దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివెల్ లో బెస్ట్ షార్ట్
ఫిలింగా "మనసానమః", ఈ ఘనత సాధించిన ఏకైక తెలుగు లఘుచిత్రం
విరాజ్ అశ్విన్ నటించిన షార్ట్ ఫిలిం మనసానమః తన రికార్డుల పరంపర
కొనసాగిస్తోంది. పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు సహా
ఆస్కార్ క్వాలిఫైకు వెళ్లిన ఈ లఘు చిత్రం తాజాగా ప్రతిష్టాత్మక
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివెల్ లో బెస్ట్ షార్ట్
ఫిలింగా ఎంపికైంది.
ఈ ఫిలిం ఫెస్టివెల్ లో పురస్కారం పొందిన ఏకైక తెలుగు లఘుచిత్రంగా
రికార్డు సాధించింది. ఉత్తమ చిత్రం పుష్పతో పాటు తెలుగు నుంచి ఈ ఘనత
అందుకుంది. మనసానమః ఇంత గొప్ప గుర్తింపు తీసుకొచ్చిన ప్రేక్షకులకు చిత్ర
టీమ్ కృతజ్ఞతలు తెలిపారు
మనసానమఃలో ధృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ హీరోయిన్లుగా
నటించారు. గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్ రెడ్డి తన తొలి
ప్రయత్నంగా మనసానమహా షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. గతేడాది యూట్యూబ్ లో
రిలీజైన ఈ షార్ట్ ఫిలిం ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై 900కు పైగా
జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెల్చుకుంది. ఆస్కార్, బప్టా లాంటి
ప్రతిష్టాత్మక అవార్డులకు క్వాలిఫై అయ్యింది.