Actor Shani Salmon Interview

 "రామ్ అసుర్'లో నా పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది



★ శివ‌న్న పాత్ర నా ఎదుగుద‌ల‌ను మ‌రింత పెంచింది

★ రాజ‌మౌళి గారి ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నా*

★ తెలుగు ప్రేక్ష‌కుల అండ‌దండ‌లే శ్రీరామ‌ర‌క్ష‌

- ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు షానీ సాల్‌మాన్(షానీ)


బ్లాక్‌స్టార్‌గా తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు సుప‌రిచితుడైన షానీ న‌టించిన రామ్ అసుర్ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన నేప‌ధ్యంలో ఆయ‌న త‌న అంత‌రంగాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.... "బ్లాక్ స్టార్‌గా గుర్తింపు పొందిన తాను తెలుగు ప్రేక్ష‌కుల అభిమానానికి శిర‌సు వంచి పాదాభివంద‌నం చేస్తున్నా అని తెలిపారు. రామ్ అసుర్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డం త‌న జీవితంలో కీల‌క మ‌లుపని, విజ‌యోత్స‌వ స‌భ‌ల‌కు ఎక్క‌డికెళ్లినా శివ‌న్నా.... అంటూ ప్రేక్ష‌కులు ఆప్యాయంగా పిల‌వ‌డం ఎంతో సంతోషాన్ని క‌ల్గిస్తుంద‌ని పేర్కొంటూ... శివ‌న్న పాత్ర‌తో త‌న గుర్తింపు మ‌రింత పెరిగింద‌ని తెలిపారు. 


షానీ త‌న ప్ర‌స్థానాన్ని వివ‌రిస్తూ... 'బేసిక‌ల్‌గా స్పోర్ట్స్‌మెన్ కావ‌డంతో హైద‌రాబాద్ న‌గ‌రంలో ఓ హోల్డింగ్ చూశాన‌ని, ఆ ప్ర‌క‌ట‌న‌లో అథ్లెటిక్స్ అండ్ జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు కావాల‌ని, అర్హులైన వారు సంప్ర‌దించాల‌ని ఉంది. స్వ‌త‌హాగా తాను నేష‌న‌ల్ ఛాంపియ‌న్ అయినందున ద‌ర‌ఖాస్తు చేసిన‌ట్లు తెలిపారు. 2003లో ఇంట‌ర్వ్యూకి వెళ్లిన‌ప్పుడు ప్రఖ్యాత ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గారి సినిమా ఆడిష‌న్స్ ప్ర‌క‌ట‌న అని తెలుసుకున్నాను. ఇంట‌ర్వ్యూకి వెళ్లిన‌ప్పుడు రాజ‌మౌళి గారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ త‌న‌ను భుజం త‌ట్టి ప్రోత్స‌హించార‌ని చెప్పారు. త‌న‌ లుక్ వెరైటీగా ఉండ‌డంతో అవ‌కాశం క‌ల్పించారు. అదే త‌న జీవితాన్ని కీల‌క మ‌లుపు తిప్పింద‌ని తెలిపారు. ఆ సినిమా ఘన విజయం కావడంతో సై షాని గా పిలవడం మొదలుపెట్టారు. ఆ సినిమా నాకు మరిన్ని సినిమాలు తెచ్చిపెట్టింది. 


జెడ్చర్లకు చెందిన తాను   ఉస్మానియా యూనివ‌ర్శిటీ లో డిగ్రీ, పీజీ నిజాం కాలేజ్‌లో విద్యాభాస్యం పూర్తి చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. త‌న కెరీర్లో ఇప్ప‌టిదాకా 70కిపైగా సినిమాల్లో న‌టించ‌డం జ‌రిగింద‌న్నారు. రాజ‌మౌళి గారి 'సై' చిత్రం ఘ‌న విజ‌యం సాధించి త‌న‌ను ఈ స్థాయికి తీసుకొచ్చింద‌ని గుర్తుచేసుకున్నారు. ఘ‌ర్ష‌ణ‌, దేవదాస్‌, హ్యాపీ, రెడీ, ఒక్క మ‌గాడు, శ‌శిరేఖా ప‌రిణ‌యం లాంటి చిత్రాల్లో విభిన్న పాత్ర‌లు పోషించ‌గా, అలా.. ఎలా.. చిత్రంలో రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తో కలిసి హీరోకు సమానమైన పాత్ర పోషించి ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వ‌డం జ‌రిగింద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల్లో30 సినిమాలు సూప‌ర్ హిట్‌గా నిలిచాయ‌న్నారు. 'దేశంలో దొంగ‌లు ప‌డ్డారు' సినిమాలో కూడా హీరో పాత్ర పోషించాను. అలా.. ఎలా.., దేశంలో దొంగ‌లు ప‌డ్డారు, రాక్ష‌సి చిత్రాల‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు చెప్పారు. 

                       

డిసెంబ‌రులో తాను నటించిన కిన్నెర‌సాని, అమ‌ర‌న్, గ్రే, పంచతంత్ర క‌థ‌లు... చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. తాను న‌ల్ల‌గా ఉండ‌డం కూడా త‌న‌కు ఒక ఎసెట్‌ అని న‌వ్వుతూ... చెబుతూ "బ్లాక్‌స్టార్" అనేది స్నేహితులు ముద్దుగా పిలుచుకుంటార‌ని చెప్పారు. తాను మంచి స్టార్‌గా ఎద‌గాల‌ని, చిత్ర రంగంలో పేద, వృద్ధ క‌ళాకారుల‌ను ఆదుకోవాల‌న్న‌ది ల‌క్ష్యంగా మందుకు సాగుతున్న‌ట్లు తెలిపారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో కొత్త‌గా వ‌చ్చే న‌టీన‌టుల‌ను ప్ర‌తిఒక్క‌రూ ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, కాలేజ్ మిత్రుడు విజ‌యానంద్ తో క‌లిసి గ‌డ‌చిన ఐదేళ్లుగా ఓవ‌ర్‌-7 ప్రొడ‌క్ష‌న్ ద్వారా నూత‌న క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించ‌డంతో పాటు యాడ్ ఫిలిమ్స్ అండ్ క్యాస్టింగ్‌, ఫిలిం ప్రొడ‌క్ష‌న్‌, సెల‌బ్రిటీ మేనేజ్‌మెంట్‌, ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఓవ‌ర్‌-7 ప్రొడ‌క్ష‌న్ ద్వారా సామాజిక బాధ్య‌త‌గా అంధులు, వృద్ధులు, అనాధలకు అన్నదానం, వైద్య సాయం, దుస్తులు అందించ‌డం వంటి సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. రీసెర్చ్ మీడియా గ్రూపులో క్రియేటీవ్ హెడ్‌గా అనేక కార్పొరేట్ ఈవెంట్‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. తెలుగు చిత్రాల‌కు ఎంతోమంది న‌టీన‌టుల‌కు అవ‌కాశాలు క‌ల్పించ‌డం జ‌రిగింది. వారంతా ఇప్పుడు స్టార్స్‌గా రాణించ‌డం సంతోషాన్ని క‌లిగిస్తుంది. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ ఈ చిత్రాల్లో న‌టించ‌డం జ‌రిగింద‌ని, బాలీవుడ్‌లో  వెల్‌కం టూ స‌జ్జ‌న్‌పూర్ చిత్రంలో మంచి పాత్ర పోషించిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ మధ్యే కొన్ని కథలు విన్నానని... ఆ సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతానని... నాకు ఈ గుర్తింపు రావడానికి కారణమైన దర్శకులకు, నిర్మాతలకు, నా తోటి నటీనటులకు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న' అని అన్నారు.

Post a Comment

Previous Post Next Post