Latest Post

Batch Movie Success Meet

 చైల్డ్ ఆర్టిస్ట్ గా 80 కు పైగా సినిమాలు చేసిన 

సాత్విక్ వర్మ ను "బ్యాచ్"తో హీరోను చేసినందుకు హ్యాపీగా ఉంది ..."బ్యాచ్" థ్యాంక్స్ మీట్ లో నిర్మాత రమేష్ గనమజ్జి 



బేబీ ఆరాధ్య సమర్పణలో ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకంపై సాత్విక్ వర్మ ,నేహా పటాన్ జంటగా శివ దర్శకత్వంలో రమేష్ గనమజ్జి నిర్మించిన చిత్రం 'బ్యాచ్". రఘు కుంచే సంగీతం అందించారు.ఈ నెల 18 న థియేటర్స్ లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా 



చిత్ర నిర్మాత రమేష్ ఘనమజ్జి మాట్లాడుతూ..దర్శకుడు చెప్పిన కథను నమ్మి సినిమా స్టార్ట్ చేశాము.నటీనటులు టెక్నీషియన్స్ అందరూ చాలా చక్కగా సెట్ అయ్యారు.ఈ రోజు సినిమా ఇంత సక్సెస్ కావడానికి ప్రధాన కారణం వారే. రఘు బయ్యా మంచి సంగీతం అందించాడు. కొత్త సింగర్స్ తో పాడించి వారిని ఇండష్ట్రీకు పరిచయం చేశాము. ఇండష్ట్రీలో  పెద్ద ఆర్టిస్టులతో 80 సినీమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేసిన సాత్విక్ ను నేను హీరోగా లాంచ్ చేసే బాధ్యత ను నాపై ఉంచినందుకు ధన్యవాదాలు.ఒక తల్లి నవమాసాలు మోసి బిడ్డను జన్మనిచ్చే సమయంలో ఎంత ప్రసవ వేదన చెందుతుందో అంతకంటే 1000 రేట్లు నేను అనుభవించడం జరిగింది.ఆ తరువాత ఆ తల్లి బిడ్డను చూసుకొని ఎంత మురిసి పోతుందో..ప్రేక్షకులు మా  సినిమాను ఆదరించి సక్సెస్ చేసినందుకు నేను అంతే సంతోషంగా ఉన్నాను.ఈ సినిమా కోసం ఎంతోమంది నాకు సపోర్ట్ గా నిలిచారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసు కుంటున్నాను. దర్శకుడు శివ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.ఈ సినిమా తరువాత శివ కు ఇండస్ట్రీలో మంచి బ్రేక్ వస్తుంది.మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులంద రికీ ధన్యవాదాలు అన్నారు. 


చిత్ర దర్శకుడు శివ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి కథకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు.రఘు కుంచె గారు నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకుల ఆదరణ వల్లే ఈ రోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు. 


డి.యస్ రావ్ మాట్లాడుతూ.. మంచి మ్యూజిక్ ఇచ్చిన  రఘుకుంచె గారు ఒక్కొక్క సాంగ్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులలో క్యూరియాసిటీ ను క్రెయేట్ చేశారు.100 థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది..నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు.ఇలాంటి చిన్న సినిమాను ఆదరిస్తే  మిరిన్నీ చిత్రాలు తీయడానికి నిర్మాతలు ముందుకు వస్తారు.ఈ సినిమాకు పనిచేసిన టీం అందరికి అల్ ద బెస్ట్ అన్నారు. 


సంగీత దర్శకుడు రఘుకుంచె మాట్లాడుతూ.. ముందుగా నిర్మాత రమేష్ ను అభినందించాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమాను విడుదల చేయడం చాలా కష్టం.అలాంటిది ఈ సినిమాను 100 థియేటర్స్ లలో విడుదల చేసి సక్సెస్ అయ్యాడు.ఇందులో సాత్విక్, నేహా లు చాలా చక్కగా నటించారు.ఈ చిత్రం తరువాత దర్శక నిర్మాతలు మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. 


హీరో సాత్విక్ మాట్లాడుతూ... సీనియర్ ఆర్టిస్టులు అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు.ఇలాంటి మంచి. చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు 


హీరోయిన్ నేహా పటాన్ మాట్లాడుతూ..ఎంతో మంది పెద్ద ఆర్టిస్టుల మధ్య నేను నటిస్తు న్నందుకు మొదట ఎంతో భయపడ్డాను. ఆతరువాత వారంతా నన్ను ఎంకరేజ్ చేయడంతో నేను నటించగలిగాను. ఇలాంటి మంచి. చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు 


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న. వారందరూ ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు 


నటీనటులు : బాహుబలి ప్రభాకర్, వినోద్ కుమార్, చిన్నా, మిర్చి మాధవి, సంధ్యాజనక్ ,మేకా రామకృష్ణ, డి.ఎస్ రావు ,చాందిని బతీజ్ , వినోద్ నాయక్ తదితరులు 


సాంకేతిక నిపుణులు

నిర్మాత : రమేష్ ఘనమజ్జి

సహ నిర్మాతలు : సత్తిబాబు కసిరెడ్డి ,అప్పారావు పంచాది

దర్శకత్వం : శివ 

సంగీతం : రఘు కుంచే 

డి ఓ పి : వెంకట్ మన్నం    

ఎడిటర్ :  జెపి 

ఆర్ట్స్ : సుమిత్ పటేల్

డాన్స్ : రాజ్ పైడి 

ఫైట్స్ : నందు 

పి.ఆర్.ఓ : హర్ష

Aadavaallu Meeku Johaarlu Releasing On March 4th

 Sharwanand, Rashmika Mandanna, Tirumala Kishore, SLVC’s Aadavaallu Meeku Johaarlu Releasing On March 4th



Versatile star Sharwanand’s out and out family entertainer Aadavallu Meeku Johaarlu is getting ready for its release. The makers have announced to release the movie on March 4th. Interim, the film has completed its censor scrutiny as well. It was awarded with clean U certificate.


Rashmika Mandanna has played Sharwanand’s love interest in the film directed by Tirumala Kishore and produced by Sudhakar Cherukuri under SLV Cinemas banner. Rockstar Devi Sri Prasad has provided soundtracks and all the three songs released so far have become sensational hits.


Khushbu, Radhika Sarathkumar and Urvashi will be seen in important roles in the film.


Cast: Sharwanand, Rashmika Mandanna, Khushbu, Radhika Sarathkumar, Urvashi, Vennela Kishore, Ravi Shankar, Sathya, Pradeep Rawath, Gopa Raju, Benarjee, Kalyani Natarajan, Rajasri Nair, Jhansi, Rajitha, Sathya Krishna, RCM Raju and others.


Technical Crew:

Director: Tirumala Kishore

Producer: Sudhakar Cherukuri

Banner: Sri Lakshmi Venkateswara Cinemas

Music Director: Devi Sri Prasad

Cinematography: Sujith Sarang

Editor: Sreekar Prasad

Art Director: AS Prakash

Choreographer: RajuSundaram and Sekhar VJ

PRO: Vamsi-Shekar


KTR is the chief guest for Bheemla Nayak's pre-release event

KTR is the chief guest for Bheemla Nayak's pre-release event



Bheemla Nayak, the much-anticipated action entertainer starring Pawan Kalyan, Rana Daggubati, is produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. The film has screenplay and dialogues by noted filmmaker Trivikram and is directed by Saagar K Chandra. Bheemla Nayak has completed all formalities for release and is set to hit theatres across the globe on February 25.


A grand pre-release event for the film will be held on February 21 in Hyderabad. The event will commence at Yousufguda Police Grounds at 6.30 pm on Monday and noted politician K T Rama Rao has agreed to grace it as a chief guest. Cinematography minister Talasani Srinivas Yadav will also be part of the evening amidst the film's cast, crew and scores of crowds.

Suresh Kondeti Launched Take Diversion First Look

 సురేష్ కొండేటి చేతుల మీదుగా 'టేక్‌ డైవర్షన్‌' ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ 

 


శివానీ సెంథిల్‌ దర్శకత్వంలో ‘టేక్‌ డైవర్షన్‌’ అనే పేరుతో ఓ ప్రేమ కథాచిత్రం రూపొందుతోంది. ‘టేక్‌ డైవర్షన్‌’ చిత్రంలో ‘పేట’, ‘చదురంగవేట్టై’ వంటి చిత్రాల్లో విలన్‌గా నటించిన రామచంద్రన్‌ ప్రధాన పాత్రలో నటించగా, శివకుమార్‌  హీరోగా పరిచయమవుతున్నాడు. హీరోయిన్‌గా పాటినీకుమార్‌, రెండో హీరోయిన్‌గా గాయత్రి నటిస్తున్నారు. జాన్‌ విజయ్‌ ప్రధాన విలన్‌ పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ టీవీ ఫేం జార్జ్‌ విజయ్‌, బాలా జె.చంద్రన్‌, శ్రీనివాసన్‌ అరుణాచలం తదితరులు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. జోస్‌ ఫ్రాంక్లిన్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం ఈశ్వరన్‌ తంగవేల్‌. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి చేతుల మీదుగా లాంచ్ అయింది. ఈ సినిమాను మద్దాల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్ సూరిశెట్టి, రామ్ మద్దాల, చందు మద్దాల, వెంకట్ మద్దాల, సురేష్ కొండేటి, డాక్టర్ గౌతం కశ్యప్, ఉమర్జీ అనురాధ పాల్గొన్నారు. 


పోస్టర్ లాంచ్ అనంతరం  నిర్మాత, సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ .. మద్దాల ప్రొడక్షన్స్ టెక్ డైవర్షన్ లోగో ఈ రోజు నా చేతులపై లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా నిర్మాతలు ఈ టేక్ డైవర్షన్ సినిమాతో వేరే బిజినెస్ రంగంలో ఉన్నాకూడా టేక్ డైవర్షన్ తీసుకుని మొదటి సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు. వాళ్ళు సినిమా రంగంలో ఉంటూనే మరో డైవెర్షన్ లోకి వెళ్లకుండా ఇక్కడ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. వెంకట్, చందు, రామ్ గార్లు అందరు బ్రదర్స్ అందరు కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. కుటుంబంలో ముగ్గురికి సినిమా రంగం పై ఆసక్తి కలగడంల ఆనందంగా ఉంది. దీని వెనకుండి నడిపించిన రాజేష్ గారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. అలాగే దీనికి వెన్ను దన్నుగా ఉన్న మహిళా జర్నలిస్ట్ అనురాధ గారు సపోర్ట్ ఇవ్వడం.. ఆనందంగా ఉంది.. వీరందరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. శివాని సెంథిల్ డైరెక్షన్ అందించారు. మ్యూజిక్ కు చాలా స్కోప్ ఉన్న సినిమా. ట్రైలర్ చూసాను చాలా బాగుంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి హిట్ అందుకుంటుంది. తెలుగు, తమిళ్ ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు. 


 ఉమర్జీ అనురాధ మాట్లాడుతూ .. టేక్ డైవర్షన్ పోస్టర్ విడుదల ద్వారా ప్యాషన్ తో వచ్చిన  రామ్ మద్దాల, చందు మద్దాల, వెంకట్ మద్దాల గార్లకు అభినందనలు తెలుపుతున్నాను. ఈ సినిమాను వారి కష్టార్జితంతో నిర్మిస్తున్నారు. చాలా తపన ఉన్న టీమ్ ద్వారా ఈ సినిమా రెడీ అయింది. ఓ చిన్న సినిమా ఇది. నిర్మాతలు చాలా కొత్తవాళ్లు. అయినా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించారు. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది అన్నారు. మ్యూజిక్ కు చాలా స్కోప్ ఉన్న సినిమా. అలాగే పాటలు కూడా చాలా బాగున్నాయి. ఈ టీం అందరికి అభినందనలు తెలుపుతున్నాను. తప్పకుండా ఈ టీమ్ అందరు పరిశ్రమలో నిలదొక్కుకుంటారు అన్నారు. 


డాక్టర్ గౌతం కశ్యప్ మాట్లాడుతూ .. ఈ టైటిల్ చాలా బాగా నచ్చింది. అలాగే సెన్సిబుల్ నిర్మాతలు. మంచి ఉద్దేశం ఉన్నవాళ్లు, అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్లు వీళ్ళు.. ఇలాంటి వాళ్ళు సినిమా రంగంలోకి రావడం చాలా మంచిది. అలాంటి వారు వస్తే మంచి సినెమాలు వస్తాయి. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నాను. డైరెక్టర్ కూడా చాలా సెన్సిబిలిటీ ఉన్న వ్యక్తి. అలాగే ఇందులో మ్యూజిక్ కు చాలా స్కోప్ ఉంది. తప్పకుండా మ్యూజికల్ హిట్ అవుతుంది. ఈ సినిమా పోస్టర్ ని సురేష్ కొండేటి విడుదల చేయడంతో మన సినిమా ప్రేక్షకుల్లోకి స్పీడ్ గా వెళ్తుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి టీమ్ అందరికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అన్నారు. 


వెంకట్ మద్దాల మాట్లాడుతూ .. ఈ బ్యానర్ ని స్థాపించడానికి కారణం మంచి సినిమాలు చేయాలనీ, మొదటి ప్రయత్నంగా టేక్ డైవర్షన్ సినిమా చేస్తున్నాం. ఈ సినిమా విషయంలో సపోర్ట్ చేసిన సురేష్ కొండేటి గారు, అనురాధ, గౌతమ్ ఇలా అందరికి థాంక్స్ చెబుతున్నాం. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. ఈ సినిమాకు జోసెఫ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు అన్నారు. 


రామ్ మద్దాల మాట్లాడుతూ .. మద్దాల ప్రొడక్షన్స్ బ్యానర్ మొదలెట్టి చేస్తున్న మొదటి సినిమా ఇది. తెలుగు, తమిళ్ భాషల్లో చేస్తున్నాం. శివాని సెంథిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయం అందుకుంటుంది అన్న నమ్మకం ఉంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. అలాగే సురేష్ కొండేటి గారు మాకు బ్యాక్ బోన్ గా నిలిచి సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు సపోర్ట్ అందిస్తున్నారు. అలాగే అనురాధ గారు, గౌతమ్ గారు ఇలా ప్రతి ఒక్కరికి థాంక్స్ అన్నారు. 


చందు మద్దాల మాట్లాడుతూ.. మేము ఇంతకు ముందు తమిళంలో ఓ చిన్న సినిమా చేసాం.. అది మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా చేస్తున్నాం. టేక్ డైవర్షన్ టైటిల్ తెలుగు తమిళ్ భాషల్లో ఒకటే టైటిల్ పెట్టాం. సినిమా విషయంలో బ్యాక్ బోన్ గా ఉండి అనురాధ గారు సపోర్ట్ అందిస్తున్నారు. అలాగే సురేష్ కొండేటి గారు సపోర్ట్ అందిస్తున్నారు. తెలుగులో ఇకపై డైరెక్ట్ మూవీస్ మరిన్ని చేస్తాం. మాకు వేరే బిజినెస్ లు ఉన్నాయి.. కానీ కంటిన్యూ గా మారిన్ సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నాం. వీళ్ళ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు ఎక్కువ సపోర్ట్ అందిస్తున్న సూరిశెట్టి రాజేష్. ఆయనకు థాంక్స్ చెబుతున్నాను అన్నారు.

Victory Venkatesh Launched Kaushal Right Movie First Look

 విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా బిగ్ బాస్ కౌశల్ మండ నటించిన "రైట్" చిత్రం ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విడుదల



మహంకాళి మూవీస్ పతాకం పై కౌశల్ మండ మరియు లీషా ఎక్లైర్స్ (Leesha Eclairs) హీరో హీరోయిన్ గా శంకర్ దర్శకత్వం లో మహంకాళి దివాకర్ మరియు లుకలాపు మధు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం "రైట్". మలయాళం లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయిన 'మెమోరీస్' చిత్రం రీమేక్ ఇది. ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ ను మరియు మోషన్ పోస్టర్ ను విక్టరీ వెంకటేష్ గారు విడుదల చేశారు.


ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ గారు మాట్లాడుతూ "కౌశల్ నటించిన రైట్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి జీతూ జోసఫ్ కథను అందించారు. బిగ్ బాస్ తర్వాత కౌశల్ నటిస్తున్న రైట్ చిత్రం మంచి విజయం సాధించాలి. మోషన్ పోస్టర్ బాగుంది. కౌశల్ కి ఈ చిత్రం సక్సెస్ కావాలి" అని కోరుకున్నారు.


హీరో కౌశల్ మండ మాట్లాడుతూ "బిగ్ బాస్ విన్ అయిన తర్వాత ఈ చిత్రం చేశాను. నా ఫస్ట్ లుక్ పోస్టర్ ను వెంకటేష్ గారితో విడుదల చేయాలి అని చాలా కాలంగా వెయిట్ చేస్తున్న, కరోనా వల్ల చాలా ఆలస్యం అయింది. ఇప్పుడు నా కోరిక తీరింది. వెంకటేష్ గారు నా సినిమా పోస్టర్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం జీతూ జోసెఫ్ గారి మెమోరీస్ చిత్రం రీమేక్ ఇది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, మీరు అందరు నన్ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే ఉంటాను. ఈ చిత్రం మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. త్వరలో థియేటర్ లో విడుదల అవుతుంది. నేను బిగ్ బాస్ లో ఉన్నపుడు తెలుగు ప్రేక్షకులందరూ నాకు సపోర్ట్ చేసి విన్నర్ ని చేశారు. మీ అందరికీ గుర్తుగా నేను నా హృదయానికి దగ్గరగా టాటూ వేయించుకున్నాను. మీ ప్రేమ అభిమానాలు నాకు ఎప్పుడు ఉండాలి, అలాగే నా రైట్ చిత్రాన్ని చూసి నన్ను బ్లెస్స్ చేస్తారు అని కోరుకుంటున్నాను. నాకు ఏ అవకాశం ఇచ్చిన నా నిర్మాతలు దివాకర్ గారు మరియు లూకాలపు మధు గారికి ధన్యవాదాలు. 40 ఏళ్ల గా ప్రతి క్రాఫ్ట్ లో ఎంతో అనుభవం ఉన్న శంకర్ గారు ఈ చిత్రం దర్శకత్వం వహిస్తున్నారు. మన నిర్మాత దివాకర్ గారు సంజీవిని బ్లడ్ బ్యాంక్ తరపున లక్షల మందికి సహాయం చేశారు. నాకు చారిటీ అంటే ఇష్టం. దివాకర్ గారి ప్రతి మంచి పనికి నేను తోడుగా ఉంటాను. టాప్ టెక్నిషన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు"


నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ "బిగ్ బాస్ విజయం తర్వాత తొలిసారి కౌశల్ హీరో గా నటిస్తున్నారు. ఈ చిత్రం మొదటి లుక్ ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్ గారికి నా కృతజ్ఞతలు. షూటింగ్ అంతా పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉంది. త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు


నిర్మాత లుకలాపు మధు మాట్లాడుతూ "మా రైట్ మూవీ మొదటి పోస్టర్ ను మోషన్ పోస్టర్ ని విక్టరీ వెంకటేష్ గారు విడుదల చేశారు. వారికి మా ధన్యవాదాలు. కౌశల్ గారు బిగ్ బాస్ తర్వాత ఈ చిత్రం లో హీరో గా నటించారు. కథ చాలా బాగుంది. మంచి విజయం సాధిస్తుంది" అని కోరుకున్నారు.


చిత్రం పేరు : రైట్ (Right)


బ్యానర్ : మహంకాళి మూవీస్


నటి నటులు : కౌశల్ మండ, లీషా ఎక్లైర్స్, 30 ఇయర్స్ పృథ్వి, ఆమని, ముక్తార్ ఖాన్ , తదితరులు


మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ కూరాకుల


కెమెరా మాన్ : ఈ వి వి ప్రసాద్


ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్


ఎడిటర్ : తిరుపతి రెడ్డి


పి ఆర్ ఓ : పాల్ పవన్


కో - డైరెక్టర్ : రఘు వర్ధన్, భిక్షు


డైరెక్టర్ : శంకర్


నిర్మాతలు : మహంకాళి దివాకర్ మరియు లుకలాపు మధు

Hero Ram Pothineni Director Boyapati Sreenu Crazy mass combo

 Crazy mass combo: Director Boyapati Sreenu, Hero Ram Pothineni and Producer Srinivasaa Chhitturi come together for pan-Indian film



In a huge partnership, top director Boyapati Sreenu and Ustaad Ram Pothineni and ace producer Srinivasaa Chhitturi, have joined forces for a pan-Indian film, a formal announcement about which was made today. 

Srinivasaa Chhitturi of Srinivasaa Silver Screen banner, after two back to back hits, is now producing The Warriorr starring Ram Pothineni and directed by N Lingusamy. 

Boyapati Sreenu is fresh from the success of Nandamuri Balakrishna-starrer recent industry hit Akhanda, while Ram Pothineni is one of the most happening crazy hero of Telugu film industry. 

The coming together of the three for this pan-Indian project is being viewed as a big combination. The yet-to-be titled movie will be made on a lavish budget. 

Boyapati Sreenu has come up with a superb story loaded with mass elements that has thrilled both the producer and hero. 

More details about the film, including its heroine and other members of the cast and crew will be made in the near future.

Nandamuri Balakrishna Gopichand Malineni Mythri Movie Makers #NBK107 Shoot Commences Today

 Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107 Shoot Commences Today



Natasimha Nandamuri Balakrishna and successful director Gopichand Malineni who both delivered blockbusters with their last respective films have teamed up to offer a mass treat. Billed to be a pucca mass and commercial film, Tollywood’s leading production house Mythri Movie Makers is bankrolling the project prestigiously.


NBK107’s regular shoot commences from today in Sircilla town in Telangana state. The makers begin the shoot with a heavy action episode. Balakrishna joins the shoot from day one itself. Ram-Lakshman masters have choreographed the action sequence being canned on Balakrishna and fighters.


Gopichand Malineni is presenting Balakrishna in a completely different and action avatar in the movie being made on grand scale. The film’s story is based on real incidents.


Shruti Haasan plays heroine opposite Balakrishna in the movie, that will have a powerful antagonist to be played by Sandalwood Star Duniya Vijay on his Tollywood debut. Varalaxmi Sarathkumar will play a powerful role in #NBK107.


Naveen Yerneni and Y Ravi Shankar will be producing the film on massive scale. Gopichand Malineni’s films are technically high in standard and #NBK107 has some top-notch technicians working for it.


S Thaman renders soundtracks, while Rishi Punjabi will handle the cinematography. Acclaimed writer Sai Madhav Burra provides dialogues, while National Award-Winning Craftsman Navin Nooli takes care of editing and AS Prakash is the production designer. Chandu Ravipati is the executive producer for the film that has fights by Ram-Lakshman duo.


Cast: Nandamuri Balakrishna, Shruti Haasan, Duniya Vijay, Varalaxmi Sarathkumar


Technical Crew:

Story, Screenplay & Direction: Gopichand Malineni

Producers: Naveen Yerneni, Y Ravi Shankar

Banner: Mythri Movie Makers

Music Director: Thaman S

DOP: Rishi Punjabi

Editor: Navin Nooli

Production Designer: AS Prakash

Dialogues: Sai Madhav Burra

Fights: Ram-Lakshman

CEO: Chiranjeevi (Cherry)

Co-Director: Kurra Ranga Rao

Executive Producer: Chandu Ravipati

Line Producer: Bala Subramanyam KVV

Publicity: Baba Sai Kumar

Marketing: First Show

PRO: Vamsi-Shekar


Tremendous Response for 18Pages Anupama Parameswaran First Look

 అనుపమ పరమేశ్వరన్ పుట్టిన రోజు సందర్భంగా ‘18 పేజెస్’ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్‌కు అనూహ్య స్పందన.. 



వరస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పెజెస్. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా వస్తుంది. కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఇందులో నందిని పాత్రలో నటిస్తున్నారు ఈమె. ఇప్పటికే విడుదలైన అనుపమ పరమేశ్వరన్ కారెక్టర్ మోషన్ పోస్టర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఒక అందమైన అడవి.. పచ్చని చెట్లు.. ప్రశాంతమైన వాతావరణం.. అందులో నుంచి ఒక సీతాకోకచిలుక ఎగురుకుంటూ వచ్చి.. అనుపమ పరమేశ్వరన్ చేతిపై వాలుతుంది. అలా ఆమె నందిని పాత్రను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. ఏ వసంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్. త్వరలోనే థియేటర్స్ లో సినిమా విడుదల కానుంది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనున్నారు.


నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు


టెక్నికల్ టీం: 

దర్శకుడు: పల్నాటి సూర్య ప్రతాప్

కథ, స్క్రీన్ ప్లే: సుకుమార్

నిర్మాతలు: బన్నీ వాసు, సుకుమార్

సమర్పణ: అల్లు అరవింద్

నిర్మాణ సంస్థలు: గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్

సినిమాటోగ్రఫర్: ఏ వసంత్

ఎడిటర్: నవీన్ నూలి

సంగీతం: గోపీ సుందర్

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, , మేఘ శ్యామ్, మడూరిమధు

Grey Movie Releasing Shortly

స్పై డ్రామాగా దాదాపు న‌ల‌భై ఏళ్ల త‌ర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన `గ్రే` సినిమా త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంది - ద‌ర్శ‌కుడు రాజ్ మ‌దిరాజు.



ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్న చిత్రం `గ్రే`. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌ మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కిరణ్ కాళ్లకూరి  నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ద స్పై హూ ల‌వ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెర‌కెక్కిన ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో..


రాజ్ మ‌దిరాజ్ మాట్లాడుతూ - ``ఐదారేళ్ల క్రితం మ‌న‌దేశంలో రెండేళ్ల వ్య‌వ‌ధిలో దాదాపు 12మంది న్యూక్లియ‌ర్ సైంటిస్టులు క‌న‌ప‌డ‌కుండా పోయారు. ఇలా గ‌తంలో కూడా చాలా  సార్లు జ‌రిగింది. వీట‌న్నింటికి కార‌ణం ఏంటంటే ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సిస్. వారు చాలా జాగ్ర‌త్త‌గా వ‌ల‌ప‌న్ని చేసిన ఆప‌రేష‌న్స్ అవ‌న్ని. అందులోనుండి పుట్టిన ఐడియానే గ్రే మూవీ..మ‌నం సాధార‌ణంగా మంచిని తెలుపుగాను, చెడును న‌లుపుగాను చూస్తుంటాం. కాని ఆ రెండు క‌ల‌ర్స్ మ‌ధ్య‌లో కొన్ని వంద‌ల షేడ్స్‌ ఉంటాయి. ప్ర‌తి ఆలోచ‌న వెనుక మ‌న ఆలోచ‌న‌ల‌కు కూడా అంద‌ని కొన్ని వింతైన ఎక్స్‌ప్రెష‌న్స్ ఉంటాయి. అదే గ్రే..ఒక స్పై డ్రామా. అర‌వింద్ కృష్ణ‌తో రెండు సినిమాలు చేశాను. మ‌ళ్లీ అత‌నితో క‌లిసి చేయడం హ్యాపీ. ఈ సినిమాలో డాక్ట‌ర్ క్యారెక్ట‌ర్ చేశారు. అలీ రెజాని బిగ్‌బాస్ త‌ర్వాత క‌లిశాను. చాలా మంచి న‌టుడు. వీరిద్ద‌రితో పాటు ప్ర‌తాప్ పోత‌న్ గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్ట‌ర్ చేయ‌డం జ‌రిగింది. ఒక ర‌కంగా సూత్ర‌ధారి క్యారెక్ట‌ర్. ఊర్వ‌శీ రాయ్ హీరోయిన్‌గా ఇంట్ర‌డ్యూస్ అవుతుంది. ఆమెది లీడింగ్ లేడీ క్యారెక్ట‌ర్‌. సినిమా ఫ‌స్ట్ కాపీ చూశాం. చాలా బాగా వ‌చ్చింది. మా టీమ్ అంద‌రికీ న‌చ్చింది. ఆడియ‌న్స్ కి కూడా త‌ప్ప‌కుండా న‌చ్చుతుందని న‌మ్ముతున్నాను. దాదాపు 40 ఏళ్ల త‌ర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో వ‌స్తున్న చిత్రమిది. దానికోసం అన్ని అంశాల‌ను రీసెర్చ్ చేయ‌డం జ‌రిగింది`` అన్నారు.


న‌టుడు అలీ రెజా మాట్లాడుతూ -  ``కాసేప‌టి క్రిత‌మే సినిమా చూశాను. మా అంద‌రికీ న‌చ్చింది. నా క్యారెక్ట‌ర్ చాలా బాగా చేశాను అనుకుంటున్నాను. క‌థ విన్న‌ప్పుడు, షూటింగ్ చేసిన‌ప్పుడు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నానో ఈ రోజు సినిమా చూసిన త‌ర్వాత  అంత‌కంటే ఎక్కువ‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు


హీరోయిన్ ఊర్వ‌శీరాయ్ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో నేను ఆరూషీ అనే పాత్ర చేయ‌డం జ‌రిగింది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఇలాంటి ఒక మంచి సినిమాతో హీరోయిన్‌గా ఇంట్ర‌డ్యూస్ అవుతున్నందుకు హ్యాపీ..ఈ అవ‌కాశం ఇచ్చిన రాజ్ మ‌దిరాజు గారికి మా నిర్మాత కిర‌ణ్ గారికి థ్యాంక్స్‌. అంతా ఒక ఫ్యామిలీలా క‌లిసి షూటింగ్ చేశాం. అర‌వింద్‌, అలీ చాలా స‌పోర్ట్ చేశారు. ప్ర‌తాప్ పోత‌న్ గారితో న‌టించ‌డం బెస్ట్ ఎక్స్‌పీరియ‌న్స్‌. త‌ప్ప‌కుండా అంద‌రు సినిమా చూడండి`` అన్నారు.


న‌టుడు అర‌వింద్ కృష్ణ మాట్లాడుతూ - ``ఈ రోజు ప్ర‌పంచంమొత్తం తెలుగు సినిమావైపు చూస్తుంది. మ‌న కాంటెంట్ ప్ర‌పంచం న‌లుమూల‌ల‌కి వెళ్తుంది. గ్రే సినిమా కాంటెంట్ కూడా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నాను. రాజ్ గారు చాలా రీసెర్చ్ చేసి ఈ సినిమా రూపొందించారు. యాక్ట‌ర్స్ అంద‌రికీ పూర్తి స్వేచ్చ‌ను ఇచ్చి న‌టింప‌జేశారు. అలీతో క‌లిసి న‌టించ‌డం ఒక గ్రేట్ ఎక్స్‌పీరియ‌న్స్‌. ఊర్వ‌శీకి మంచి భవిష్య‌త్ ఉంటుంది. ప్ర‌తాప్ గారితో న‌టించ‌డం అద్భుత‌మైన ఎక్స్‌పీరియ‌న్స్‌. ప్ర‌స్తుతం తెలుగు ప్రేక్ష‌కులు ఇలాంటి సినిమాల కోస‌మే ఎదురుచూస్తున్నారు అని నేను న‌మ్ముతున్నాను. మీ అంద‌రి అంచ‌నాల‌ను అందుకోవాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను`` అన్నారు.


నిర్మాత  కిరణ్ కాళ్లకూరి మాట్లాడుతూ - ``ఈ సినిమాతో ఎంతో మంది మంచి న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. అద్వితీయ మూవీస్ ముఖ్య ఉద్దేశ్యం కూడా అదే.. వీలైనంత ఎక్కువ మంది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌ని ప‌రిచ‌యం చేయ‌డం. మా బేన‌ర్‌లో మ‌రో మూడు సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. `గ్రే` సినిమాని ఇంత బాగా తీసిన రాజ్ మ‌దిరాజుగారికి, ఆయ‌న‌కి పూర్తి స‌హ‌కారం అందించిన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ మ‌హేశ్ చ‌ద‌ల‌వాడ గారికి థ్యాంక్స్‌. రెండు గంట‌లు హ్యాపీగా చూసే చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు.


నటీన‌టులు

ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్‌, రాజ్ మ‌దిరాజు, షాని సాల్మోన్‌, న‌జియా, సిద్ధార్థ్‌


సాంకేతిక నిపుణులు

ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: రాజ్‌ మ‌దిరాజు

నిర్మాత: కిరణ్ కాళ్లకూరి, మాధురి కాళ్లకూరి

స‌హ నిర్మాత: రాజేష్ తోరేటి, రాజా వ‌శిష్ట‌, శ్రీదేవి కాళ్లకూరి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ఉమామ‌హేశ్వ‌ర్ చ‌ద‌ల‌వాడ‌

సినిమాటోగ్రాఫ‌ర్: ఎమ్ ఆర్ చేత‌న్ కుమార్‌

ఆర్ట్ డైరెక్ట‌ర్: రాజీవ్ నాయ‌ర్‌

మ్యూజిక్: నాగ‌రాజు తాల్లూరి

ఎడిట‌ర్: స‌త్య గిదుటూరి

మేక‌ప్:  విమ‌లా రెడ్డి

యాక్ష‌న్: వింగ్ చున్‌ అంజి

ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌: సంజ‌య్‌

కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: హేమంత్ సిరి

పీఆర్వో: శ్రీను- సిద్ధు

Actress Urvashi Interview About Aadavaallu Meeku Johaarlu

 ప్ర‌తి ఫ్రేములో ఐదుగురు మ‌హిళ‌ల‌కి స‌మాన‌మైన ప్రాధాన్య‌త ఉండ‌డం గొప్ప విష‌యం -  న‌టి ఊర్వ‌శి



యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. రాధిక‌, ఊర్వ‌శి, కుష్బు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా  న‌టి ఊర్వ‌శి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు..


ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే టైటిలే చాలా పాజిటీవ్‌గా ఉంది. టైటిల్ చూడ‌గానే ఆడ‌వారికి  ప్రాధాన్యం ఉన్న సినిమా అని అర్ధం అవుతుంది. మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే ప్ర‌తి ఫ్రేములో ఐదుగురు మ‌హిళ‌ల‌కి స‌మాన‌మైన ప్రాధాన్య‌త క‌లిగించ‌డ‌మే గొప్ప విష‌యం. ఎక్క‌డా కూడా ఒక‌రు ఎక్కువ ఒక‌రు త‌క్కువ అని అని ఉండ‌దు. స‌మాన‌మైన ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇలాంటి ఒక స్క్రిప్ట్ రావ‌డ‌మే అరుదు.


ఈ సినిమాలో హీరోకి ఐదుగురు త‌ల్లులు ఉంటారు. అందులో ఒక త‌ల్లి అంటే కొంచెం ఎక్కువ ప్రేమ, అటాచ్ మెంట్ ఉంటుంది అది ఎందుకు? ఆ త‌ల్లి ఎవ‌రు? అనేది సినిమాలో తెలుస్తుంది. భిన్న అభిప్రాయాలు ఉన్న ఐదుగురు త‌ల్లులును ఒప్పించి హీరో త‌న ప్రేయ‌సిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.


రాధిక‌, కుష్బు గారితో ఇప్ప‌టికే చాలా సినిమాల్లో క‌లిసి న‌టించాను. రాధిక క్యారెక్ట‌ర్ మెచ్యూర్డ్‌గా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం అంద‌రికీ మంచి చెడులు చెప్ప‌డం ఇలా ఉంటుంది. నా క్యారెక్ట‌ర్ విష‌యానికి వ‌స్తే చాలా ఎమోష‌న‌ల్, ఎక్కువ‌గా మ‌ట్లాడ‌తాను. అన్నింటికి నా ఒపీనియ‌న్ తీసుకోవాలి అనే మెండిత‌నం ఉంటుంది. అంద‌రిలో నా డెసిష‌న్ ఫైన‌ల్‌గా ఉండాలి అనుకుంటాను. నాకు న‌చ్చ‌క‌పోతే ఏ పని చేయొద్దు అనే ప‌ట్టుద‌ల‌వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. వాటిని ఎలా ప‌రిష్క‌రించారు అనేది ముఖ్యంగా ఉంటుంది.


శ‌ర్వానంద్, నేను ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రంలో న‌టించాము. చాలా మంచి ఆర్టిస్టు. ర‌ష్మిక కూడా చాలా  చ‌క్క‌గా న‌టించింది. షూటింగ్ అంతా స‌ర‌దాగా జ‌రిగేది ఎందుకంటే మళ్లీ ఇలాంటి ఒక కాంబినేష‌న్ రావ‌డం చాలా క‌ష్టం. డైరెక్ట‌ర్ ఇంత మంది ఆర్టిస్టుల‌తో సినిమా తీయ‌డం గొప్ప విష‌యం. నిర్మాత‌లు పూర్తి స‌హాకారం అందించారు. ఆరు షెడ్యూల్స్ షూటింగ్  చేశాం. అంద‌రం చాలా ఎంజాయ్ చేశాం.


క‌రోనా త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రు ఫ్యామిలీస్‌తో క‌లిసి వ‌చ్చి చూసే చిత్ర‌మిది. కామెడి, రొమాన్స్ ఇలా అన్ని అంశాలు ఉన్నాయి. త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌కి న‌చ్చుతుంది. ఫిబ్ర‌వ‌రి 25న త‌ప్ప‌కుండా అంద‌రు సినిమా చూడండి.

Prakash Raj Naveen Chandra Karthik Ratnam Movie Launched Grandly

 అంగరంగ వైభవంగా ప్రకాశ్‌రాజు, నవీన్‌చంద్ర, కార్తీక్‌రత్నంల చిత్రం ప్రారంభం....




ప్రకాశ్‌రాజు, నవీన్‌చంద్ర,  కార్తీక్‌రత్నంలు  కీలకపాత్రల్లో నటిస్తోన్న తెలుగు, తమిళ ద్విభాషా  చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యింది.  శ్రీ అండ్‌ కావ్య సమర్పణలో ప్రొడక్షన్‌ నం 6గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని థింక్‌ బిగ్‌ బ్యానర్‌పై ‘తలైవి’ దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్, శ్రీ షిరిడిసాయి మూవీస్‌ అధినేత యం. రాజశేఖర్‌ రెడ్డి, ప్రకాశ్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రకాశ్‌రాజ్, శ్రీక్రియేషన్స్‌పై బి.నర్సింగరావులు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో వాలీ మోహన్‌దాస్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నారు.  నటుడు తనికెళ్ల భరణి పూజచేసి నిర్మాతలను ఆశీర్వదించటంతో  సినిమా ప్రారంభం అయ్యింది. అనంతరం దర్శకుడు వేగేశ్న సతీష్, రచయిత జనార్ధన మహర్షి, సంగీత దర్శకులు ఆర్‌.పి పట్నాయక్‌ చేతుల మీదుగా స్క్రిప్ట్‌ను దర్శకుడు వాలీ, నిర్మాతలు విజయ్, రాజశేఖర్‌కి అందించారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నవీన్‌చంద్ర, కార్తీక్‌ రత్నంలపై ప్రముఖ నటుడు అలీ క్లాప్‌ కొట్టగా, నిర్మాత సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ్‌ కెమెరా స్విచాన్‌ చేశారు.  తొలి షాట్‌కు ‘ఆర్‌ ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు. పాత్రికేయుల సమావేశంలో నిర్మాత యం. రాజశేఖర్‌ మాట్లాడుతూ– నేను చెప్పిన ఈ సినిమా కథను నమ్మి నాతో ట్రావెల్‌ చేయటానికి ముందుకొచ్చిన  ముగ్గురుకి నేను థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. కథ వినగానే ప్రకాశ్‌రాజు గారు, ఏ.ఎల్‌ విజయ్‌ గారు, నవీన్‌చంద్ర మనం సినిమా కలిసి చేస్తున్నాం అని నన్ను నమ్మి ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు’’ అన్నారు. 

నవీన్‌చంద్ర మాట్లాడుతూ– ‘‘ ఈ సినిమా కథ చాలా స్పెషల్‌. ఎంతోమంది ఈ కథతో నిజ జీవితంలో ఇన్‌స్ఫైర్‌ అవుతారు. ఇలాంటి మంచి కథతో నా దగ్గరికి వచ్చిన దర్శకుడు వాలీకి థ్యాంక్స్‌. చక్కని కథలను తెరకెక్కించే నిర్మాత రాజశేఖర్‌ అన్న నాకు ఎప్పటినుండో మంచి మిత్రుడు. ఎంతోమంది సినిమా పెద్దలు వచ్చి మా సినిమాను బ్లెస్‌ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్‌’’ అన్నారు. 

కార్తీక్‌ రత్నం మాట్లాడుతూ–‘‘ దర్శకుడు వాలీ కథను ఎంతో కొత్తగా రాసుకున్నారు. నిర్మాత రాజశేఖర్‌ గారు తెలుగులో నేను నటించిన ‘కేరాఫ్‌ కెంచెరపాలెం’ సినిమాను తమిళ్‌లో ‘కేరాఫ్‌ కాదల్‌’ తెరకెక్కించి నన్ను తమిళ్‌కి కూడా పరిచయం చేశారు. ఈ సినిమాతో ఆయన పెద్ద విజయం సాదిస్తారు’’ అన్నారు. విజయ్‌ మాట్లాడుతూ–‘‘  కంటెంట్‌ ఉన్న ఏ సినిమా అయినా  నాకు చాలా ఇష్టం. అలాంటి కథతో రాజశేఖర్‌ నా దగ్గరికి వచ్చారు. కథ నచ్చటంతో పెద్ద సినిమా అవుతుంది అనే నమ్మకంతో ఈ సినిమాలోకి ఎంటర్‌ అయ్యాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బి.నర్సింగరావు, నటుడు రాజారవీంధ్ర,  దర్శకుడు శ్రీపురం కిరణ్,  ‘గుణ 369’ ఫేమ్‌ డైరెక్టర్‌ అర్జున్‌ జంధ్యాల, దర్శకులు గౌతమ్‌ పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. వాణీబోజన్, అమృతా అయ్యర్‌లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి  కెమెరా–గురుదేవ్, ఎడిటర్‌– సతీష్‌ , ఆర్ట్‌– హరిబాబు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌– రంగా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – శివమల్లాల

 'Heli' song from Kiran Abbavaram's 'Sebastian P.C. 524' unveiled

 'Heli' song from Kiran Abbavaram's 'Sebastian P.C. 524' unveiled



Tollywood has always been welcoming of talented artists and technicians. With 'Raja Varu Rani Varu', Kiran Abbavaram successfully drew everyone's attention. The film proved that he is a performer that Telugu cinema will surely warm up to. 'SR Kalyanamandapam' became another hit that was loved by youths, families, and mass audience. Kiran is now getting ready to score a hat-trick hit with 'Sebastian P.C. 524'. Written and directed by Balaji Sayyapureddy, the film is being produced by B Sidda Reddy, Pramod and Raju. Namratha Darekar (aka Nuveksha) and Komali Prasad are the film's heroines. Elite Entertainment is presenting the movie, while Jovitha Cinemas is producing it. On Friday, a song titled 'Heli' was released.


Heli is the name of Nuveksha's character in the comedy thriller. The latest song gives the listener a taste of the romantic track between the lead pair. Ghibran has composed the beautiful song. Kapil Kapilan has sung it. Here are a couple of lines from the evocative song:


'నీ మాట వింటే రాదా మైమరపే...నీ పేరు అంటే రాదా మైమరపే...'


Released on Aditya Music, Sanapati Bharadwaj Patrudu has written the song with poetic touches.


The hero in the film suffers from night blindness. As a police constable, what sort of problems did he face because of the health issue? That's the premise of the movie.


Cast and crew:


Kiran Abbavaram, Komalee Prasad, Nuveksha (Namratha Darekar), Srikanth Iyyangar, Surya, Rohini, Adarsh Balakrishna, George, Surya, Mahesh Vitta, Ravi Teja, Raj Vikram, Latha, Ishaan, Rajesh and others.


PRO: Surendra Kumar Naidu - Phani Kandukuri (Beyond Media)

Digital Partner: Ticket Factory

Publicity Design: Chavan Prasad

Stills: Kundan-Shiva

Sound: Sync Cinemas' Sachin Sudhakaran

Costumes: Rebecca-Ayesha Mariam

Fights: Anji Master

CG: Veera

DI: Raju

Cinematography: Raj K Nalli

Art Direction: Kiran

Editing: Viplav Nyashadam

Executive Producer: KL Madan

Presented by: Elite Entertainments

Produced by: Jovitha Cinemas

Producers: Sidda Reddy B, Pramod, Raju

Story, Direction: Balaji Sayyapureddy

Ustad Ram Launched Chor Bazaar Title Song

 ‘‘చోర్ బజార్’’ టైటిల్ సాంగ్ విడుదల చేసిన ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని



స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్  తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న "చోర్ బజార్" సినిమా టైటిల్ సాంగ్ ను శుక్రవారం స్టైలిష్ హీరో రామ్ పోతినేని విడుదల చేశారు. 


ఈ సందర్భంగా *రామ్ మాట్లాడుతూ*...చోర్ బజార్ టైటిల్ సాంగ్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. పాట చాలా ట్రెండీగా ఉండి, గల్లీ బాయ్స్ పాటలా అనిపించింది. ఆకాష్ క్యారెక్టరైజేషన్, ఆటిట్యూడ్ అదిరిపోయినట్లు పాటతో తెలుస్తోంది.  రెగ్యులర్ పాటలా కాకుండా ర్యాప్ తో టూడేస్ సాంగ్ లా చేశారు. ఫొటోగ్రఫీ చాలా బాగుంది.  ఆకాష్ హిట్ కొడతాడని నమ్మకంగా చెబుతున్నా. ఇలాగే ట్రెండ్ సెట్టర్స్ గా సినిమాలు చేస్తూ ఉండాలని విష్ చేస్తున్నా. అన్నారు.


చోర్ బజార్ టైటిల్ సాంగ్ ఎలా ఉందో చూస్తే...*మీకు దిల్ ఉన్నోళ్ల కథ చెప్పాలె..దిల్ నిండా దమ్మున్నోళ్ల కథ చెప్పాలె..ఇది చోర్ బజార్...ఆజా చోర్ బజార్..ప్రతి బస్తీలో ఉంటనేను లేదు నాకు ఆధార్..నచ్చినట్లు బతుకుతుంట లేదు నాకు బాధ...ఖద్దరైన, ఖాకీ అయిన లేదు నాకు తేడా, రంగు రంగు జీవితాలు చోర్ బజార్ ఆజా*...అంటూ సాగుతుందీ గీత. రాప్ స్టైల్ లో సాగిన ఈ పాట మంచి ఎనర్జీతో సాగుతూ హీరో క్యారెక్టరైజేషన్ ను వివరించింది. నవాబ్ గండ్, అసురన్ టీమ్ ఈ పాటకు సంగీతాన్ని, ర్యాప్ అందించి పాడారు



"చోర్ బజార్" సినిమా త్వరలో థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.


సాంకేతిక నిపుణులు - సినిమాటోగ్రఫీ - జగదీష్ చీకటి, సంగీతం - సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ - అన్వర్ అలీ ఆర్ట్ - గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్స్ డిజైనర్ - ప్రసన్న దంతులూరి, ఫైట్స్ - ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ - భాను, పబ్లిసిటీ డిజైనర్ - అనిల్ భాను ,  స్టిల్స్ : వికాస్ సీగు, పి.ఆర్.వో - జీఎస్కే మీడియా,  మేకప్ - శివ, కాస్ట్యూమ్ చీఫ్ - లోకేష్, డిజిటల్ మీడియా - టాక్ స్కూప్, సహ నిర్మాత - అల్లూరి సురేష్ వర్మ, బ్యానర్ - ఐ.వి ప్రొడక్షన్స్, నిర్మాత - వీ.ఎస్ రాజు, రచన, దర్శకత్వం - బి. జీవన్ రెడ్డి.

11:34 Trailer Looks Promising

 11:34 Trailer Looks Promising With Intriguing Story, Gripping Narration And Top-notch Technicalities



Ssharadh Chandra Tadimeti handled multiple departments of writing, editing and direction of his maiden directorial venture 11:34 which is billed to be a robbery action thriller with a unique story and gripping narration. Produced by Ramdhuni Creations, the film based on real incidents stars Gangadhar Reddy, Phani Sharma, Madupu Phani Bhargav and Krishna Madupu in lead roles.


After stunning with appealing first look poster, the team has come up with theatrical trailer today. The video actually introduces us all the characters, besides giving insights into what the film is all about. Although it starred newcomers, everyone has come up with intense performances. Technically too, the trailer looks promising with top-notch cinematography and pulsating background score. Director Ssharadh Chandra wins brownie points for his wonderful taking. On the whole, the trailer hikes prospects on the movie.


Najeeb Shaik and Jithender Talakanti handled the cinematography of the movie, while Shivtej Baipalli and Sharath Kuthadi are the music directors. The movie has been made on grand scale with high technical standards.


The makers are planning to release the movie soon.

aha releases another cult film 96 in Telugu

 aha releases another cult film 96 in Telugu on Feb 18 as Valentine's special, directed by C.Premkumar, featuring Vijay Sethupathi and Trisha Krishnan.



100% Telugu OTT platform aha, a household name for Telugu entertainment, promised "Every Friday new release" and has been successful in keeping up their word. 96 has been receiving love since day one and the Telugu audience seems quite happy with the release.


The amount of love aha has been receiving for the release of 96 in Telugu is quite overwhelming. aha is known for the right film picks and releasing 96 in Telugu as Valentine's special they couldn't be more right.


 #96OnAHA is streamed on Feb 18. The streaming platform's recent releases were Arjuna Phalguna, Hey Jude, The American Dream, Lakshya, Senapathi, 3 Roses, Laabham, Manchi Rojuloachaie, Romantic, Most Eligible Bachelor, Anubhavinchu Raja, Sarkaar, Chef Mantra, Alludu Garu, and Christmas Thatha, to name a few.


Telugu Indian Idol, the first-ever Indian Idol in South India, hosted by Sreerama Chandra, will be streaming on the platform soon. aha's talk show, Unstoppable, hosted by Nandamuri Balakrishna, has been rated the no. 1 talk show on IMDB.


Anupama Parameswaran Butterfly Movie First Look Launched

 అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జెన్ నెక్ట్స్ మూవీస్ చిత్రం ‘బటర్ ఫ్లై’ ..టైటిల్‌, ఫస్ట్ లుక్ విడుదల



‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించిన మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. శ‌త‌మానం భ‌వ‌తి, హ‌లో గురూ ప్రేమ కోస‌మే వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకున్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం ‘బటర్ ఫ్లై’. 



జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యాన‌ర్‌పై గంటా స‌తీష్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి ప్ర‌కాష్ బోడ‌పాటి, ప్ర‌సాద్ తిరువ‌ళ్లూరి, ప్ర‌దీప్ న‌ల్లిమెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 18) అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే చేతులు క‌ట్టుకుని నిల‌బ‌డిన అనుప‌మ‌, ఏదో విష‌యం గురించి ఆలోచిస్తుంది. ఆమె వెనుక సీతాకోక చిలుక రెక్క‌లున్నాయి. ఆ రెక్క‌ల్లో అంద‌మైన రంగులను మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇటు యువ‌త‌, అటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యేలా వైవిధ్య‌మైన క‌థాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు మేక‌ర్స్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు. 



అరవింద్ షారోన్ (అర్విజ్), గిడోన్ కట్టా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 



నటీనటులు :


అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌



సాంకేతిక వ‌ర్గం:


నిర్మాణ సంస్థ :  జెన్ నెక్ట్స్ మూవీస్‌


స్టోరి, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం :  గంటా స‌తీష్ బాబు


నిర్మాత‌లు : ర‌వి ప్ర‌కాష్ బోడ‌పాటి, ప్ర‌సాద్ తిరువ‌ళ్లూరి, ప్ర‌దీణ్ న‌ల్లిమెల్లి


సినిమాటోగ్ర‌పీ :  సమీర్ రెడ్డి 


మ్యూజిక్ : అరవింద్ షారోన్ (అర్విజ్‌), గిడోన్ క‌ట్టా


ఆర్ట్ :  విజ‌య్ కుమార్ మ‌క్కెన‌


ఎడిట‌ర్ :  మ‌ధు


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ :  నారాయ‌ణ‌


డైలాగ్ రైట‌ర్ :  ద‌క్షిణా మూర్తి


లిరిక్ రైట‌ర్ :  అనంత శ్రీరామ్ 


ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ & డిజైన‌ర్ :  పోత‌రాజు పాంచ‌జ‌న్య (పింటు)


కెమెరా మెన్ :  బాబు గొట్టిపాటి


స్టిల్ ఫొటోగ్రాఫ్ :  రాజా


పబ్లిసిటీ డిజైన‌ర్ : అనిల్ భాను


డ‌బ్బింగ్ ఇంజ‌నీర్: ప‌ప్పు (శ‌బ్దాల‌య‌)


సౌండ్ ఎఫెక్ట్ : య‌తిరాజ్‌


పి.ఆర్‌.ఓ:  వంశీ కాకా


ట్రైల‌ర్ :  సుధాన్‌



Tamannaah Bhatia Next is Babli Bouncer

 TAMANNAAH BHATIA TO LEAD MADHUR BHANDARKAR’S NEXT FILM “BABLI BOUNCER”




~Fox Star Studios and Junglee Pictures join hands to kick-start the production of a fresh and unique coming-of-age story~


India, 18th February 2022: Multiple National award-winning director Madhur Bhandarkar is known for his magic in bringing alive soul-stirring characters that go on to become truly iconic and evergreen. Known for his excellence in presenting exceptional stories with female protagonists in the lead; the visionary filmmaker is once again bringing a distinctive story starring Tamannaah Bhatia in a never seen before avatar, as Babli Bouncer.  Jointly produced by Fox Star Studios and Junglee Pictures, Babli Bouncer is a delightful coming-of-age fictional story of a female bouncer, set in the real ‘bouncer town’ of North India – Asola Fatepur.


“As a filmmaker, there is a lot to be excited for and look forward to, when you get the chance to explore a never-before-told narrative. I want to portray this story of a female bouncer through a slice-of-life comedic tone that also leaves a lasting impact”, quipped filmmaker Madhur Bhandarkar. He continued, “With the shooting of Babli Bouncer starting today, I am ready as ever to bring forth this story from the world view of women bouncers. It’s a wonderful story and I’m absolutely sure Tamannaah will leave everyone surprised with her performance!”


Sharing her thoughts on kick-starting the shoot, actor Tamannaah Bhatia said, “As soon as I read Babli Bouncer, I fell in love with the character because it is one of the most exciting and fun characters with substance that I have come across. Madhur Sir has a flair for crafting defining female protagonists and Babli too is such a powerful character. For the first time, a film will explore the story of a female bouncer, and I am more than excited to be her voice. I can't wait to dive into this whole new world."


“We want to celebrate the rich diversity of human experiences and imagination through our stories. We focus on creating movies and characters that are fresh, unique and extremely entertaining with a strong universal appeal. Babli Bouncer is one such story which we feel should leave a lasting impression on the audiences. We are very excited to embark on this journey with Junglee Pictures, Madhur and Tamannaah to create what should be a very heartwarming and uplifting entertainer,” said Bikram Duggal, Head of Studios, Disney Star, India


Amrita Pandey, CEO Junglee Pictures added, “Babli Bouncer tells a rooted, inspiring and feel-good story of an endearing and powerful character Babli. I believe Amit Joshi, Aradhana Debnath & Madhur Bhandarkar have created this heart-warming story in a never seen before world. We are elated to team up with Fox Star Studios, Madhur Bhandarkar & Tamannaah Bhatia for this film.” 


Babli Bouncer explores the unseen world of bouncers, also stars Saurabh Shukla along with Abhishek Bajaj and Sahil Vaid in pivotal roles. 


Produced by Fox Star Studios and Junglee Pictures, Babli Bouncer is directed by Madhur Bhandarkar and stars Tamannaah Bhatia, in the lead. Concept, story and the screenplay: Amit Joshi, Aradhana Debnath and Madhur Bhandarkar. The movie will release end of this year in Hindi, Tamil and Telugu.

Hero Siva Kandukuri Interview

 ఆర్గానిక్ కథలు, కంటెంట్‌తో కూడిన సినిమాలు చేయాలనుకుంటున్నాను: శివ కందుకూరి



ఇంజనీరింగ్ పూర్తి చేసి న‌ట‌న‌పై ఆస‌క్తితో సినిమారంగంలోకి అడుగుపెట్టిన శివ కందుకూరి  2020లో `చూసి చూడంగానే` సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. న‌టుడిగా గుర్తింపు పొందిన ఆయ‌న‌కు `గ‌మ‌నం` సినిమా మ‌రింత‌గా పేరు తెచ్చింది. అందులో చారుహాస‌న్‌, శ్రియా శ‌ర‌ణ్ వంటి న‌టీన‌టుల‌నుంచి ఎంతో నేర్చుకున్నాననీ తెలియ‌జేస్తున్నారు. `పెళ్లి చూపులు’ ఫేమ్ రాజ్ కందుకూరి  కుమారుడిగా నేప‌థ్యం వున్నా క‌ష్ట‌ప‌డి తానేంటో నిరూపించుకుకోవాల‌నేదే త‌న కోరిక‌ని తెలియ‌జేస్తున్నాడు. శుక్ర‌వారం ఫిబ్ర‌వ‌రి 18న శివ కందుకూరి పుట్టిన‌రోజు.  ఈ సంద‌ర్భంగా గురువారంనాడు మీడియాలో ప‌లు విష‌యాలను తెలియ‌జేశారు.


- సినిమా చేయాలంటే క‌థ‌, కేరెక్ట‌ర్‌లో ప‌ర్‌ప‌స్ వుండేలా చూస్తాను. అలాగే  అలాగే క‌థ‌ల‌ను ఎంపిక చేసుకున్నా. `గ‌మ‌నం` అలా చేసిందే. ఆ సినిమా ఓటీటీలో విడుద‌లై అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రేక్ష‌కులు ఆద‌రించారు. దాన్ని బ‌ట్టి నేను ఎంచుకున్న విధానం క‌రెక్ట్ అనిపించింది.


- నేను కమర్షియల్ సబ్జెక్ట్‌లను మాత్రమే ఎంచుకోవాలని కాదు. దాని నుంచి బ‌ట‌య‌కు వ‌చ్చి అర్థ‌వంతమైన సినిమాలే చేయాలన్నది నా నమ్మకం. నేను నా నమ్మకాలకు వ్యతిరేకంగా వెళ్లలేను.


- కనీసం నా కెరీర్ తొలిదశలో అయినా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలు చేసినా ఆర్గానిక్ సినిమాలే చేస్తాను. 'మను చరిత్ర' ఆర్గానిక్‌గా ఉండబోతోంది. క్యారెక్టర్ జర్నీ, స్టోరీ రియలిస్టిక్ గా ఉంటుంది.


- నేను ఏ పాత్ర చేసినా పాత్రకు కనెక్ట్ అవ్వాలి. స్క్రిప్ట్‌లో నాకు నమ్మకం ఉండాలి. అల్లు అర్జున్ గారు పుష్ప‌లోని క్యారెక్టర్‌ని నమ్మారు కాబట్టి 'పుష్ప' మెప్పించింది. ఆ స్థాయి నమ్మకం లేకుంటే ప్రేక్షకులు ఇంతగా ఆదరించి ఉండేవారు కాదు. ఇది అన్ని రకాల సినిమాలకూ వర్తిస్తుంది.

- ఏదో ఫ్యామిలీ బేక్‌గ్రౌండ్ వుంది కదాని ఏది బ‌డితే అది చేయ‌కూడ‌దు. ప్రేక్ష‌కులు మ‌న‌ల్ని నిశితంగా గ‌మ‌నిస్తూనేవుంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటీటీ వ‌చ్చాక స్పానిష్‌తోపాటు ప‌లు దేశాల సినిమాల‌ను చూసి ఎన‌లైజ్ చేస్తున్నారు. అందుకే న‌టులుగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.


- వచ్చే ఐదేళ్లలో నేను కొన్ని సినిమాలు మాత్రమే చేయగలను. వాల్యూమ్ పట్టింపు లేదు. మా నాన్న సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉన్నారు. సినిమా చేయాలా వద్దా అనే నిర్ణయం నాపై ఆధారపడి ఉంటుంది. నాన్న‌గారు కేవలం ఏదైనా స‌జెన్స్‌ మాత్రమే ఇస్తాడు. చాలా సార్లు  నా అభిప్రాయాలకే పెద్ద పీట వేస్తారు.


- కెరీర్ మొద‌టిలోనే `గ‌మ‌నం` ద్వారా చారు హాసన్ సర్, ఇళ‌య‌రాజా సంగీతం, సినిమాటోగ్రాఫర్ విఎస్ జ్ఞానశేఖర్ వంటి సీనియర్లను గమనించి నేను చాలా నేర్చుకున్నాను. నా రెండో సినిమా ‘గమనం’లో ప్రతిభావంతులైన వారితో కలిసి పని చేశాను. క‌థ విన్న‌ప్పుడే నా గ్రాడ్ ఫాద‌ర్‌తో వున్న ఎటాచ్‌మెంట్‌ చారు హాస‌న్‌తో క‌నెక్ట్ అయింది. న‌ట‌న‌కూ స్కోప్ వున్న చిత్ర‌మ‌ది. డెడికేష‌న్ వారి నుంచి నేర్చుకున్నా.


- ప్ర‌స్తుతం ఇండస్ట్రీలో యూత్ హీరోల‌తో భారీ పోటీ ఉంటుంది. అదీ పాజిటివ్ కోణంలోనే వుంది. ప్ర‌తి ఒక్క‌రూ క‌థాపరంగా విభిన్నంగా ఏదైనా చేయాలని కోరుకుంటారు.  


- పెద్ద చిత్రాల‌తో పాటుగా తక్కువ బడ్జెట్‌లతో రూపొందించబడిన చిత్రాలకు OTT ఒక ఫ్లాట్‌ఫార‌మ్‌గా మారింది. అందులో  కంటెంట్-ఆధారిత కథనాలను చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంది. కొత్త వారికి ఇది చాలా ఆరోగ్యకరమైన విష‌యం.


- కొత్త సినిమాల‌ప‌రంగా చూస్తే, 'మను చరిత్ర' చిత్రీకరణ పూర్తి చేసుకుంది. క్రైమ్ థ్రిల్లర్ కూడా చేస్తున్నాను. నూతన దర్శకుడు పురుషోత్తం రాజ్ దీనికి దర్శకుడు. నేచురల్ స్టార్ నాని గారు నిర్మిస్తున్న 'మీట్ క్యూట్ వెబ్ ఫిలింలో చేస్తున్నాను. మ‌రో వెబ్ సిరీస్ కూడా చ‌ర్చ‌ల్లో వుంది. ఓటీటీ అనేది పేండ‌మిక్ త‌ర్వాత  ప్రేక్ష‌కుల‌కు మంచి వినోద సాధ‌నంగా మారిపోయింది. ఏదైనా థియేట‌ర్‌ను బీట్ చేయ‌లేదు.


- నా బ‌ర్ద్ డే రిజ‌ల్యూష‌న్ పెద్ద‌గా లేవు. ఆర్గానిక్ స్టోరీలు చెప్పాల‌నుకుంటున్నాను. క‌రోనా అనే గేప్ కూడా క‌థ‌లు ఎంచుకునేవిధానంలో మార్పును ప్ర‌తి ఆర్టిస్టులో క‌ల‌గ‌జేసిందని చెప్ప‌గ‌ల‌ను. మను చ‌రిత్ర అనే సినిమా రెండు నెల‌లో రిలీజ్ చేయాల‌నుకుంటున్నామ‌ని తెలిపారు.

Aadavaallu Meeku Johaarlu Trailer Releasing On February 19th

 Sharwanand, Rashmika Mandanna, Tirumala Kishore, SLVC’s Aadavaallu Meeku Johaarlu Trailer Releasing On February 19th



Young and versatile hero Sharwanand’s wholesome family entertainer Aadavaallu Meeku Johaarlu directed by Tirumala Kishore is all set for a grand release worldwide on 25th of this month. Meanwhile, promotions are in full swing for the film which is carrying enthusiastic reports, thanks to aggressive promotions and striking promotional content.


After teasing with teaser of the movie, the makers are coming up with theatrical trailer which will be dropped on February 19th. The poster indicates the kind of bonhomie Sharwanand shares with women in his family. The poster is full of positive vibes.


Rashmika Mandanna is the female lead opposite Sharwanand in the film produced by Sudhakar Cherukuri under SLV Cinemas banner. Sujith Sarang handled the cinematography, while Rockstar Devi Sri Prasad has provided tunes for the movie, and Sreekar Prasad who won several national awards is the editor.


Khushbu, Radhika Sarathkumar and Urvashi are playing important roles in the film that also features some stellar cast.


Cast: Sharwanand, Rashmika Mandanna, Khushbu, Radhika Sarathkumar, Urvashi, Vennela Kishore, Ravi Shankar, Sathya, Pradeep Rawath, Gopa Raju, Benarjee, Kalyani Natarajan, Rajasri Nair, Jhansi, Rajitha, Sathya Krishna, RCM Raju and others.


Technical Crew:

Director: Tirumala Kishore

Producer: Sudhakar Cherukuri

Banner: Sri Lakshmi Venkateswara Cinemas

Music Director: Devi Sri Prasad

Cinematography: Sujith Sarang

Editor: Sreekar Prasad

Art Director: AS Prakash

Choreographer: RajuSundaram and Sekhar VJ

PRO: Vamsi-Shekar


Virgin Story Song Launched by Director Raghavendra Rao

 యూత్ ఎంటర్టైనర్ 'వర్జిన్ స్టోరి' పాట లాంచ్ చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు



నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న

సినిమా "వర్జిన్ స్టోరి" కొత్త పాటని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నేడు

విడుదల చేసి మూవీ టీమ్ కి ఆశిస్సులు అందించారు.


కొత్తగా రెక్కలొచ్చెనా అనే ఉపశీర్షిక తో ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం

వహిస్తున్న ఈ చిత్రం రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష

శ్రీధర్ నిర్మించారు. ఈ సందర్భంగా...



దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ, "హీరో

హీరోయిన్లు సినిమా పేరు కు తగ్గట్టే ఫ్రెష్ గా ఉన్నారు. స్టోరీకి

తగ్గట్టే టైటిల్ ఉంది. సాంగ్ చాలా బాగుంది. శ్రీధర్ సినిమా పై చాలా

ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. డైరెక్టర్ ప్రదీప్ వాళ్ల తాత అట్లూరి పుండరీ

కాక్షయ్య గారు ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉన్న వ్యక్తి, చాలా మంచి మంచి

సినిమాలు తీశారు. అందరికి మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా

కోరుకుంటున్నాను." అన్నారు.


నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ, "ఈ రోజు మాకు చాలా స్పెషల్ డే. నా

సినిమా అరంగేట్రం నుండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న

దర్శకేంద్రులు రాఘవేందర్ రావు గారు మా సాంగ్ ను లాంచ్ చేయడం చాలా

హ్యాపీగా ఉంది. ఇప్పుడు ప్యాన్ ఇండియా - ప్యాన్ ఇండియా అంటున్నారు అందరూ.

కానీ మన ఫస్ట్ ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. కమర్షియల్

సినిమాకు కొత్త అర్థం తీసుకొచ్చిన ట్రెండ్ సెట్టర్ ఆయన. అలాంటి లెజండరీ

డైరెక్టర్ ఆశీస్సులు మా ‘‘వర్జిన్ స్టోరీ’’ కి దక్కడం అదృష్ణంగా

భావిస్తున్నాను. ఆయన ఆశిర్వాదాలు మాకెప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా.

సాంగ్ చాయిస్ లో ఆయనకంటూ మంచి టేస్ట్ ఉంటుంది, ఆయనకి ఈ పాట నచ్చిందంటే

అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ నెల 18న థియేటర్ లలో విడుదల

చేయాలనుకుంటున్నాం" అన్నారు.


హీరో విక్రమ్ సహిదేవ్ మాట్లాడుతూ రాఘవేందర్ రావు గారు ఈ రోజు రావడం అయన

చేతుల మీదుగా మా పాట లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.


హీరోయిన్ సౌమిక పాండియన్ మాట్లాడుతూ రాఘవేందర్ రావు గారు పెద్ద ఫాన్ నేను

అయన ఆశీర్వాదం మాకు దక్కడంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందనపై అంచనాలు

మాకు చాలా పెరిగాయి అన్నారు.


విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి

తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి

సంగీతం – అచు రాజమణి,

సినిమాటోగ్రఫీ – అనీష్ తరుణ్ కుమార్,

ఎడిటర్ – గ్యారీ,

సాహిత్యం – భాస్కర భట్ల, అనంత్ శ్రీరామ్,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - రాఘవేంద్ర,

నిర్మాతలు – లగడపాటి శిరీష శ్రీధర్,

రచన, దర్శకత్వం – ప్రదీప్ బి అట్లూరి