Home » » Pushpa The Film of the Year -DadasahebPhalke International Film Festival Awards 2022

Pushpa The Film of the Year -DadasahebPhalke International Film Festival Awards 2022

 దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో అల్లు అర్జున్ ‘పుష్ప’కు అరుదైన గౌరవం.. ఫిలిం ఆఫ్ ద ఇయర్ గా ఎంపికఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సంచలన దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా వైడ్‌గా అన్ని భాషల్లోనూ అద్భుతం చేసింది పుష్ప. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనకు అంతా ఫిదా అయిపోయారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బన్నీ మేనరిజమ్స్ ఫాలో అవుతున్నారు. ఈ సినిమాలో బన్నీ నటనకు ఇప్పటికే ప్రశంసల జల్లు కురుస్తుంది. తాజాగా మరో అరుదైన గౌరవం పుష్ప సినిమాకు దక్కింది. తాజాగా ఈ చిత్రం దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 అవార్డ్స్‌లో ఫిలిం ఆఫ్ ద ఇయర్ గా నిలిచింది. ఈ అవార్డ్ రావడంపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. త్వరలోనే పుష్ప 2 షూటింగ్ మొదలు కానుంది.


Share this article :