Kinnerasani Trailer Launched

 సంద‌డిగా సాగిన "కిన్నెరసాని" ట్రైలర్ లాంచ్, జ‌న‌వ‌రి 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న కిన్నెర‌సాని



సాయి రిషిక ప్రజెంట్ ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్, శుభం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కళ్యాణ్ దేవ్, మహతి బిక్షు,కశిష్ ఖాన్, శీతల్ నటీనటులు గారమణ తేజ దర్శకత్వంలో రజినీ తాళ్లూరి, రవి చింతల సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం "కిన్నెరసాని" ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాదులో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో


చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. 


సాయి తేజ్ నాకు ఈ కథను రెండు సంవత్సరాల క్రితమే చెప్పాడు.ఇది కాక చాలా కథలు చెప్పినా కూడా నాకు ఈ కథే నాకు కనెక్ట్ అవ్వడంతో ఇంతకు ముందు చేసిన సినిమల్లా కాకుండా ఈ కథను చాలా సార్లు రివిజన్ చేసుకుని ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశాను.ఇందులో ఐదు కథలు ఉంటాయి.ఐదు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్లే ఇందులో ఎవరు హీరో,ఎవరు హీరోయిన్, విలన్ అని చెప్పలేము కథే హీరో. ఇటువంటి కథను యాక్సెప్ట్ చేసి అందుకు హీరోలు కూడా సిద్ధంగా ఉండి ఆ కథను ఇష్టపడి చెయ్యాలి అప్పుడే సినిమా బాగా వస్తుంది. అలాగే అందరూ కూడా ఎంతో ఇష్టపడి చెయ్యడంతో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మా ఈ కష్టానికి రమణ తేజ్ ఇచ్చిన ఆవుట్ ఫుట్ కు మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము.ఇప్పటి వరకు నేను ఐదు సార్లు చూశాను నా హార్ట్ కు నచ్చింది.ఈ మూవీ ని ఒకజ జీ5 వారికి మాత్రమే చూయించాను చూసిన వెంటనే వారు అగ్రిమెంట్ చేసుకుందామని చెప్పడంతో నాకు ఇంకా ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది. మొదటి సారి నేను ఈ సినిమాను ఓటిటి లో విడుదల చేద్దామను కున్నాను అని వారితో అంటే వారు వద్దు ఇటువంటి మూవీ బిగ్ స్క్రీన్ పైన రావాలని  చెప్పడంతో వారు ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ తొ ఈ మూవీ ను జనవరి 26 న విడుదల చేస్తున్నాము.అలాగే నేను యాంగ్ టీం తో వర్క్ చేయాలని కొత్తవారికి అవకాశం ఇస్తున్నాను.త్వరలో నేను రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాను.ఈ సినిమాలకు ఇద్దరు కొత్త దర్శకులను పరిచయం చేస్తున్నా ను. ఒక పెద్ద స్టార్ వారిని ఎంకరేజ్ చేయబోతున్నాడు. సంక్రాంతి కి అనౌన్స్ చేస్తున్నాము. ఇందులోని ఒక స్క్రిప్ట్ ద్వారా 52 మంది కాస్ట్ ,క్రూ ను ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్నాము అని అన్నారు.



చిత్ర దర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ.. 


సాయి తేజ్ మంచి కథతో నన్ను సెలెక్ట్ చేసుకొన్నందుకు ధన్యవాదాలు. 

ఇప్పటి వరకు స్టోరీ అంటే మిస్టరీ థ్రిల్లర్ వంటి మార్క్ వచ్చే కథలు చూసుంటారు.ఇది బ్యూటీఫుల్ లవ్ స్టొరీ.ఇందులో లాట్స్ ఆఫ్ మిస్టరీ ఉంటుంది.సాయితేజ్ స్క్రీన్ ప్లే బిగ్ హైలెట్ అవుతుంది.ఈ సినిమాకు నేను డైరెక్ట్ చేయాలని నన్ను బెలీవ్ చేసినందుకు నిర్మాత రామ్ తాళ్లూరి కి ధన్యవాదాలు. ఈ సినిమాకు విజువల్స్ చాలా ఇంపార్టెంట్  కాంప్రమైజ్ కాకుండా చేశాడు దినేష్. సాగర్ మంచి బిజియం ఇచ్చారు.ఇంతకుముందు సాగర్ దగ్గర ఇలాంటి మ్యూజిక్ చూడలేదు. జోహార్ కు వర్క్ చేసిన అన్వర్ ఈ సినిమాకు ఎడిటింగ్ టెర్రిఫిక్ గా చేశాడు.ఇలా ప్రతి టెక్నిసిషన్స్ చాలా కష్టపడ్డారు. కళ్యాణ్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. హీరోయిన్లు చాలా చక్కటి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ట్రైలర్ లో మీరు చూసింది 5 % మాత్రమే ఉంది. ఇంకా సినిమాలో చాలా కథ ఉంది.రియల్ స్విచ్ఛవేషన్ లోని ఎమోషన్స్ ను ఇందులో చూయించడం జరిగిందీ.జనవరి 26 న వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు. 


రైటర్ సాయి తేజ్ మాట్లాడుతూ.. 


కథ కంటే కథనం బగుండాలని యూనిక్ గా రాసుకున్నాను కిన్నెరసాని . రమణ తేజ్ ఎమోషన్ ను చాలా బాగా క్యారీ చేస్తాడు. ఇందులో కథే హీరో, విలన్ గా రవీంద్ర విజయ్ చేశాడు., అందరూ టెక్నిసిషన్స్ అందరూ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. నటీనటులు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఒక టైం లో నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలను కున్నప్పుడు రాం తాళ్లూరి గారు నేను సినిమా తీస్తాను.నువ్వు కథ రాయమని సపోర్ట్ ఇచ్చాడు.కల్కి కంటే ఈ కిన్నెరసాని బాగా వచ్చింది.జనవరి 26 న వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు. 


చిత్ర నిర్మాత రవి మాట్లాడుతూ.. 


ఇది నా మొదటి చిత్రం సాయి తేజ్ దగ్గర ఈ కథ వినగానే కథ నచ్చింది.వెంటనే ఈ మూవీ చెయ్యడానికి ముందుకు వచ్చాము. ఈ సినిమాకు పనిచేసిన కాస్ట్ & క్రూ అందరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది అన్నారు. 


 సినిమాటోగ్రఫర్ దినేష్ మాట్లాడుతూ..


నాకు దర్శక, నిర్మాతలు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ బ్యానర్ లో చాలా కంఫర్ట్ గా ఉంది. మేమంతా ఈ వినిమాను ఎంజాయ్ చేస్తూ చేశాము అన్నారు. 


రవీంద్ర విజయ్ మాట్లాడుతూ.. 


ఇలాంటి సైకో కథ రాయడం చాలా కష్టం.ఈ సినిమా ద్వారా నాకు చాలా మంది ఫ్రెండ్స్ దొరికారు.బ్యూటీఫుల్ సినిమా ఇది .అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు. 


నటి కశిష్ ఖాన్ మాట్లాడుతూ.. 


సినిమా చాలా బాగా వచ్చింది. కళ్యాణ్ దేవ్ చాలా సపోర్ట్ చేశారు.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు, ధన్యవాదాలు అన్నారు. 


నటి మహతి బిక్షు మాట్లాడుతూ.. 


ఇలాంటి మంచి సినిమాలో నేను చేసినందుకు చాలా లక్కీ.. నా కెరీర్ లో గుర్తుండి పోయే సినిమా ఇది.. చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.



నటి శీతల్ మాట్లాడుతూ.. 


తేజ నాకు ఫోన్ చేసి బ్యూటీఫుల్ స్టోరీ చెప్పాడు.ఈ కథా నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు, ధన్యవాదాలు అన్నారు.



ఎడిటర్ అన్వర్ మాట్లాడుతూ..


ఇలాంటి ఎంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాకు పనిచేదిండుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.



నటీనటులు కళ్యాణ్ దేవ్, మహతి బిక్షు, కశిష్ ఖాన్, శీతల్ 


బ్యానర్ :ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ ,శుభం ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ :రామ్ తాళ్ళురి 

ప్రజెంట్ :సాయి రిషిక 

నిర్మాతలు : రజినీ తాళ్లూరి రవి చింతల 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ; జే విద్యాసాగర్ 

డైరెక్షన్ : రమణ తేజ 

రైటర్ : సాయి తేజ 

మ్యూజిక్ : మహతి స్వర సాగర్ 

సినిమాటోగ్రఫీ : దినేష్ కె బాబు 

ఎడిటింగ్ : అన్వర్ అలీ 

లిరిసిస్ట్ : కిట్టు విశ్వ ప్రగడ 

కాస్ట్యూమ్ డిజైనర్ : కీర్తి వాసం 

సౌండ్ డిజైన్ : సింగ్ సినిమా 

ఏవో : ప్రణీత్ అడబాల 

విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ : నాగు తలారి 

పి ఆర్ వో - ఏలూరు శీను & మేఘశ్యామ్

Post a Comment

Previous Post Next Post