Latest Post

Daksha Title Logo Launched

 దక్ష - టైటిల్ లోగో ఆవిష్కరించిన తనికెళ్ళ భరణి, శరత్ బాబు





శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాత గా, వివేకానంద విక్రాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం " దక్ష".

ఈ సినిమా ద్వారా సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా కి సంబంధించిన టైటిల్ లోగో ను సీనియర్ నటులు తనికెళ్ళ భరణి మరియు శరత్ బాబు గారు విడుదల చేశారు.


ఈ సందర్భంగా సీనియర్ నటులు తనికెళ్ళ భరణి గారు మాట్లాడుతూ "దక్ష అంటే అన్ని వ్యవహారాలు సమన్వయం చేసేవాడు అని అర్థం"  అతనే మా  తల్లాడ సాయి కృష్ణ , తను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాడు. గతంలో తాను డైరెక్ట్ చేసిన ఒక వ్యవసాయ షార్ట్ ఫిలిం కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. చాలా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం చాలా గొప్ప విషయం. ఈ దక్ష చిత్రం లో మన శరత్ బాబు గారి తనయుడు ఆయుష్ హీరో గా పరిచయం అవుతున్నాడు. శరత్ బాబు గారు నాకు మంచి మిత్రుడు, ఎన్నో చిత్రాల్లో కలిసి పని చేసాం. ఆయుష్ కి ఈ చిత్రం మంచి విజయం అందించాలని, ఈ సినిమా లో పని చేసిన నటులకు టెక్నిషన్స్ అందరికీ మంచి అవకాశాలు రావాలి" అని కోరుకున్నారు.


శరత్ బాబు గారు మాట్లాడుతూ "ఆయుష్ నా తమ్ముడి కొడుకు, నా కొడుకు కూడా. ఆయుష్ కి ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను. ఈ చిత్రం టైటిల్ లోగో కార్యక్రమానికి తనికెళ్ళ భరణి గారు గెస్ట్ గా రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి, నిర్మాతలకు మంచి డబ్బు సంపాదించి పెట్టి, దర్శకుడికి మంచి విజయం కావాలి" అని కోరుకున్నారు.


నటులు తల్లాడ వెంకన్న మాట్లాడుతూ "దక్ష చిత్రం టైటిల్ లోగో విడుదల చేసిన తనికెళ్ళ భరణి గారికి శరత్ బాబు గారికి నా శుభాకాంక్షలు. తల్లాడ సాయి కృష్ణ మా తమ్ముడి  కొడుకు, తనకు మంచి బంగారు భవిష్యత్తు ఉండాలి అని, ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం అవుతున్న వివేకానంద విక్రాంత్ కి ఈ చిత్రం మంచి విజయం , పెరు తీసుకొని రావాలి అని, ఈ చిత్రం లో నటించిన నటి నటులకి, టెక్నిషన్స్ అందరికీ మంచి పేరు తెచ్చి పెట్టాలి" అని కోరుకున్నారు.


దర్శకుడు వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ "దర్శకుడిగా దక్ష నా మొదటి చిత్రం నిర్మాత తల్లాడ సాయి కృష్ణ చాలా సపోర్ట్ చేసాడు. సినిమా చాలా బాగా వచ్చింది, మంచి విజయం సాధిస్తుంది" అని కోరుకున్నారు.


హీరో ఆయుష్ మాట్లాడుతూ "నేను హీరో గా అవ్వాలి అన్నది నా డ్రీమ్. ముంబై లో యాక్టింగ్ కోర్స్ చేశాను. ఇప్పుడు దక్ష చిత్రం తో హీరో గా పరిచయం అవుతున్నాను. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడి పని చేసాం. హైదరాబాద్, అరకు, ఖమ్మం లాంటి ఎన్నో లొకేషన్స్ లో షూటింగ్ చేసాము. ఇది ఒక థ్రిల్లర్ సినిమా 2022, జనవరి లేక ఫిబ్రవరి లో విడుదల అవుతుంది. మీ అందరి సపోర్ట్ కావాలి.


హీరోయిన్స్ అను మరియు నక్షత్ర ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకున్నారు.


నిర్మాత తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ "దక్ష చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం. మా చిన్న చిత్రానికి మీడియా సపోర్ట్ కావాలి. మంచి కథ తో మీ ముందుకు వస్తున్నాం. మీ సపోర్ట్ కావాలి" అని కోరుకున్నారు.


సినిమా : " దక్ష "

బ్యానర్ :- శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్

నిర్మాత :- తల్లాడ శ్రీనివాస్

కో-ప్రొడ్యూసర్ :- తల్లాడ సాయి కృష్ణ

డైరెక్టర్ :- వివేకానంద విక్రాంత్

హీరో , హీరోయిన్ లు :- ఆయుష్ , అను , నక్షత్ర , శోభన్ బాబు ,రవి రెడ్డి ,రియా ,అఖిల్ , పవన్   తదితరులు ...

కథ - మాటలు :- శివ కాకు ,

కెమెరా :- శివ రాతోడు , ఆర్.ఎస్ . శ్రీకాంత్,

సంగీతం :- రామ్ తవ్వ ,

పబ్లిసిటీ డిజెన్స్ :- రాహుల్ , శ్యామ్ వీరవెల్లి , రాజేష్  బచ్చు ,

పిఆర్ఓ :-  పాల్ పవన్

RGV’s LADKI : Enter the Dragon Girl is first Hindi trailer on Burj Khalifa

 RGV’s LADKI : Enter the Dragon Girl is first Hindi trailer on Burj Khalifa



For the first time in the History of Hindi Cinema and the 11-year-old existence of the iconic Burj Khalifa, the Hindi film trailer of Ram Gopal Varma’s ambitious film LADKI : Enter The Girl Dragon was showcased on the Burj Khalifa in Dubai Yesterday. The man, Ram Gopal Varma himself graced this colourful event along with his cast and crew and made the night vivid.

Director Ram Gopal Varma tweeted "This is the most thrilling moment of my entire career to see the trailer of my most ambitious film Ladki trailer on the tallest screen in the world. I am in tears". The film Ladki in Hindi, Ammayi in Telugu and Dragon girl in China will release on 10th December on large scale. 

Artsee Media, Big People and Parijatha Movie Creations banners have produced it.



The film starring Pooja Bhalekar is already in the news after being Ram Gopal Varma’s tribute to Bruce Lee and is also being released in China with Chinese subtitles. The film will release in around 30000 theatres in China alone making it the largest release ever.

Sehari Ready for Release

 విడుద‌ల‌కు సిద్ద‌మైన హర్ష్‌ కనుమిల్లి,  జ్ఞానసాగర్  ద్వార‌క‌, వర్గో పిక్చర్స్ `సెహ‌రి`.



హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సెహరి’. వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి, ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన  టీజ‌ర్ 60 లక్షల వీక్షణలు పొందగా,  “సెహరి టైటిల్ సాంగ్”, “ఇది చాలా బాగుందిలే” యూట్యూబ్ నందు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “ఇది చాలా బాగుందిలే” అనే పాట 80 లక్షల వీక్షణలు పొంది శరవేగంగా కోటి వీక్షణలకు దూసుకుపోతూ అతి త్వ‌ర‌లో విడుద‌ల‌కాబోతున్న ఈ చిత్రం  పట్ల ప్రేక్షకులలో అంచనాలను పెంచింది. ఈ సంద‌ర్భంగా


నిర్మాత అద్వయ జిష్ణు రెడ్డి మాట్లాడుతూ - `సెహ‌రి టీజర్ మరియు పాటల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ముఖ్యంగా హీరో హర్ష్ కనుమిల్లి నటన చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. అంతే కాకుండా ఎక్కడ కూడా మొదటి సారిగా నటించినట్టుగా కాక ఎంతో అనుభవంతో నటిస్తున్నట్టుగా చాలా అధ్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఉన్నత నిర్మాణ విలువలతో నిర్మించబడిన “సెహరి” సినిమా కుటుంబ సమేతంగా వెళ్ళి హాయిగా నవ్వుకుని ఆనందించదగ్గ సినిమా అవుతుంది” అని చిత్ర విజయం పట్ల నిర్మాత ఆద్వయ జిష్ణు రెడ్డి దీమా వ్యక్తం చేశారు.


దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక మాట్లాడుతూ - ``ఈ చిత్రంలోని కధ మరియు పాత్రలు అన్నీ యువత మరియు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాం” అన్నారు.


నటీనటులు: హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి, అభినవ్‌ గోమఠం, ప్రణీత్‌ రెడ్డి, కోటి, బాలకృష్ణ


సాంకేతిక విభాగం

దర్శకుడు: జ్ఞానసాగర్‌ ద్వారక

ప్రొడ్యూసర్స్‌: అద్వయ జిష్ణు రెడ్డి

డీఓపీ: అరవింద్‌ విశ్వనాథ్‌

మ్యూజిక్‌ డైరెక్టర్‌: ప్రశాంత్‌ ఆర్ విహారి

ఎడిటర్‌: రవితేజ గిరిజాల

ఆర్ట్‌ డైరెక్టర్‌: సాహి సురేష్

Pakka commercial Team Birthday Wishes to Raashi Khanna

 దివి నుంచి దిగొచ్చిన దేవకన్యలా ఉన్న రాశీ ఖన్నా‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ బర్త్ డే టీజర్..



ప్ర‌తి రోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ వ‌రుకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రాశీ ఖన్నా పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ టీజర్ మేకింగ్ చాలా రీ ఫ్రెషింగ్‌గా అనిపించింది. ఇందులో హీరోయిన్ రాశీ ఖన్నా ఆకాశం నుంచి నేలపైకి వస్తున్న దేవకన్యలా కనిపిస్తున్నారు. ఈమె క్యారెక్టర్‌ను ప్రతిరోజూ పండగే మాదిరే ఇందులోనూ మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. గోపీచంద్ పాత్రను కూడా చాలా చక్కగా డిజైన్ చేసారు మారుతి. టీజర్‌లోనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ వస్తుంది. గతంలో జిల్, ఆక్సీజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశి ఖన్నా. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌.  మార్చ్ 18న సినిమా విడుదల కనుంది. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.


నటీనటులు:

గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు


టెక్నికల్ టీం:

స‌మ‌ర్ప‌ణ - అల్లు అరవింద్

బ్యాన‌ర్ - జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్

నిర్మాత‌ - బ‌న్నీ వాస్

ద‌ర్శ‌కుడు - మారుతి

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ర‌వీంద‌ర్

మ్యూజిక్ - జ‌కేస్ బీజాయ్

స‌హ నిర్మాత - ఎస్ కే ఎన్

లైన్ ప్రొడ్యూసర్ - బాబు

ఎడిటింగ్ - ఎన్ పి ఉద్భ‌వ్

సినిమాటోగ్ర‌ఫి - క‌ర‌మ్ చావ్ల‌

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

Game On Motion Poster Launched




 శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న "గేమ్ ఆన్" సినిమా రవి కస్తూరి సమర్పణలో డిసెంబర్ మూడవ వారంలో షూటింగ్ మొదలవుతుంది.సినిమా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితుడైన కుమార్ బాబు నిర్మాతగా తెలుగు తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.హీరోగా రథం ఫేం గీతానంద్ తన తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకొని అందరి ప్రశంశలు పొందిన గీతానంద్ హీరోగా నటిస్తున్నారు.దర్శకుడు దయానంద్ తన మొదటి సినిమా "బాయ్స్" తో అందరి టెక్నీషియన్స్ మన్ననలు పొంది యూత్ ని ఆకట్టుకునేలా త్వరలో రిలీజ్ కు సిద్ధమై ఉంది.ఈ ఇద్దరి కలయికతో నిర్మిస్తున్న "గేమ్ ఆన్" సినిమా సరికొత్త కథతో ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పై రానటువంటి కథాంశంతో మంచి టెక్నీషియన్ తో నిర్మిస్తున్న చిత్రం. సినిమా స్టార్ట్ చేయకుండానే సినిమా కథ తెలిసి హిందీ రైట్స్ అడగడం ఆశ్చర్యకరంగా ఉంది. నాకు తెలిసి ఈ సినిమా చిన్న సినిమాల్లో చాలా పెద్ద సినిమా అవుతుంది. ఇందులో ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ ఎమోషన్,లవ్ సెంటిమెంట్స్, ట్విస్టులు ఇలా అన్ని రకాలుగా అందరిని ఆకట్టుకునే అంశాలు అన్నీ ఉన్నాయి. నాకున్న అనుభవంతో చెప్తున్నా టాప్ టెన్ మూవీస్ లో ఈ సినిమా ఖచ్చితంగా నిలుస్తుంది. ఈ సినిమాతో గీతానంద్ మంచి హీరోగా నిలబడటమే కాకుండా దర్శకుడిగా దయానంద్ మంచి మార్కులు కొట్టేస్తాడు.మంచి  టెక్నీషియన్స్ దొరకడమే కాకుండా ఈ సినిమాకు ఆర్టిస్టులు అందరూ సెట్ అవుతున్నారు.చాలా మంచి ఇంపార్టెంట్ మధుబాల మదర్ క్యారెక్టర్ చేస్తుంది. కన్నడ కిషోర్, మధుసూదన్  చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమాకు కరెక్ట్ గా సెట్ అవుతున్నారు. ఈ సినిమా 2022లో ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాత కుమార్ బాబు తెలియజేశారు.


 

 సాంకేతిక నిపుణులు

సమర్పణ : రవి కస్తూరి

బ్యానర్ :శ్రీ లక్ష్మీ వెంటకేశ్వర క్రియేషన్స్ &  గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్‌  

నిర్మాత : కుమార్ బాబు

రచన,దర్శకత్వం : దయానంద్.

లైన్ ప్రొడ్యూసర్ : నికిలేష్ వర్మ

విజువల్స్ : కుశేందర్ రమేష్ 

ప్రొడక్షన్ డిజైన్ : దిలీప్ జాన్ 

సంగీతం : అశ్విన్- అరుణ్

పి.ఆర్.ఓ :మధు.వి.ఆర్ & వంశీ శేఖర్

Hero Satya Dev Interview About SkyLab

 ‘స్కై లాబ్‌’ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంది :  హీరో స‌త్య‌దేవ్‌



వెర్సటైల్ యాక్టర్స్ స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మించి చిత్రం ‘స్కైలాబ్‌’. నిత్యామీన‌న్ స‌హ నిర్మాత‌.  1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. డిసెంబర్ 4న మూవీ విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో స‌త్య‌దేవ్ ఇంట‌ర్వ్యూ విశేషాలు...



- సాధార‌ణంగా నేను కాలేజీ డేస్ నుంచి చాలా స‌ర‌దాగా ఉంటాను. కానీ నా ఫేస్ చూడ‌టానికి కామెడీకి భిన్నంగా ఉండ‌టంతో ప్రారంభంలో ఇన్‌టెన్స్ రోల్స్ చేస్తూ వ‌చ్చాను. అలాంటి రోల్స్ చేస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్లు కానీ, స్నేహితులు కానీ.. ఏంట్రా నువ్వు ఇన్‌టెన్స్ రోల్స్ చేస్తున్నావు అనుకునేవాళ్లు. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన క్యారెక్ట‌ర్ కూడా రాలేదని కూడా ఆగాను. ఇక స్కై లాబ్ విష‌యానికి వ‌స్తే  అందులో నా క్యారెక్ట‌ర్ ఫ‌న్నీగా ఉంటుంది. స్కై లాబ్ ప‌డిపోతున్న‌ప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఓ డాక్ట‌ర్ డిమాండ్ సప్ల‌య్ అని మాట్లాడుతుంటాడు. డాక్ట‌ర్ ఆనంద్‌కు మంచి ఆర్క్ ఉంటుంది. స్కై లాబ్ ప‌డిపోతున్నప్పుడు దాన్ని ఉప‌యోగించుకుని డ‌బ్బులు సంపాదించాల‌నుకునే ఆనంద్ అనే డాక్ట‌ర్ చివ‌ర‌కు ఎలా మారిపోతాడ‌నేది.. క్యారెక్ట‌ర్‌లో మంచి ఆర్క్ ఉంటుంది. సిట్యువేష‌న‌ల్ కామెడీ. గ్రామ‌స్థుల‌తో కామెడి. ఆనంద్ బండ లింగ‌ప‌ల్లిలో ఓ క్లినిక్ పెట్టాల‌నుకుంటాడు. ఆ గ్రామ‌స్థులు అందుకు ఒప్పుకుంటారా? ఏం చెప్పి ఒప్పించారు? అనే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. గౌరి, డాక్ట‌ర్ ఆనంద్‌, సుబేదార్ రామారావు స‌హా అన్నీ పాత్ర‌ల‌ను చ‌క్క‌గా రాశారు. వీళ్లు వాళ్లు అని కాదు.. అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది. 


- స్కై లాబ్ ప‌డిపోతుంద‌ని, ఓ ప‌ర్టికుల‌ర్ గ్రామం నాశ‌న‌మైపోతుంద‌నే వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో.. అప్ప‌ట్లో అంద‌రూ భ‌య‌ప‌డ్డారు. ప‌ర్టికుల‌ర్ ప్రాంతంలోని వారు చ‌నిపోతామ‌ని భావించారు. కోళ్లు, మేక‌లు కోసుకుని తినేశారు. ఇంకేం ఉండ‌దు అని భావించారు. నేను విన్న దాని ప్ర‌కారం కొంద‌రైతే బంగారు నాణెల‌ను మింగేశార‌ని, కొంద‌రు ఆస్థుల‌ను అమ్ముకుని వెళ్లిపోయార‌ని ఇలా చాలా చాలా జ‌రిగాయి. 


- గౌరి, ఆనంద్‌, సుబేదార్ రామారావు అనే మూడు ప్ర‌ధాన పాత్ర‌లు వీటితో పాటు స్కై లాబ్‌... బండ లింగ‌ప‌ల్లిలోని ప్ర‌జ‌లు చుట్టూ క‌థ తిరుగుతుంది. అంద‌రి మ‌ధ్య కామెడీగా సాగే సినిమా. 


- స్కై లాబ్‌కు ఆదిత్య జ‌వ్వాది సినిమాటోగ్రాఫ‌ర్‌. డీ శాట్ ప్యాట్ర‌న్‌లో కాకుండా .. ద‌ర్శ‌కుడు విశ్వ‌క్ అండ్ టీమ్ దాన్నొక సెల‌బ్రేష‌న్స్‌లా చూపించాల‌ని అనుకున్నారు. దాంతో సినిమా అంతా క‌ల‌ర్‌ఫుల్‌గా చూపించారు. క‌రీంన‌గ‌ర్ బండ‌లింగ‌ప‌ల్లి గ్రామంలో జ‌రిగే క‌థ‌. కాబ‌ట్టి యాస విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. నాకు తెలంగాణ యాస కొంత‌వ‌చ్చు. కొంత నేర్చుకున్నాను. 


- సింక్ సౌండ్‌లో సినిమా చేయ‌డం వ‌ల్ల డ‌బ్బింగ్ చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే సింక్ సౌండ్‌లో సినిమా చేయ‌డ‌మ‌నేది అంత సుల‌భ‌మైన విష‌య‌మైతే కాదు. డైలాగ్ నేర్చుకుని సీన్‌లో న‌టించ‌గ‌లిగితే అథెంటిక్‌గా ఉంటుంది. పెర్పామెన్స్ కూడా ఎన్‌హ‌న్స్ అవుతుంది. 


- నాకు, నిత్యామీన‌న్‌కు ఆన్ స్క్రీన్ ఒక సీన్ కూడా ఉండ‌దు. నిత్యా మీన‌న్‌గారు సూప‌ర్బ్ పెర్ఫామ‌ర్‌. అన్ని పాత్ర‌ల‌కు ఓ క‌నెక్టింగ్ పాయింట్ ఉంటుంది. 


- వివేక్ ఆత్రేయ నాకు ఫోన్ చేసి విశ్వ‌క్ గురించి చెప్పి క‌థ విన‌మ‌న్నాడు. త‌ను రాగానే సూట్‌కేసుతో వ‌చ్చాడు. అడ్వాన్స్ ఇస్తాడేమో అనుకున్నాను. కానీ అందులో సినిమాకు కావాల్సిన డేటా ఉంది. దాని స‌హాయంతో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్లాడు. త‌ను అంత క్లారిటీతో ఉన్నాడు. నెరేష‌న్‌ న‌చ్చ‌డంతో ముందుకెళ్లాం. కోవిడ్ టైమ్‌లో షూటింగ్స్ ఆగిపోయాయి. గ్యాప్‌లో మ‌రో చిన్న సినిమా చేద్దామ‌ని అన్నా కూడా త‌ను ఒప్పుకోలేదు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. 


- లుక్ విష‌యంలోనూ విశ్వ‌క్ కేర్ తీసుకున్నాడు. అంతకుముందున్న సినిమాల్లో ఉన్న గ‌డ్డం మీసాలు తీసేసి న‌టించాను. 


- న‌టుడిగా ఛాలెంజ్‌ను తీసుకోక‌పోతే సెట్స్‌కు రాలేనేమో అని నేను భావిస్తాను. అందుక‌నే స్కై లాబ్ సినిమా చేశాను. గుర్తుందా శీతాకాలం సినిమా చూస్తే అందులో మూడు వేరియేష్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తాను. ల‌వ్‌స్టోరి. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేయ‌ని జోన‌ర్ కాబ‌ట్టి చేశాను. అలా రొటీన్‌గా చేస్తే ఆడియెన్స్ తిడతారు..


- గాడ్‌ఫాద‌ర్‌లో న‌టిస్తున్నాను. కానీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తే బావుంటుంది.

Nayeem Dairies Releasing on December 10th

 డిసెంబర్‌ 10న వస్తున్న ‘నయీం డైరీస్‌’



గ్యాంగ్‌ స్టర్‌ నయీం జీవిత కథతో తెరకెక్కుతున్న ‘నయీం డైరీస్‌’ చిత్రం డిసెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాము బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వశిష్ఠ సింహ లీడ్‌ రోల్‌ చేశారు. సీఏ వరదరాజు నిర్మాత. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ చక్కని స్పందన వచ్చింది. ఈ సందర్భంగా నిర్మాత సీఏ వరదరాజు మాట్లాడుతూ... నయీం కథ వినగానే యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో బాగుంటుందని చేశాం.  వశిష్ట సింహ నటన హైలెట్ గా ఉంటుంది.

మేము అనుకున్న దానికంటే బాగా యాక్ట్‌ చేశారు.  డిసెంబర్‌ 10న సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు. 


దర్శకుడు దాము మాట్లాడుతూ ‘‘రాజకీయ, పోలీస్‌ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయి అన్నది ధైర్యంగా ఈ సినిమాలో చెబుతున్నాం.  నయీం ఎన్‌కౌంటర్‌ అయ్యాక అతని గురించి పూర్తిగా అధ్యాయనం చేశాను. తను అండర్‌ గ్రౌండ్‌లో ఉన్నప్పుడు నేనూ విప్లవకారుడుగా ఐదేళ్లు అజ్ఞాతంలో ఉన్నాను. ఒక విప్లవకారుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో చూశాను. అవన్నీ డ్రమటిక్‌గా సినిమాలో చూపించాను. నయీం పాత్ర పోషించిన వశిష్ఠ సింహ నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు చక్కని స్పందన వస్తోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా వర్గాల నుండే కాకుండా సమాజం లో  విభిన్న వర్గాల నుండి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది."  అని అన్నారు. 


యజ్ఞ శెట్టి, దివి, బాహుబలి నిఖిల్‌, శశి కుమార్‌, జబర్దస్త్‌ ఫణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – సురేష్‌ భార్గవ్‌, సంగీతం– అరుణ్‌ ప్రభాకర్‌, ఎడిటర్‌ – కిషోర్‌ మద్దాలి, పీఆర్వో – జి యస్ కె మీడియా, నిర్మాత సీఏ వరదరాజు, రచన దర్శకత్వం దాము బాలాజీ.

83 Trailer Launched Movie Releasing on December 24th

 భార‌త క్రికెట్ ప్రేమికుడు మ‌ర‌చిపోలేని అద్వితీయ ప్ర‌యాణం ‘83’ ట్రైలర్ విడుదల.. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 ప్రపంచ వ్యాప్తంగా  సినిమా విడుదల



భార‌త‌దేశంలో క్రికెట్‌ను ప్రేమించిన‌, ప్రేమించే, ప్రేమించ‌బోయే ప్ర‌తివారు తెలుసుకోవాల్సిన మ‌ర‌పురాని, మ‌ర‌చిపోలేని అద్భుత‌మైన ప్ర‌యాణం 1983. ఈ ఏడాదిలో భార‌త క్రికెట్ గ‌మ‌నాన్ని దిశా నిర్దేశం చేసింది. భార‌త క్రికెట్ టీమ్ విశ్వ విజేత‌గా ఆవిర్భ‌వించింది. అలాంటి అద్భుత‌మైన ప్ర‌యాణం గురించి నేటి త‌రంలో చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. అంతెందుకు ఇప్పుడున్నంత సాంకేతిక లేక‌పోవ‌డంతో వార్తాప‌త్రిక‌లు, దూర‌ద‌ర్శ‌న్ వంటి ఛానెల్స్ ద్వారా మాత్ర‌మే క‌పిల్ డేర్ డెవిల్స్ ప్రయాణం గురించి తెలిసింది. అయితే అది గ్రౌండ్‌లో మాత్ర‌మే. అస‌లు ఎవ‌రూ ఊహించ‌ని ఓ ప్ర‌యాణాన్ని సుసాధ్యం చేయాలంటే ఎలాంటి భావోద్వేగాల‌కు క్రికెట్ టీమ్‌లోని స‌భ్యులు లోనై ఉంటారో ఊహించ‌వ‌చ్చు. అలాంటి ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీయే ‘83’.  ఈ భారీ చిత్రం క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబర్ 24న విడుద‌ల‌వుతుంది. 


డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్ కొన్ని కోట్ల మంది భార‌తీయుల  క‌ల‌ను వెండితెర‌పై సాక్షాత్క‌రింప చేయ‌డానికి అడుగులు వేసిన‌ప్పుడు ఎలా ఉంటుందోన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ‘83’ సినిమా పోస్ట‌ర్స్‌, ప్ర‌మోషన్స్‌.. క‌పిల్ దేవ్ నుంచి మేనేజ‌ర్ మాన్ సింగ్ వ‌ర‌కు ప్ర‌తి ఆట‌గాడిగా న‌టించిన యాక్టర్స్ గురించి క్ర‌మంగా తెలుస్తూ రావ‌డంతో సినిమాపై అంచన‌లు పెరిగాయి. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్ ఈ అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. అయితే మంగ‌ళ‌వారం విడుద‌లైన ‘83’ ట్రైల‌ర్ ఈ అంచ‌నాల‌ను ఆకాశాన్నంటేలా చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్వీర్ సింగ్ అల‌నాటి క‌పిల్‌దేవ్ పాత్ర‌ను పోషించగా.. నాటి క‌పిల్ స‌తీమ‌ణి పాత్ర‌ను ర‌ణ్వీర్ నిజ జీవితంలో స‌తీమ‌ణి అయిన దీపికా ప‌దుకొనె క్యారీ చేసింది. ట్రైల‌ర్ విషయానికి వ‌స్తే.. 1983లో ఎంతో కీల‌కంగా భావించిన సెమీఫైన‌ల్ పోరుతో మొద‌లైంది. నిజానికి 1983 సెమీఫైన‌ల్స్‌లో భార‌త టీమ్ జింబాబ్వేను ఎదుర్కొన్న‌ప్పుడు మ్యాచ్ ప్రసారం కాలేదు. ఆ మ్యాచ్‌ను ఎవ‌రూ చూడ‌లేక‌పోయారు. అలాంటి మ్యాచ్‌ను మ‌న క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్‌. 9 పరుగుల‌కు నాలుగు వికెట్లు కోల్పోయిన భార‌త టీమ్‌ను ఆనాటి కెప్టెన్ దిగ్విజ‌యంగా 176 ప‌రుగుల‌తో గెలుపు బాట ఎలా ప‌ట్టించాడో.. దాన్ని ‘83’ సినిమాలో చూపించనున్నారు.ఆ మ్యాచ్‌లోని కొన్ని ఎలిమెంట్స్‌తో ట్రైల‌ర్ స్టార్ట్ అయ్యింది. 


ఇక ఫైన‌ల్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ వెస్టిండీస్‌ను ఎదుర్కొనే క్ర‌మంలో భార‌త ఆట‌గాళ్లు ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నారు. వాటిని మాన‌సికంగా ఎలా అధిగ‌మించి ప్ర‌పంచ క‌ప్పును ముద్దాడారు అనే విష‌యాల‌ను ఈ ట్రైల‌ర్‌లో ఆవిష్క‌రించారు. నేప‌థ్య సంగీతం, విజువ‌ల్స్ అన్నీ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌క్కా అని చెప్పేయ‌డ‌మే కాదు.. ప్ర‌తి క్రికెట్ అభిమాని గుండెల్లో నిలిచిపోయే చిత్ర‌మ‌వుతుంద‌ని చెప్ప‌క‌నే చెప్పేస్తుంది. 


అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో క‌బీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా ప‌దుకొనె, సాజిద్ న‌డియ‌ద్‌వాలా, క‌బీర్ ఖాన్‌, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంట‌మ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మించారు. క‌పిల్ దేవ్‌గా ర‌ణ్వీర్ సింగ్‌, క‌పిల్ స‌తీమ‌ణి రూమీ భాటియాగా దీపికా ప‌దుకొనె, సునీల్ గ‌వాస్క‌ర్‌గా తాహిర్ రాజ్ బాసిన్‌, కృష్ణ‌మాచార్య శ్రీకాంత్‌గా జీవా, మ‌ద‌న్ లాల్‌గా హార్డీ సందు, మ‌హీంద్ర‌నాథ్ అమ‌ర్‌నాథ్‌గా స‌కీబ్ స‌లీమ్‌, బ‌ల్వీంద‌ర్ సంధుగా అమ్మి విర్క్‌, వికెట్ కీప‌ర్ స‌య్య‌ద్ కిర్మాణిగా సాహిల్ క‌త్తార్‌, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్‌, దిలీప్ వెంగ్‌స‌ర్కార్‌గా అదినాథ్ కొతారె, ర‌విశాస్త్రిగా కార్వా.. మేనేజ‌ర్ మాన్‌సింగ్‌గా పంక‌జ్ త్రిపాఠి త‌దిత‌రులు న‌టించారు. ఇండియ‌న్ క్రికెట్‌లో మ‌ర‌చిపోలేని అమేజింగ్ జ‌ర్నీతో రూపొందిన ‘83’ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 24న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

Clap Entertainment Production No. 3 in association with Mythri Movie Makers Launched in a Grand manner

 Ritesh Rana, Lavanya Tripati, Naresh Agastya, Satya, Vennela Kishore starrer Clap Entertainment Production No. 3 in association with Mythri Movie Makers Launched in a Grand manner



Ritesh Rana, who made the Super hit Movie ‘Mathu Vadalara’ will be joining forces once again with Clap Entertainment which will produce the movie in association with Mythri Movie Makers. The director readied a surreal comedy story in a fictional world and is touted to be a comedy thriller.


Billed to be an outright entertainer and commercial film, the film will have Lavanya Tripati, Naresh Agastya, Satya, Vennela Kishore and Gundu Sudarshan in the lead roles and is tentatively titled Production No. 3. The film has been launched in a grand manner with a puja ceremony today at the Westin Hotel, Hyderabad.


The clap was given by SS Rajamoulli Garu while Koratala Siva Garu directed the first shot. Gunnam Gangaraju Garu switched on the camera and Rajamouli Garu, Koratala Siva Garu along with Mythri producers Naveen Garu, Ravi Garu, Cherry Garu handed the script to the director.


Chiranjeevi (Cherry) and Hemalatha Pedamallu will be producing the film and Naveen Yerneni and Ravi Shankar Yalamanchili of Mythri Movie Makers will be presenting the film.


Kala Bhairava renders soundtracks, while Suresh Sarangam handles the cinematography. Ritesh Rana provides dialogues, while Srinivas is the Art Director and the fights will be choreographed by Shankar master. Alekhya is the Line Producer for the film and Baba Sai is the Executive Producer while Bal Subramaniam KVV is the Chief Executive Producer.


Cast: Lavanya Tripati, Naresh Agastya, Satya, Vennela Kishore, Gundu Sudarshan


Technical Crew:

Dialogues, Story, Screenplay & Direction: Ritesh Rana

Producers: Chiranjeevi (Cherry), Hemalatha Pedamallu

Presenters: Naveen Yereneni, Ravi Shankar Yalamanchili

Banner: Clap Entertainment in association with Mythri Movie Makers

Music Director: Kaala Bhairava

DOP: Suresh Sarangam

Production Designer: Narni Srinivas

Dialogues: Ritesh Rana

Fights: Shankar Uyyala

Line Producer: Alekhya Pedamallu

Executive Producer: Baba Sai

Chief Executive Producer: Bala Subramanyam KVV

Production Controller: Patsa Suman Naga Shekar

Publicity: Baba Sai Kumar

Marketing: First Show

PRO: Madhu Maduri

Vijay Deverakonda’s Liger Schedule With Legend Mike Tyson In USA

 It’s A Wrap For Vijay Deverakonda’s Liger Schedule With Legend Mike Tyson In USA



Young and promising hero Vijay Deverakonda and dashing director Puri Jagannadh’s maiden Pan India project LIGER (Saala Crossbreed) that also marks Legend Mike Tyson’s debut in Indian cinema has wrapped up USA schedule. Mike Tyson’s portions have been completed with this schedule.


The shooting went smoothly with Mike Tyson lending full co-operation for the team. They had an amazing time working with the Legend. The USA schedule indeed is the best shoot schedule so far for the entire team. The wrap-up party was hosted in one of the biggest restaurants, ‘Catch’. The makers shared wrap-up party pictures of Mike Tyson posing alongside the team. Mike Tyson’s wife Kiki can also be seen in the pictures.


Mike Tyson has played a crucial and mighty role in the film and it will be an eye feast to see the happening star alongside the Legend Mike Tyson.


In association with Puri connects, the film is being produced jointly by Bollywood's leading production house Dharma Productions. Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film.


Given it is one of the craziest Pan India projects and moreover The Great Mike Tyson on board, Puri connects and Dharma Productions are making the film on a grand scale.


The film in the crazy combination has cinematography handled by Vishnu Sarma, while Kecha from Thailand is the stunt director.


Ramya Krishnan and Ronit Roy play prominent roles in Liger which is being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages.


Liger is in last leg of shooting and the makers are planning to release the movie in first half of 2022.


Cast: Vijay Deverakonda, Ananya Panday, Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Ali, Makarand Desh Pandey and Getup Srinu.


Technical Crew:

Director: Puri Jagannadh

Producers: Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta

Banners: Puri connects and Dharma Productions

DOP: Vishnu Sarma

Art Director: Jonny Shaik Basha

Editor: Junaid Siddiqui

Stunt Director: Kecha

Actor Shani Salmon Interview

 "రామ్ అసుర్'లో నా పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది



★ శివ‌న్న పాత్ర నా ఎదుగుద‌ల‌ను మ‌రింత పెంచింది

★ రాజ‌మౌళి గారి ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నా*

★ తెలుగు ప్రేక్ష‌కుల అండ‌దండ‌లే శ్రీరామ‌ర‌క్ష‌

- ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు షానీ సాల్‌మాన్(షానీ)


బ్లాక్‌స్టార్‌గా తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు సుప‌రిచితుడైన షానీ న‌టించిన రామ్ అసుర్ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన నేప‌ధ్యంలో ఆయ‌న త‌న అంత‌రంగాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.... "బ్లాక్ స్టార్‌గా గుర్తింపు పొందిన తాను తెలుగు ప్రేక్ష‌కుల అభిమానానికి శిర‌సు వంచి పాదాభివంద‌నం చేస్తున్నా అని తెలిపారు. రామ్ అసుర్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డం త‌న జీవితంలో కీల‌క మ‌లుపని, విజ‌యోత్స‌వ స‌భ‌ల‌కు ఎక్క‌డికెళ్లినా శివ‌న్నా.... అంటూ ప్రేక్ష‌కులు ఆప్యాయంగా పిల‌వ‌డం ఎంతో సంతోషాన్ని క‌ల్గిస్తుంద‌ని పేర్కొంటూ... శివ‌న్న పాత్ర‌తో త‌న గుర్తింపు మ‌రింత పెరిగింద‌ని తెలిపారు. 


షానీ త‌న ప్ర‌స్థానాన్ని వివ‌రిస్తూ... 'బేసిక‌ల్‌గా స్పోర్ట్స్‌మెన్ కావ‌డంతో హైద‌రాబాద్ న‌గ‌రంలో ఓ హోల్డింగ్ చూశాన‌ని, ఆ ప్ర‌క‌ట‌న‌లో అథ్లెటిక్స్ అండ్ జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు కావాల‌ని, అర్హులైన వారు సంప్ర‌దించాల‌ని ఉంది. స్వ‌త‌హాగా తాను నేష‌న‌ల్ ఛాంపియ‌న్ అయినందున ద‌ర‌ఖాస్తు చేసిన‌ట్లు తెలిపారు. 2003లో ఇంట‌ర్వ్యూకి వెళ్లిన‌ప్పుడు ప్రఖ్యాత ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గారి సినిమా ఆడిష‌న్స్ ప్ర‌క‌ట‌న అని తెలుసుకున్నాను. ఇంట‌ర్వ్యూకి వెళ్లిన‌ప్పుడు రాజ‌మౌళి గారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ త‌న‌ను భుజం త‌ట్టి ప్రోత్స‌హించార‌ని చెప్పారు. త‌న‌ లుక్ వెరైటీగా ఉండ‌డంతో అవ‌కాశం క‌ల్పించారు. అదే త‌న జీవితాన్ని కీల‌క మ‌లుపు తిప్పింద‌ని తెలిపారు. ఆ సినిమా ఘన విజయం కావడంతో సై షాని గా పిలవడం మొదలుపెట్టారు. ఆ సినిమా నాకు మరిన్ని సినిమాలు తెచ్చిపెట్టింది. 


జెడ్చర్లకు చెందిన తాను   ఉస్మానియా యూనివ‌ర్శిటీ లో డిగ్రీ, పీజీ నిజాం కాలేజ్‌లో విద్యాభాస్యం పూర్తి చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. త‌న కెరీర్లో ఇప్ప‌టిదాకా 70కిపైగా సినిమాల్లో న‌టించ‌డం జ‌రిగింద‌న్నారు. రాజ‌మౌళి గారి 'సై' చిత్రం ఘ‌న విజ‌యం సాధించి త‌న‌ను ఈ స్థాయికి తీసుకొచ్చింద‌ని గుర్తుచేసుకున్నారు. ఘ‌ర్ష‌ణ‌, దేవదాస్‌, హ్యాపీ, రెడీ, ఒక్క మ‌గాడు, శ‌శిరేఖా ప‌రిణ‌యం లాంటి చిత్రాల్లో విభిన్న పాత్ర‌లు పోషించ‌గా, అలా.. ఎలా.. చిత్రంలో రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తో కలిసి హీరోకు సమానమైన పాత్ర పోషించి ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వ‌డం జ‌రిగింద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల్లో30 సినిమాలు సూప‌ర్ హిట్‌గా నిలిచాయ‌న్నారు. 'దేశంలో దొంగ‌లు ప‌డ్డారు' సినిమాలో కూడా హీరో పాత్ర పోషించాను. అలా.. ఎలా.., దేశంలో దొంగ‌లు ప‌డ్డారు, రాక్ష‌సి చిత్రాల‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు చెప్పారు. 

                       

డిసెంబ‌రులో తాను నటించిన కిన్నెర‌సాని, అమ‌ర‌న్, గ్రే, పంచతంత్ర క‌థ‌లు... చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. తాను న‌ల్ల‌గా ఉండ‌డం కూడా త‌న‌కు ఒక ఎసెట్‌ అని న‌వ్వుతూ... చెబుతూ "బ్లాక్‌స్టార్" అనేది స్నేహితులు ముద్దుగా పిలుచుకుంటార‌ని చెప్పారు. తాను మంచి స్టార్‌గా ఎద‌గాల‌ని, చిత్ర రంగంలో పేద, వృద్ధ క‌ళాకారుల‌ను ఆదుకోవాల‌న్న‌ది ల‌క్ష్యంగా మందుకు సాగుతున్న‌ట్లు తెలిపారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో కొత్త‌గా వ‌చ్చే న‌టీన‌టుల‌ను ప్ర‌తిఒక్క‌రూ ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, కాలేజ్ మిత్రుడు విజ‌యానంద్ తో క‌లిసి గ‌డ‌చిన ఐదేళ్లుగా ఓవ‌ర్‌-7 ప్రొడ‌క్ష‌న్ ద్వారా నూత‌న క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించ‌డంతో పాటు యాడ్ ఫిలిమ్స్ అండ్ క్యాస్టింగ్‌, ఫిలిం ప్రొడ‌క్ష‌న్‌, సెల‌బ్రిటీ మేనేజ్‌మెంట్‌, ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఓవ‌ర్‌-7 ప్రొడ‌క్ష‌న్ ద్వారా సామాజిక బాధ్య‌త‌గా అంధులు, వృద్ధులు, అనాధలకు అన్నదానం, వైద్య సాయం, దుస్తులు అందించ‌డం వంటి సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. రీసెర్చ్ మీడియా గ్రూపులో క్రియేటీవ్ హెడ్‌గా అనేక కార్పొరేట్ ఈవెంట్‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. తెలుగు చిత్రాల‌కు ఎంతోమంది న‌టీన‌టుల‌కు అవ‌కాశాలు క‌ల్పించ‌డం జ‌రిగింది. వారంతా ఇప్పుడు స్టార్స్‌గా రాణించ‌డం సంతోషాన్ని క‌లిగిస్తుంది. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ ఈ చిత్రాల్లో న‌టించ‌డం జ‌రిగింద‌ని, బాలీవుడ్‌లో  వెల్‌కం టూ స‌జ్జ‌న్‌పూర్ చిత్రంలో మంచి పాత్ర పోషించిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ మధ్యే కొన్ని కథలు విన్నానని... ఆ సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతానని... నాకు ఈ గుర్తింపు రావడానికి కారణమైన దర్శకులకు, నిర్మాతలకు, నా తోటి నటీనటులకు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న' అని అన్నారు.

Heroine Poorna Interview About Akhanda

 అఖండ లో బాలా సర్‌ను చూస్తే దేవుడిని చూసినట్టు అనిపించేది  -  హీరోయిన్ పూర్ణ



నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం పూర్ణ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..


2008లో సీమ టపాకాయ్ విడుదలైంది. ఇన్నేళ్ల తరువాత ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో ఆఫర్ రావడం ఆనందంగా ఉంది. అవును మూవీ తరువాత చాలా మంచి ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు కూడా ఈ పాత్రను వేరే ఆర్టిస్ట్ చేయాలి. కానీ అదృష్టం కొద్దీ నాకు వచ్చింది. బోయపాటి గారు కాల్ చేయడంతో సంతోషించాను. ఇందులో నేను పద్మావతి అనే పాత్రలో కనిపిస్తాను. చాలా ఇంపార్టెంట్ రోల్. శ్రీకాంత్ గారి బాలా సర్‌కు మధ్యలో ఈ పాత్ర ఉంటుంది.


బోయపాటి గారి సినిమాలో స్త్రీ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. హీరోయిన్ కారెక్టర్ కాకుండా మిగతా పాత్రలు కూడా ఎంతో స్ట్రాంగ్ ఉంటాయి. పాత్రలో డామినేషన్ ఉంటుందని బోయపాటి గారు ముందే చెప్పారు. బాలా సర్ ముందు నిలబడి అలాంటి డైలాగ్స్ చెప్పాలా? అని భయపడ్డాను. కానీ బాలా సర్ ఎంతో సహకరించారు. సెట్‌లో ఎంతో కంఫర్ట్‌గా ఉంటారు. ఆయన ఎనర్జీ మామూలుగా ఉండదు. ఒక్కో ఫైట్ దాదాపు 17 రోజులు ఉండేది. మేం చివర్లో జాయిన్ అయ్యేవాళ్లం. సెట్‌లో అందరూ అలిసిపోయి కనిపిస్తారు. కానీ బాలా సర్ మాత్రం..  సింహం సింహమే. ఎంతో ఎనర్జీగా ఉంటారు. నేను ఫోన్‌లో ఆయన వాల్ పేపర్ పెట్టుకుంటాను. ఆ ఎనర్జీ నాక్కూడా రావాలని అనుకుంటాను.


ఇందులో నాకు మూడు సీన్లు ఉంటాయి. కచ్చితంగా అందరూ మాట్లాడుకుంటారు. పూర్ణను గుర్తిస్తారు. మంచి పాత్రను పోషించారు అని ఆడియెన్స్ అంటారు. నా పాత్ర చాలా ముఖ్యమైంది.


మెచ్యూర్డ్, డామినేషన్, హెల్త్ మినిష్టర్ లాంటి కారెక్టర్. హీరోయిన్ ఐఏఎస్ పాత్రలో కనిపిస్తారు.. ఆమెను ట్రైన్ చేస్తాను. చైల్డిష్‌లా ఉంటే కుదరదు.


నాకు ఈ చిత్రంలో బాలా సర్ పోషించిన రెండు పాత్రలతో సీన్లు ఉంటాయి. అఘోర పాత్రలో బాలా సర్‌ను చూస్తే నాకు దేవుడిని చూసినట్టు అనిపించేది.


నా లక్కీ నంబర్ 5. 2021లో మొత్తం కూడితే 5 వస్తుంది. నాకు ఈ ఏడాదిలొ మంచి పాత్రలు వస్తున్నాయి. లాక్డౌన్ తరువాత చాలా ఆఫర్లు వచ్చాయి. హీరోయిన్‌గా చేయాలని కాదు.. నాకు నాలుగైదు సీన్లు ఉన్నా కూడా ఇంపాక్ట్ చూపించాలి. దృశ్యం 2లో అందరూ బాగా నటించావని అన్నారు. అలా నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలని అనుకుంటాను. సుహాసిని, రేవతి వంటి వారిని చూసి ఎలాంటి పాత్రలైనా చేయాలని అనుకున్నాను.


కేరళ నుంచి ఇక్కడకు వచ్చి ఇన్నేళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్నానంటే అదే నాకు చాలా గొప్ప విషయం. నేను ఇండస్ట్రీకి సింగిల్‌గా వచ్చాను. అప్పుడు ఎవ్వరూ తెలీదు. కానీ ఇంత వరకు ప్రయాణించాను. దానికి ముఖ్య కారణం మా అమ్మ. దర్శకుడు మిస్కిన్ సర్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందరూ నన్ను ప్రోత్సహించారు.


నాకు డ్యాన్స్ బాగా వచ్చు. కానీ డ్యాన్స్ చేసే పాత్ర మాత్రం ఇంత వరకు రాలేదు. డబ్బే కావాలంటే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయొచ్చు. కానీ కెరీర్ బాగుండాలి.. సుధీర్ఘంగా సాగాలంటే మాత్రం మంచి చిత్రాలనే ఎంచుకోవాలి. కానీ ప్రతీ ఒక్కరూ తప్పులు చేస్తారు. అలా నేను కూడా చేశాను.


పాత్ర నాకు నచ్చితే ఒప్పుకుంటాను. పాత్ర డిమాండ్ చేస్తే, నాకు నచ్చిన క్యాస్టూమ్ అయితే వేసుకుంటాను. ఇవన్నీ ముందే ఆలోచించి పాత్రకు ఓకే చెబుతాను. ఎందుకంటే సెట్‌కు వెళ్లాక అది వేసుకోలేను.. ఇది వేసుకోలేను అంటే అందరికీ ప్రాబ్లం అవుతుంది.


చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు చూడను. నా పాత్ర నచ్చితే ఓకే చెబుతాను. అయితే ఓ నటిగా అన్ని రకాలుగా చూసుకుంటాను.


టీవీలో కనిపిస్తే మళ్లీ సినిమా అవకాశాలు వస్తాయో?రాదో అనే అనుమానం ఉండేది. కానీ నేను చాలా లక్కీ. సినిమా అవకాశాలు వస్తున్నాయి. నాకు ఢీ షో ఎప్పుడూ ప్లస్ అవుతూనే వచ్చింది. కొన్ని కొన్ని తప్పులు మాట్లాడినా కూడా తెలుగు ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాను.


మనం పబ్లిక్ ప్రాపర్టీ. ప్రజల వల్లే మనం సెలెబ్రిటీలు అవుతాం. వారు పాజిటివ్, నెగెటివ్ కామెంట్లు చేస్తారు. నేను అన్నీ ఒకేలా తీసుకుంటాను. నేను సోషల్ మీడియాలో అన్ని కామెంట్లను చదువుతాను. నెగెటివ్ కామెంట్లను చూసి ఎంతో మార్చుకున్నాను.


ఈ సినిమాతో నా కెరీర్ టర్న్ అవుతుందని ప్రారంభ దశలో అనుకున్నాను. కానీ ఇప్పుడు అలాంటి అభిప్రాయం ఏమీ లేదు. అఖండ తరువాత మంచి పాత్రలు వస్తాయని అనుకుంటాను.


నవంబర్‌లో నా చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. 3 రోజెస్, దృశ్యం 2 రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అఖండ విడుదల కాబోతోంది. తమిళ, కన్నడ చిత్రాలు కూడా విడుదలకు సిద్దంగా ఉన్నాయి


Kiran Abbavaram’s “Sammathame” First Song Lyrical Out

 Kiran Abbavaram’s “Sammathame” First Song Lyrical Out


Young and energetic hero Kiran Abbavaram has been attempting distinctive subjects. After scoring commercial hits with his first two films, Kiran Abbavaram is now coming up with a musical romantic entertainer “Sammathame” which is set in urban backdrop.

Title and first look poster and then first glimpse of the movie raised expectations. Now, they have begun musical promotions. Lyrical video of first single Krishna & Satyabhama is out now.

Like how beautiful Krishna and Satyabhama’s love story was, the romantic track of Kiran and Chandini too looks adorable in this song. Sekhar Chandra has come up with an enjoyable number that has groovy beats. Krishna Kanth’s lyrics are a blend of Telugu and English words. Yazin Nazir and Sireesha Bhagavatula make this song sound much more charming with their pleasant singing.

Kiran Abbavaram and Chandini Chowdary are super cool in their respective roles. Director Gopinath Reddy came up with a different love story and like the first glimpse the first song too has full of positive vibes.

Produced by K Praveena under UG Productions banner, “Sammathame” is presently in post-production phase. Cinematography is by Sateesh Reddy. The makers are planning to release the movie soon.

Cast: Kiran Abbavaram, Chandini Chowdary and others.

Technical Crew:
Story, Screenplay, Direction: Gopinath Reddy
Producer: Kankanala Praveena
Banner: UG Productions
Music Director: Sekhar Chandra
DOP: Sateesh Reddy Masam
Editor: Vilpav Nyshadam
Art Director: Sudheer Macharla
PRO: Vamsi-Shekar

Kiran Abbavaram - Ramesh Kaduri - Clap Entertainment Production No. 4 in association with Mythri Movie Makers Launched in a Grand manner

 Kiran Abbavaram - Ramesh Kaduri - Clap Entertainment Production No. 4 in association with Mythri Movie Makers Launched in a Grand manner



Ramesh Kaduri, who worked as an Associate director under KS Ravindra (Bobby) and Gopichand Malineni will be debuting with this movie. Kiran Abbavaram the promising upcoming star hero in the making, fresh from the superhit success of SR Kalyana Mandapam will be playing the male lead and will be joining forces with Clap Entertainment which will produce the movie in association with Mythri Movie Makers.


Touted to be a pakka mass entertainer and a commercial film, the film will be tentatively titled Production No. 4. The film has been launched in a grand manner with a pooja ceremony today in Hyderabad.


Chiranjeevi (Cherry) and Hemalatha Pedamallu will be producing the film and Naveen Yerneni and Ravi Shankar Yalamanchili of Mythri Movie Makers will be presenting the film.


Venkat C Dileep will handle the cinematography. Ramesh Kaduri provides dialogues, while JV is the Art Director. Alekhya is the Line Producer, Baba Sai is the Executive Producer and Bal Subramaniam KVV is the Chief Executive Producer for the film.


The clap was given by Sri Koratala Shiva Garu as Sri Gopichand Malineni directed the first shot. The camera was switched on by Sri KS Ravindra (Bobby) Garu while Sri Koratala Shiva Garu & Sri Gopichand Malineni & Sri KS Ravindra (Bobby) Garu & Mythri producers Naveen garu, Ravi garu, Cherry garu handed over the script.



Cast: Kiran Abbavaram


Technical Crew:

Story, Screenplay & Direction: Ramesh Kaduri

Producers: Chiranjeevi (Cherry), Hemalatha Pedamallu

Presenters: Naveen Yereneni, Ravi Shankar Yalamanchili

Banner: Clap Entertainment in association with Mythri Movie Makers

DOP: Venkat C Dileep

Production Designer: JV

Dialogues: Ramesh Kaduri, Surya

Line Producer: Alekhya Pedamallu

Executive Producer: Baba Sai Kumar 

Chief Executive Producer: Bala Subramanyam KVV

Production Controller: Suresh Kandula

Marketing: First Show

PRO: Madhu Maduri

SkyLab Pre Release Event Held Grandly

‘స్కై లాబ్‌’ సినిమా పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ కావాల‌ని కోరుకుంటున్నాను :  నేచుర‌ల్ స్టార్ నాని



వెర్సటైల్ యాక్టర్స్ స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘స్కైలాబ్‌’. నిత్యామీన‌న్ స‌హ నిర్మాత‌.  1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. డిసెంబర్ 4న మూవీ విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నేచుర‌ల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో...


నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ ‘‘సాధారణంగా సినిమా రిలీజ్ దగ్గర పడుతుందంటే టీమ్ సభ్యుల్లో తెలియని ఓ టెన్ష‌న్ ఉంటుంది. కానీ ఈరోజు స్కై లాబ్ టీమ్‌లో ఆ టెన్ష‌న్ క‌న‌ప‌డ‌టం లేదు. అంద‌రి ముఖాలు వెలిగిపోతున్నాయి. కొన్ని సినిమాల‌కు అలా కుదురుతాయి. వైబ్ చెప్పేస్తుంది, సినిమా కొట్టేస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించి ఒక‌రిపై ఒక‌రికి ఉండే న‌మ్మ‌కం. పాజిటివ్ నెస్‌, ప్రేమ‌, సినిమా విజువ‌ల్స్ అన్నీ చూస్తుంటే సినిమా చాలా పెద్ద స‌క్సెస్ అయిపోతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. స్కై లాబ్ గురించి నేను కూడా చిన్న‌ప్పుడు క‌థ క‌థ‌లుగా విన్నాను. అంద‌రూ చాలా భ‌య‌ప‌డ్డారు. అలాంటి ఐడియాతో సినిమా చేయ‌డ‌మ‌నేది చాలా ఎగ్జ‌యిటింగ్ అనే చెప్పాలి. నిజానికి నేను డైరెక్ట‌ర్ విశ్వ‌క్‌తో మాట్లాడినప్పుడు నాకు తెలిసిందేంటంటే, ఈ క‌థ‌ను ముందు నాకే చెబుతామ‌ని అనుకుంటే కుద‌ర‌లేద‌ని. చాలా మిస్ అయ్యాన‌ని బాధేసింది. అయితే నిత్యా, పృథ్వీ నిర్మాత‌లు, మంచి టీమ్  చేతిలో ప‌డింద‌ని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలా మొద‌లైంది సినిమా వ‌చ్చి దాదాపు ప‌దేళ్లు అయ్యింది. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యాల్లో చిన్న పిల్ల‌ల్లా ఉండేవాళ్లం. స్కూల్లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్‌లా ఆ సినిమాను ఎంజాయ్ చేశాం. మ‌ణిర‌త్నం వంటి డైరెక్ట‌ర్స్‌కే నిత్యా మీన‌న్ ఫేవ‌రేట్ యాక్ట‌ర్‌. ఆమె ఏ లాంగ్వేజ్‌లో సినిమా చేసినా మంచి న‌టి అనే పేరు తెచ్చుకుంది. అంత మంచి యాక్ట‌ర్ ఈ సినిమాతో త‌న ప్రొడ‌క్ష‌న్ జ‌ర్నీ స్టార్ట్ చేసిందంటే, గ‌ర్వంగా ఫీల్ అవుతుందంటే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించ‌వచ్చు. రామానాయుడుగారిలా, సురేష్‌బాబుగారిలా, దిల్‌రాజుగారిలా వంద‌ల సినిమాలు త‌ను ప్రొడ్యూస్ చేయాల‌ని కోరుకుంటున్నాను. ఇక స‌త్య‌దేవ్ గురించి చెప్పాలంటే.. త‌ను స్టార్ అవ‌బోతున్న యాక్ట‌ర్‌లా అనిపిస్తాడు. త‌ను ఎంచుకుంటున్న సినిమాలు, పెర్ఫామెన్స్‌ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటి వాళ్లు మంచి స్థాయికి చేరుకుంటే మ‌న‌కెంతో సంతోషంగా ఉంటుంది. త‌న‌లాంటి డిఫ‌రెంట్ మూవీస్ చేసే హీరోలు మ‌న‌కు కావాలి. త‌న‌కు ఆల్ ది వెరీ బెస్ట్‌. రాహుల్ రామ‌కృష్ణ టెరిఫిక్ యాక్ట‌ర్‌. త‌న‌కు అభినంద‌న‌లు. డైరెక్ట‌ర్ విశ్వ‌క్‌కి ఆల్ ది బెస్ట్‌. స్కై లాబ్ స‌క్సెస్‌కి స్కై లిమిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిసెంబ‌ర్ 4న స్కైలాబ్ బాక్సాఫీస్ మీద ప‌డ‌బోతుందని నాకు తెలుసు. సినిమా పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


స‌త్య‌దేవ్ మాట్లాడుతూ  ‘‘స్కై లాబ్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క‌నిపిస్తున్నాయి. నాని అన్న వ‌చ్చాడంటే సినిమా హిట్‌. త‌ను మా తిమ్మ‌రుసు సినిమాకు వ‌చ్చాడు. నాకు మంచి హిట్ వ‌చ్చింది. ఇది కూడా అలాగే అవుతుంద‌ని భావిస్తున్నాను. డైరెక్ట‌ర్ విశ్వ‌క్‌, నిర్మాత పృథ్వీ సినిమా చూసి చాలా గుండె ధైర్యంతో ఉన్నారు. మంచి టీమ్ వ‌ర్క్ చేసింది. విశ్వం, చంద్రిక సినిమాలోని బండ లింగ‌ప‌ల్లిని అద్బుతంగా రీ క్రియేట్ చేశారు. ప్ర‌శాంత్ ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్ ఇచ్చాడు. నిర్మాత పృథ్వీ ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్‌. విశ్వ‌క్ ఖండేరావు సినిమా మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాడు. నిత్యా మీన‌న్ గారితో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఆమె ఈ సినిమాతో నిర్మాత‌గా మారినందుకు ఆమె ఎంత సంతోషంగా ఉందో నాకు తెలుసు. డిసెంబ‌ర్ 4న విడుద‌ల‌వుతున్న స్కై లాబ్ చూసి ఇది మా తెలుగు సినిమా అని అంద‌రూ గొప్ప‌గా చెప్పుకుంటారు’’ అన్నారు. 


నిత్యామీన‌న్ మాట్లాడుతూ ‘‘నేను ఈవెంట్స్‌లో పాల్గొన‌డానికి పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌ను. నెర్వ‌స్‌గా ఫీల్ అవుతాను. కానీ ఇక్క‌డ ఉండ‌టం అనేది కాస్త ఎమోష‌న‌ల్‌గానే ఉంది. విశ్వ‌క్ క‌థ చెప్పిన‌ప్పుడు ఎక్స‌లెంట్‌గా ఉంద‌నిపించింది. నేను న‌టిగా నా లైఫ్‌లో చూసిన ద‌ర్శ‌కుల్లో త‌ను బెస్ట్ అని ఫీల్ అవుతున్నాను. త‌న‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంటుంది. నిర్మాత పృథ్వీ పిన్న‌మ‌రాజు వంటి వ్య‌క్తిని ఎక్క‌డా క‌ల‌వ‌లేదు. మంచి సినిమాను మాత్ర‌మే నిర్మించాల‌ని త‌పించే వ్య‌క్తి. ఈ టీమ్ నిర్మాత‌గా నాకు న‌మ్మ‌కాన్ని పెంచారు. రియ‌ల్ ఫుల్ ఎమోష‌న్‌, సోల్ ఉన్న మూవీ స్కై లాబ్‌. నిర్మాత‌గానే కాదు.. నటిగానూ నాకెంతో తృప్తినిచ్చిన సినిమా ఇది. ప్ర‌శాంత్ విహారి ఇచ్చిన సంగీతం సినిమాను మ‌రో లెవ‌ల్‌లో నిల‌బెట్టింది. స‌త్య దేవ్‌, రాహుల్ రామకృష్ణతో న‌టించేట‌ప్పుడు రియ‌ల్ యాక్ట‌ర్స్ అనిపించారు. ఈ సినిమా నిర్మాణంలో భాగ‌మైనందుకు గౌర‌వంగా, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. రియ‌ల్ మూవీగా ఫీల్ కావ‌డంతో నేను ఈ సినిమాలో భాగ‌మైయ్యాను. ఈ మూవీని నా సోల్‌గా ఫీల్ అవుతున్నాను. డిసెంబ‌ర్ 4న మా స్కై లాబ్‌ను ప్ర‌పంచం అంతా చూడ‌బోతుంది’’ అన్నారు. 


డైరెక్టర్ విశ్వక్ ఖండేరావు మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ కావాలనేది 12 ఏళ్ల క‌ల‌.. 4 ఏళ్ల క‌ష్టం. అదే నా సినిమా స్కై లాబ్‌. నా టీమ్ స‌పోర్ట్ లేక‌పోతే నేను ఈ సినిమా చేయ‌లేక‌పోయేవాడిని. సినిమాటోగ్రాఫ‌ర్ ఆదిత్యతో క‌లిసి ఫిల్మ్ స్కూల్‌లో చ‌దువుకున్నాను. అత‌నితో పాటు కొంద‌రు స్నేహితుల‌తో క‌లిసి ఈ సినిమా చేశాను. ఈ స్నేహితులు ఉండ‌టం వ‌ల్లే నేను ధైర్యంగా అడుగులు ముందుకు వేశాను. ర‌వితేజ గిరిజాల ఎడిటింగ్ విష‌యంలో ప్ర‌తి క‌ట్‌కు స‌మాధానం చెప్ప‌గ‌ల‌డు. ఇది సిట్యువేష‌న‌ల్ కామెడీ మూవీ. నేను ఏదైతే సినిమాలో ఉండాల‌ని అనుకున్నానో, దాన్ని ప్ర‌శాంత్ విహారి త‌న సంగీతంతో ప్రాణం పోశాడు. అమేజింగ్ వ‌ర్క్ అందించాడు. యాక్ట‌ర్స్ నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ స‌హా అంద‌రూ ముందే ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండేవారు. నిజానికి ఈ క‌థ‌ను నానిగారికి చెప్పాల‌నుకున్నాను. అయితే ముందు పృథ్వీగారికి చెప్ప‌గానే ఆయ‌న సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేశారు. సినిమా అంటే అంత ప్యాషన్ ఉండే వ్య‌క్తి. అంత మంచి నిర్మాత దొర‌కడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ప్ర‌వ‌ల్లిక‌, న‌రేశ్‌గారు అందించిన స‌పోర్ట్ మ‌ర‌చిపోలేను. ఇక ర‌వికిర‌ణ్‌గారు మంచి ఇన్‌పుట్స్ అందించి సినిమాను సాఫీగా సాగిపోవ‌డానికి స‌పోర్ట్ చేశారు. ఈ సినిమాకు గొప్ప యాక్ట‌ర్స్ దొరికార‌ని చెప్ప‌గ‌ల‌ను. క‌థ విన్న‌ప్ప‌టి నుంచి న‌టిగా, నిర్మాత‌గా ఆమె అందిస్తున్న సహ‌కారం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ప్ర‌తి సినిమాను కుదిరితే ఆమెతోనే చేయాల‌నుకుంటున్నాను. స‌త్య‌దేవ్‌గారి గురించి ఎంత మాట్లాడినా త‌క్కువే. డిఫ‌రెంట్ క‌థ‌ల‌ను రాసుకున్న‌ప్పుడు ఆయ‌న్ని క‌లిసి మాట్లాడ‌వ‌చ్చున‌ని న‌మ్మ‌కం క‌లిగించిన యాక్ట‌ర్‌. ఈ సినిమాలో మ‌రో కొత్త స‌త్య దేవ్‌ను చూస్తారు. ఆయ‌న ఏ రోల్‌ను అయినా చేయ‌గ‌ల‌రు. రాహుల్ సింప్లీ సూప‌ర్బ్‌. అలాగే భ‌ర‌ణిగారు, సుబ్బ‌రాయ శ‌ర్మ‌గారు స‌హా ఇత‌ర న‌టీన‌టులతో క‌లిసి ప‌నిచేయ‌డం మ‌ర‌చిపోలేని ఎక్స్‌పీరియెన్స్‌’’ అన్నారు. 


నిర్మాత పృథ్వీ పిన్న‌మ‌రాజు మాట్లాడుతూ ‘‘మా ఈవెంట్‌కు వ‌చ్చిన నానిగారికి థాంక్స్‌. సింక్ సౌండ్‌లో చేసిన సినిమా ఇది. ముందు కాస్త భ‌య‌ప‌డ్డాను కానీ... క్వాలిటీ ప‌రంగా అమేజింగ్‌గా ఉంటుంది. సౌండ్ డిపార్ట్‌మెంట్ ఎక్స‌లెంట్ స‌పోర్ట్ చేశారు. ప్ర‌శాంత్ అండ్ టీమ్ చేసిన స‌పోర్ట్‌తో మంచి ఔట్‌పుట్ వ‌చ్చింది. సినిమాటోగ్రాఫ‌ర్ ఆదిత్య మా సినిమా కోసం చాలా సినిమాల‌ను వ‌దులుకుని అండ‌గా నిల‌బ‌డ్డాడు. విశ్వ‌క్ సీన్ కన‌స్ట్ర‌క్ష‌న్ నుంచి ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో తెలుసు. మ్యాజిక‌ల్‌గా ఉంటుంది. రాహుల్ రామ‌కృష్ణ టాలెంటెడ్ యాక్ట‌ర్‌. నిత్యామీన‌న్‌గారు సినిమాలోని సెన్సిబిలిటీ ప‌ట్టుకుని మాకు స‌పోర్ట్‌గా నిలిచారు. స‌త్య‌గారిని ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన రోల్స్‌కు భిన్న‌మైన రోల్‌లో చూడ‌బోతున్నారు. అంద‌రూ అందించిన స‌పోర్ట్‌కు థాంక్స్‌’’ అన్నారు. 


చిత్ర స‌మ‌ర్ప‌కుడు డా.ర‌వి కిర‌ణ్ మాట్లాడుతూ ‘‘స్కై లాబ్ అనేది మా టీమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. టైటిల్ విన్న‌వాళ్లు ముందు దీన్ని సైంటిఫిక్ మూవీ అని, సోషియో ఫాంట‌సీ సినిమా అనుకున్నారు. కానీ ట్రైల‌ర్ రిలీజ్ అయిన త‌ర్వాత సినిమా ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యం అంద‌రికీ అర్థ‌మైంది. ట్రైల‌ర్ చూసిన వాళ్లంద‌రూ మాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. మాకు అది మంచి బూస్టింగ్ అయ్యింది. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసే చ‌క్క‌టి సినిమా మా స్కై లాబ్‌’’ అన్నారు. 


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో వివేక్ ఆత్రేయ‌, మున్నా, వెంక‌ట్ మ‌హ స‌హా ఎంటైర్ యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.


Naa Kosam Song Teaser From Bangarraju To Be Out On December 1st

 Naa Kosam Song Teaser From Bangarraju To Be Out On December 1st



First look posters of all the lead actors, first single Laddunda and recently released teaser of Bangarraju starring King Akkineni Nagarjuna, Yuva Samrat Naga Chaitanya, Ramya Krishna and Krithi Shetty increased expectations on the film being directed by Kalyan Krishna Kurasala.


They are not taking much time to release second single to continue to please fans and movie buffs. Teaser of second single Naa Kosam will be out on December 1st at 11:12 AM. Naga Shaurya and Krithi Shetty are seen chitchatting with bliss in both the faces. Nee Kosam is going to be a romantic melody.


Anup Rubens is providing soundtracks for the movie and second single seems to have some fascinating visuals with wonderful chemistry between Naga Chaitanya and Krithi Shetty. This is first film together for this pair.


Nagarjuna and Naga Chaitanya are sharing screen space together for the second time, after the most memorable film of Akkineni family Manam. Bangarraju, which is a sequel to Nagarjuna’s biggest blockbuster Soggade Chinni Nayana, is progressing with its shoot.


Zee Studios is co-producing the project with Annapurna Studios Pvt Ltd. Nagarjuna is the producer. Satyanand has penned screenplay, while Yuvaraj handles the cinematography.


Cast: Akkineni Nagarjuna, Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty, Chalapathi Rao, Rao Ramesh, Brahmaji, Vennela Kishore and Jhansi


Technical Crew:

Story & Direction: Kalyan Krishna Kurasala

Producer: Akkineni Nagarjuna

Banners: Zee Studios, Annapurna Studios Pvt Ltd

Screenplay: Satyanand

Music: Anoop Rubens

DOP: Yuvaraj

Art Director: Brahma Kadali

PRO: Vamsi-Shekar

Bimbisara Teaser Launched

 నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ టీజర్ విడుదల



డేరింగ్ అండ్ డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె నిర్మిస్తోన్న చిత్రం ‘బింబిసార’ . వశిష్ట దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించిన క‌ళ్యాణ్ రామ్ మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. సోమవారం రోజున(నవంబర్ 29) బింబిసార టీజ‌ర్‌ను నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేశారు. ఏ టైమ్ ట్రావెల్ ఈవిల్ టు గుడ్ అనే క్యాప్ష‌న్‌ను కూడా పోస్ట్ చేశారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే త్రిగ‌ర్తాల సామ్రాజ్యాధినేత బింబిసారుడు ఏక చ‌త్రాధిప‌త్యం కోసం రాజ్యాల‌పై దాడులు చేయ‌డం, ఇత‌ర రాజుల‌ను సామంతుల‌ను చేసుకోవ‌డం.. ఎదురు తిరిగిన వారిని చంపేయ‌డం వంటి ప‌నుల‌ను చేశార‌నే విష‌యాన్ని టీజ‌ర్ ద్వారా తెలియ‌జేశారు. బింబిసారుడిగా క‌ళ్యాణ్ రామ్ లుక్ సింప్లీ సూప‌ర్బ్‌. 

‘‘ఓ స‌మూహం తాలుకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే, కొన్ని వంద‌ల రాజ్యాలు ఆ ఖ‌డ్గానికి త‌ల వంచి బానిసలైతే.. ఇంద‌రి భ‌యాన్ని చూస్తూ ఒక‌రితో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగ‌ర్త‌ల సామ్రాజ్య‌పు నెత్తుటి సంత‌కం. బింబిసారుడి ఏక చ‌త్రాధిప‌త్యం’’ అనే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌తో క‌ళ్యాణ్ రామ్ బింబిసారుడి పాత్ర‌ను ఎలివేట్ చేసిన తీరు.. టీజ‌ర్ చివ‌ర‌లో ప్ర‌స్తుత కాలానికి చెందిన యువ‌కుడిగా హీరో క‌ళ్యాణ్ రామ్ విల‌న్స్‌తో త‌ల‌ప‌డటం సీన్‌ను చూపించారు. టీజ‌ర్‌తోనే సినిమా ఎలా ఉండ‌బోతుంది. ఎలాంటి ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేయ‌బోతున్నామ‌ని మేక‌ర్స్ టీజ‌ర్‌లో తెలిపారు. ముఖ్యంగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌కు సంబంధించిన విజువ‌ల్స్ ఆడియెన్స్‌ను క‌ట్టిప‌డేస్తున్నాయి. 


‘‘ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న హై టెక్నిక‌ల్ వేల్యూస్ మూవీ ఇది. కళ్యాణ్ రామ్ సరసన క్యాథ‌రిన్‌ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తా’’మ‌ని నిర్మాత‌లు తెలిపారు. 


నటీనటులు:


నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, క్యాథిరిన్ ట్రెసా, సంయుక్తా మీన‌న్ త‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు : 

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: వ‌శిష్ఠ్ 

నిర్మాత : హ‌రికృష్ణ.కె

సినిమాటోగ్ర‌ఫీ:  ఛోటా కె.నాయుడు

సంగీతం:  చిరంత‌న్ భ‌ట్‌

డైరెక్ట‌ర్ ఆఫ్ మ్యూజిక్ :  సంతోష్ నారాయ‌ణ్‌

ఎడిట‌ర్‌:  త‌మ్మిరాజు

వి.ఎఫ్‌.ఎక్స్ ప్రొడ్యూస‌ర్‌:  అనిల్ పడూరి

ఆర్ట్‌:  కిర‌ణ్ కుమార్ మ‌న్నె

ఫైట్స్‌:  వెంక‌ట్‌, రామ‌కృష్ణ‌

మాట‌లు :  వాసుదేవ్ మునెప్ప‌గారి

పాట‌లు:  రామ‌జోగ‌య్య శాస్త్రి, శ్రీమ‌ణి, వ‌రికుప్ప‌ల యాద‌గిరి

డాన్స్‌:  శోభి, ర‌ఘు, విజ‌య్, య‌శ్వంత్‌

పి.ఆర్‌.ఒ :  వంశీ కాకా


Ramcharan Trophy 2021

 రామ్ చరణ్ ట్రోఫీ  - 2021.. ఆరు విభాగాల్లో పోటీలు ప్రారంభం!

 


మెగా హీరోల అభిమానులు అంటేనే సేవకు, స్వచ్ఛంద కార్యక్రమాలకు పెట్టింది పేరు. మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ నటించిన 'RRR' చిత్రం జనవరి 7 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా రామ్ చరణ్ ట్రోఫీ - 2021' పేరుతో క్లాసికల్ డాన్స్ ,వెస్టర్న్ డాన్స్, పాటల  పోటీలు, సోలో యాక్టింగ్, షార్ట్ ఫిలిం మేకింగ్, బాడీ బిల్డింగ్ తదితర ఆరు విభాగాలలో డిసెంబర్ 9,10,11  తేదీలలో వైజాగ్  పబ్లిక్   లైబ్రరీ   ఆడిటోరియం  లో సెమీఫైనల్స్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు వైజాగ్ VJF ప్రెస్ క్లబ్లో రాష్ట్ర స్థాయి పోటీల పోస్టర్ ని ప్రముఖ స్టార్ మేకర్ సత్యానంద్ చేతుల మీదుగా ప్రారంభించగా, రాంచరణ్ ట్రోఫీని ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు ,రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ, మెగా అభిమానులు  & ఆర్గనైజర్లు సమక్షంలో ట్రోఫీని ప్రారంభించారు. ఈ ''రాంచరణ్ ట్రోఫీ '' పోటీలలో ఆరు విభాగాల్లో గెలిచిన ఫైనల్స్ విజేతలకు 19 - 12 -2021వ తేదీ ఉదయం 9 గంటలకు విశాఖ ఉడా చిల్డ్రన్స్ ఏరినా ఆడిటోరియం లో ప్రముఖ అతిధుల చేతుల మీదుగా కాష్ ప్రైజ్  సహాయ ట్రోఫీ బహుకరించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం 'ధనుంజయ ఛానల్' నిర్వహిస్తోంది. ఈ మేరకు  రాష్ట్ర చిరంజీవి యువత భవాని అధ్యక్షులు రవి కుమార్ ఒక ప్రకటన విడుదల చేసారు.

Pushpa The Rise Trailer on December 6th

 డిసెంబర్ 6న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప: ది రైజ్’ ట్రైలర్ విడుదల.. 



ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచి మరో మేజర్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇప్పుడు బయటికి వచ్చింది. అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్  ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి, సామి సామి, ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. డిసెంబర్ 6న ట్రైలర్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ విడుదలైంది. అందులో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్. 


నటీనటలు: 

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు


టెక్నికల్ టీం: 

దర్శకుడు: సుకుమార్

నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ 

కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా 

సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్ 

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 

ఆర్ట్ డైరెక్టర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే 

సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి 

ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R

ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్

లిరిసిస్ట్: చంద్రబోస్ 

క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్

మేకప్: నాని భారతి 

CEO: చెర్రీ

కో డైరెక్టర్: విష్ణు 

లైన్ ప్రొడ్యూసర్: KVV బాల సుబ్రమణ్యం 

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా

PRO: ఏలూరు శ్రీను, మడూరి మధు

Tremendous Response for RadheShyam Romantic Lyrical

‘రాధే శ్యామ్’ నుంచి నగుమోము తారలే రొమాంటిక్ సాంగ్ టీజర్‌కు అనూహ్యమైన స్పందన..



ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. అభిమానులకు సరికొత్త మ్యూజిక్ ఫీల్ ఇవ్వాలి అని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాలో మరే సినిమాకు సాధ్యంకాని స్థాయిలో ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆషికీ ఆ గయీ హిందీ సాంగ్ టీజర్ కు మంచి అప్లాజ్ వచ్చింది.

తాజాగా తెలుగు సాంగ్ టీజర్ విడుదల అయింది. నగుమోము తారలే అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా.. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ టీజర్ వైరల్ అవుతుంది. ఈ పాట కచ్చితంగా అభిమానులకు నచ్చుతుందని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్. ఈ పాటలో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ చాలా రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. సముద్రపు తీరంలో పాట చాలా రిచ్‌గా కనిపిస్తుంది. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్ నార్త్ వర్షన్స్ కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ డార్లింగ్‌ని సరికొత్త లుక్‌లో ప్రెజెంట్ చేశారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్  ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.


నటీనటులు:

ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు..


టెక్నికల్ టీమ్:


కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె  రాధాకృష్ణ కుమార్

నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌

బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్

సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌

డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్

సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి

ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్

పిఆర్ఓ : ఏలూరు శ్రీను