Latest Post

Singeetham Srinivasa Rao Dikkatra Parvathi Gets Rare Honor

 సింగీతం శ్రీ‌నివాస‌రావు తీసిన 'దిక్క‌ట్ర పార్వ‌తి'కి అరుదైన గౌర‌వం...


*జనవరి 1న చెన్నై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో సినిమా ప్రత్యేక ప్రదర్శన*



భారతీయ చిత్ర పరిశ్రమకు కొత్తదనం పరిచయం చేసిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. అందులో తమిళ సినిమా 'దిక్కట్ర పార్వతి' ఒకటి. గ్రేట్ రాజాజీ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రమిది. 1974లో విడుదలైంది. దీనికి ఫిల్మ్ ఫైనాన్స్ కార్పోరేషన్ స్పాన్సర్ చేయడం విశేషం. ఇప్పుడీ సినిమా ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. చెన్నైలో జరుగుతున్న ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో జనవరి 1వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు 'దిక్కట్ర పార్వతి'ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.


'దిక్కట్ర పార్వతి'కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రాజాజీ జన్మస్థానమైన తోరపల్లెలో చిత్రాన్ని తెరకెక్కించారు. హై కోర్టు అనుమతి తీసుకుని హోసూర్‌లోని కోర్టులో సినిమాలో కోర్టు రూమ్ సీన్స్ చిత్రీకరించారు. ఆ సన్నివేశాల్లో రియల్ లాయర్లు నటించారు. కణ్ణదాసన్ రాసిన ఓ పాటతో పాటు రాజాజీ రాసిన మరో పాటను వాణీ జయరామ్ ఆలపించారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్జీ రామ‌చంద్ర‌న్‌ ఆదేశాల మేరకు... మద్యపాన నిషేధం కొరకు 16 ఎంఎం కాపీలు సిద్ధం చేయించడానికి ప్రభుత్వ అధికారులు సినిమా నెగెటివ్ తీసుకున్నారు. తమిళంలో తొలి నియో రియలిస్టిక్ సినిమా కూడా ఇదే. 


చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో సినిమా ప్ర‌ద‌ర్శించ‌నున్న నేప‌థ్యంలో అప్పటి సంగతులను సింగీతం శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు. "ఈ సినిమా కోసం రాజాజీ గారిని వ్యక్తిగతంగా కలిసి ఆయన అనుమతి తీసుకోవడం మరువలేని అనుభూతి. సినిమా విడుదలైన కొన్నాళ్ల తర్వాత నెగెటివ్ డ్యామేజ్ అయ్యిందనే విషయం తెలిసి షాక్ అయ్యాను. అదృష్టవశాత్తూ... మంచి ప్రింట్ ఒకటి పుణెలోని నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ దగ్గర లభించింది. భారతీయ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఐదు వందల క్లాసిక్ సినిమాలను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది. అందులో 'దిక్కట్ర పార్వతి' ఒకటి. ఈ రోజు సినిమా డిజిటల్ కాపీ నా దగ్గర ఉండటం చాలా సంతోషంగా ఉంది. సినిమా విడుదలైనప్పుడు అప్పటి ప్రేక్షకులు ఎంత ఫ్రెష్‌గా ఫీల్‌ ఫీలయ్యారో... ఇప్పటి ప్రేక్షకులు కూడా అంతే ఫ్రెష్‌గా ఫీల్‌ అవుతారని ఆశిస్తున్నాను" అని సింగీతం శ్రీనివాసరావు తెలిపారు.


లక్ష్మి, వై.జి. మహేంద్ర తదితరులు నటించిన ఈ సినిమాకు నేషనల్ అవార్డు లభించింది. ఈ చిత్రానికి వీణా విద్వాన్ చిట్టిబాబు సంగీతం అందించారు. రవి వర్మ, కారైకుడి నారాయణ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.

Mahanatulu Characters Glimpse Released

 సందడిగా సాగిన "మహానటులు" మూవీ పోస్టర్, క్యారెక్టర్ రివీల్ కార్యక్రమం




మిస్టర్ అండ్ మిస్ సినిమాతో రొమాంటిక్ హిట్ ఫిల్మ్ రూపొందించిన దర్శకుడు అశోక్ కుమార్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా మహానటులు. ఏబీఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఏబీఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ బొడ్డిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి నిర్మాతలు. మహానటులు పోస్టర్ లాంఛ్, క్యారెక్టర్ రివీల్  కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, బిగ్ బాస్ విజేత సన్నీ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా



*దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ*...అశోక్ నేనూ మహేష్ కత్తి, సుధీర్ వర్మ రెగ్యులర్ గా కలిసేవాళ్లం. అశోక్ ఏ సినిమా చేసినా నేనూ, మహేష్ కత్తి లేకుండా చేసేవాడు కాదు. మహేష్ కత్తి ఇవాళ మన మధ్య లేడు. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేసేవాడు కత్తి మహేష్. అశోక్ సినిమా పిచ్చోడు. ఇతనికి బెంగళూరులో మంచి ఉద్యోగం ఉండేది. ఆ ఉద్యోగం మానేసి వచ్చి సినిమాలు చేస్తున్నాడు. చాలా రోజులు నా చుట్టూ తిరిగాడు. నేను ఉద్యోగం చేసుకోమని తిట్టేవాడిని. ఓ స్త్రీ రేపు రా అనే షార్ట్ ఫిలిం చేసి మళ్లీ నా దగ్గరకు వచ్చాడు. అశోక్ చేసిన ఓ స్త్రీ రేపు రా అనే సినిమా హిందీలో వంద కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆయన ఇన్స్పిరేషన్ తో చేసిన సినిమా సూపర్ హిట్ అయ్యింది. అశోక్ మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. కానీ ఆయన ఎదుగుతాడని ఆశిస్తున్నా. ప్రొడ్యూసర్ ఆట ఆసోసియేషన్ యాక్టివ్ గా ఉంటారు. మా అశోక్ తో సినిమా చేసినందుకు ప్రొడ్యూసర్ కు థాంక్స్ చెబుతున్నా. అశోక్ పెద్ద దర్శకుడు కావాలన్నది నా కోరిక. ఈ ఏడాది అది జరుగుతుందని కోరుకుంటున్నా. అన్నారు.


*బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ మాట్లాడుతూ*...బిగ్ బాస్ లో ఈ మధ్య మహానటులను చూశా. నా ఫ్రెండ్ మ్యాడీ ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది. భరద్వాజ గారు, అనూప్ గారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. మహానటులు కంప్లీట్ ఎంటర్ టైనర్ అర్థమవుతోంది. మంచి ట్విస్టులు ఉన్నాయట. మూవీ చాలా బాగుంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను. నేనూ నటుడినే, అశోక్ గారు మమ్మల్ని కూడా చూడాలని కోరుకుంటున్నా. అన్నారు.


*హీరోయిన్ గోల్డీ నిస్సీ మాట్లాడుతూ*..నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకుడు అశోక్ గారికి థాంక్స్. నాలాంటి న్యూ టాలెంట్ కు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉంది. మహానటులు మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా తప్పక చూడండి, మంచి సినిమా. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.


*దర్శకుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ*...టైటిల్ పెట్టినట్లు ఈ సినిమాలో అంతా మహానటులే. జాతిరత్నాలు జానర్ లో సినిమా ఉంటుంది. నేను ఇప్పటిదాకా కామెడీ జానర్ టచ్ చేయలేదు. సినిమా చేస్తున్నప్పుడు నేనూ ఎంజాయ్ చేశాను. మన చూట్టూ ఉండే ఓ నాలుగు క్యారెక్టర్స్ కథలో ఉంటారు. ఈ నలుగురు టీమ్ అప్ అయ్యి మహానటులు అనే యూట్యూబ్ ఛానెల్ ను ఎలా డెవలప్ చేశారు అనేది కథ. మీరు ఈ సినిమా ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెప్పగలను.


*ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షానీ మాట్లాడుతూ*..నేను నటుడిని అయితే  ఈ సినిమా మా దర్శకుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనే బాధ్యత అప్పగించారు. నిర్మాతలు ఈ సినిమాకు బాగా సపోర్ట్ చేశారు. క్వాలిటీలో రాజీ పడకుండా నిర్మించారు. దర్శకుడు ఎలాంటి కథను చెప్పాలనుకున్నాడో అది అనుకున్నట్లే తెరపైకి వచ్చింది. అన్నారు.


*నిర్మాత అనిల్ బొడ్డిరెడ్డి మాట్లాడుతూ*...ఏబీఆర్ ప్రొడక్షన్స్ కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని ప్రారంభించాం. ప్రతిభ గల కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తున్నం, ఇవ్వబోతున్నాం. ఏబీఆర్ టీవీ ప్రారంభించాం. ఇందులో జానపదాలు, బుర్రకథలు ఇలాంటి మన ప్రాచీన కళారూపాలపై డాక్యుమెంటరీలు చేస్తున్నాం. కళాకారులు ఏబీఆర్ టీవీ మన ప్లాట్ ఫామ్ అనుకోవాలి. అన్నారు.


*నిర్మాత డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి మాట్లాడుతూ*...మా సినిమా ప్రచార కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు థాంక్స్. నాకు సినిమా ఇండస్ట్రీతో పరిచయం లేదు. నా మిత్రుడు అనిల్ బొద్దిరెడ్డి గారు గతంలో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. మిస్టర్ అండ్ మిస్ సినిమా చూసి అశోక్ తో కొత్త సినిమా ప్లాన్ చేస్తుంటే నేనూ జాయిన్ అయితా అని చెప్పాను. అలా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. ఈ మధ్యే మహానటులు సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. ఇక రెగ్యులర్ గా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాము. త్వరలో ఎమ్మెల్యే సీతక్క బయోపిక్ చేయబోతున్నాం. అన్నారు.


*సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ*...మహానటులు టీజర్ చూశాను చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంది. సినిమా బాగా నవ్విస్తుందని ఆశిస్తున్నాను. సినిమా హిట్ కావాలని..ఎంటైర్ టీమ్ కు ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను. అన్నారు.


*సంగీత దర్శకుడు మార్కస్ ఎం మాట్లాడుతూ*...ఈ సినిమాలో నాలుగు సాంగ్స్ ఉంటాయి. అన్నీ సందర్భానుసారం వచ్చేవే. మంచి ఆల్బమ్ అవుతుంది. నాకీ అవకాశం ఇచ్చిన దర్శకుడు అశోక్ గారికి థాంక్స్. అన్నారు.


*వీజే మ్యాడీ మాట్లాడుతూ*...మా డైరెక్టర్ తో గతంలో మిస్టర్ అండ్ మిస్ సినిమా చేశాను. ఈ సినిమాలో నీకు రోల్ ఉంది అని చెప్పారు. వెంటనే షూటింగ్ కు వెళ్లిపోయాను. మహానటులు సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. అన్నారు.



ఈ చిత్రానికి సంగీతం - కథ, మాటలు - పి సుధీర్ వర్మ, సినిమాటోగ్రఫీ - సిద్ధం నరేష్, మ్యూజిక్ మార్కస్ ఎం, ఎడిటింగ్ - కార్తీస్ కట్స్, ఆర్ట్ - హేమంత్ కుమార్ జి., కాస్ట్యూమ్స్ - తనూజ మాలపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - షానీ సాల్మన్, సాహిత్యం - ఫణి కృష్ణ సంకెపల్లి, పవన్ రాచపల్లి, నిర్మాతలు - అనిల్ బొడ్డిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి, పీఆర్వో - జీఎస్కే మీడియా, దర్శకత్వం - అశోక్ రెడ్డి

Shyam Singha Roy Blockbuster Classic Celebrations

 శ్యామ్ సింగ‌రాయ్ బ్లాక్ బ‌స్ట‌ర్ క్లాసిక్ సెల‌బ్రేష‌న్స్...



న్యాచురల్ స్టార్ నాని హీరోగా న‌టించిన‌ శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సంద‌ర్భంగా శ్యామ్ సింగ‌రాయ్ బ్లాక్ బ‌స్ట‌ర్ క్లాసిక్ సెల‌బ్రేష‌న్స్ ను హైద‌రాబాద్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో నేచుర‌ల్ స్టార్ నాని, రాహుల్ సాంకృత్యాన్‌, నిర్మాత వెంక‌ట్‌బోయ‌న‌పల్లి చేతుల మీదుగా చిత్ర యూనిట్‌కు షీల్డ్‌లు అందించారు.


Arjuna Phalguna Pre Release Event Held Grandly

 అర్జున ఫ‌ల్గుణ‌  మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు.



శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన‌ చిత్రం `అర్జున ఫ‌ల్గుణ‌`. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహించారు. ఈ మూవీ డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..


డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ.. విష్ణు, వివేక్, తేజ నాకు మంచి ఫ్రెండ్స్. గోదావరి అందాలను, వాళ్ల పద్దతులను అక్కడివారు చాలా ఫ్రైడ్‌గా తీసుకుంటారు. అది ఈ ట్రైలర్‌లో కనిపిస్తుంది. శ్రీ విష్ణు ఏ కథ తీసుకుంటే అందులో లీనమై పోతారు. గోదావరి జిల్లాల్లో పుట్టి పెరిగి వచ్చిన విష్ణు గారు.. తన డైలాగ్ డెలివరీతో అదరగొట్టాడు. తెలుగు అనేది ఎంత వైవిధ్యంగా ఉంటుందో.. విష్ణు సినిమాలు కూడా అంతే వైవిధ్యంగా ఉంటాయి. నేషనల్ లెవల్‌లో రిప్రజెంట్ చేసే కెపబులిటి ఉన్న సినిమాలు ఆయన కిట్టిలో ఉండబోతున్నాయి. శ్రీ విష్ణుతో పని పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంది. తేజ జోహర్ చూశాను. ఈ సినిమాను చాలా కన్విక్షన్‌గా తీశారు. డిసెంబర్ 31 తర్వాత హ్యాపీ న్యూ ఇయర్‌తో పాటుగా, ఇరగొట్టేశారనే మెసేజ్ కూడా వస్తుంది.


సినిమాటోగ్రఫర్ జగదీష్ మాట్లాడుతూ.. నేను ముందు తేజకు థ్యాంక్స్ చెప్పాలి. మా జర్నీ జోహార్ సినిమాతో ప్రారంభమైంది. మేం మా శక్తి మేర ప్రయత్నించాం. మంచి ప్రశంసలు దక్కాయి. అర్జున ఫల్గుణ సినిమాను విజువల్ జర్నీగా చేశామని అనుకుంటున్నాం. డిసెంబర్ 31న రాబోయే ఫలితం కోసం ఎదురుచూస్తున్నాం. శ్రీ విష్ణు గారితో పని చేయడం కంఫర్టబుల్‌గా ఉంటుంది. అమృతా అయ్యర్ చక్కగా నటించింది. ఈ అద్బుతమై టీంతో కలిసి పని చేయడంఎంతో సంతోషంగా ఉంది. మా రైటర్ సుధీర్‌ మంచి యాక్టర్. నన్ను సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. నిర్మాతలు అన్వేష్, నిరంజన్ రెడ్డి గారికి థ్యాంక్స్.


డైలాగ్ రైటర్ సుధీర్ వర్మ మాట్లాడుతూ.. మా టీమ్‌ను బ్లెస్ చేయడానికి వచ్చిన దిల్ రాజు గారికి, యంగ్ డైరెక్టర్స్‌కు థాంక్స్. నేను ఇంతకు ముందు కొన్ని సినిమాలకు పనిచేశారు. కానీ ఫస్ట్ టైమ్ స్టేజ్ ఎక్కించింది మాత్రం అర్జున ఫల్గుణ. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు తేజ గారిని పరిచయం చేసిన ధీరజ్ గారికి థాంక్స్ చెప్పుకోవాలి. జోహర్‌ సినిమా చూశాక తేజ ఎంటో తెలుసు. శ్రీ విష్ణు, తేజ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు మిస్ అవ్వొద్దని కోరుకున్నాను. జోహర్ చూసి.. ఈ సినిమా చూస్తే తేజను జడ్జ్‌ చేయడం కష్టం. భవిష్యత్తులో ఉర మాస్ డైరెక్టర్‌గా చూడొచ్చు. మీతో ఇంకా కలిసి పనిచేయాలి. నిరంజన్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి థాంక్స్. శ్రీ విష్ణుది పక్కింటి అబ్బాయి అనే ఇమేజ్. శ్రీ విష్ణు చేసిన ప్రతి క్యారెక్టర్‌కు సఫరేట్ ఫ్యాన్‌ బేస్ ఉంది. ఇలాగే ఈ అర్జునుడు కూడా అందరికి నచ్చుతాడు. కొత్త డైరెక్టర్లకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ప్రతి సినిమాకు కొత్త డైరెక్టర్లను పరిచయం చేయాలని కోరుకుంటున్నాను.


ద‌ర్శ‌కుడు తిరుమల కిషోర్.. విష్ణు  చేసిన  15 సినిమాల్లో 10 మంది  కొత్తమందే. ఉన్నది ఒకటే  జిందగి  చిత్రంలో డైలాగ్‌లా.. ఇండస్ట్రీలో నా ప్రతి  కథలో  ఉండేవాడు  విష్ణు. అమృత చాలా మంచి నటి. తెలుగు తెలిసిన అమ్మాయిల ఒక్క అక్షరం కూడా మిస్  అవ్వకుండా  డైలాగ్  చెబుతుంది. తేజ మాటలతోనే  తాను ఎలాంటి  సినిమా తీశాడో తెలిసింది. ట్రైలర్ చూశాక నా  ఆలోచన  నిజమని  అనిపించింది. నిర్మాతలు  లేకుంటే సినిమా  అయ్యేది కాదు. ప్రియదర్శి మ్యూజిక్ బాగుంది.


ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. జోహర్ మూవీ చూసినప్పుడు తేజ అదరగొట్టాడని  అనిపించింది. అర్జున  ఫల్గుణ  చిత్రం  చాలా  బాగొచ్చింది. విష్ణు క్లోజ్ సర్కిల్స్‌లో మాట్లాడేటప్పుడు  ఊరి గురించి ఎక్కువగా  మాట్లాడుతాడు. గోదావరి గురించి ఒక సినిమా  చేయాలని విష్ణు  చెప్పేవాడు. అందుకు  తగ్గట్టు తేజ స్క్రిప్ట్ తీసుకువచ్చాడు. గోదావరి ఊరంటే చాలా  ఇష్టం ఉన్న ఇద్దరు వ్యక్తులు  తీసిన  సినిమాను  మీరు  చూడబోతున్నారు. మీరు పండగకు ఇంటికి  వెళితే  రెండు  రోజులు  ఎక్కువ ఉండి వస్తారు.  


ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. నిరంజన్, అన్వేష్‌లు సినిమా మీద ఫ్యాషన్‌తో 2008 లో మ్యాట్ని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ స్టార్ట్ చేశారు. నేను ఎలాగైతే కొత్త డైరెక్టర్లను పరిచయం చేస్తూ సినిమాలు చేస్తానో వాళ్లు కూడా సేమ్ రూట్‌. ఒక్క క్షణం, ఘాజీ.. ఇప్పుడు అర్జుణ ఫల్గుణ  ఇలా కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నారు. నిరంజన్, అన్వేష్‌లకు ఆల్ ది బెస్ట్. మనం ఎన్ని సక్సెస్‌లు తీస్తామో తెలియదు.. కానీ ప్రయత్నం చేస్తు వెళ్తుంటే సక్సెస్ వస్తుందని నమ్ముతాను. దాన్నే వాళ్లు కూడా నమ్ముతూ ఇలాగే డిఫరెంట్ సినిమాలు తీస్తున్నారు. అర్జున మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. శ్రీ విష్ణు హీరో అనాలో, ఆర్టిస్ట్ అనాలో, యాక్టర్ అనాలో నాకు తెలియదు. కానీ లీడ్ చేస్తున్నప్పుడు హీరోనే అంటాం. ఆర్టిస్ట్‌గా ప్రతి సినిమాను కొత్తగా ప్రయత్నం చేస్తూ.. తన ఫర్ఫామెన్స్‌తో సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ, కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్నాడు. చేస్తు ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్‌లు వస్తాయి. ఎందరో నీ ముందు ఎగ్జామ్‌ఫుల్‌గా ఉన్నారు. ఏదో ఒక రోజు నీ ప్రయత్నం నిన్ను పెద్ద వాడిని చేస్తుంది. ప్రయత్నం ఆపకు. తేజ జోహర్ సినిమా చూశాను.. ఆల్ ది బెస్ట్. నాకు కొత్త డైరెక్టర్లు కథ చెబితే రెండు మూడు విష్ణుతో షేర్ చేశాను. బెక్కం గోపి సినిమా చేస్తున్నాడు. మా బ్యానర్‌లో కూడా సినిమా చేయబోతున్నాడు.


మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ మాట్లాడుతూ.. నాకు సపోర్ట్ చేసిన తేజ గారికి, నాని గారికి, ఆదిత్య మ్యూజిక్, చైతన్య ప్రసాద్ గారికి థాంక్స్. శ్రీ విష్ణు స్క్రీన్‌పై అదరగొట్టాడు. సినిమా చాలా బాగొచ్చింది.


లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్.. తేజ, ప్రియదర్శన్‌తో నేను జోహర్ సినిమాకు పనిచేశాను. పల్లవి, చరణం పక్కన బెట్టి.. మూడ్‌ను ఎలివేట్ చేసేలా ప్రియదర్శన్ ట్యూన్ ఇస్తాడు. అన్ని పాటలు ఎంజాయ్ చేస్తూ రాశాను. అర్జున ఫల్గుణ పేరు వింటనే ఒక వైబ్రేషన్ వస్తుంది. అందరికి మంచి పేరు తీసుకొచ్చే మంచి టైటిల్.

తెలంగాణ, ఉత్తారంధ్ర, రాయలసీమ మాండలికాల్లో దేని మాధుర్యం దానిదే.. అది తెలుగు భాష గొప్పతనం. గోదావరి తల్లి రుణం తీర్చుకోవడానికి నాకు తేజ ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు.


ద‌ర్శ‌కుడు వెంకటేశ్ మహా మాట్లాడుతూ.. ఒక వైపు ఆచార్య లాంటి మెగా ప్రాజెక్టులు చేస్తూ మరోవైపు అర్జున ఫల్గుణ వంటి సినిమాలు తీసుకొస్తున్నందకు థాంక్స్. నాలుగేళ్లుగా విష్ణుతో సినిమా చేయాలని చూశాను. కానీ కుదరలేదు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రానికి చివరి వరకు ట్రై చేశాను.. కానీ కుదరలేదు. త్వరలోనే మేము ఇద్దరం కలిసి పని చేయాలని కోరుకుంటున్నాం. జోహర్ చిత్రంలో తేజ.. సోషల్ ఇష్యూను బాగా చూపించారు. సినిమాలు అనేవి జనాలను అర్థం కావనే ప్రసక్తే ఉండదు.


రంగస్థలం మహేష్ మాట్లాడుతూ.. నాకు చాన్స్ ఇచ్చినందుకు నిర్మాతలకు, దర్శకుడు తేజ గారికి చాలా థాంక్స్. నాకు సపోర్ట్ చేసినందుకు శ్రీ విష్ణు గారికి థాంక్స్. శ్రీ విష్ణు సినిమాలోనే నేను ఫస్ట్ చేశాను. నాకు చిరంజీవి గారి తర్వాత రవితేజ గారంటే ఇష్టం. రవితేజ గరి తర్వాత శ్రీ విష్ణు అన్న అంటేనే ఇష్టం. 100 పర్సెంట్ ఉంటే ఎవరైనా 100 పర్సెంట్ ఇస్తారు. కానీ శ్రీ విష్ణు అన్న 50 పర్సెంట్ ఉన్నా.. 100 పర్సెంట్ ఇస్తాడు. అదే 100 పర్సెంట్ ఉంటే శ్రీ విష్ణు అన్న ఇరక్కొడతాడు. నాకు దర్శకుడు తేజ ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. రంగస్థలం తర్వాత నేను చేసిన ఏమోషనల్ క్యారెక్టర్ ఇది. ఆ తర్వాత అంత మంచి పాత్ర ఈ చిత్రంలో చేశాను. నేను ఎక్కువగా చెప్పానని అనుకుంటే సినిమా చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి అడగొచ్చు.


దర్శకుడు సాగర్ కే చంద్ర మాట్లాడుతూ.. నన్ను ఇక్కడికి పిలిచినందుకు నిర్మాతలకు థాంక్స్. ట్రైలర్ చూసినప్పుడు చాలా ఏమోషనల్‌గా అనిపించింది. మంచి హిట్ కొట్టబోతున్నారు. అప్పట్లో ఒకడు ఉండేవాడు సినిమా రిలీజ్ అయి రేపటితో ఐదేళ్లు అవుతుంది. చాలా మంది నాకు ఫోన్ చేసి విష్ణుకు కథ చెప్పాలి అని అడుగుతున్నారు. నీతో కలిసి పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంది. విష్ణు నాకు మంచి ఫ్రెండ్.  


నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ - .. నిర్మాతలు నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌లకు కంగ్రాట్స్. నేను నిన్న సినిమా చూశాను. సినిమా చాలా బాగొచ్చింది. శ్రీ విష్ణకు ఈ సినిమా మంచి హిట్ ఇస్తుంది. తేజకు కంగ్రాట్స్. మ్యూజిక్ సూపర్‌గా ఉంది. శ్రీ విష్ణు చాలా మంది డైరెక్టర్స్‌ను పరిచయం చేసిన శ్రీ విష్ణు నేను పరిచయం చేసినందుకు నాకు గర్వంగా ఉంది. టీమ్ అందరికి ఆల్‌ ది బెస్ట్.


చిత్ర ద‌ర్శ‌కుడు తేజ మర్ని మాట్లాడుతూ.. మా ఈవెంట్‌కు వచ్చిన అతిథులందరికీ చాలా థాంక్స్. కొత్త కొత్త డైరెక్టర్లకు శ్రీ విష్ణు ధైర్యం. ఈ సినిమా కథ చెప్పగానే ప్రాజెక్టు టేకాఫ్ ఇచ్చినందుకు నిర్మాతలకు థాంక్స్. ఈ కథ రాస్తున్నప్పుడే నేను శ్రీ విష్ణును ఊహించుకున్నాను. సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. సినిమాలో క్యారెక్టర్లను ముందుగానే అనుకున్నాను. మహేష్ రంగస్థలం తర్వాత ఈ చిత్రంలో అంతటి స్థాయిలో ఏమోషనల్ క్యారెక్టర్ చేశాడు. క్లైమాక్స్‌లో ఏడిపించేస్తాడు. కోవిడ్ టైమ్‌లో ఎటువంటి లోటు రాకుండా చూసుకన్న ప్రోడక్షన్ టీమ్స్‌కు థాంక్స్ చెప్పాలి. జోహర్‌ సినిమా చేస్తున్నప్పుడు జగదీశ్‌ను కలిసినప్పుడు.. నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను. నాతో జోహర్ సినిమా చేసినప్పుడు ఉన్నవారే.. ఈ సినిమాకు కూడా పనిచేశారు. స్టేజి మీదకు ఎక్కి మైక్ పట్టుకోవడం నా జీవితంలో ఇదే తొలిసారి. అచ్చమైన తెలుగమ్మాయి కావాలంటే నాకు ఎవరూ దొరకలేదు. రెడ్ చిత్రంలో ఆమె లుక్ చూసిన తర్వాత అమృతను ఫిక్స్ చేశాం. చాలా ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ అదరగొట్టాడు. పల్లవి, చరణాలు మాకు అక్కర్లేదు.  శ్రీ విష్ణుకు కథ చెప్పినప్పుడు ఫస్టాఫ్ విన్నాక ఆయనలో ఒక స్పార్క్ కనిపించింది. సెకాండఫ్ చెప్పగానే సినిమా చేస్తున్నానని చెప్పారు. ఆయన ఇచ్చిన ధైర్యమే నన్ను ఇక్కడ నిలబెట్టింది. మంచి యాక్షన్, బ్యూటిఫుల్ ఏమోషన్‌తో.. సంక్రాంతి ముందే వచ్చిందని అనుకుంటారు. అలా అనుకోకపోతే.. నా దగ్గర సమాధానం లేదు. మా టీమ్ అందరికి థాంక్స్. కాస్టూమ్ డిజైనర్ ప్రసన్న గారు నేను అనుకున్నట్టుగా క్యారెక్టర్లను చూపించారు. నేను పాటల గురించి పెద్దగా ఆలోచించను ఎందుకంటే.. నేను ట్యూన్ పంపిన నాలుగు గంటల్లోనే చైతన్య ప్రసాద్ గారు పాట రాసి పంపిస్తారు. సుధీర్ డైలాగ్స్‌తో సినిమాకు ప్రాణం పోశాడనే చెప్పాలి. మా పీఆర్‌వోలు వంశీ, శేఖర్‌లకు థాంక్స్. వాళ్లిద్దరు సినిమాను జనాల్లోకి ఇంత అద్భుతంగా తీసుకెళ్లారు. డిసెంబర్ 31న అందరూ థియేటర్లలో అర్జున ఫల్గుణ సినిమా చూసి  మమ్మల్ని ఆశీర్వదించండి. శివరాజు, సుబ్బరాజు, పెద్ద నరేష్, దేవీ ప్రసాద్‌లు కూడా నా మీద నమ్మకంతో ఈ సినిమాలో చేశారు. ఎన్టీఆర్ ఫాన్స్ ఎట్టి పరిస్థితుల్లో అసంతృప్తి చెందరు.


హీరోయిన్ అమృత‌ అయ్యర్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన గెస్టలకు థాంక్స్. నాకు మెంటర్‌గా ఉన్న తిరుమల కిషోర్‌ గారికి థాంక్స్. నిరంజన్ రెడ్డి గారికి, అన్వేష్ గారికి థాంక్స్.  పల్లెటూరిలో ఉన్న శ్రావణి అనే క్యూట్ క్యారెక్టర్ ఇచ్చినందుకు తేజ గారికి థాంక్స్. శ్రీ విష్ణుతొ పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా సింపుల్, హంబుల్, కంఫర్టెబుల్ హీరో. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనిపించింది. ఆ అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. పక్కన ఉన్న అందరూ చాలా బాగా చేయాలని మోటివేట్ చేస్తుంటారు. మహేష్, చైతన్య.. అంతా ఫ్రెండ్స్ అయ్యారు. ఆఫ్ స్క్రీన్‌లో కూడా చాలా సపోర్ట్ చేశారు. డీవోపీ జగదీశ్ గారు స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు. ప్రియదర్శన్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. టీమ్ అందరికి చాలా థాంక్స్. డిసెంబర్ 31న అంతా థియేటర్లలో సినిమా చూడంది. ఇది తెలుగులో నా మూడో సినిమా. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ ఇయర్ పెద్ద సినిమాతో వస్తాను.


హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ..అర్జున ఫల్గుణ అనేది ఇంత గొప్ప గర్వంగా చెప్పుకోవడానికి కారణం నిర్మాతలు నిరంజ్ రెడ్డి గారు, అన్వేష్ గారు. ఏ రోజు కూడా మమ్మల్ని ఒక్క ప్రశ్న వేయలేదు. 55 రోజులు షూటింగ్ చేశాం. సినిమాను అందరం చాలా ఇష్టపడ్డాం. నాకు మైక్ పట్టుకుని మాట్లాడమే నచ్చదు. జగదీష్ నాకు ఏదో ఒక షాట్‌తో పిచ్చెక్కించాడు. పెద్ద కెమెరామెన్ అవుతాడు. సినిమా మొత్తం పెయింటింగ్‌లా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ గురించి అందరూ బాగా చెప్పారు.. అతడు మరో బుడ్డి థ‌మ‌న్‌ కాబోతున్నాడు. సుధీర్ డైలాగ్‌లు చాలా రాశాడు.. గోదావరి జిల్లాల్లో మాటల మాదిరిగా అందరితో చెప్పించారు. తేజ మర్ని పైకి అలా కనిపిస్తున్నాడు గానీ.. పెద్ద ఫైర్ బ్రాండ్. షూటింగ్‌లో షేక్ ఆడించాడు. నేను నిజంగా భయపడ్డాను. మనం సెట్ అవుతామా అని అనుకున్నాను. చాలా ఫోర్స్ ఉన్న డైరెక్టర్. మహేష్, చైతన్య, చౌదరి, అమృత.. తేజ గురించి బాగా చెప్పారు. వాళ్లకు తేజ ఏ కథ చెప్పాడో తెలియదు గానీ.. సినిమా చూశాక నేను హీరోనా..? వీళ్లందరు హీరోలా..? అని అనిపించింది. ప్రతి ఒక్కరు ఇరగదీశారు. నాకు తెలిసి తేజ.. ప్రతి ఒక్క ఆర్టిస్టు దగ్గరకు వెళ్లి నువ్వే ఈ సినిమాకు హీరో అని చేయించి ఉంటాడు. చాలా హ్యాపీగా ఉంది.. ఈ సినిమాలో చాలా మంచి పెర్ఫామెన్స్‌లు చూస్తారు. నేను సినిమాల్లోకి ఉట్టి చేతులతో ఆర్ట్‌ను నమ్ముకుని వచ్చాను. నాకు ఈ రోజు చాలా ఆస్తి ఉంది. కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే ఆస్తి ఉంది. నా ఆస్తి నేను పరిచయం చేసిన నా డైరెక్టర్లు అందరూ. ఈ ఆస్తి వాళ్లు చేసే చేసే సినిమాలకు ఒక రేంజ్‌లకు వెళ్తుంది. మాదాపూర్, కొండాపూర్ దాటేసి.. రియల్ ఎస్టేట్ భూమ్ ఉన్న శంషాబాద్‌ వైపు వెళ్తున్నాను. నాకు దొరికే డైరెక్టర్లను నేను అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్లు ఏదో గొప్పగా చెప్పారు గానీ.. అంతా మేము  కలిసి పనిచేసిందే. గోదావ‌రి గురించి నేను చాలా గొప్పగా చెప్పగలను. అర్జున ఫల్గుణ మొత్తం గోదావరి జిల్లాల్లోనే షూట్ చేశాం. ఒకటి రెండు పర్సెంట్ తప్ప. అందరూ కూడా కాలర్ ఎగరేసి ఇదిరా మా గోదావరి జిల్లాలు అని చెప్పుకొంటారు. నేను ఎప్పుడు కథనే  సినిమాగా చేశాను. నా ఫ్రెండ్స్ కామెడీ, ఫ్యామిలీ, బాయ్ నెక్స్ట్ డోర్ సినిమాలు చేయమని చెప్పేవారు. మాస్ సినిమాలు వద్దనే వారు. డిసెంబర్ 31 తర్వాత మీరు చెప్పండి నేను మాస్ సినిమాలకు పనికి వస్తానో రానో మీరు నిజాయితీగా చెప్పండి. సినిమాలో మేము జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. బయట తేజ జూనియర్‌కు పెద్ద ఫ్యాన్. అందరికి కోస్తే రక్తం వస్తుంది.. కానీ తేజకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారు. ఆయన పేరు చెబితేనే తేజ ముఖం వెలిగిపోతుంది. సినిమా చూస్తే మేము కష్టపడి చేశామో లేదో మీకే తెలుస్తోంది. అందరూ థియేటర్లకు వచ్చి చూడండి. 10 నిమిషాలకే గోదావరి జిల్లాలకు వెళ్లిపోతారు. 15 నిమిషాలకే కథలోకి వెళ్లిపోతారు అక్కడి నుంచి గోదావరి  జిల్లాలో  కనిపించే మంచి మనుషుల మనసులు, అమాయకత్వాలు, సంప్రదాయాలు ఇవన్నీ కనిపిస్తాయి. చాలా అట్రాక్ట్ అవుతారు. ఈసారి సంక్రాంతి పండగ డిసెంబర్ 31 నుంచి జనవరి 15 వరకు ఉంటుంది.  మల్కల్ లంక అనే ఊరు వాళ్లు చాలా సపోర్ట్ చేశారు. ఆ ఊరు ఈ సినిమాతో ఫేమస్ అవుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగా చేపించారు. ఐదుగురు అమాయకులు, మంచి మనుసులున్న వ్యక్తుల వైన్ షాపు ఫ్రెండ్ షిప్. ఐదుగురు అమాయకులు చిన్న ఇదిలో ఇరుక్కుని ఎలా బయటపడ్డారనేది ఈ సినిమా. సినిమాలో చాలా చోట్ల పునకాలు వచ్చే ఎపిసోడ్లు ఉంటాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటారు. ఈ సినిమా ద్వారా నేను కూడా చాలా నేర్చుకున్నాను.`` అన్నారు.

Kinnerasani Trailer Launched

 సంద‌డిగా సాగిన "కిన్నెరసాని" ట్రైలర్ లాంచ్, జ‌న‌వ‌రి 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న కిన్నెర‌సాని



సాయి రిషిక ప్రజెంట్ ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్, శుభం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కళ్యాణ్ దేవ్, మహతి బిక్షు,కశిష్ ఖాన్, శీతల్ నటీనటులు గారమణ తేజ దర్శకత్వంలో రజినీ తాళ్లూరి, రవి చింతల సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం "కిన్నెరసాని" ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాదులో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో


చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. 


సాయి తేజ్ నాకు ఈ కథను రెండు సంవత్సరాల క్రితమే చెప్పాడు.ఇది కాక చాలా కథలు చెప్పినా కూడా నాకు ఈ కథే నాకు కనెక్ట్ అవ్వడంతో ఇంతకు ముందు చేసిన సినిమల్లా కాకుండా ఈ కథను చాలా సార్లు రివిజన్ చేసుకుని ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశాను.ఇందులో ఐదు కథలు ఉంటాయి.ఐదు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్లే ఇందులో ఎవరు హీరో,ఎవరు హీరోయిన్, విలన్ అని చెప్పలేము కథే హీరో. ఇటువంటి కథను యాక్సెప్ట్ చేసి అందుకు హీరోలు కూడా సిద్ధంగా ఉండి ఆ కథను ఇష్టపడి చెయ్యాలి అప్పుడే సినిమా బాగా వస్తుంది. అలాగే అందరూ కూడా ఎంతో ఇష్టపడి చెయ్యడంతో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మా ఈ కష్టానికి రమణ తేజ్ ఇచ్చిన ఆవుట్ ఫుట్ కు మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము.ఇప్పటి వరకు నేను ఐదు సార్లు చూశాను నా హార్ట్ కు నచ్చింది.ఈ మూవీ ని ఒకజ జీ5 వారికి మాత్రమే చూయించాను చూసిన వెంటనే వారు అగ్రిమెంట్ చేసుకుందామని చెప్పడంతో నాకు ఇంకా ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది. మొదటి సారి నేను ఈ సినిమాను ఓటిటి లో విడుదల చేద్దామను కున్నాను అని వారితో అంటే వారు వద్దు ఇటువంటి మూవీ బిగ్ స్క్రీన్ పైన రావాలని  చెప్పడంతో వారు ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ తొ ఈ మూవీ ను జనవరి 26 న విడుదల చేస్తున్నాము.అలాగే నేను యాంగ్ టీం తో వర్క్ చేయాలని కొత్తవారికి అవకాశం ఇస్తున్నాను.త్వరలో నేను రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాను.ఈ సినిమాలకు ఇద్దరు కొత్త దర్శకులను పరిచయం చేస్తున్నా ను. ఒక పెద్ద స్టార్ వారిని ఎంకరేజ్ చేయబోతున్నాడు. సంక్రాంతి కి అనౌన్స్ చేస్తున్నాము. ఇందులోని ఒక స్క్రిప్ట్ ద్వారా 52 మంది కాస్ట్ ,క్రూ ను ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్నాము అని అన్నారు.



చిత్ర దర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ.. 


సాయి తేజ్ మంచి కథతో నన్ను సెలెక్ట్ చేసుకొన్నందుకు ధన్యవాదాలు. 

ఇప్పటి వరకు స్టోరీ అంటే మిస్టరీ థ్రిల్లర్ వంటి మార్క్ వచ్చే కథలు చూసుంటారు.ఇది బ్యూటీఫుల్ లవ్ స్టొరీ.ఇందులో లాట్స్ ఆఫ్ మిస్టరీ ఉంటుంది.సాయితేజ్ స్క్రీన్ ప్లే బిగ్ హైలెట్ అవుతుంది.ఈ సినిమాకు నేను డైరెక్ట్ చేయాలని నన్ను బెలీవ్ చేసినందుకు నిర్మాత రామ్ తాళ్లూరి కి ధన్యవాదాలు. ఈ సినిమాకు విజువల్స్ చాలా ఇంపార్టెంట్  కాంప్రమైజ్ కాకుండా చేశాడు దినేష్. సాగర్ మంచి బిజియం ఇచ్చారు.ఇంతకుముందు సాగర్ దగ్గర ఇలాంటి మ్యూజిక్ చూడలేదు. జోహార్ కు వర్క్ చేసిన అన్వర్ ఈ సినిమాకు ఎడిటింగ్ టెర్రిఫిక్ గా చేశాడు.ఇలా ప్రతి టెక్నిసిషన్స్ చాలా కష్టపడ్డారు. కళ్యాణ్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. హీరోయిన్లు చాలా చక్కటి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ట్రైలర్ లో మీరు చూసింది 5 % మాత్రమే ఉంది. ఇంకా సినిమాలో చాలా కథ ఉంది.రియల్ స్విచ్ఛవేషన్ లోని ఎమోషన్స్ ను ఇందులో చూయించడం జరిగిందీ.జనవరి 26 న వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు. 


రైటర్ సాయి తేజ్ మాట్లాడుతూ.. 


కథ కంటే కథనం బగుండాలని యూనిక్ గా రాసుకున్నాను కిన్నెరసాని . రమణ తేజ్ ఎమోషన్ ను చాలా బాగా క్యారీ చేస్తాడు. ఇందులో కథే హీరో, విలన్ గా రవీంద్ర విజయ్ చేశాడు., అందరూ టెక్నిసిషన్స్ అందరూ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. నటీనటులు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఒక టైం లో నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలను కున్నప్పుడు రాం తాళ్లూరి గారు నేను సినిమా తీస్తాను.నువ్వు కథ రాయమని సపోర్ట్ ఇచ్చాడు.కల్కి కంటే ఈ కిన్నెరసాని బాగా వచ్చింది.జనవరి 26 న వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు. 


చిత్ర నిర్మాత రవి మాట్లాడుతూ.. 


ఇది నా మొదటి చిత్రం సాయి తేజ్ దగ్గర ఈ కథ వినగానే కథ నచ్చింది.వెంటనే ఈ మూవీ చెయ్యడానికి ముందుకు వచ్చాము. ఈ సినిమాకు పనిచేసిన కాస్ట్ & క్రూ అందరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది అన్నారు. 


 సినిమాటోగ్రఫర్ దినేష్ మాట్లాడుతూ..


నాకు దర్శక, నిర్మాతలు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ బ్యానర్ లో చాలా కంఫర్ట్ గా ఉంది. మేమంతా ఈ వినిమాను ఎంజాయ్ చేస్తూ చేశాము అన్నారు. 


రవీంద్ర విజయ్ మాట్లాడుతూ.. 


ఇలాంటి సైకో కథ రాయడం చాలా కష్టం.ఈ సినిమా ద్వారా నాకు చాలా మంది ఫ్రెండ్స్ దొరికారు.బ్యూటీఫుల్ సినిమా ఇది .అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు. 


నటి కశిష్ ఖాన్ మాట్లాడుతూ.. 


సినిమా చాలా బాగా వచ్చింది. కళ్యాణ్ దేవ్ చాలా సపోర్ట్ చేశారు.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు, ధన్యవాదాలు అన్నారు. 


నటి మహతి బిక్షు మాట్లాడుతూ.. 


ఇలాంటి మంచి సినిమాలో నేను చేసినందుకు చాలా లక్కీ.. నా కెరీర్ లో గుర్తుండి పోయే సినిమా ఇది.. చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.



నటి శీతల్ మాట్లాడుతూ.. 


తేజ నాకు ఫోన్ చేసి బ్యూటీఫుల్ స్టోరీ చెప్పాడు.ఈ కథా నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు, ధన్యవాదాలు అన్నారు.



ఎడిటర్ అన్వర్ మాట్లాడుతూ..


ఇలాంటి ఎంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాకు పనిచేదిండుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.



నటీనటులు కళ్యాణ్ దేవ్, మహతి బిక్షు, కశిష్ ఖాన్, శీతల్ 


బ్యానర్ :ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ ,శుభం ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ :రామ్ తాళ్ళురి 

ప్రజెంట్ :సాయి రిషిక 

నిర్మాతలు : రజినీ తాళ్లూరి రవి చింతల 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ; జే విద్యాసాగర్ 

డైరెక్షన్ : రమణ తేజ 

రైటర్ : సాయి తేజ 

మ్యూజిక్ : మహతి స్వర సాగర్ 

సినిమాటోగ్రఫీ : దినేష్ కె బాబు 

ఎడిటింగ్ : అన్వర్ అలీ 

లిరిసిస్ట్ : కిట్టు విశ్వ ప్రగడ 

కాస్ట్యూమ్ డిజైనర్ : కీర్తి వాసం 

సౌండ్ డిజైన్ : సింగ్ సినిమా 

ఏవో : ప్రణీత్ అడబాల 

విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ : నాగు తలారి 

పి ఆర్ వో - ఏలూరు శీను & మేఘశ్యామ్

Sundarangudu Releasing in January

 కృష్ణ సాయి ఇన్ అండ్ యాజ్

"సుందరాంగుడు" వస్తున్నాడు!!



     కృష్ణసాయి టైటిల్ పాత్రలో చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్-ఎమ్.ఎస్.కె.ప్రమీదశ్రీ ఫిలిమ్స్ పతాకాలపై ఎమ్.ఎస్.రాజు-చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "సుందరాంగుడు". వినయ్ బాబు దర్శకత్వం వహించిన ఈ వినూత్న ప్రేమకథాచిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి మూడోవారంలో విడుదలకు సిద్ధమవుతోంది. మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ ఈ చిత్రంలో హీరోయిన్లు.

      ఈ సందర్భంగా నిర్మాతలు ఎమ్.ఎస్.రాజు-చందర్ గౌడ్ మాట్లాడుతూ..."మా హీరో కృష్ణ సాయి చాలా అద్భుతంగా నటించాడు. హీరోగా తనకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంది.

అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే చిత్రం "సుందరాంగుడు". రామోజీ ఫిల్మ్ సిటీ, గోవాలోని అత్యద్భుత లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలు "సుందరాంగుడు" చిత్రానికి ప్రధానాకర్షణ" అని అన్నారు.

      జీవా, భాషా, అమిత్ తివారి, జూనియర్ రేలంగి, మిర్చి మాధవి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఫైట్స్: రామ్ సుంకర-అశోక్ రాజ్, మ్యూజిక్: సిద్ధబాబు, కెమెరా: వెంకట్ హనుమాన్, ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాతలు: ఎమ్.ఎస్.రాజు-చందర్ గౌడ్, దర్శకత్వం: వినయ్ బాబు!!

Telugu Distributors Council Thanked AP Government

 ఏపీ ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన తెలుగు డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్.



ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట క‌లిగింది. సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఒపెన్ చేసేందుకు  అనుమ‌తినిచ్చిన ప్ర‌భుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. 


ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ త‌ర‌పున కొన్ని విన్న‌పాలు చేసుకోవ‌డం జ‌రిగింది. అందులో మొద‌టగా థియేట‌ర్స్ రీ ఒపెనింగ్ కి అనుమతి నిచ్చిన ఆంధ్ర‌ప్ర‌ధేశ్ ముఖ్య‌మంత్రి గౌర‌వ‌నీయులు శ్రీ వై.ఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిగారికి, సినిమాటోగ్ర‌ఫి మంత్రి వర్యులు శ్రీ పేర్ని నాని గారికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్  తరపున కృత‌జ్ఞ‌త‌లు. మిగ‌తా విన్న‌పాల ప‌ట్ల కూడా సానుకూలంగా స్పందించి మ‌మ్మ‌ల్ని ఆదుకుంటార‌ని ఆశిస్తున్నాము అని తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ ఆశాభావం వ్యక్తం చేసింది.

UREKAA SAKA MIKA Releasing on December 30th

 డిసెంబర్ 30న 'యురేకా సకా మికా' రిలీజ్ 



బ్లాక్ పెప్పర్ స్క్రీన్స్ బేనర్ లో సాకేత్ సాయిరాం దర్శకత్వంలో డాలీభట్ నిర్మించిన చిత్రం 'యురేకా సకా మికా'. శ్రీధర్, అవంతి జంటగా నటించిన ఈ చిత్రానికి సాకేత్ సాయిరాం సంగీతం మరియు దర్శకత్వం వహించడంతో పాటు విలన్ గా కూడా చేశారు. మరో ముఖ్య పాత్రలో కావ్య సింగ్ నటించారు. ఈ చిత్రాన్ని హంగామా, క్లిడ్ వాకర్, ఎయిర్ టెల్ ఏక్సట్రీమ్, సోనీ, టాటా స్కై, టి.సి.ఎల్, వీ.ఐ, నెట్ ప్లస్, జీ, వన్ ప్లస్, ఎంఐ, ఎల్ జి, అమెజాన్(us,uk) తదితర 20 ప్లాట్ ఫామ్స్ లలో విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా చిత్ర 

దర్శకుడు సాకేత్ సాయి రామ్ మాట్లాడుతూ..బేసిక్ గా నేను మ్యూజిక్ డైరెక్టర్ ని.. తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా ఇండస్ట్రీ కు పరిచయమయ్యాను.నేను మ్యూజిక్ దర్శకుడు గా చేసిన "1940 లో ఒక గ్రామం" సినిమాకు నేషనల్ అవార్డు, మ్యూజిక్ కు స్టేట్ అవార్డు వచ్చింది. తరువాత సొంతూరు,హైస్కూల్ వంటి ఎన్నో సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. సుమారు 32 సినిమాలు చేసినా కూడా సరైన గుర్తింపు రాకపోవడంతో దర్శకుడు అయ్యి మంచి సినిమాలు తీయాలనే కొరికతో  దర్శకుడు అవ్వాలని నేను డైరెక్టర్ గా డెమో చేశాను.నా డెమో చూసిన నిర్మాత డాలీ బట్ "అనుకున్నదొక్కటి అయినదొక్కటి" సినిమాకు అవకాశం ఇచ్చారు.తరువాత 'యురేకా సకా మికా' చిత్రం సైకో పాథక్ థిల్లర్ కాదాంశం తో రూపొందింది. కథకు తగిన కామెడీ కూడా తోడు అవటం తో 'యురేకా సకా మికా'  ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ చిత్రం లో 5 పాటలు వున్నాయి. 'యురేకా సాక మికా' హర్రర్ కావటంతో రీ-రికార్డింగ్ కూడా హైలెట్ గా నిలుస్తుంది. కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంట్లోకి ఇద్దరు దొంగలు ప్రవేశించి అతనిని ఎంతో టార్చెర్ చేసి దొంగతనం చేసి వెళ్లి పోతారు. ఆ తరువాత కృష్ణమూర్తి, క్రిష్ గా సైకోపాథిక్ గా మారి వారికి ఎలాంటి గుణపాఠం చెప్పాడు అన్నదే 'యురేకా సకా మికా'  చిత్ర కథాంశం అన్నారు. 

నిర్మాత డాలీభట్ మాట్లాడుతూ.. చిత్ర నిర్మాత డాలీభట్ మాట్లాడుతూ..అనుకున్నదొక్కటి అయినదొక్కటి సినిమా తర్వాత నేను చేస్తున్న రెండవ సినిమా 'యురేకా సకా మికా'..  తెలుగులో చాలా సినిమాలు వున్నా ఇది  డిఫరెంట్ కాన్సెప్ట్. ఇందులో హీరో,హీరోయిన్స్ లేరు క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి.. కావ్య సింగ్ ఇందులో చాలా చక్కగా నటించింది.ఇంకొక నటి. అవంతిక కూడా చాలా చక్కగా నటించింది. మా చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్ గా పరిచయమైన ప్రవీణ్ రెడ్డి ఆ తరువాత కే.జి.యఫ్, కాలా, మహాసముద్రం, రొమాంటిక్ వంటి భారీ చిత్రాలకు పనిచేయటం,అలాగే మా  చిత్రం లో నటించిన ఆర్టిస్టులు కూడా ఎంతో బిజీ గా ఉండడం మాకు ఎంతో గర్వకారణం. ఇందులోని పాటలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. ఈ సినిమా చాలా మంచి ఔట్ ఫుట్ వచ్చింది. ఫ్రెష్ జానర్ తో వస్తున్న ఇలాంటి మూవీస్ కు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.ఈ నెల 30 న 20 ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లలో  హంగామా, క్లిడ్ వాకర్, ఎయిర్ టెల్ ఏక్సట్రీమ్, సోనీ, టాటా స్కై, టి.సి.ఎల్, వీ.ఐ, నెట్ ప్లస్, జీ, వన్ ప్లస్, ఎంఐ, ఎల్ జి, అమెజాన్(us,uk) తదితర 20 ప్లాట్ ఫామ్స్ లో 'యురేకా సకా మికా'  సినిమా డిసెంబర్ 30 నుండి ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా, ఎక్కడైనా ఈ సినిమా చూడవచ్చు అన్నారు. 

ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్ రాజీవ్ మాట్లాడుతూ.. ఇది 20 ఫ్లాట్ ఫార్మ్ లలో .ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 30 న స్ట్రీమింగ్ అవుతుంది.. మా ఈస్ట్ వెస్ట్ లో  మేము రిలీజ్ చేస్తున్న  400  సినిమా.ప్రస్తుతం తెలుగు భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది.ప్రతి 15 రోజులకు ఒక లాంగ్వేజ్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాము. ఈ.చిత్ర దర్శక నిర్మాతల ఇలాంటి మంచి ప్రాజెక్ట్ లు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. 

నటీనటులు: 

శ్రీధర్, అవంతి, సాకేత్ సాయిరాం, కావ్య సింగ్, ఆకెళ్ళ గోపాల కృష్ణ, విరాజ్, రామ కృష్ణ, స్వాతి నాయుడు, గోయెల్ తదితరులు. 

సాంకేతిక నిపుణులు: 

కథ- స్క్రీన్ ప్లే-సంగీతం- దర్శకత్వం: సాకేత్ సాయి రామ్, నిర్మాత: డాలీభట్, సినిమాటోగ్రాఫర్: రాము-ప్రవీణ్ రెడ్డి, ఎడిటర్: గోపి సిందం, కొరియోగ్రఫీ: రంజిత్, పాటలు: సాగర్ నారాయణ, వీరేంద్ర ఈమని, శ్రీ మురళి, షేక్ మీరా, సునీల్ వంచ, మాటలు: టి.ఆనంద్ కృష్ణ, శ్రీధర్.

Vijay Deverakonda Puri Jagannadh LIGER (Saala Crossbreed) BTS Stills Out

 Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Pan India Film LIGER (Saala Crossbreed) BTS Stills Out



Pan India star Vijay Deverakonda and dashing director Puri Jagannadh’s maiden Pan India project LIGER (Saala Crossbreed) is making huge noise for many reasons and one of the main being Dynamite Mike Tyson being part of it.


Team Liger is offering multiple delicious treats for movie buffs, ahead of New Year. Yesterday, they released a video to make announcement on Glimpse of the movie that will be out tomorrow at 10:03 AM.


Today, they have release two BTS stills. While one picture shows Vijay Deverakonda focussing camera lens, the other shows Puri Jagannadh briefing the star about a scene to be shot. The makers definite these two stills as focus and attack.


A special Insta Filter will be unveiled today at 4 PM.


Ananya Pandey is playing the leading lady. In association with Puri connects, the film is being produced jointly by Bollywood's leading production house Dharma Productions. Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film on a grand scale.


The film in the crazy combination has cinematography handled by Vishnu Sarma, while Kecha from Thailand is the stunt director.


Ramya Krishnan and Ronit Roy play prominent roles in Liger which is being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages.


The Pan India Movie is ready to splash its blood, sweat and entertainment, as it is releasing in theatres worldwide on 25th August, 2022.

Oke Oka Jeevitham Teaser Launched

ఒకే ఒక జీవితం లైఫ్ లాంగ్ నా సినిమా అని చెప్పుకునేలా ఉంటుంది - హీరో శర్వానంద్



యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లె మైల్ స్టోన్ లాంటి చిత్రాన్ని చేయబోతోన్నారు. కెరీర్‌పరంగా 30వ సినిమాగా ఒకే ఒక జీవితం అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైఫై సినిమాకు తరుణ్ భాస్కర్‌ మాటలను అందించారు. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించారు. బుధవారం నాడు ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ..


సతీష్ మాట్టాడుతూ.. ‘ఈ సినిమాలో పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా యూనిట్ అందరికి చాలా థాంక్స్. అందరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు..


తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘కొన్ని ప్రాజెక్ట్‌లు కేరీర్ కోసం చేస్తాం. కానీ పెళ్లి చూపులు చేసినప్పుడు మా నాన్న కోసం తీశాను. చాలా శ్రద్దగా, నిజాయితీగా చేశాను. మళ్లీ ఇలా అనిపించింది శ్రీ కార్తీక్ సినిమాలోనే. ఇది వాళ్ల అమ్మ కోసం తీశాడు. ఈ సినిమా మనందరికి టచ్ అవుతుంది. ఆయన రాసిని ప్రతి ఒక్క లైన్‌లో డెడికేషన్, మోటివేషన్ ఉంది. అతని తల్లిపై చూపించిన ప్రేమ.. ఈ సినిమాలో స్టార్. ఈ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అందరికి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.


ఎడిటర్ శ్రీ జిత్ మాట్లాడుతూ.. ‘అవుట్‌ పుట్ చాలా బాగొచ్చింది. ప్రొడ్యూసర్స్‌కు చాలా థాంక్స్. శ్రీ కార్తీక్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.


డివోపీ సుజిత్ మాట్లాడుతూ.. ఇది శ్రీ కార్తీక్ కల. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అమల గారు, శర్వనంద్ గారితో కలిసి పని చేయడం అదృష్టం’ అని అన్నారు..


జేక్స్ బిజోయ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా మాకు చాలా ప్రత్యేకమైనది. శ్రీ కార్తీక్ నా జర్నీ 9 ఏళ్ల ప్రారంభమైంది. అమ్మ పాట చాలా ప్రత్యేకమైంది. ఈ పాటను కంపోజ్ చేసినప్పుడు.. శ్రీ కార్తీక్ అమ్మ గారు నాకు చెప్పినట్టుగా అనిపించింది. అమల గారికి ,శర్వానంద్ గారికి చాలా థాంక్స్. అందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నారు’ అని అన్నారు..


ఎస్‌ఆర్ ప్రభు మాట్లాడుతూ.. ‘అంతా ఫ్యామిలీగా కలిసి పనిచేశాం. స్ట్రిప్ట్ చెప్పినప్పుడే.. ఇది అందరికి నచ్చుతుందని అనుకున్నాం. సినిమా విడుదల చేయడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం’ అని అన్నారు..


అమల అక్కినేని మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో అందరికి అమ్మను అయిపోయాను. ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. స్టోరి చెప్పినప్పుడు.. నేను ఈ పాత్రను చేయాలని అనుకున్నాను. మిగిలిన సినిమాలు చేసిన చేయకపోయినా.. ఈ పాత్ర చాలు అనిపించింది. శ్రీ కార్తీక్ ఎంత కష్టపడ్డాడో అంత మంచి పేరు వస్తుంది. సినిమా కోసం పనిచేసిన అందరికి థాంక్స్. తప్పకుండా ఈ సినిమా మీరు ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.


శర్వానంద్  మాట్లాడుతూ.. ‘ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఉన్నది ఒకే ఒక జీవితం అందరూ ఎంజాయ్ చేయండి. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి.. ఇప్పుడే మొత్తం మాట్లాడలేను. ఇది నా సినిమానో, శ్రీ కార్తీక్ సినిమానో కాదు.. ఇది వాళ్ల అమ్మ సినిమా. సినిమా నరేషన్ అప్పటి నుంచి ఆమె మా వెనకాల నుంచి నడిపిస్తోంది. ఈ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం నాకు ఇచ్చినందుకు ప్రభుకు థాంక్స్. ఇది లైఫ్ లాంగ్ నా సినిమా అని చెప్పుకునే సినిమా. జేక్స్ బిజోయ్ అన్ని సాంగ్స్ ఇరగొట్టాడు. ముఖ్యంగా అమ్మ పాట గురించి చెప్పాలి. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి.. 9 నెలల పాటు రాశారు. దురదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు మన మధ్యలేరు. కానీ పాటల్లో ఎప్పుడూ జీవించే ఉంటారు. ఈ స్టోరి చెప్పగానే అమల గారు చేస్తున్నారా అని అడిగాను. నేను ఈ పాత్రలో ఆమెను మాత్రమే ఊహించుకున్నాను. ఈ సినిమాకు ఆత్మ అమల గారి పాత్ర. ఈ పాటను రిలీజ్‌ చేయడం లేదు. ఒక చిన్న ఈవెంట్ చేసి.. కుదిరితే శాస్త్రి గారి అమ్మగారిని, అమల గారి అమ్మగారిని, మా అమ్మగారిని పిలిచి ఈ వేడుకలో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం’ అని అన్నారు.


దర్శకుడు శ్రీ కార్తీక్ మాట్లాడుతూ.. ‘ముందు ఒక కథను రాశాను. కానీ అందులో ఎమోషన్ కనిపించలేదు. తరువాత మా అమ్మ చనిపోయారు. అప్పుడు మళ్లీ కథ రాసేందుకు కూర్చున్నాను. అమ్మను మళ్లీ చూడాలని అనిపించింది. అమ్మని చూడాలని రాసిన ఒక్క సీన్.. అలా పెరిగి ఒకే ఒక జీవితం సినిమాగా మారింది. నిర్మాత ఎస్ ఆర్ ప్రభు సర్ దొరకడం అమ్మ ఇచ్చిన ఆశీర్వాదం. నా అమ్మను మళ్లీ చూడాలనేది నా కోరిక. నాకు ఓ హీరో కూడా కావాలి. ఇందులో స్ట్రాంగ్ ఎమోషనల్ ఉందని తెలుగులోనే ఈ సినిమా చేయాలని అన్నారు. మా అమ్మకు తెలుగు సినిమాలు, పాటలు అంటేనే ఇష్టం. అందుకే మా అమ్మ నాకు శర్వానంద్‌న చూపించారు. శర్వా నటించినప్పుడు నన్ను నేను చూసుకున్నాను. శర్వా మిమ్మల్ని కచ్చితంగా ఏడిపిస్తాడు. 90వ దశకంలోకి మీ అందరినీ తీసుకెళ్తాడు. ఈ పాత్ర రాసినప్పుడే అమల గారు చేయాలని అనుకున్నాను. కానీ ఆమె తిరిగి నటిస్తారా? లేదా? అని నేను ఆలోచించలేదు. ఆమెకు కథ వినిపించాను. ఆడియెన్‌లా విన్నారు. సెట్‌లో నేను మా అమ్మను చూశాను. నేను ఆమెను అమ్మా అని పిలుస్తాను. ఎమోషన్స్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రీతూ, నాజర్ సర్ ఇలా ప్రతీ ఒక్కరూ అద్భుతంగా చేశారు. నా టీం అంతా కూడా కలిసి ఆరేళ్లు ప్రయాణం చేశాం. ఇది ఫీల్ గుడ్ సినిమాల మిగిలిపోతుంది. చెన్నై తెలుగులో డైలాగ్స్ రాస్తే మీరు తిడతారు అని.. తరుణ్ భాస్కర్‌ను అనుకున్నాను. పెళ్లి చూపులు సినిమా చూసి ఆశ్చర్యపోయాను. తరుణ్ భాస్కర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయనలో నన్ను చూసుకున్నాను’ అని అన్నారు

Shekhar Kammula Thanked Minister Harish Rao

 వైద్యారోగ్య శాఖా మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన దర్శకుడు శేఖర్ కమ్ముల



వరంగల్ కు చెందిన యువకుడు హర్షవర్ధన్ కు అత్యవసర వైద్యం అందించడంలో చొరవ చూపించిన తెలంగాణ వైద్యారోగ్య శాఖా మంత్రి హరీష్ రావుకు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపారు. గత మూడేళ్లుగా శేఖర్ కమ్ముల సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయనకు నిత్యం ఎవరో ఒకరి దగ్గర నుంచి అత్యవసర వైద్య చికిత్స కేసులు వస్తున్నాయి. 


తాజాగా వరంగల్ కు చెందిన హర్షవర్థన్ అనే యువకుడు క్రాన్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ శేఖర్ కమ్ముల సహయాన్ని కోరారు. శేఖర్ కమ్ముల వెంటనే ఈ యువకుడి పరిస్థితిని మంత్రి హరీష్ రావు దృష్టికి  తీసుకొచ్చారు. తక్షణమే స్పందించిన హరీష్ రావు నిమ్స్ లో హర్షవర్ధన్ కు చికిత్స అందించేలా ఆదేశాలు ఇచ్చారు. అడిగిన వెంటనే స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన హరీష్ రావుకు సోషల్ మీడియా ద్వారా దర్శకుడు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపారు. హరీష్ రావు గారిని ప్రజల మంత్రి అని పిలిచేందుకు ఇలాంటి ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చని శేఖర్ కమ్ములు తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Raashi Khanna Anthahpuram Releasing on December 31st

 అంతఃపురం'లో రాశీ ఖన్నా ఎందుకు భయపడుతోంది? ఈ నెల 31న తెలుసుకోండి!



అనగనగా ఓ 'అంతఃపురం'. రాజ భవనంలా ఉంటుంది. అందులో ఓ అమ్మాయి ఉంది. యువరాణికి ఏమాత్రం తీసిపోదు. 'అంతఃపురం'లో అమ్మాయి యువరాణిలా కనిపించాలనే ఏమో... రాశీ ఖన్నాను దర్శకుడు సుందర్ .సి ఎంపిక చేశారు. ఆమెను అందాల బొమ్మలా చూపించారు. 'అంతఃపురం'లో సకల సౌకర్యాలు ఉన్నాయి. కానీ, ఆ అమ్మాయి మాత్రం భయపడుతోంది. ఎందుకు? ఏమిటి? అనేది తెలియాలంటే డిసెంబర్ 31న విడుదల అవుతున్న 'అంతఃపురం' సినిమా చూసి తెలుసుకోవాలి. తెలుగులో హిట్ సినిమాలు చేసిన రాశీ ఖన్నా... ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ చేశారు. ఆల్రెడీ రిలీజైన ట్రైల‌ర్‌, సాంగ్స్‌లో అందంగా, అదే సమయంలో అభిన‌యానికి ఆస్కార‌మున్న పాత్ర చేశార‌ని తెలుస్తోంది. రాశీ ఖన్నా స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


రాశీ ఖన్నా ఓ కథానాయికగా, ఆర్యకు జంటగా నటించిన తమిళ సినిమా 'అరణ్మణై 3'. సుందర్ .సి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఇందులో ఆండ్రియా మరో కథానాయిక. ఇందులో సాక్షి అగర్వాల్, వివేక్, యోగిబాబు, మనోబాల ప్రధాన తారాగణం. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమా తమిళనాట మంచి విజయం సాధించింది. తెలుగులో 'అంతఃపురం' పేరుతో గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ విడుదల చేస్తోంది. రెడ్ జెయింట్ మూవీస్ ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో, అవని సినీమాక్స్ ప్రై.లి. ఖుష్బూ సమర్పణలో, బెంజ్ మీడియా ప్రై.లి. ఎ.సి.ఎస్. అరుణ్ కుమార్ సమర్పణలో సినిమాను విడుదల చేస్తోంది.


సుందర్ సి మాట్లాడుతూ "మా 'అరణ్మణై' ఫ్రాంచైజీలో వచ్చిన తొలి రెండు చిత్రాలు తెలుగులో 'చంద్రకళ', 'కళావతి'గా విడుదలై విజయాలు సాధించాయి. ఇప్పుడీ 'అంతఃపురం' కూడా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. ఇందులోని హారర్, కామెడీ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటాయి. విజువల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటుందీసినిమా. 'అంతఃపురం'లో‌ గ్రాండియర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నెల 31న సినిమా విడుదల చేస్తున్నాం" అని అన్నారు.


ఈ చిత్రానికి ఎడిటింగ్: ఫెన్నీ ఒలీవర్, యాక్షన్: పీటర్ హెయిన్, సినిమాటోగ్రఫీ: యు.కె. సెంథిల్ కుమార్, మాటలు: ఎ. శ్రీనివాస మూర్తి, పాటలు: భువన చంద్ర, రాజశ్రీ సుధాకర్, నేపథ్య గానం: ఎస్పీ అభిషేక్, మ్యూజిక్: సత్య సి, సమర్పణ: ఉదయనిధి స్టాలిన్, ఎ.సి.ఎస్. అరుణ్ కుమార్, ఖుష్భూ, రచన, దర్శకత్వం: సుందర్ .సి.

Detective Satyabhama Movie Release Pressmeet

 ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి ఈ నెల 31 న వస్తున్న సోని అగర్వాల్‌  ‘డిటెక్టివ్‌ సత్యభామ’



 సిన్మా ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై  శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్‌ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్‌ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్‌ సత్యభామ’. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల డిసెంబర్ 31న సుమారు 500 థియేటర్స్ లలో విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్, టీజర్, పాటలను చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్  విడుదల చేశారు. డిటెక్టివ్‌ సత్యభామ చిత్రం లోని ట్రైలర్ ను నిర్మాత పోలెమోని శ్రీశైలం విడుదల చేశారు.  అలాగే ఇందులోని మొదటి పాటను  రాజ పోలెమోని విడుదల చేయగా, నటి సునీత పాండే రెండవ పాటను, సినీ పి.ఆర్.ఓ ఆర్.కె. చౌదరి మూడవ పాటను, నటి శివ జ్యోతి  నాలుగవ పాటను, నటుడు మురళి ఐదవ పాటను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో_


 చిత్ర నిర్మాత శ్రీశైలం పోలెమోని మాట్లాడుతూ ..  ప్రతి ఒక్కరూ నా సినిమా అనుకోని చాలా కష్టపడ్డారు.సోనీ అగర్వాల్ ఈ సినిమాలో చాలా చక్కగా నటించారు.7 జి బృందావనం చేసినప్పటి ఫ్యాన్స్ ఇప్పడు వస్తున్న ఈ సినిమా విడుదల కోసం ఇంకా ఎదురు చూస్తుండం గొప్ప విషయం.. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా అన్ని అంగులతో తీర్చి దిద్దాము. స్క్రీన్ మాక్స్  ప్రసాద్ గారు మా చిత్రాన్ని  విడుదల చేస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రపంచ వ్యాప్తంగా  ఈ నెల 31 న సుమారు 500 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.


     

 చిత్ర దర్శకుడు నవనీత్‌ చారి మాట్లాడుతూ .. సంగీత దర్శకుడుగా వర్క్ చేసిన నాకు నేను చెప్పిన కథను నిర్మాత శ్రీశైలం పోలెమోని నమ్మి నాకీ అవకాశం ఇచ్చారు. ఇందులో నటించిన వారంతా నేను అనుకున్న దానికంటే ఎక్కువ చేశారు. టెక్నిసిషన్స్ అందరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు.ఎవ్వరు ఎక్సెప్ట్ చెయ్యని ట్విస్ట్స్,టర్న్స్ ఇందులో ఉంటాయి. ఇందులోని పాటలు చాలా బాగుంటాయి..సోనీ అగర్వాల్ యాక్షన్స్ సీన్స్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటాయి.

సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఈ నెల 31 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుంది అన్నారు .


 డి.ఓ.పి లక్కీ మాట్లాడుతూ .. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. స్క్రీన్ మాక్స్ ద్వారా ప్రసాద్ గారు విడుదల చేస్తున్నారు.మాకు దర్శక,నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేసినందున ఈ సినిమా త్వరగా షూట్ కంప్లీట్ అయ్యింది. యూత్ కు కావాల్సిన అంశాలు అన్ని ఇందులో ఉంటాయి.


 నటి శివజ్యోతి మాట్లాడుతూ .. ఇది నా నాలుగవ సినిమా ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుంది. అందరం ఎంతో కష్టపడి చేశాము.ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.


 ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటించిన సునీత పాండే  మాట్లాడుతూ .. కార్పొరేటర్ తరువాత వస్తున్న మూడవ చిత్రమిది. "డిటెక్టీవ్ సత్యభామ'  వంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.


 మాటల రచయిత సంతోష్ ఇంగాని మాట్లాడుతూ .. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.


 నటుడు మురళి మురళి మాట్లాడుతూ. . మా నిర్మాతకు థియేటర్స్ లోనే విడుదల చేయాలని పట్టుబట్టి ఈ నెల 31 న విడుదల చేశారు.అందరం ఎంతో మంచి మనసుపెట్టి నటించాము. ఈ నెల 31 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని  ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.


 నటీ నటులు :

సోని అగర్వాల్‌, సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్‌, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్‌, భరత్‌ తదితరులు.


 సాంకేతిక నిపుణులు :

బ్యానర్‌ : సిన్మా ఎంటర్టైన్మెంట్‌

నిర్మాత : శ్రీశైలం పోలె మోని

సంగీతం`దర్శకత్వం: నవనీత్‌ చారి

కెమెరా&ఎడిటర్‌: లక్కీ ఏకరి

డైలాగ్‌ : సంతోష్ ఇంగాని

పి.ఆర్‌.ఓ : ఆర్‌.కె. చౌదరి

Pan India Film LIGER (Saala Crossbreed) First Glimpse Date And Time Locked

 Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Pan India Film LIGER (Saala Crossbreed) First Glimpse Date And Time Locked



Pan India star Vijay Deverakonda and dashing director Puri Jagannadh’s maiden Pan India project LIGER (Saala Crossbreed) that also marks Dynamite Mike Tyson’s debut in Indian cinema is nearing completion.


As part of promotions, the makers will be coming up with multiple updates. The Big Announcement video is out now and it announces the date and time of First Glimpse. The video begins with a voiceover and the makers announce, “Witness The Madness. Unleashing The Beast To The Nation… Glimpse On December 31st at 10:03 AM.”


On December 30th, we will have two special treats. While BTS Stills will be released at 10:03 AM, Special Insta Filter will be unveiled at 4 PM.


Liger is going to be one of the biggest action extravaganzas in India, as it deals with the subject of Mixed Martial Arts and moreover, it features Legend Mike Tyson in a mighty role.

In association with Puri connects, the film is being produced jointly by Bollywood's leading production house Dharma Productions. Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film on a grand scale.


The film in the crazy combination has cinematography handled by Vishnu Sarma, while Kecha from Thailand is the stunt director.


Ramya Krishnan and Ronit Roy play prominent roles in Liger which is being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages.


The Pan India Movie is ready to splash its blood, sweat and entertainment, as it is releasing in theatres worldwide on 25th August, 2022.


Benchmark Studios Proud To Welcome Mythri Movie Makers On Board For Sudheer Babu Aa Ammayi Gurinchi Meeku Cheppali

 Benchmark Studios Proud To Welcome Mythri Movie Makers On Board For Sudheer Babu, Mohanakrishna Indraganti’s Aa Ammayi Gurinchi Meeku Cheppali



Hero Sudheer Babu and director Mohanakrishna Indraganti’s third film together titled Aa Ammayi Gurinchi Meeku Cheppali is done with its shooting. The most happening actress Krithi Shetty is playing Sudheer Babu’s love interest in the film produced jointly by B Mahendra Babu and Kiran Ballapalli, while Gajulapalle Sudheer Babu presents it under Benchmark Studios.


Benchmark Studios is proud to welcome Tollywood’s leading production house Mythri Movie Makers on board for Aa Ammayi Gurinchi Meeku Cheppali which is tipped to be a romantic entertainer with a wonderful love story. The film is already carrying good buzz for the successful combination and appealing title. Now, Mythri Movie Makers being part of the project will be a big advantage for it.


The makers have also announced to release first look poster of the movie soon.


Vivek Sagar composes the music, while cinematography is handled by P G Vinda. Sahi Suresh and Marthand K Venkatesh look after art and editing departments respectively.


Avasarala Srinivas, Vennela Kishore, Rahul Ramakrishna, Srikanth Iyengar and Kalyani Natarajan are the other prominent cast in the film.


Cast: Sudheer Babu, Krithi Shetty, Avasarala Srinivas, Vennela Kishore, Rahul Ramakrishna and others.


Technical Crew

Writer, Director: Mohanakrishna Indraganti

Producers: B Mahendra Babu, Kiran Ballapalli

Presenter: Gajulapalle Sudheer Babu

Banner: Mythri Movie Makers, Benchmark Studios

Music Director: Vivek Sagar

DOP: P G Vinda

Art Director: Sahi Suresh

Editor: Marthand K Venkatesh

Lyrics: Sirivennela Seetharama Sastry, Rama Jogayya Sastry, Kasarla Shyam

Co -Director: Kota Suresh Kumar

PRO: Vamsi Shekar

Hero Sree Vishnu Interview About Arjuna Phalguna

 అర్జున ఫల్గుణలో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి -  హీరో శ్రీ విష్ణు



శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం అర్జున ఫ‌ల్గుణ‌. తేజ మార్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో హీరో శ్రీ విష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..


ఈ ఏడాది ఇది నా మూడో చిత్రం

ఈ ఏడాదిలో నాకు ఇది మూడో చిత్రం. రైటింగ్ స్కిల్స్, రైటర్స్‌ని నేను ఎక్కువ ఎంచుకున్నాను. కొత్త దర్శకులనే నేను ఎంచుకుంటూ వచ్చాను. మంచి కథతో దర్శకులు వస్తే.. అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను. నాకు మొదటి సారి తేజ మార్నిలో దర్శకుడు కనిపించాడు. బాగా హ్యాండిల్ చేయగలడని నాకు నమ్మకం కలిగింది. ఎమోషన్ సీన్స్ బాగా రాశాడు. ఎమోషనల్ హ్యాండిల్ చేయగలిగితే సినిమా వర్కవుట్ అవుతుంది. అందుకే సినిమాను ఓకే చేశాను. చాలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి నాకు షాక్ ఇచ్చాడు. 55 రోజుల్లో షూట్ చేయడం చాలా కష్టం. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు.


ఈ టైటిల్ అలా వచ్చింది

అర్జున ఫల్గుణ అనేది భారతంలోని టాపిక్. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటీ, కృష్ణ, విజయ, ఇలా ఓ పది పేర్లు తలుచుకుంటూ ధైర్యం వస్తుందని పురాణాల్లో చెప్పారు. కానీ రాను రాను అది అర్జున ఫల్గుణ వరకే చెప్పారు. ఉరుములు మెరుపులు పిడుగులు వస్తే అందరూ అర్జున ఫల్గుణ అని అనుకునేమనేవారు. కానీ కొన్ని పేర్లు విన్నప్పుడు, తలుచుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. అలా అర్జున ఫల్గుణ అనే పేరులో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ సినిమాకు ముందుగా వేరే పేరు అనుకున్నాం. కానీ అది కుదరలేదు. ఒకరోజు వర్షంలో కూర్చుని డైరెక్టర్, నేను మాట్లాడుకున్నాం. అలా ఈ టైటిల్ వచ్చింది.


చాలా ఫ్రెష్‌గా అనిపించింది

నన్ను తేజ కలిసినప్పుడు జోహార్ సినిమా ఇంకా రాలేదు. ఆర్టాస్ అనే కూల్ డ్రింక్ అనే పాయింట్ ఈస్ట్ వెస్ట్ వాళ్లకు మాత్రమే తెలుసు. నాకు ఇంకా అవి గుర్తున్నాయి. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్‌లో కథ చేయాలని అనుకున్నాను. ఊరి బ్యాక్ డ్రాప్‌లోంచి సిటీకి వచ్చిన కథలు చేశాను. కానీ మొత్తం ఊరి బ్యాక్ డ్రాప్‌లో చేయలేదు. ఇది చాలా ఫ్రెష్‌గా అనిపించింది. పూర్తి కథను సిద్దం చేయమని చెప్పాను.


ఐదుగురు కుర్రాళ్ల కథ

మేం ఐదుగురం ఫ్రెండ్స్. ఆ పేర్లలో ఫస్ట్ లెటర్స్‌తో ఆర్టాస్ అని వస్తుంది. ఇంతకు ముందు అయితే ఆర్టాస్ కూల్‌డ్రింక్‌ కంపెనీలో పని చేసే కుర్రాళ్ల కథ. కానీ అది కుదరలేదు. అందుకే సోడా మీదకు కథ మార్చేశాం. డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటూ సంపాదించుకుందామనే కుర్రాళ్ల కథ. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకుంటే చాలని అనుకునే మనస్తత్వంతో ఉంటారు.


కరెక్ట్ స్లాంగ్

ఇది వరకు చాలా సినిమాల్లో ఈ యాసలో మాట్లాడాను. కానీ ఇప్పుడు పూర్తిగా గోదావరి యాసలోనే  ఉంటుంది. ఇది కరెక్ట్ స్లాంగ్. ఈ సినిమాలో యాస పరంగా ఎలాంటి హద్దుల్లేవు. పూర్తిగా ఎటకారంగా ఉంటుంది.


ఫీమేల్ కారెక్టర్‌ను స్ట్రాంగ్‌గా చూపిస్తాను

గ్రామ వాలంటీర్ల గురించి తప్పుగా వెళ్లింది. ట్రైలర్ అలా కట్ చేశాం కాబట్టి అలా అనిపించింది. నా ప్రతీ సినిమాల్లో ఫీమేల్ కారెక్టర్‌ను స్ట్రాంగ్‌గా చూపిస్తాను. ఇందులో కూడా అలానే ఉంటుంది. కానీ ఆ గ్యాంగులో ఎవరికీ ఉద్యోగం రాకుండా ఆ అమ్మాయికి మాత్రమే వస్తుందని కడుపు మంటతో అలా మాట్లాడతారు. వివాదమనిపిస్తే, నిజంగానే ఎవరైనా హర్ట్ అవుతారని నాకు అనిపిస్తే నేనే ముందుగా సీన్లు తీసేయమని అంటాను.


ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం

తెలుగు హీరోలందరినీ నేను ఆరాధిస్తాను. అందరినీ ఇష్టపడతాను. పెద్ద ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలా అందరినీ నేను గొప్పగా చూస్తుంటాను. మన హీరోలను గౌరవించుకునే అవకాశం వస్తే నేను దాన్ని వాడుకుంటాను. వాళ్లంతా గొప్ప వాళ్లు కాబట్టే స్టార్లు అయ్యారు. నాకు ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇందులో ఎంతో పాజిటివ్‌గా ఉంటుంది.


నర్సీపట్నం ఘటనల ఆధారంగా..

యథార్థ సంఘటనలే కానీ దాన్ని గోదావరి జిల్లాకు అడాప్ట్ చేశాం. నర్సీపట్నంలో జరిగిన ఘటనల ఆధారంగానే ఈ సినిమాను తీశాం.


ఆ సీన్లు అద్భుతంగా వచ్చాయి.

మన దగ్గర పర్మిషన్ త్వరగా రాదని ట్రైన్ ఎపిసోడ్ కోసం ఒరిస్సా వెళ్లాం. రెండు రోజుల పర్మిషన్ అనుకుంటే ఇచ్చింది ఒక రోజే. అందులోనూ కరెక్ట్‌గా రెండున్నర గంటలే దొరికాయి. అందులోనూ మేం గట్టిగా వాడింది గంటన్నర మాత్రమే. చాలా కష్టపడి సీన్లు తీసేశాం. బ్రిడ్జ్ దగ్గర సీన్లు అద్భుతంగా వచ్చాయి. బ్రిడ్జ్ దగ్గర పరిగెత్తే సీన్లలో కిందకు మాత్రం చూడొద్దని అన్నారు. కానీ మధ్యలోకి వెళ్లాక చూశాను. నాకు ఒక్కసారిగా భయమేసింది.


తెలుసుకునే ప్రయత్నం చేస్తారు..

తెలుగు టైటిల్స్ నాకు చాలా ఇష్టం. తెలుగులో పెట్టేందుకే నేను ఎక్కువగా మొగ్గు చూపుతుంటాను. అలా మధ్య మధ్యలో సంస్కృత పదాలు కూడా పెడుతుంటాను. ఈ తరం వాళ్లకు అర్జున ఫల్గుణ అనేది ఎవ్వరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒకరో ఇద్దరూ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.


ఐదు నిమిషాల్లోనే..

అర్జున ఫల్గుణలో అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి. పద్దతులు, సంప్రదాయాలు చూపిస్తాం. ఫ్రెండ్స్ మధ్య ఉండే ఎమోషన్ బాగా ఉంటుంది. సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ముల్కల లంక అనే ఊర్లోకి వెళ్తారు.


ప్రతీ ఒక్కరు హీరో..

రంగస్థలం మహేష్, చైతన్య, రాజావారు రాణివారు చౌదరి, నేను, అమృతా అయ్యర్ మేం ఐదుగురం ఉంటాం. ప్రతీ పాత్రకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. పెద్ద నరేష్ గారు, శివాజీ రాజాగారు, సుబ్బరాజు గారు అందరూ అద్భుతంగా నటించారు. తేజ అందరి దగ్గరికి వెళ్లి మీరే హీరో అని చెప్పినట్టున్నాడు. ప్రతీ ఒక్కరు హీరోలా ఇరగ్గొట్టేశారు.


అవే నా బలం..

రియలిస్టిక్ సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. కెరీర్‌లో ఒకటో రెండో రియలిస్టిక్ కథలు వస్తాయి. కానీ నా దగ్గరకు వచ్చిన ప్రతీ కథను రియలిస్టిక్ చేసేందుకు ప్రయత్నిస్తాను. నా సినిమాలన్నీ నాచురల్‌గా ఉంటాయని అందరూ అంటుంటారు. రియలిస్టిక్‌ కథలే నా బలం.


కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాను..

నేను పెద్దగా ప్రయోగాలు ఏమీ చేయలేదు. నార్మల్ కథనే కాస్త కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాను. తిప్పరా మీసం సినిమాను బాగా నమ్మాం. అమ్మ సెంటిమెంట్‌తో ఆ సినిమా చేశాను. అంతకు ముందే బ్రోచేవారెవరురా అంటూ ఫుల్ కామెడీ సినిమాను తీశాను. తిప్పరా మీసం కూడా ఎక్కువ సరదాగా ఉంటుందని అనుకున్నారు. కానీ అది పూర్తిగా మదర్ సెంటిమెంట్‌తో ఉంటుంది. కానీ నా వరకు అదే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన చిత్రం.


రియలిస్టిక్‌గా అనిపిస్తాయి..

ప్రియదర్శన్ అనే కొత్త అబ్బాయి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సుధీర్ రాసిన డైలాగ్స్ ఎంతో రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. డైలాగ్స్ రాసినట్టు ఎక్కడా అనిపించవు.


మంచి యాక్షన్ డ్రామా..

భళా తందనాన అనే సినిమా చేస్తున్నాను. లక్కీ మీడియాలో మరో చిత్రం చేస్తున్నాను. భళా తందనాన పెద్ద స్పాన్ ఉన్న సినిమా. మంచి యాక్షన్ డ్రామా. లక్కీ మీడియాలో చేస్తోన్నది పోలీస్ ఆఫీసర్ బయోగ్రఫీ. ఇందులో ఐదు ఏజ్ గ్రూపులుంటాయి.


పెద్ద సినిమాల హవా ఇప్పట్లో తగ్గదు..

మనకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. రాజ రాజ చోర కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే విడుదల చేశాం. ఒమిక్రాన్ వస్తుందంటే మనం ఏం చెప్పలేం. ఇక పెద్ద సినిమాల హవా ఇప్పట్లో తగ్గదు. మాకు కనీసం ఓ వారం సోలోగా దొరికిందని సంతోషంగా ఉన్నాం. కొత్త ఏడాదిని ఇలా పాజిటివ్ సినిమాతో ప్రారంభిస్తే బాగుంటుందని అనిపించింది. ఇది కరెక్ట్ సీజన్. ముందు డిసెంబర్ మొదటి రెండు వారాల్లో అనుకున్నాం. కానీ చివరకు ఇలా డిసెంబర్ చివరన వస్తున్నాం.


నాకు చాలా సిగ్గు..

నాకు చాలా మొహమాటం. కానీ క్లోజ్ అయితే చాలా దూరం వెళ్తాను. నా డైరెక్షన్ టీం, కెమెరా డిపార్ట్మెంట్ ఇలా అందరి మీద చేతులు వేసుకుని మాట్లాడుతాను. కెమెరా ముందు పోజులు పెట్టాలంటే కూడా నాకు చాలా సిగ్గు. ఓ అరవై రోజులు ఒకే చోట ఉంటాం కాబట్టి అందరితో కలిసిపోవడానికి ట్రై చేస్తాను.


మమ్మల్ని చాలా నమ్మారు..

నిర్మాత నిరంజన్ రెడ్డి గారు వైల్డ్ డాగ్, ఆ తరువాత ఆచార్య మధ్యలో మేం. కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. ఎప్పుడూ కూడా ఆయన మమ్మల్నీ ఏమీ అడగలేదు. ఆయన మమ్మల్ని చాలా నమ్మారు.

Sarasalu Chalu Movie Launched Grandly

 పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "సరసాలు చాలు"




 సికే ఇన్ఫిని సమర్పణలో మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నరేష్ అగస్త్య,సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి.చంద్రకాంత్ రెడ్డి 

నిర్మిస్తున్న  'సరసాలు చాలు'  చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని జె ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ లో ఘణంగా జరుపుకుంది..ఈ కార్యా క్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ చిత్ర యూనిట్ కు స్క్రిప్ట్ ను అందజేయగా..చిత్ర నిర్మాత భార్య శృతి రెడ్డి  హీరో, హీరోయిన్ లపై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ కొట్టారు, నిర్మాత చంద్రకాంత్ రెడ్డి ,రోహిత్ లు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. లూజర్ వెబ్ సిరీస్  దర్శకుడు అభిలాష్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.ఈ పూజా కార్యక్రమాలు అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో


 చిత్ర నిర్మాత బి.చంద్రకాంత్ రెడ్డి  మాట్లాడుతూ . చిన్నప్పటి నుండి  సినిమా అంటే ఏంతో ఇష్టం ఉండడంతో  సందీప్ చెప్పిన కథ నచ్చి  ఈ మూవీ చేస్తున్నాను రొమాంటిక్ కామెడీ  ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులను అలరించే విధంగా తీస్తాము.ఇక ముందు మా బ్యానర్లో ఇలాంటి మంచి సినిమాలు చేస్తాము అని అన్నారు


 చిత్ర దర్శకుడు డాక్టర్ సందీప్ చేగూరి మాట్లాడుతూ . ఒక "చిన్న విరామం" సినిమా తర్వాత వస్తున్న నా రెండవ సినిమా "సరసాలు చాలు" పేరుకు తగ్గట్టే ఈ సినిమా చాలా కలర్ ఫుల్ బ్రీజి ఎంటర్ టైనర్.,కామెడీ కు ఇంపార్టెంట్ ఇస్తూ సాగే ఫుల్ కామెడీ క్లిన్ ఎంటర్ టైనర్ గా  ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రతి కపుల్ కి, రిలేషన్ షిప్ లో ఉన్న వాళ్ళకి, పెళ్లైన వాళ్ళ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది.ఇందులో  కూడా ఎమోషన్స్, హార్ట్ బ్రేక్స్, నవ్వులు, కోపాలు ఉంటాయి. మంచి రొమాంటిక్ కామెడీతో వస్తున్న ఈ చిత్రంలో అద్భుతమైన నాలుగు పాటలు ఉంటాయి. మూడు షెడ్యూల్లో  ఈ సినిమాను పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేస్తామని  అన్నారు. 


 చిత్ర హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. 


 హీరోయిన్ సంజన సారధి మాట్లాడుతూ..దర్శకుడు చెప్పిన కథ వినగానే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. నటనకు మంచి స్కోప్ వుండే ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. 


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.


 నటీనటులు

నరేష్ అగస్త్య,సంజన సారధి తదితరులు 


 సాంకేతిక నిపుణులు

సమర్పణ : సికే ఇన్ఫిని

బ్యానర్ : మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్

నిర్మాత : బి.చంద్రకాంత్ రెడ్డి 

రైటర్, డైరెక్టర్ : డాక్టర్ సందీప్ చేగూరి

డి.ఓ.పి : రోహిత్ బట్చు,

మ్యూజిక్ : భరత్ మంచిరాజు

పి ఆర్.ఓ : శ్రీధర్

ప్రొడక్షన్స్ డిజైనర్ : ఝాన్సీ

4 Years of Okka Kshanam Allu Sirish recalls Memories

 4 Years of Okka Kshanam: Allu Sirish recalls how film screened in 4 different languages in 4 years



Allu Sirish's Okka Kshanam clocked 4 years to its release today, which was screened in 4 different languages. The Telugu film went on to garner rave reviews by Hindi, Tamil and Malayalam audiences, truly a 'Pan-India' film. Taking to his social media, Allu Sirish shared, "Okka Kshanam has completed 4 years and it remains one of my best films. The Telugu version was dubbed into Hindi as "Shoorveer 2" and became a big hit on television & YouTube. In the last lockdown, the film got dubbed into Tamil as "Andha Oru Nimidam" on Star Vijay and repeated its success on Disney+HotStar too. Finally it got dubbed into Malayalam to repeat & was well received by the audience and critics.It's a moment of pride for director Vi Anand and myself that our sci-fi thriller was screened in 4 India languages & was successful in all of them. Truly a "pan Indian" film. Couldn't have asked for a better way to celebrate 4 years of Okka Kshsnam. Thank you everyone for all the love."

Radhe Shyam Musical Tour Begins From Vizag

 Radhe Shyam Musical Tour Begins From Vizag



Radhe Shyam is one of the most anticipated films in Indian cinema at the moment. The Prabhas starrer is up for theatrical release on the 14th of January and the film is riding high on expectations already. 


Now, Radhe Shyam's musical tour has begun in Vizag. A promotional wagon with Radhe Shyam's posters imprinted all over it has been inaugurated by fans and this wagon will be extensively used to promote the film through offline mediums.


Prabhas will be actively taking part in Radhe Shyam's promotions from the 7th of January. He will be interacting with pan-India media outlets and promote Radhe Shyam.


Prabhas plans to take the hype surrounding Radhe Shyam to a whole new level with his whirlwind promotions. Also, the makers are planning to line up more promotional material in the days to follow. 


Radhe Shyam is a proper love drama directed by Radha Krishna Kumar. The film has Prabhas and Pooja Hegde in the lead roles.

Bhala Chora Bhala Shooting Completed

 షూటింగ్ పూర్తి చేసుకున్న ‘భళా చోర భళా’



ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో యాక్టివ్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘భళా చోర భళా’. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మిస్టరీ చిత్రానికి ఏ. ప్రదీప్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏ. జనని ప్రదీప్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది.


ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఏ. ప్రదీప్ మాట్లాడుతూ.. ‘‘సరికొత్త కథాంశంతో ‘భళా చోర భళా’ చిత్రం తెరకెక్కిస్తున్నాము. ఫుల్ లెంగ్త్ కామెడీ‌తో పాటు మిస్టరీ అంశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. మంచి ఆర్టిస్టులు కుదిరారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరిపి త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం. లక్షణ్ సినిమాటోగ్రఫీ.. సింహ కొప్పర్తి, వెంకటేష్ అద్దంకిల మ్యూజిక్; రవితేజ నిమ్మన ఆర్ట్ వర్క్ హైలెట్‌గా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది. త్వరలోనే విడుదల వివరాలను ప్రకటిస్తాము. సహకరించిన అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.


ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను, వెంకటేష్, రవి కిరణ్, రవి శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

సినిమాటోగ్రఫీ: లక్ష్మణ్,

ఎడిటింగ్: వెంకటేష్,

ఎడిటర్: రాము అద్దంకి,

ఆర్ట్: రవితేజ నిమ్మన,

సంగీతం: సింహ కొప్పర్తి, వెంకటేష్ అద్దంకి;

నిర్మాత: ఏ. జనని ప్రదీప్,

కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: ఏ. ప్రదీప్.