప్రెజెంట్స్: బేబీ హన్విక ప్రెజెంట్స్, నిర్మాత: బి.ఎన్.రావు, కథ & దర్శకత్వం: శశిధర్ చావలి, సంగీత దర్శకుడు: మణిశర్మ, సినిమాటోగ్రాఫర్: తన్వీర్ అంజుమ్, సాహిత్యం: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, కడలి, సహ నిర్మాత: రవికిరణ్ చావలి, కొరియోగ్రాఫర్: భూపతి రాజా,

పబ్లిసిటీ డిజైనర్: శివం సి కబిలన్, పి.ఆర్.ఓ: వంశీ - శేఖర్,

కాస్ట్యూమ్ డిజైనర్: కావ్య కాంతామణి & రాజశ్రీ రామినేని


Alia Bhatt Interview About Gangubai Kathiawadi

గంగూబాయ్‌ చాలా మంచి సినిమా.. ప్రేక్షకుల్ని థియేటర్స్‌కి రప్పిస్తుంది: ఆలియా భట్



‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెడుతోంది బాలీవుడ్ నటి ఆలియా భట్. అయితే అంతకంటే ముందే ‘గంగూబాయ్ కథియావాడి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భన్సాలీతో కలిసి పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌‌పై జయంతీలాల్ గడ నిర్మించారు. ఫిబ్రవరి 25న సినిమా విడుదలవుతున్న సందర్భంగా సినిమా గురించి, తన పాత్ర గురించి ఆలియా చెప్పిన విశేషాలివి.  


ప్యాండమిక్ తర్వాత విడుదలవుతున్న మొదటి మేజర్‌‌ సినిమా గంగూబాయ్. మీరెలా ఫీలవుతున్నారు?

చాలా నెర్వస్‌గా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దాంతో మొన్నటి వరకు నా మనసులో చాలా ప్రశ్నలు తిరిగాయి. ప్రేక్షకులు థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ని మర్చిపోయారా? ఇంతకు ముందులాగే థియేటర్లకు వస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలు. మంచి సినిమా అయితే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారనే నమ్మకాన్ని పుష్ప సినిమా కలిగించింది. దాంతో నా కాన్ఫిడెన్స్ పెరిగింది. మాది చాలా మంచి సినిమా. కాబట్టి కచ్చితంగా ఆడియెన్స్ వచ్చి ఎంజాయ్ చేస్తారనే అనుకుంటున్నాను.  


ఈ ఆఫర్ మీకెలా వచ్చింది?

నాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు (2005) సంజయ్‌ సర్‌‌ ‘బ్లాక్‌’ సినిమా ఆడిషన్‌లో పాల్గొన్నాను. సెలెక్ట్ కాలేదు. కానీ ఆయన నా కళ్లలోకి చూసి నేను కచ్చితంగా హీరోయిన్‌ అవుతానని చెప్పారు. ఈ సినిమా కథ విన్నప్పుడు నేనిది చేయగలనా అని ఆయన్ని అడిగాను. ఎందుకంటే గతంలో నేను పోషించిన పాత్రలకి పూర్తి భిన్నంగా ఉంది. కానీ నేను చేయగలనని సంజయ్‌ గారు నమ్మారు. నువ్వేం కంగారుపడకు, అంతా మంచే జరుగుతుందని ధైర్యం చెప్పారు.  


మీ క్యారెక్టర్‌‌ కోసం ఎలా ప్రిపేరయ్యారు?

నేను చేసే పాత్రల్లో నన్ను నేను ఊహించుకుంటూ ఉంటాను. ఏ సీన్ ఇచ్చినా మనసులో ఊహించుకుని వెంటనే చేసేస్తాను. ఈ సినిమా విషయంలో సంజయ్ సర్ చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అయ్యాను. వాయిస్ విషయంలో అయితే చాలా హార్డ్ వర్క్ చేశాను. గంగూబాయ్‌ చిన్నగా ఉన్నప్పుడు, పెద్దయిన తర్వాత స్వరంలో మార్పు ఎలా చూపించాలనేదానిపై ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. సినిమాలో కొంత పార్ట్ కోసం బరువు కూడా పెరగాల్సి వచ్చింది. డైట్ ఫాలో అవ్వకుండా ఏది తినాలనిపిస్తే అది తినేయమని సంజయ్ సర్ చెప్పారు. గుజరాతీ యాస పట్టుకోవడం కాస్త కష్టమయ్యింది. పైగా గంగూబాయ్ కథంతా 1950ల కాలంలో జరిగింది కదా. అప్పటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా నటించాల్సి వచ్చింది.


పాత్రలపై రీసెర్చ్ చేస్తుంటారా?

అలా ఏమీ ఉండదు కానీ డైరెక్టర్ విజన్‌కి తగ్గట్టు నన్ను నేను మార్చుకుంటాను. వాళ్లేం చెప్తే అది చేస్తాను. ఏమీ ప్రిపేరవ్వకుండా సెట్‌కి రమ్మనే డైరెక్టర్లు ఉన్నారు. రెండు మూడు నెలలు ప్రిపేరయ్యి రమ్మనేవాళ్లు కూడా ఉన్నారు. వాళ్లకి తగ్గట్టుగా చేస్తాను. చెప్పాలంటే గంగూబాయ్ కథియావాడి ఆ పద్ధతులన్నిటినీ మార్చేసింది. నా అంచనాలను మించి ఉంది. సంజయ్‌ సర్‌‌ స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేస్తుండేవారు. ఎప్పుడు ఏ సర్‌‌ప్రైజ్‌ ఉంటుందో తెలిసేది కాదు. ఓ నటికి ఇలాంటి అనుభవం చాలా అరుదుగా దొరుకుతుంది.  


ఈ సినిమా నుంచి మీరేదైనా కొత్త విషయం తెలుసుకున్నారా?

ఒక సీన్‌ చేయడానికి ఒక్క పద్ధతే ఉండదనే విషయం తెలుసుకున్నాను. మొదట్లో సీన్ చదివి సెట్‌కి వచ్చేదాన్ని. కానీ సెట్‌కి వెళ్లాక నా ఆలోచన మారిపోయేది. ఆ సిట్యుయేషన్‌లో గంగూబాయే ఉంటే ఎలా రియాక్టవుతుందో ఊహించుకునేదాన్ని. సీన్‌ పేపర్‌‌ ఒక స్టార్టింగ్ పాయింట్ అంతే. మనం ఎగరాలంటే రెక్కలు విప్పుకోవాలి కదా. నేనూ అదే చేసేదాన్ని.  


ఇలాంటి ఎమోషనల్‌ పాత్ర చేయడం కష్టమనిపించలేదా?

నిజానికి కష్టమే. చెప్పాలంటే నేనిప్పటికీ ఆ పాత్రకి ఎమోషనల్‌గా అటాచ్‌ అయి ఉన్నాను. ప్యాండమిక్‌ వల్ల రెండేళ్ల పాటు షూట్ చేశాం కదా. అందుకే అందులో నుంచి బైటికి రావడం కష్టంగా ఉంది. ఆ పాత్ర నా మనసులోనే ఉండిపోయింది. మూడేళ్లుగా నేను దానితో ప్రయాణం చేస్తున్నాను. ఆడియెన్స్ సినిమా చూశాక కానీ నేను రిలాక్స్ అవ్వలేను.


అత్యంత చాలెంజింగ్‌గా అనిపించిన సీన్ ఏది?

అసలు ఆ క్యారెక్టరే ఎంతో చాలెంజింగ్. సినిమా మొత్తం దాని చుట్టూనే తిరుగుతుంది. చూస్తే మీరు కూడా ఈ పాత్రతో లవ్‌లో పడిపోతారు. నేను పూర్తిగా తన ప్రపంచంలోకి వెళ్లిపోయాను. నా జీవితంలో కామాఠిపురని ఎప్పుడూ చూడలేదు. ముంబైలోని ఫిల్మ్ సిటీలో వేసిన కామాఠిపుర సెట్‌కి మాత్రమే వెళ్లాను. కానీ అక్కడికి వెళ్లగానే వేరొక మనిషిలా మారిపోయేదాన్ని. కొన్నిసార్లు ఇంట్లో కూడా నాకు తెలియకుండానే గంగూబాయ్‌లా కూర్చునేదాన్ని. తనలాగే మాట్లాడేదాన్ని. మా ఇంట్లో వాళ్లంతా నువ్వెవరు, నువ్వు ఆలియావి కాదా అనేవారు. మీరు మీలా కాకుండా వేరొకరిలా మారడం అంత ఈజీ కాదు. నేను మారానంటే ఆ క్యారెక్టర్ అంత ఎమోషనల్‌గా ఉండటం వల్లే. తను రెబెల్. తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎదిరించింది. ఓ బలమైన శక్తిగా ఎదిగింది. అదే తన గొప్పదనం.

 

గంగూబాయ్ పాత్ర కల్పితమా?

ఈ సినిమా హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా రూపొందింది. గంగూబాయ్‌ది అందులో ఓ చిన్న చాప్టర్. ప్రతి సినిమాలాగే ఇందులోనూ క్రియేటివ్‌గా ఆలోచించి కొన్ని సీన్స్, డైలాగ్స్ యాడ్ చేశాం.


అజయ్‌ దేవగన్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

చాలా ఎంజాయ్ చేశాను. గంగూబాయ్ జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి పాత్రలో నటించారు అజయ్. ఆయనే తన జీవితాన్ని ముఖ్యమైన మలుపు తిప్పుతారు. అంత గొప్ప నటుడితో కలిసి పని చేయడం చాలా బాగుంది. చెప్పిన టైమ్‌ కంటే ముందే సెట్‌కి వచ్చేస్తారు. నాకంటే ముందే ఎక్కడ వచ్చేస్తారో అని చాలా టెన్షన్ పడేదాన్ని. నటనలోనూ నాకెన్నో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.  


ఆర్‌‌ఆర్‌‌ఆర్ కంటే ముందు గంగూబాయ్ సినిమాతో టాలీవుడ్‌లో మీ ముద్ర వేయగలనని అనుకుంటున్నారా?

ఇవన్నీ ప్లాన్ ప్రకారం జరుగుతున్నవేమీ కాదు. అలా కుదిరాయంతే. ప్యాన్ ఇండియా యాక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్. ఆ విషయంలో శ్రీదేవి గారు నాకు స్ఫూర్తి. ఆవిడ తెలుగు, తమిళం, హిందీ అంటూ ప్రతి భాషలోనూ స్టార్ అయ్యారు. నేనూ అలా అవ్వాలనేదే నా కోరిక. అందుకు భాష సరిహద్దు కాదని నేను నమ్ముతాను. ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’ లాంటి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. దేవుడి దయవల్ల అక్కడితో ఆగిపోకుండా తెలుగులో నా ప్రయాణం మరింత ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాను.


Sridevi Movies unveils a Magnificent sets for Samantha’s ‘Yashoda’

 Sridevi Movies unveils a Magnificent sets for Samantha’s ‘Yashoda’



Samantha’s much awaited next ‘Yashoda’ movie produced by Sivalenka Krishna Prasad under Sridevi Movies banner. Talented duo Hari - Harish are making their directorial debut with this flick. Happening actors Varalaxmi Sarathkumar, Unni Mukundan, Rao Ramesh, Murali Sharma are playing pivotal roles in this film. In the supervision of Art Director Ashok, a huge set worth 3 Crore was unveiled for crucial scenes.


Speaking on the occasion producer Sivalenka Krishnaprasad says, “Starring Samantha as the lead, 30 to 40% of our ‘Yashoda’ scenes happen in a single place. We’ve visited many star  hotels for the same but shooting 35, 40 days at such hotels feels troublesome. So, we decided to unveil Grand Sets of 2 floors worth 3 crores at Nanakramguda’s Ramanaidu Studios under the supervision of Art Director Ashok. It has 7 to 8 sets of dining hall, living room, conference hall, library and nothing less than any 7 star hotel amenities. Beginning the schedule on the sets from February 3rd, crucial scenes on Samantha, Varalaxmi Sarathkumar, Unni Mukundan are being shot at the same. Wrapping the first schedule from December 6th to Christmas & another before sankranti in January,  pivotal scenes are planned to roll in Kodaikanal. We’re planning to wrap the entire shoot by April and release it in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi simultaneously.”


Art Director Ashok is popular for his impressive Charminar set in ‘Okkadu’ & other phenomenal works in various films. He worked on 150+ projects in Telugu & Tamil. Movie unit says he gave the best work that is apt for the story & Yashoda sets will be a bigger reference for his efficiency and expertise further.


Besides Samantha, Varalaxmi Sarathkumar, Unni Mukundan, Rao Ramesh, Murali Sharma, Sampath Raj, Shatru, Madhurima, Kalpika Ganesh, Divya Sripada, Priyanka Sharma and other popular and actors are playing major roles in this movie.


Music: Manisharma,

Dialogues: Pulagam Chinnarayana, Dr. Challa Bhagyalaxmi

Lyrics: Ramajogiah Sastry

Creative Director: Hemambar Jasthi

Camera: M. Sukumar

Art: Ashok

Fights: Venkat

Editor: Marthand. K. Venkatesh

Line Producer: Vidya Sivalenka

Co-producer: Chinta Gopalakrishna Reddy

Direction: Hari - Harish

Producer: Sivalenka Krishna Prasad


Kiran Abbavaram's 'Sebastian P.C. 524' to be released on March 4th

 Kiran Abbavaram's 'Sebastian P.C. 524' to be released on March 4th




Kiran Abbavaram, who got introduced with 'Raja Varu Rani Varu', has attained recognition as a distinctive hero in Tollywood. His second film 'SR Kalyanamandapam' was a solid hit in 2021. From class to mass audiences, from youths to family audiences, he has been loved by all sections of audiences. 'Sebastian P.C. 524', which is written and directed by Balaji Sayyapureddy, is his next film. He is on a hat-trick. Produced by Jovitha Cinemas and presented by Elite Entertainment, the film is being produced by B Sidda Reddy, Jayachandra Reddy, Pramod and Raju. Namratha Darekar (aka Nuveksha) and Komali Prasad are its heroines.


Prime Show Entertainment is releasing the promising movie in theatres on March 4.


In this regard, the producers today said, "Kiran Abbavaram has been on a success-delivering spree. He is surely going to score a hat-trick with 'Sebastian'. Ghibran's music is awesome. The listeners have showered their love on the song 'Heli' in a big way. The recently-released teaser has been trending heavily. The audio, released on Aditya Music, has been evoking a tremendous response. Night blindness is the backdrop of the story. The male lead suffers from the issue and he becomes a cop. How does he manage night shifts? What kind of practical issues does he face? These plot points have been narrated in an exciting way in our movie."


Cast and crew:


Kiran Abbavaram, Komalee Prasad, Nuveksha (Namratha Darekar), Srikanth Iyyangar, Surya, Rohini, Adarsh Balakrishna, George, Surya, Mahesh Vitta, Ravi Teja, Raj Vikram, Latha, Ishaan, Rajesh and others.


PRO: Surendra Kumar Naidu - Phani Kandukuri (Beyond Media)

Digital Partner: Ticket Factory

Publicity Design: Chavan Prasad

Stills: Kundan-Shiva

Sound: Sync Cinemas' Sachin Sudhakaran

Costumes: Rebecca-Ayesha Mariam

Fights: Anji Master

CG: Veera

DI: Raju

Cinematography: Raj K Nalli

Art Direction: Kiran

Editing: Viplav Nyashadam

Executive Producer: KL Madan

Presented by: Elite Entertainments

Produced by: Jovitha Cinemas

Producers: B Sidda Reddy, Jayachandra Reddy, Pramod and Raju.

Story, Direction: Balaji Sayyapureddy

Nindu Chandamama Movie Song Nilavani Ee Kashanam Song Launched

 'నిండు చందమామ' చిత్రం నుంచి 'నిలవనీ ఈ క్షణం..' పాట విడుదల 



గణేష్ శ్రీ వాస్తవ్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నిండు చందమామ'. గణేష్ శ్రీ వాస్తవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'నిలవనీ ఈ క్షణం..' పాటను విడుదల చేశారు. ఈ సందర్బంగా నిర్మాత, దర్శకుడు, హీరో గణేష్ శ్రీ వాస్తవ్ చిత్ర విశేషాలను వివరిస్తూ .. . 'నిండు చందమామ' చిత్రంలో మొత్తం నాలుగు పాటలున్నాయి. తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన పాట 'నిలవనీ ఈ క్షణం..'. ఈ పాటకంటే ముందు విడుదల చేసిన 'నింగిలో ఉన్నదే నిండుచందమామ', 'నీ ప్రేమకే..' పాటలు మంచి ఆదరణను పొందాయి. వేటికవే భిన్నంగా ఉంటూ అందర్నీ అలరించాయి. సంగీత, సాహిత్యాల మేళవింపు మా చిత్రం 'నిండు చందమామ' లో కనిపిస్తుంది. ఈ చిత్రంలోని పాటలను సంతోష్ బెజవాడ, చైతన్య, కిరణ్ వల్లూరి రాశారు. వారి సాహిత్యం కిరణ్ వల్లూరి సంగీత సారథ్యంలో పరవళ్లు తొక్కుతుంది. ఈ పాటలు ప్రతి ఒక్కరి నాలుకలపై నిత్యం నర్తిస్తాయి. అంత సక్కటి సాహిత్యం కుదిరింది. ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించాం. నిర్మాణ విలువలు కూడా 'నిండు చందమామ'లాగే ఉంటాయన్న గట్టినమ్మకం మాకుంది. నిర్మాత, దర్శకుడు, హీరోగా బరువైన మూడు భాధ్యతల్నీ మోసిన నేను ఎంతో సంతృప్తికరంగా ఉన్నాను. ఎందుకంటే 'నిండు చందమామ' చిత్రం యూనిట్ అందరి కృషితో అంత చక్కగా వచ్చింది కాబట్టి. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా వర్కబుల్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. మా చిత్రానికి అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.. 

గణేష్ శ్రీ వాస్తవ్, పలక్ గంగేలి, ప్రియా శ్రీనివాస్, సతీష్ సరిపల్లి, మీసం సురేష్, కంభంపాటి కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కిరణ్ వల్లూరి, డి.ఓ.పి : సాయితేజ కల్ల (సినిమా వాడు ఫేమ్), ఎడిటింగ్ : మయూర్ కులకర్ణి, పగిళ్ల సైదులు, పాటలు: సంతోష్ బెజవాడ, చైతన్య, కిరణ్ వల్లూరి, పబ్లిసిటీ డిజైనర్ : దేవ్ భీమిడిట్స్, కథ--నిర్మాణం- దర్శకత్వం: గణేష్ శ్రీ వాస్తవ్

Rana Daggubati Launched Telugu Teaser Of Suriya Asian Multiplexes Private Limited’s ET

 Rana Daggubati Launched Telugu Teaser Of Suriya, Pandiraj, Asian Multiplexes Private Limited’s ET



Versatile actor Suriya is coming up with an action thriller film titled ET directed by Pandiraj and produced by Kalanithi Maran under Sun Pictures. Tollywood’s popular production and distribution house Asian Multiplexes Private Limited is releasing the Telugu version of the movie. Along with the Tamil version, the film will have simultaneous release in Telugu on March 10, 2022.


Handsome hunk Rana Daggubati launched ET’s teaser and just over 1 minute video presents Suriya in an intense avatar. The promo that gives a sneak peek into the actor’s powerful character, shows the film is going to be high on action.


The teaser is packed with breath-taking action sequences as the protagonist shows off his valour by fighting with several bad people. Vinai Rai makes his presence felt as the main antagonist. Suriya’s vengeance and, his one dialogue at the end “Those who are with me should never be afraid, no one can do anything to us”, is enough to raise the anticipation.


Suriya is exceptional in a ferocious role, wherein the teaser also shows us his romance with Priyanka Arul Mohan. The background music by D Imman is top-notch, while cinematography by R Rathnavelu is other big attraction.


Sathyaraj, Rajkiran and Saranya Ponvannan will be seen in crucial roles in the film.


Virgin Story Success Meet Held Grandly

 "వర్జిన్ స్టోరి" యూత్ కు బాగా నచ్చుతోంది - నిర్మాత లగడపాటి శ్రీధర్



నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న

సినిమా "వర్జిన్ స్టోరి". కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక.

రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని

నిర్మించారు. సౌమిక పాండియన్ నాయికగా నటించింది. ప్రదీప్ బి అట్లూరి

దర్శకత్వం వహించారు. శుక్రవారం థియేటర్ లలో విడుదలైన "వర్జిన్ స్టోరి"

సినిమా యువ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని చిత్ర బృందం తెలిపారు.

హైదరాబాద్ లో నిర్మాణ సంస్థ కార్యాలయంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ

సందర్భంగా


నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ..."వర్జిన్ స్టోరి" చిత్రంతో ఒక

కొత్త ప్రయత్నం చేశామని అభినందిస్తున్నారు. రివ్యూస్ కూడా చాలా బాగా

వచ్చాయి. అవకాశం ఉన్నా ఎక్కడా అసభ్యత చూపించలేదు అని ప్రశంసిస్తున్నారు.

యూఎస్ నుంచి మిత్రులు కాల్ చేసి అభినందిస్తున్నారు. టీనేజ్ లో ఉన్న

వాళ్లకు మా సినిమా కంటెంట్ బాగా అర్థమవుతుంది. సినిమాకు విజయాన్ని

అందించి మమ్మల్ని మా టీమ్ ను ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు. అన్నారు.


దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి మాట్లాడుతూ...క్లీన్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్

చేశాం. యూత్ నుంచి రెస్పాన్స్ బాగుంది. కామెడీలో చాలా రకాలు ఉంటాయి. మేము

విభిన్నంగా ఎంటర్ టైన్ మెంట్ ఇద్దామని ప్రయత్నించాం. మంచి రివ్యూస్

వచ్చాయి. ఆడియెన్స్ నుంచి ఇంకా మంచి స్పందన ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం.

అన్నారు.


నాయిక సౌమిక పాండియన్ మాట్లాడుతూ...నేను పియూ అనే పాత్రలో నటించగలను అని

నమ్మిన దర్శకుడు ప్రదీప్ గారికి థాంక్స్. థియేటర్ లో సినిమా

చూస్తున్నప్పుడు నా క్యారెక్టర్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని

భయపడ్డాను. కానీ కొన్ని సీన్స్ పూర్తయ్యాక నేను బాగానే నటించానని నమ్మకం

కలిగింది. కొత్త ప్రయత్నం చేసిన మా చిత్రాన్ని ఆదరించండి. అన్నారు.


ఈ కార్యక్రమంలో చిత్రంలోని ఇతర నటీనటులు పాల్గొన్నారు

Tremendous Response for For Die Hard Fan Shakalaka Shankar First Look

 'డై హార్డ్ ఫ్యాన్'లో బేబమ్మగా షకలక శంకర్.. కృష్ణ కాంత్ గా రాజీవ్ కనకాల లుక్స్ కు అనూహ్య స్పందన..



శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరామ్.M దర్శకత్వంలో ప్రియాంక శర్మ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం డై హార్డ్ ఫ్యాన్. సెలెబ్రిటీ, అభిమాని మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా ఈ సినిమా కథ. ఫ్యాన్ పాత్రలో శివ ఆలపాటి నటిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య సాగే డ్రామా ఇది. ఇందులో షకలక శంకర్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో షకలక శంకర్ బేబమ్మ.. రాజీవ్ కనకాల కృష్ణ కాంత్ పాత్రలో నటిస్తున్నారు. ఈ ఇద్దరి ఫస్ట్ లుక్ కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సినిమా పూర్తిగా కామెడీ సస్పెన్స్ డ్రామాగా రాబోతుంది. మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సయ్యద్ తేజుద్దీన్ మాటలు రాస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.


నటీనటులు: ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల తదితరులు


టెక్నికల్ టీమ్:

దర్శకుడు: అభిరామ్ M

బ్యానర్: శ్రీహాన్ సినీ క్రియేషన్స్

నిర్మాత: చంద్రప్రియ సుబుధి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి

మాటలు: సయ్యద్ తేజుద్దీన్

సంగీతం: మధు పొన్నాస్

సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి

ఎడిట్ VFX - తిరు B

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వెంకటేష్ తిరుమల శెట్టి

PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్