Latest Post

Mega saga continues through Aditya music, this time with “Vakeel saab”

 Mega saga continues through Aditya music, this time with “Vakeel saab”



Aditya Music is the forerunner in Telugu film Industry for the past 30 years with multiple blockbuster

albums in their kitty. Post pandemic when Tollywood is gearing up for big releases, Aditya Music

strategically brought the rights of some biggest blockbusters for the year 2021. Aditya Music having

trust in the craze and power of Power star Pawan Kalyan’s Vakeel Saab, has added it to their

catalogue. Aditya music’s association with Power star Pawan Kalyan was from the times of

Thammudu, Badri and Khushi. They are proud to be part of his sensational hits Gabbar singh and

Atharintiki Daredi.

The audio album of Vakeel Saab released through Aditya Music label is garnering millions of views

on YouTube and other digital streaming platforms. It started with the enchanting song “Maguva

Maguva” released in the year 2020 around Women’s Day. Since then, people have been eagerly

waiting for Vakeel Saab album composed by Thaman S. The second track Sathyameva Jayathe

released around the first week of March, 2021, created ripples in the market.

 

Aditya music has been associated with the Mega family for more than two decades now with almost

all their major hits under Aditya music catalogue which comprises of famous albums of Megastar

Chiranjeevi, Power Star Pawan Kalyan, Mega power star Ram Charan, Varun Tej, Sai Dharam Tej and

Panja Vaisshnav Tej.  

 

Vakeel Saab is slated to hit the big screens on April 9 with a worldwide release. Speaking on the

occasion, Shri Umesh Gupta of Aditya Music has said that they are glad to be associated with Sri

Venkateswara Creations for the much-awaited movie of Power star Pawan Kalyan “Vakeel saab”.

The trailer of Vakeel Saab is already garnering millions of views in You tube and proved the potential

of Power star Pawan Kalyan.

Kichcha Sudeep-starrer Vikrant Rona to release on the 19th of August

 



Kichcha Sudeep-starrer Vikrant Rona to release on the 19th of August 

August 19th is the day where the world gets a new hero – Vikrant Rona. Kichcha Sudeep Vikrant Rona is now slated to meet the audience in theatres on the 19th of August, 2021. The Baadshah rung in the celebrations for having completed 25 years in cinema with the title logo reveal and a 180-seconder sneak-peek of the multilingual pan-India film and both were superimposed on the world's tallest building, Burj Khalifa. 

The reigning Baadshah of the Kannada film industry is prepared to make a positive impact upon the experience of watching movies in the theatres with the announcement of the release date of his much-awaited film. The upcoming pan-world multilingual action adventure will release in fourteen languages and 55 countries. It is one of the most expected films to hit the screens in 2021.

Producer Jack Manjunath says, “As a producer, I'm happy to announce the release date of Vikrant Rona. We endeavour to present the world's new hero, Vikrant Rona to the audience in the language of their preference. The film is a visual wonder and considering the pandemic, we feel the audience deserve to watch a film of such magnitude in theatres. Backed by the star power of Kichcha Sudeep sir. We can't wait to entertain the viewers in the biggest way possible with this film."

Director Anup Bhandari says, "Excited about the release announcement, the post production work is going on full swing. Some of the best technicians are a part of our film and together we are working towards giving our audience a glimpse into the world of Vikrant Rona in the best way possible.

Adding to the big news. Team Vikrant Rona also has confirmed that the film will see a 3D release and more details about it will be shared in a few days.

Directed by Anup Bhandari, produced by Jack Manjunath and Shalini Manjunath, co-produced by Alankar Pandian, music by B Ajaneesh Loknath, DOP William David and Shivkumar of KGF fame has designed the sets for Vikrant Rona. Vikrant Rona stars Kichcha Sudeep, Nirup Bhandari, Neetha Ashok and will hit the theatres on the 19th of August, 2021.

Sevadaas Title Song Launched

 



తెలుగు-బంజారా భాష‌ల్లో రూపొందుతోన్న `సేవాదాస్‌` టైటిల్ సాంగ్ లాంచ్

   ‘గోర్‌ జీవన్‌’ చిత్రంతో హీరోగా, దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న  కేపియన్‌ చౌహాన్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం ‘సేవాదాస్‌’.  తెలుగు, బంజారా భాష‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో  ప్రీతి అశ్రాని హీరోయిన్‌.   మ‌రో హీరోయిన్‌గా రేఖా నిరోషా న‌టిస్తోంది.  సీనియర్‌ నటులు సుమన్‌,  భానుచందర్ కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. హాథీరామ్‌ బాలాజీ క్రియేషన్స్‌  పతాకంపై  వినోద్‌ రైనా ఎస్లావత్‌, సీతారామ్‌ బాదావత్‌ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. బోలే సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని బంజారా భాష‌కు సంబంధించిన  టైటిల్‌ సాంగ్‌ను గురువారం  ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు.  ఈ పాటను యువ గాయకుడు స్వరాగ్‌ ఆపించారు.  నిజాయితీకి మారుపేరైన ఓ తండ్రి బాటలో నడిచే కొడుకు  కథ ఎలా మొదలైంది? ఎలా ముగిసింది? అనేది  ‘సేవాదాస్‌’ చిత్ర కథాంశం.  ఈ చిత్రం షూటింగ్‌  కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.  ప్రస్తుతం  పోస్ట్‌ ప్రొడక్షన్‌ పను ఆఖరి దశలో ఉన్నాయి. త్వరలో ఆడియో   విడుదల‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన అనంత‌రం న‌టుడు సుమ‌న్ మాట్లాడుతూ...``నేను ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది భాష‌ల్లో న‌టించాను. బంజారా భాష‌లో రూపొందుతోన్న `సేవాదాస్‌` తో తొమ్మిది భాష‌ల్లో న‌టించన‌ట్లు అవుతుంది. ఇక ఈ సినిమా లో బంజారా క‌మ్యూనిటీకి ఆది గురువైన సేవాలాల్ పాత్ర‌లో న‌టించాను.  యువ దర్శ‌క నిర్మాత‌లు తెర‌కెక్కిస్తున్నారు.  ఎక్క‌డివారినైనా క‌నెక్ట్ చేసేది ఒక సినిమా మాత్ర‌మే. నా వంతు ప్ర‌య‌త్నంగా బంజారా క‌మ్యూనిటీని నలు దిశ‌లా తెలియ‌జేయాల‌న్న ఉద్దేశంతో ఈ సినిమాలో న‌టించాను. ఇక చౌహాన్  ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా ఎంతో అనుభ‌వం ఉన్నహీరోలా, ద‌ర్శ‌కుడులా  సినిమాను తీర్చిదిద్దాడు. నిర్మాతలు కూడా ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు.  అలాగే ఈ రోజుల్లో పాట‌లు కూడా సినిమాకు చాలా ముఖ్యం. ఇందులో బోలే నాలుగు అద్భుత‌మైన పాట‌లు అందించాడు. క‌మిర్షియ‌ల్ అంశాలతో పాటు బంజారా సెంటిమెంట్‌తో ఈ సిన‌మా అంద‌రికీ క‌నెక్ట‌య్యేలా ఉంటుంది `` అన్నారు.

 ద‌ర్శ‌కుడు, హీరో కేపియ‌న్ చౌహాన్ మాట్లాడుతూ...``గోర్ జీవ‌న్‌` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులు, బంజ‌రా క‌మ్యూనిటీ వాళ్లు నన్ను ఎంత‌గానో ఆద‌రించారు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో రెండో చిత్రంగా తెలుగు, బంజారా భాష‌ల్లో `సేవాదాస్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నా.  జంబారా క‌మ్యూనిటీకి ఆది గురువైన సేవాలాల్ పాత్ర‌లో సుమ‌న్ గారు ఒదిగిపోయారు. వారు లేకుంటే ఈ సినిమా లేదు. ఎంతో అనుభవం ఉన్న సుమ‌న్ గారిని డైర‌క్ట్ చేయ‌డం, ఆయ‌న‌తో క‌లిసి న‌టించడం నా అదృష్టంగా భావిస్తున్నా. మా నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా క్వాలిటీగా రావ‌డానికి స‌హ‌క‌రించారు. బోలే గారు నా మొద‌టి సినిమా `గోర్ జీవ‌న్` క‌న్నా ఈ సినిమాకు అద్భుత‌మైన పాట‌లు ఇచ్చారు. త్వ‌ర‌లో ఆడియో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

 నిర్మాతలు వినోద్‌ రైనా ఎస్లావత్‌, సీతారామ్‌ బాదావత్  మాట్లాడుతూ...``నేను నా మిత్రుడు సీతారామ్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.  ద‌ర్శ‌కుడు చౌహాన్  బంజారా భాష‌లో రూపొందించిన `గోర్ జీవ‌న్` సినిమాతో స‌క్సెస్ కొట్టారు.  బంజారా చిత్రాల‌కు చౌహాన్ ఐకాన్ అని చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న స్పూర్తితో ప్ర‌స్తుతం చాలా బంజారా చిత్రాలు వ‌స్తున్నాయి.  ఖ‌ర్చుకు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను తెర‌కెక్కించాం. త్వ‌ర‌లో ఆడియో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

 సంగీత ద‌ర్శ‌కుడు బోలే మాట్లాడుతూ...`` ఇందులో నాలుగు పాట‌లు కూడా చాలా బాగా కుదిరాయి. ఈ రోజు టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది.  పాట ఎంత బాగా వ‌చ్చిందో పిక్చ‌రైజేష‌న్ కూడా బాగా కుదిరింది. సుమ‌న్ గారు న‌టించ‌డం సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. చౌహాన్ ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు.  సేవాదాస్ సినిమా కచ్చితంగా స‌క్సెస్ సాధిస్తుంది`` అన్నారు.

 న‌టుడు డా.సంప‌త్ నాయ‌క్ మాట్లాడుతూ...``నేను ఇందులో నెగిటివ్ పాత్ర‌లో న‌టించాను. ఈ సినిమాకు మూల కార‌ణ‌మైన చౌహాన్ ఇలాంటి మ‌రెన్నో మంచి చిత్రాలు చేయాల‌న్నారు.

 ఇంకా  ఈ కార్య‌క్ర‌మంలో న‌టుడు రంగ‌రాజ‌న్‌,  సెకండ్ హీరోయిన్  రేఖా నిరోషా, దిలీప్ రాథోడ్‌, బిక్షు నాయ‌క్‌,  విజయ్‌ ఠాగూర్ త‌దిత‌రులు పాల్గొని సినిమా విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.


     సుమన్‌, భానుచందర్‌, చలాకి చంటి,  విజయ రంగరాజు,  ఫిష్‌ వెంకట్‌, నవీన రెడ్డి, గీతా సింగ్‌,  శైల‌జ, బిక్షు నాయక్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి  సంగీతంః బోలే,  సినిమాటోగ్రఫీః విజయ్‌ ఠాగూర్, ‌  నిర్మాతలుః వినోద్‌ రైనా ఎస్లావత్‌, సీతారామ్‌ బాదావత్ , కథ-స్క్రీన్‌ ప్లే- దర్శకత్వంః కేపియన్‌ చౌహాన్. 

Chitrapatam Title Song Released

 


తండ్రి కూతుళ్ల మధ్య ఎమోషనల్ డ్రామా ‘చిత్రపఠం’ టైటిల్ సాంగ్ విడుదల.. 


శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌లో బండారు దానయ్య కవి తెరకెక్కిస్తున్న సినిమా చిత్రపఠం. ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది. ఈ చిత్రం అన్ని సినిమాల మాదిరి హీరో, హీరోయిన్ల చుట్టూ తిరిగే కథ కాదని.. తండ్రి కూతుళ్ల మధ్య సాగే అద్భుతమైన ఎమోషనల్ డ్రామా అని దర్శక నిర్మాత దానయ్య కవి తెలిపారు. సినిమాలో అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయని.. అలాగని ఆఫ్ బీట్ సినిమా కాదని.. కమర్షియల్ అంశాలు కూడా తమ సినిమాలో పుష్పలంగా ఉంటాయని తెలిపారు ఈయన. తన దృష్టిలో కమర్షియల్ అంశాలు అంటే మనసును తాకే ఎమోషన్ అని తెలిపారు ఈయన. తమ చిత్రపఠం సినిమాలో అద్భుతమైన 8 పాటలున్నాయని.. తండ్రి కూతుళ్ల మధ్య సాగే ఈ ఎమోషనల్ డ్రామా అందర్నీ అలరిస్తుందని ఈయన నమ్మకంగా చెప్తున్నారు. తాజాగా విడుదలైన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాకు మురళీ మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సంగీతం, సాహిత్యం, రచన, దర్శకత్వం బాధ్యతలు బండారు దానయ్య కవి తీసుకున్నారు. 


నటీనటులు: 

కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, నరీన్ (తమిళ ఫేమ్), శరణ్య పొన్నవన్ (తమిళ ఫేమ్), కాలకేయ ప్రభాకర్, పార్వతీషం, బాలా చారీ, సిరివల్లి తదితరులు.. 


టెక్నికల్ టీం: 

సంగీతం, సాహిత్యం, రచన, దర్శకత్వం: బండారు దానయ్య కవి

నిర్మాత: పుప్పాల శ్రీధర్ రావు 

బ్యానర్: శ్రీ క్రియేషన్స్ 

సినిమాటోగ్రఫీ: మురళీ మోహన్ రెడ్డి 

ఎడిటర్: వినోద్ అద్వయ్ 

పాట: నా పేరే చిత్రపఠం 

గాయకులు: బృంద, బండారు దానయ్య కవి 

ల్యాబ్: ప్రసాద్ ల్యాబ్, ప్రైమ్ ఫోకస్ (రామానాయుడు)

Sampoornesh Babu Bazaar Rowdy Releasing in April Last week



 ఏప్రిల్ నెలాఖరులో సంపూర్ణేష్ బాబు 'బజార్ రౌడీ' విడుదల..

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా కె ఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా బజార్ రౌడీ. వసంత నాగేశ్వరరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యం లో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంపూర్ణేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. సీనియర్ రైటర్ మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాశారు. 1000 సినిమాలకు పైగా ఎడిటింగ్ చేసిన సీనియర్ ఎడిటర్ గౌతంరాజు బజార్ రౌడీ సినిమాకి పనిచేశారు. SS ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఏప్రిల్ నెలాఖరులో బజార్ రౌడీ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.


నటీనటులు: 

సంపూర్ణేష్ బాబు, సాయాజి షిండే, 30 ఇయర్స్ పృథ్వి, కత్తి మహేష్ తదితరులు..


టెక్నికల్ టీమ్: 

దర్శకుడు: వసంత నాగేశ్వరరావు

నిర్మాత: సంధిరెడ్డి శ్రీనివాసరావు 

Executive నిర్మాత- శేఖర్ అలవలపాటి

సమర్పణ: బోడెంపూడి కిరణ్ కుమార్ 

బ్యానర్: కె ఎస్ క్రియేషన్స్ 

మాటలు: మరుధూరి రాజా 

సంగీతం: ఎస్ఎస్ ఫ్యాక్టరీ 

ఎడిటింగ్: గౌతం రాజు 

సినిమాటోగ్రఫీ: ఏ విజయ్ కుమార్ 

పిఆర్ఓ: ఏలూరు శ్రీను

Virata Parvam Release Gets Postponed



Rana, Sai Pallavi, Venu Udugula’s Virata Parvam Release Gets Postponed


Rana and Sai Pallavi starrer Virata Parvam is a unique and content driven film where the lead pair will be seen in never seen before roles. The film’s teaser that was released last month had got tremendous response.


Inspired from true events of 1990s, Rana plays the role of Comrade Ravanna who is known by his pen name Aranya. Sai Pallavi will be seen as his admirer named Vennela. Virata Parvam is going to narrate a wonderful love story in the backdrop of war.


Unfortunately, the film has now been postponed due to spike in Covid-19 cases across the country. It was planned for release on 30th of this month.


D Suresh Babu is presenting the film and Sudhakar Cherukuri of Sri Lakshmi Venkateswara Cinemas is bankrolling it. Dani Sanchez Lopez and Divakar Mani handled the cinematography, while Suresh Bobbili scores the music.


Virata Parvam also stars Priyamani, Nanditha Das, Naveen Chandra, Zareena Wahab, Eswari Rao and Sai Chand in important roles.


Cast: Rana Daggubati, Sai Pallavi, Priyamani, Nanditha Das, Naveen Chandra, Zareena Wahab, Eswari Rao, Sai Chand, Benarji, Nagineedu, Rahul Ramakrishna, Devi Prasad, Anand Ravi, Anand Chakrapani and others.


Crew:


Writer & Director: Venu Udugula


Producer: Sudhakar Cherukuri.


Banner: Suresh Productions, Sri Lakshmi Venkateswara Cinemas


Presents: Suresh Babu


DOP: Dani Sanchez Lopez, Divakar Mani


Editor: Sreekar Prasad


Production designer: Sri Nagendra


Music: Suresh Bobbili


Stunts: Stephen Richard, Peter Hein


Choreography: Raju Sundaram.


PRO: Vamsi - Sekhar


Executive producer: Vijay kumar chaganti


Publicity Design: Dhani Aelay

Thellavarithe Guruvaram on Ahafrom April 16

 


Aha rings in a laughter-filled weekend with Thellavarithe Guruvaram

 The 100% Telugu OTT platform is set to stream the romantic comedy from April 16


Film lovers are in for a sumptuous treat this weekend as 100% Telugu streaming platform aha gets ready to premiere the quirky romantic comedy Thellavarithe Guruvaram on April 16. The film is a cherry on the cake for the platform, after entertaining audiences with a diverse array of releases like Krack, Naandhi, Gaali Sampath, Zombie Reddy this year. Extending the Ugadi festive vibe onto the weekend, Thellavarithe Guruvaram is a fun-filled fare that the entire family could savour.


Thellavarithe Guruvaram, starring Sri Simha, Misha Narang and Chitra Shukla in pivotal roles, brims with energy and mirrors the confusions that many millennials face with respect to love and relationships. A feel-good fare that addresses a pertinent issue in a lighter vein, the film is sure to resonate with viewers of various age groups and has all the ingredients to make for a perfect OTT watch. 


That’s not all about aha, which has cemented its authority as a go-to platform for the best Telugu content across diverse categories, from evergreen classics to modern-day blockbusters, gripping web shows and celebrity interviews, all under one roof. Stay tuned to aha for more exclusive content that’s guaranteed to liven up your streaming playlists

RVG Production No 3 Launched


 'శివాoశు'ను హీరోగా పరిచయం చేస్తూ

ఆర్.వి.జీ ప్రొడక్షన్-3 ప్రారంభం!!


     కత్తిలాంటి కొత్త కుర్రాడు 'శివాoశు'ను హీరోగా పరిచయం చేస్తూ... ఆర్.వి.జీ మూవీజ్-ఎస్.వి.ఎల్.ఎంట్రప్రైజస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం హైద్రాబాద్, సత్యసాయి నిగమాగమంలోని వినాయకుని గుడిలో మొదలైంది. రవిశంకర్ ఓంకాలి-తలారి వినోద్ కుమార్ ముదిరాజ్-శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) దర్శకత్వం వహిస్తున్నారు. శివాoశు సరసన ప్రాచీరాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ ఆమని ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

     దైవ సన్నిధిలో దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి... ఈ చిత్రానికి మాటలు-పాటలు రాస్తున్న ప్రముఖ రచయిత వి.ఎస్.పి.తెన్నేటి కెమెరా స్విచాన్ చేయగా... శ్రీమతి స్వాతి రుద్రాపట్ల క్లాప్ కొట్టారు. 

పూజా కార్యక్రమాలు అనంతరం రెగ్యులర్ షూట్ ప్రారంభించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో... దర్శకుడు రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి), రచయిత వి.ఎస్.పి.తెన్నేటి, హీరో శివాoశు, హీరోయిన్ ప్రాచీ రాయ్, నిర్మాతలు రవిశంకర్ ఓంకాలి- తలారి వినోద్ కుమార్ ముదిరాజ్- శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్ సంగీత దర్శకుడు రాజేష్ రాజ్.టి, కెమెరామెన్ ప్రసాద్ కె.నాయుడు, ఈ చిత్రంలో కీలక పాత్రధారి ఆకెళ్ల పాల్గొని చిత్ర విశేషాలు వెల్లడించారు. 

    దర్శకనిర్మాత రుద్రాపట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ... నా ప్రతి సినిమాలోనూ కొత్తవారిని పరిచయం చేసే నేను... ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో... అత్యంత ప్రతిభతోపాటు మంచి ఫైర్ ఉన్న కుర్రాడ్ని హీరోగా పరిచయం చేస్తున్నాను" అన్నారు!!

Prajadiary Excellence Awards Event Held Grandly



 ప్రతిష్టాత్మక మైన ప్రజా డైరీ excellence అవార్డ్ ను ఈ రోజు ప్రజాడైరీ 20 వ వారికోత్సవ సభలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి చేతులు మీదుగా 100 చిత్రాలు. నిర్మించిన రామ సత్యనారాయణ  కు excellence  అవార్డ్ ను బహుకరించి 200 చిత్రాలు పూర్తి చేయాలి అని అశ్విదరించారు..మరియు ప్రజా డైరీ అధినేత సురేష్ ని 20 సం లు గా ఒక ప్రజాడైరీ పేపర్ ను రన్ చేయటం సాధారణ కాదని కొనియాడారు..సుమన్ గారు మాట్లాడుతూ కిషన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి ఈ ప్రజా డైరీ అవార్డ్ ని మా నిర్మాత రామ సత్యనారాయణ కి  ఇవ్వటం ఆనందం గా ఉంది అన్నారు.

చిన్న ప్రొడ్యూసర్స్ కి సుమన్ గారు మెగా స్టార్ అని ఆయనతో 16 సినిమాలు నిర్మాత గా నిర్మించటం అదృష్టం అని శ్రీ కిషన్ రెడ్డి గారు చెప్పిన విధంగా 200 చిత్రాలు మార్క్ సాధించటానికి ప్రయత్నం చేస్తాను అని అతి త్వరలో ఓక శతాధిక చిత్ర దర్శకుడు తో కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది అని రామ సత్యనారాయణ చెప్పారు.

DTL Cinemas Production No 1 Announcement

DTL సినిమాస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ వన్ !



 DTL  సినిమాస్  బ్యానర్ పై బొడ పోతుల  శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో  ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం స్క్రిప్ట్ పూజా కార్యక్రమాలు ఫిలింనగర్ సాయిబాబా మందిరంలో ఘనంగా జరిగాయి. దీనికి ముఖ్యఅతిథిగా దర్శకులు సముద్ర గారు విచ్చేశి స్క్రిప్ట్ డైరెక్టర్ కి అందజేశారు. 

ఈ చిత్ర దర్శకుడు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ నమ్మకం ఉన్న చోటనే ప్రేమ నిలబడుతుంది. అనే పాయింట్ తో స్వచ్ఛమైన ప్రేమకథను చేయబోతున్నాం అని చెప్పారు. ఈ చిత్రానికి హీరో హీరోయిన్లుగా అగ్ర కథానాయకుల తో  మీ ముందుకు రాబోతున్నా రని అన్నారు. అలాగే ఈ సినిమా కి సంబందించిన టెక్నీషియన్స్ మరియు ఆర్టిస్టుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలియజేశారు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ గా బోడ పోతల శ్రీనివాస్ గౌడ్ 

కో ప్రొడ్యూసర్ గా రవితేజ , లక్ష్మి

దర్శకుడు : ప్రభాస్ నిమ్మల

Super Star Krishna best wishes to AndarubagundaliAnduloNenundali



 అందరూ బావుండాలి అందులో నేనుండాలి (వికృతి) వంటి మంచి సినిమాలో నటించిన నరేశ్‌కి, అలీకి ఆల్‌ ది బెస్ట్‌– సూపర్‌స్టార్‌ కృష్ణనరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. మలయాళంలో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.  సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది.   అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుని ఇప్పటివరకు 90 శాతం పూర్తి చేసుకుంది.  1100 సినిమాల్లో అనేక పాత్రల్లో నటించిన అలీ హీరోగా తన బ్యానర్‌లో నిర్మిస్తోన్న తొలిచిత్రం కావటంతో ఎంతో గ్రాండియర్‌గా సినిమాను తెరకెక్కించే ఉద్ధేశ్యంతో ఎక్కడ రాజీపడకుండా దాదాపు 20 మంది అగ్ర నటీనటులతో సినిమాను నిర్మిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఉగాది పండగ సందర్భంగా సూపర్‌స్టార్‌ కృష్ణ ఇంటివద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కృష్ణ మాట్లాడుతూ–‘‘ నేను హీరోగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘పండంటి కాపురం’ చిత్రంలోని ‘‘ఏవమ్మా జగడాల వదినమ్మో...పాటలో నరేశ్‌ని ఎత్తుకుని ఆడిపాడాను. అలాగే రాజమండ్రిలో అలీని కలిశాను. అప్పుడు అలీకి 7ఏళ్లు ఉంటాయేమో.  తర్వాత విజయనిర్మల దర్శకత్వంలో నేను,సుజాత హీరో,హీరోయిన్లుగా నటించిన ‘సిరిమల్లె నవ్వింది’ చిత్రంలో బాలనటునిగా అలీ నటించారు. ఇలా నా సినిమాల్లో బాలనటులుగా నటించిన ఇద్దరూ ఈ రోజున కలిసి ఓ సినిమాలో హీరోలుగా నటించటం ఆ సినిమాని అలీ నిర్మించటం చాలా ఆనందంగా ఉంది. ఉగాది రోజున నా దగ్గరికి వచ్చి వారి సినిమా  ‘అందరూ బావుండాలి, అందులో నేనుండాలి’కి నా బ్లెస్సింగ్స్‌ కావాలని అడిగారు. చక్కని టైటిల్‌తో ఎమోషనల్‌గా ఉండే కంటెంట్‌తో సినిమాను తెరకెక్కించారని తెలిసి హ్యాపీగా ఫీలయ్యాను. ఈ సినిమా ద్వారా దర్శకుడు శ్రీపురం కిరణ్‌కి చక్కని పేరు అలీకి నిర్మాతగా డబ్బు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. నరేశ్‌ మాట్లాడుతూ–‘‘ ఈ సినిమాలోని నా పార్టు షూటింగ్‌తో పాటు డబ్బింగ్‌ కూడా పూర్తి చేశాను. నా భార్య పాత్రలో పవిత్రా లోకేశ్‌ నటించారు. ఈ సినిమాలో నటించినందుకు మనస్ఫూర్తిగా అలీకి థ్యాంక్స్‌ చెప్తున్నాను. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి మన్ననలు పొందుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. అలీ మాట్లాడుతూ–‘‘ సూపర్‌స్టార్‌ కృష్ణ గారి చేయి గురించి సినిమా పరిశ్రమలో తెలియని వారుండరు. ఈ రోజు తెలుగువారి ఉగాదితో పాటు, ముస్లిం సోదరుల రంజాన్‌ నెల ప్రారంభరోజు కావటం విశేషం. ఈ సినిమాలో కూడా హిందూ ఫ్యామిలీ, ముస్లిం ఫ్యామిలీలకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఈ రోజు అన్నయ్య నరేశ్, నేను వచ్చి కృష్ణ గారి చేతులమీదుగా మా సినిమాని ఆశీర్వదించమని కోరుకున్నాం. ఆయన నిండు మనసుతో ఆశీర్వదించారు. మా సినిమాకు మాకు అదే పెద్ద బ్లెస్సింగ్‌లా ఫీలవుతున్నాను. ప్రస్తుతం మా సినిమా పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలతో పాటు కొద్దిగా షూటింగ్‌ బ్యాలెన్స్‌ ఉంది. మే నెల రెండో వారానికల్లా అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి’’ అన్నారు.  ఈ సినిమాలోని అన్ని పాటలను ప్రముఖ రచయిత భాస్కరభట్ల రవికుమార్‌ రచించటం విశేషం. ఏ.ఆర్‌ రెహమాన్‌ వద్ద సంగీత శాఖలో అనేక సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన రాకేశ్‌ పళిదం ఈ చిత్రంతో సంగీత దర్శకునిగా ఆరంగేట్రం చేస్తుండటం విశేషం.  ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌ ప్రణవి మానుకొండ నరేశ్‌ కూతురిగా కీలకపాత్రలో నటించారు.  మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి,సనా, వివేక్, శివారెడ్డి, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం,లాస్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి చీఫ్‌ క్రియేటివ్‌ హెడ్‌– ఇర్ఫాన్, కో డైరెక్టర్‌– ప్రణవానంద్‌  కెమెరా– ఎస్‌ మురళీమోహన్‌ రెడ్డి, ఆర్ట్‌– కెవి రమణ, డాన్స్‌ డైరెక్టర్‌– స్వర్ణ, ఎడిటర్‌– సెల్వకుమార్, ఫైట్స్‌–నందు, మేకప్‌–నంద్యాల గంగాధర్, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌– సయ్యద్‌ తాజ్‌ బాషా, విఎఫ్‌ఎక్స్‌– మాయాబజార్‌ స్టూడియో

'Power Play' Is Garnering Very Good Response In Amazon Prime

Raj Tarun - Konda Vijaykumar's 'Power Play' Is Garnering Very Good Response In Amazon Prime



Latest film in Young Hero Raj Tarun and Director Konda Vijay Kumar‘s successful combination is ‘Power Play’. This film is Presented by Smt Padma Produced by Mahidhar, Devesh under Vanamalee Creations Pvt Ltd as their Production No – 1. The film was recently released in theatres and acquired positive response for its thrilling content. Now, 'Power Play' is streaming in Amazon Prime and is recieving very good response with highest viewing count.  On this occasion..


Young Hero Raj Tarun said, ” Our 'Power Play' is getting very good appreciation from Amazon Prime similar to its theatrical release . I am recieving phone calls from friends, Industry people saying that they have watched a very good thriller.  ”



Director Vijay Kumar Konda said, ” I am very happy that 'Power Play' is getting very good reach in OTT too. I did this film in a new genre for me. This film gave me very good boost for me for doing different films in future along with Entertainment subjects. " 



Producer Devesh said, ” I am glad that 'Power Play' is getting amazing response in Amazon too after its theatrical release.  Thanks to the audience for enjoying the highlight points of the film and for a very good reception of the film "



Executive Producer Palaparthi Ananth Sai said, ” Thanks to each and everyone for appreciating our film in OTT”



Raj Tarun, Hemal Ingle, Poorna, Madhunandan, Ajay, Kota Srinivas Rao, Raja Ravindra, Dhanraj, Kedari Shankar, Tillu Venu, Bhupal, Appaji, Ravi Varma, Sandya Janak and Others



Story & Dialogues: Nandyala Ravi

Cinematography: I Andrew

Music: Suresh Bobbili

Editing: Praveen Pudi

Art: Siva  

Fights: Real Satish

Production Controller: B.V.Subbarao

Co-Director: Venu Kurapati

Executive Producer: Palaparthi Ananth Sai

Presented by: Smt.Padma

Produced by: Mahidhar – Devesh

Screenplay-Direction: Vijay Kumar Konda

A.R. Rahman Presents the ‘99 Songs Special Concert

 


A.R. Rahman Presents the ‘99 Songs Special Concert’: 

a Magnificent Digital Show Chronicling the Songs of the Mega Film

Streaming on JioSaavn’s LIVE Anywhere platform, 

the special concert film brings to life the 

Academy and Grammy Award-winning musician’s debut production, ‘99 Songs’


Chennai/Mumbai, April 14, 2021: A.R. Rahman has released the 99 Songs Special Concert — a digital show chronicling the music of his upcoming film 99 Songs. A musical experience that brings to life 99 Songs as never seen before, the digital concert is now streaming on JioSaavn’s LIVE Anywhere platform. This special concert allows listeners to experience the music of 99 Songs ahead of the film’s release in theatres on April 16th. Streaming in Hindi, Tamil and Telugu, the 99 Songs Special Concert sees Academy and Grammy Award-winning composer Rahman unite with the exceptional voices of the 99 Songs soundtrack. The film’s lead actor Ehan Bhat (who trained to be a musician for the film!) and director Vishwesh Krishnamoorthy too join Rahman in rendering the sound of the movie. Together, team 99 Songs delivers a digital musical montage that pays tribute to the story of the film while honouring the spirit of music itself. 


About the 99 Songs Special Concert, A.R. Rahman says,


“My initial idea was that I should go to every city, every college and perform, for you, the songs of this movie. But given the times, the least we can do is present a show with the incredible singers and musicians who are part of the soundtrack. I hope you'll go to cinemas on 16th April with masks on and show some love to the film."



In a first-of-its-kind presentation, the 99 Songs Special Concert sees music maestro A.R. Rahman, who makes his filmmaking debut as producer and writer with this movie, invoke the power of music during an uncertain time. Amidst the trials of the pandemic, Rahman weaves a musical concert that traverses through the tracks of 99 Songs to deliver a show that reflects the magic of the live A.R. Rahman experience. 


The 99 Songs Special Concert features the global music legend alongside vocalists Benny Dayal, Shashwat Singh, Shashaa Tirupati, Vijay Yesudas, Sreekanth Hariharan, Poorvi Koutish, Haricharan, the Sunshine Orchestra and more. The show is truly a celebration of the power of music. Much like in the art of filmmaking, Rahman combines music with storytelling to take viewers on a journey through the soundtrack of 99 Songs, as if turning the chapters of a book. The songs are accompanied by a story told by the maestro, the lyricists Navneet Virk, Dilshaad Shabbir Shaikh, Kalpradah and more, as well as the vocalists, about how the track came to be. 


“ ‘99 Songs’ is the story about one man's struggle between the old world and the new world. The antidote is music,” said Rahman as he invited viewers to witness the music of 99 Songs. The concert began with the spiritual love song “O Aashiqa,” sung by Shashwat Singh. Rahman graces the stage throughout the concert film, weaving melodies at the piano. “O Aashiqa” is flush with choral voices and the memorable piano riff rendered by Rahman. Singh’s passionate bridge drives the message of the song home. As lyricist Virk explained, this song embodies the spirit of 99 Songs. It’s about selflessness; it’s a prayer for a better world. Virk even recalled Rahman’s brief for “O Aashiqa” while speaking on stage. “That song has to say everything we want to say. That song has to have the lesson of the movie,” he said. 


99 Songs’ director and screenplay writer Vishwesh Krishnamoorthy also took to the stage to speak about how his relationship with filmmaking changed during the production of 99 Songs. As a fellow musician (Krishnamoorthy has also been the frontman for Mumbai hardcore band Scribe), the director delved into how each day on set propelled him to evolve as a creator. “You wanted to make a film about music and you wanted me to direct it. I tried to explore it to the deepest depths. You really pushed me towards becoming much better on this film,” he said to Rahman who concurred on how the challenge of making 99 Songs led them both to transform as creatives.


The dialogue between the producer and director was followed by a mesmerizing performance of the quintessential 99 Songs love song, “Sofia.” Singh returned to the stage to belt the beautiful track as the delicate and exhilarating guitaring by Carl Fernandes and Joshua Satya infused “Sofia” with a magical lead. Subsequently, Poorvi Koutish, the volcanic voice of “Jwalamukhi,” rendered a spellbinding performance of the powerful heartbreak track. As lyricist Virk explained, “Still waters run deep. Love is passion and pain; that's jwalamukhi — a volcano." Up next was a performance of the ballad “Teri Nazar” by Singh. Lyricist Shaikh explained, “It's a song about the great pain of being separated from your lover.” The evocative tabla by Sai Shravanam and mellifluous flute by Naveen Kumar lent a delicate melancholy to Singh’s silky vocals. Rahman further revealed details about the track by sharing what the song was meant to embody, “It was about the journey of a person who starts with simple melodies, and [then] goes to a very, very complex [place], and [then] goes back to simplicity,” he said.


The ballad was followed by moving performances of the lullaby from 99 Songs, “O Mera Chand,” as well as the spiritual track “Sai Shirdi Sai,” by Bela Shende. The singer’s saccharine vocals melded with the transportive flute and sparkling instrumentals to create a transcendental musical stage bolstered by Rahman. After this meditative interlude, Rahman invited vocalist Shashaa Tirupati to render his incredible jazz composition, “Soja Soja,” which was made all the more triumphant by Lisa & Rameethha V’s brass. The 99 Songs Special Concert came to a close with a performance of “Nayi Nayi” by Singh. Director Krishnamoorthy (with his guitar!) and actor Ehan Bhat joined the singer on stage to amplify the celebratory theme of the track. This performance was made all the more special when Rahman himself departed his position at the piano to take up the keytar and end “Nayi Nayi” on a jubilant note.


99 SONGS SPECIAL CONCERT: CREDITS 


SINGERS: Bela Shende, Shashaa Tirupati, Poorvi Koutish, Benny Dayal, Haricharan, Sreekanth Hariharan, Sarthak Kalyani, Shashwat Singh, Rakshita Suresh, Vijay Yesudas, Abhay Jodhpurkar.


BAND:

Drums - David Joseph

Percussion - Yash Pathak 

Keyboard - Karthick Devaraj & Nakul Abhyankar 

Bass Guitar - Carl Fernandes 

Guitar - Joshua Satya 

Tabla - Sai Shravanam 

Flute - Naveen Kumar 

Ghatam - Karthik 

Sunshine Orchestra - Adithyanarayanan Shankar, Angad Singh, Deepthi Raghu, Drishti Tandel, Noor Bhatia, Rajnarendran Rajagopalan, Rameethha V, Riddhiman Dutta, Rijul Chakraborthy, Shivam Karadwal, Sneha Symon, Vanshika Arora

Chorus - Adithyanarayanan Shankar 

Angad Singh

Deepthi Raghu

Drishti Tandel

Noor Bhatia

Rajnarendran Rajagopalan 

Rameethha V

Riddhiman Dutta

Rijul Chakraborthy 

Shivam Karadwal 

Sneha Symon 

Vanshika Arora

Modular - Damini Chauhan 

Brass - Lisa & Rameethha V

Violin - Vignesh. U, Nandhini. A, Balaji. A, Vignesh.S

Viola - Ebinezar Gnanraj. M, Dinesh. A, Harish Kumar. K, Hirthick Roshan. G

Cello - Vaijayanthi. R, Deepa. S, Balaji. M, Mohammed Ismail. S

Double Bass - Anish Franklin. V, David. K

Conductor – Anupam Roy

Raja Releasing on April 16th

 


ఈ నెల 16న గ్రాండ్ గా విడుదలవుతున్న" రాజా" 


రాంకి (వీర్నాల రామకృష్ణ),దివ్య రావు (డిగ్రీ కాలేజ్ ఫేమ్), ఆస్మ, యాంకర్ శ్యామల, పోసాని కృష్ణ మురళి నటీనటులుగా  ఏ ఆర్కె ఆర్ట్స్ సమర్పణలో వస్తోన్న సినిమా  "రాజా”. టోటల్ యూత్ అడల్ట్ కంటెంట్  సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16న విడుదలవుతున్న సందర్భంగా.


 *హీరో మరియు దర్శకుడు రాంకి (వీర్నాల రామకృష్ణ)* మాట్లాడుతూ…అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16న గ్రాండ్ గా "రాజా” సినిమాను విడుదల చేస్తున్నాము. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. గతంలో మేము విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్,  మోషన్ పోస్టర్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంతలా అంటే… 10 రోజుల్లో మా సినిమా బిజినెస్ ని క్లోజ్ చేసే అంతలా ఈ టీజర్ కి బయ్యర్స్ నుంచి ఆఫర్ వచ్చింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా యూత్ ని అలరిస్తుంది. హీరోయిన్ లు  దివ్య రావ్ (డిగ్రీ కాలేజ్ ఫేమ్), ఆస్మ లు చాలా బాగా నటించారు.యాంకర్ శ్యామల కూడా ఎంతో బిజీ గా వున్నా మేము అడిగిన వెంటనే మాకు చాలా బాగా సపోర్ట్ చేసింది.చాలా మంది అరిస్టులు కూడా బాగా సపోర్ట్ చేశారు. వారందరికీ ధన్యవాదాలు.వీళ్ళతో పనిచేయడం నాకు చాలా కంఫర్ట్ అనిపించింది. ఫస్ట్ టైం నటిస్తున్నాననే ఫీలింగ్ లేకుండా చేశారు. ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి ఎంతో బిజీగా ఉన్నా కూడా మా సినిమాలో నటించి నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆయన చేసిన కామెడీ సినిమాలో హైలైట్. ఎంతో హెల్దీగా  తన కామెడీ టైమింగ్ తో నవ్వించారు. ఆయకు ధన్యవాదాలు. ఇది మహిళల ఇమేజ్ ని పెంచే ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా. రొమాన్స్ విషయంలో మహిళల ఫీలింగ్స్ ఎంటనేది చాలా సున్నితంగా తెరమీద చూపించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా తప్పక నచ్చుతుంది అని అన్నారు.


 *చిత్ర నిర్మాత మాట్లాడుతూ..* సినిమా చాలా బాగా వచ్చింది.మా అదృష్టం ఏంటంటే సినిమా రేలీజ్ కు ముందే బిజినెస్ అయిపోవడం, అలాగే థియేట్రికల్స్  వేరే వాళ్ళు తీసుకొని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది.మా కంటెంట్ లో దమ్ముంది కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విడుదల చేస్తున్న రెండు రాష్ట్రాల డిస్ట్రుబ్యూటర్లకు ధన్యవాదాలు. అందరూ ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తే చాలా మంది బతుకుతారు.మరియు మా సినిమా పోస్టర్స్, ట్రైలర్స్ ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. అలాగే మా సినిమాను కూడా ఆదరించి మమ్మల్ని మా టీంను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.


 

 *నటీనటులు* 

హీరో: రాంకి (వీర్నాల రామకృష్ణ)

హీరోయిన్: దివ్య రావు (డిగ్రీ కాలేజ్ ఫేమ్)

సెకండ్ హీరోయిన్: ఆస్మ

పోసాని కృష్ణ మురళి, యాంకర్ శ్యామల, టార్జెన్, జయవాణి, జోగి బ్రదర్స్ (కృష్ణ, నాయుడు) గౌతంరాజు, అశోక్ కుమార్, మేఘన చౌదరి, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ దొరబాబు, మైత్రి రజిత, దీప్తి.


 *సాంకేతిక నిపుణులు* 

టైటిల్:  "రాజా"

బ్యానర్: ఏఆర్కే ఆర్ట్స్

నిర్మాత: ఏఆర్కే ఆర్ట్స్

ప్రజెంట్స్: ఏఆర్కే ఆర్ట్స్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.గురువరవ్

డిఓపి: రాజు

ఎడిటర్: బి.ఎన్. ఆర్.

ఆర్. ఆర్.: తమిరి శంకర్

లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, హరి గౌర, కసర్ల శ్యామ్

స్టొరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: రాంకి (రామకృష్ణ)

డైలాగ్స్: రాంకి, జి.రవి, విజయ్

పిఆరోఓ: మధు.విఆర్

Nithya Kalyanam Pachha Toranam Script Pooja Held on the occasion of Ugadi

 


ఉగాది సందర్భంగా ‘నిత్యకళ్యాణం పచ్చ తోరణం’మూవీకి స్క్రిప్ట్ కు పూజాకార్యక్రమాలు 

సి.హెచ్.సత్య సుమన్ బాబు హీరోగా నటిస్తూ స్వీయదర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘నిత్యకళ్యాణం పచ్చ తోరణం’. 

ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీ నగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం 11 గంటలకు ఈ చిత్ర స్క్రిప్ట్ కు పూజాకార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 25 నుంచి నెల్లూర్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత అరకు, బెంగళూరులో జరిగే షెడ్యూల్స్ లో చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారు. ఆగస్ట్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చిత్ర యూనిట్ తెలియజేసింది. 

జి రవితేజ సమర్ఫణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్, నిర్మిస్తుండగా.. సి.హెచ్.సత్య సుమన్ బాబు హీరోగా నటిస్తూ స్వీయదర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం ఇది. సత్యసుమన్ బాబుకు ఇది హీరోగా రెండో సినిమా. హీరోయిన్ వివరాలను త్వరలోనే తెలియజేయబోతోన్న ఈ చిత్రంలో సుమన్,షియాజీ షిండే, చలపతి, నరేష్, అన్నపూర్ణమ్మ ఇతర కీలక పాత్రల్లో నటించబోతున్నారు.

టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న  చిత్రానికి

 మాటలు : రామకృష్ణ 

సంగీతం : ప్రమోద్ పులిగిళ్ల

సినిమాటోగ్రఫీ : అడపా సతీష్ 

ఆర్ట్ : నాని 

 కో డైరెక్టో నవీన్ రామ్ నల్లం రెడ్డి 

ఆర్ఆర్ : చిన్నా 

పిఆర్వో : దుద్ది శ్రీను

నిర్మాత, దర్శకత్వం  : సి.హెచ్.సత్య సుమన్ బాబు

Iconic director Shankar and Bollywood superstar Ranveer Singh Pan India Movie Announced

 


Two forces of Indian cinema - iconic director Shankar and Bollywood superstar Ranveer Singh - come together to create one of the biggest pan-Indian cinematic events of contemporary times - the official adaptation of cult blockbuster Anniyan!Bringing these creative giants together for the very first time will be veteran film producer Dr. Jayantilal Gada (Pen Studios)!



This is most certainly one of the biggest director-actor collaborations in recent times! Iconic director Shankar, known for his path-breaking, larger-than-life vision, and Bollywood superstar Ranveer Singh, who has given India some of the most unforgettable and lovable characters on-screen, are coming together in an unprecedented creative coup! Shankar will be directing Ranveer in the official adaptation of his cult blockbuster ‘Anniyan’, that will be mounted on a gigantic cinematic canvas, promising one of the most anticipated pan-Indian cinematic events of our time. 


The yet-untitled project is being interestingly announced around the auspicious time of Baisakhi in North India and Puthandu in Tamil Nadu, which marks the New Year celebrations in these respective calendars. This signifies the intent that Shankar and Ranveer have to make this project a pan-Indian entertainer. The film is slated to go on the floors in Mid 2022. It will be co-produced by God Bless Entertainment and the music of the film will be available on Saregama.


Expressing his excitement, director Shankar said, “For it to be made into a Hindi film, Anniyan needed a maverick, charismatic showman like no other to play the part. I found this in the mercurial Ranveer Singh because he is a one-in-a-generation actor who has shown us that he can immortalise a character through his stellar performance. I’m thrilled to make Anniyan for the pan-Indian audience and I’m confident that this powerful story will strike a chord in the hearts of all. In Dr. Gada, Ranveer and I have found an ideal producer who believes in the vision we have to change the nativity of content for audiences across the country.“


Superstar Ranveer Singh says, “I am blessed to have this opportunity to be a part of the spectacular cinematic vision of Shankar sir. He is an exception to the norm, a true disruptor who has shown us that no vision is large enough to achieve on screen. I had always hoped and dreamed that I would get a chance to collaborate with him, and I have a strong feeling that we will create magic together. To lead a film like Anniyan is a dream come true for any artiste. Vikram Sir, one of our country’s finest talents, an artiste who I hugely admire, gave a colossal performance in the original, one that can never be matched. I can only hope that my interpretation and rendition of the part also connects with audiences in the same way. It’s undoubtedly a once-in-a-lifetime performance piece, and I am ready to give this role every single ounce of my being. Shankar Sir is a genius filmmaker and a true visionary. Words don’t do justice to just how excited I am at the prospect of being directed by him” 


Talking about the Shankar-Ranveer creative coup, Dr. Jayantilal Gada, Chairman and M.D. of Pen Studios says, “Shankar and Ranveer are two forces of nature and them coming together is the biggest cinematic event in India. For us at Pen, it is an opportunity of a lifetime and we are thrilled to partner with the two powerhouses as producers and worldwide distributors of the film. We are confident that their collaboration will write a new chapter in the history of Indian cinema. We are announcing the film during a very significant time of Baisakhi and Puthandu to signify Shankar and Ranveer’s intent to make a truly pan-Indian entertainer!”



Telangana Devudu Releasing on April 23



 Telangana Devadu’ ready to hit theaters on April 23 

The Telangana movement is the historical movement in Telangana  and lot of Agitations happened to achieve Telangana 

 The life of everyone involved in the Telangana movement is inspiring. All the major movements happened in those time is perfectly captured in the movie 'Telangana Devadu' starring the friendly star Srikanth in the title role with the story of a great man who led such a movement. The film, which introduces Zishan Usman as the hero, was produced by Mohammad Zakir Usman under the banner of Max Lab Pvt. The film, directed by Vadatya Harish, is all set to release on April 23.

Speaking on the occasion, director Vadatya Harish said, "I feel lucky to have the opportunity to show case  the history of the Telangana movement. And Special thanks to our producer Mohammad Zakir Usman for giving us such a great opportunity. His support and contribution to make this film is so good and  unforgettable. The film stars over 50 star actors. Thanks to everyone for theirvaluablesupport . Hero Srikanth garu led our team very well we are releasing our film on April 23 

Producer  Mohammad Zakir Usman said, 

"First of all, I wish u all a very Happy Telugu New Year to everyone. Our film. ‘Telangana Devadu’  came out very well I thank Srikanth garu for his  contribution and support for this film which  is unforgettable.

 Director Vadatya Harish did perfect job 

He has showcased the incidents happening after Telangana achievement in the Telangana regions. The way he screened the film will amaze  everyone. Our son Zishan Usman is also being introduced as an actor with this film. Many senior actors starred in the film. Currently all the activities related to the film have been completed. We are planning to release the film Telangana Devudu in  theaters on April 23rd. Thanks to everyone who cooperated. I hope all the audience will follow Corona's precaution and see our film in theaters and make it a success. ''

Srikanth, Sangeetha, Zishan Usman ( introduction Film), Brahmanandam, Sunil, Suman, Brahmaji, Venkat, Pridvi, Raghubabu, Shayaji Shinde, Vijay Rangaraju, Banerjee, Chittibabu, Madhumita, Satya Krishna, Sana, Rajita, ETV Prabhakar, Sameer,   Koteshwara Rao, Kashi Vishwanath and Gemini Suresh

Producer: Mohammad Zakir Usman

Written and directed by: Vadatya Harish

Music: Nandan Bobbili


Cinematographer: Adusumilli Vijay Kumar


Editor: Gautam Raju


Line Producer: Mohammad Khan


PRVO: BS‌. Veerababu


Maxlab CEO: Mohammad Intehaj Ahmed





ఏప్రిల్ 23న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ‘తెలంగాణ దేవుడు’

తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఓ నిఘంటువు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితం ఓ స్ఫూర్తి ప్రదాయకం. అటువంటి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఓ మహానీయుని కథాంశంతో ఫ్రెండ్లీ స్టార్‌ శ్రీకాంత్ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహ్మద్‌ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. వడత్యా హరీష్‌ ‘


రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. 


ఈ సందర్భంగా దర్శకుడు వడత్యా హరీష్‌ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఉద్యమ చరిత్రను తెరకెక్కించే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి అదృష్టాన్ని ప్రసాదించిన మా నిర్మాత మహ్మద్ జాకీర్ ఉస్మాన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఆయన చేసిన సపోర్ట్, సహకారం మరువలేనిది. ఈ చిత్రంలో 50కి పైగా స్టార్ నటీనటులు నటించారు. అందరికీ ధన్యవాదాలు. హీరో శ్రీకాంత్‌గారు మా టీమ్‌ని ఎంతో హుషారుగా ముందుకు నడిపించారు. వారికి చిత్రయూనిట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 23న చిత్రం థియేటర్లలోకి వస్తోంది. అందరూ ఆశీర్వదిస్తారని కోరుతున్నాను..’’ అని తెలిపారు. 


చిత్ర నిర్మాత మహ్మద్‌ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా అందరికీ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. మా ‘తెలంగాణ దేవుడు’ చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం కోసం శ్రీకాంత్‌ గారు ఇచ్చిన సహకారం, సపోర్ట్‌ మరిచిపోలేనిది. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రాంతాలలో తెలంగాణ కోసం ఉద్యమం చేసి సాధించుకున్న తర్వాత ఏర్పడిన పరిణామాల గురించి ప్రస్పుటంగా ఈ చిత్రం ద్వారా దర్శకుడు వడత్యా హరీష్‌ అద్భుతంగా చూపించబోతున్నాడు. ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ చిత్రంతో మా అబ్బాయి జిషాన్ ఉస్మాన్ కూడా నటుడిగా పరిచయం అవుతున్నారు. సీనియర్ నటీనటులు ఎందరో ఈ చిత్రంలో నటించారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 23న గ్రాండ్‌గా థియేటర్లలోకి మా ‘తెలంగాణ దేవుడు’ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులందరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. థియేటర్లలో మా సినిమాను చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను..’’ అని తెలిపారు.


శ్రీకాంత్, సంగీత, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృద్వి, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్య కృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు

నిర్మాత: మహ్మద్‌ జాకీర్ ఉస్మాన్

రచన, దర్శకత్వం: వడత్యా హరీష్

మ్యూజిక్: నందన్ బొబ్బిలి

సినిమాటోగ్రాఫర్: అడుసుమిల్లి విజయ్ కుమార్

ఎడిటర్: గౌతంరాజు

లైన్ ప్రొడ్యూసర్: మహ్మద్‌ ఖాన్

పీఆర్వో: బి.ఎస్‌. వీరబాబు

మాక్స్‌ల్యాబ్ సిఈఓ: మహ్మద్‌ ఇంతెహాజ్‌ అహ్మద్‌

Vinnara E Premakatha Movie Opening

 


విన్నారా ఈ ప్రేమ కథ చిత్రం ప్రారంభం

ప్రత ప్రొడక్షన్స్ పతాకం పై గౌతమ్ రాజు గారి అబ్బాయి కృష్ణ మరియు ప్రియాంక హీరో హీరోయిన్ గా సి హెచ్ దొరబాబు దర్శకత్వం లో డాక్టర్ శ్రీధర్ రాజు యెర్ర నిర్మిస్తున్న చిత్రం "విన్నారా ఈ ప్రేమ కథ" దాచినా దాగదు అనేది కాప్షన్. ఉగాది పర్వదినాన  ఈ చిత్రం యొక్క ప్రారంభ వేడుక నానక్ రామ్ గూడా లోని నరేష్ గార్డెన్ లో పూజ కార్యక్రమాలతో  ఘనంగా జరిగింది. ఈ చిత్రం యొక్క ప్రారంభ వేడుకకి గౌతమ్ రాజు, తమ్మారెడ్డి భరద్వాజ్, నరేష్, జీవిత రాజశేఖర్, భారత్ పారేపల్లి తదితరులు విచ్చేసి యూనిట్ సభ్యులని ఆశీర్వదించారు. ముహూర్తపు సన్నివేశానికి భారత్ పారేపల్లి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ కొట్టారు మరియు సీనియర్ నరేష్ గారు ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసారు.



అనంతరం పాత్రికేయుల సమావేశం లో తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ "గౌతమ్ రాజు గారి అబ్బాయి కృష్ణ హీరో గా ప్రియాంక హీరోయిన్ గా దొరబాబు గారి దర్శకత్వం లో ప్రారంభం అయిన చిత్రం "విన్నారా ఈ ప్రేమ కథ" ఈ చిత్రం విజయం కావలి" అని కోరుకున్నారు.


భారత్ పారేపల్లి మాట్లాడుతూ "టైటిల్ చాలా కొత్తగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాదించాలి. నిర్మాతలకి మంచి డబ్బు రావాలి" అని కోరుకున్నారు.



నిర్మాత  డాక్టర్ శ్రీధర్ రాజు యెర్ర మాట్లాడుతూ "ఉగాది పండగ రోజు మా చిత్రం ప్రారంభం కావటం చాలా సంతోషం గా ఉంది. ప్రతాప్ ప్రొడక్షన్స్ లో ఇది రెండో సినిమా. ఈ చిత్రం రేలంగి గారి కామెడీ లాగా పల్లెటూరి నేపథ్యం లో చిత్రీకరిస్తున్నాం. ఆంధ్ర లోని కాకినాడ, రావులపల్లెం వంటి సహజ లొకేషన్స్ లో సినిమా ని చిత్రీకరిస్తున్నాం. మా చిత్రం అన్ని రకాల ప్రేక్షకులకి నచ్చుతుంది" అని తెలిపారు.


హీరో కృష్ణ మాట్లాడుతూ "సినిమా కథ చాలా బాగుంది. దొరబాబు గారు చాలా కసి తో రాసుకున్నారు ఈ కథ ని. ఇది ఒక పల్లెటూరి లో జరిగే కథ. మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్. సరదాగా ఉంటుంది ఈ సినిమా అందరికి నచ్చుతుంది" అని తెలిపారు.


హీరోయిన్ ప్రియాంక రెడ్డి మాట్లాడుతూ "నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శకుడు నిర్మాతకి నా ధన్యవాదాలు" అని తెలిపారు.


గౌతమ్ రాజు గారు మాట్లాడుతూ "అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మా అబ్బాయి హీరో గా కొత్త చిత్రం ప్రాంరంభం అయ్యింది. నా కొడుకు చిత్రానికి వచ్చిన అందరికి నా ధన్యవాదాలు. దర్శకుడు దొరబాబు చాలా కస్టపడి మంచి కథతో వచ్చాడు. చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు. ఈ చిత్రం మంచి విజయం సాదించాలి, నిర్మాతలకి మంచి డబ్బు రావాలి. పల్లెటూరు లో జరిగే కొత్త కథ. అందరికి నచ్చుతుంది" అని తెలిపారు.




నరేష్ గారు మాట్లాడుతూ "విన్నారా ఈ ప్రేమ కథ మంచి లవ్ స్టోరీ. దొరబాబు మంచి కథ తో వచ్చారు. గౌతమ్ రాజు గారి అబ్బాయి కృష్ణ కి మంచి సినిమా అవుతుంది. మంచి విజయం సాదించాలి" అని కోరుకున్నారు.


బ్యానర్ : ప్రత ప్రొడక్షన్స్


సినిమా పేరు : విన్నారా ఈ ప్రేమ కథ


నటి నటులు : కృష్ణ, ప్రియాంక రెడ్డి తదితరులు


సంగీతం : ఘంటసాల విశ్వనాధ్


కెమెరా : ఏ కె ఆనంద్


ఎడిటింగ్ : ప్రదీప్


పాటలు, మాటలు : పెద్దాడ మూర్తి


డాన్స్ మాస్టర్ : శైలజ గుండాల

Tuck Jagadeesh Release Postponed

 


నిన్నుకోరి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్‌ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న  ఫ్యామిలి ఎంట‌ర్టైన‌ర్ `టక్ జగదీష్. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కు‌తోన్న ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.  

అయితే ఈ రోజు ఉగాది సంద‌ర్భంగా  అంద‌రికీ శ్రీ ప్ల‌వ నామ సంవ‌త్స‌ర ఉగాది శుభాకాంక్ష‌లు తెలుపుతూ

స్పెష‌ల్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. ట‌క్ జ‌గ‌దీష్ ఫ్యామిలీ అంతా క‌లిసి ఆనందంగా ఉన్న ఈ పోస్ట‌ర్‌కి  మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.


క‌రోనా వ్యాప్తి కార‌ణంగా ఈ సినిమా విడుద‌ల తేది వాయిదా ప‌డిన‌ట్లు  వీడియో ద్వారా వివ‌రించారు నేచుర‌ల్ స్టార్ నాని.. ``టక్ జగదీష్ కుటుంబమంతా కలిసి చూసే సినిమా.. అలాంటి సినిమాను ఫ్యామిలీస్ కలిసి చూస్తేనే మజా వస్తుంది.. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకపోవడంతో రిలీజ్ డేట్ కూడా మారిపోయింది, అంతేకాదు ఉగాదికి రావాల్సిన ట్రైలర్ కూడా వాయిదా పడింద‌ని  ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందో..అప్పుడే కొత్త విడుదల తేదీ కూడా అందులోనే ఉంటుందని తెలిపారు  న్యాచురల్ స్టార్ నాని.  


తారాగ‌ణం:

నేచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, న‌రేష్‌,  డానియ‌ల్ బాలాజీ,  తిరువీర్, రోహిణి,  దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్.


సాంకేతిక బృందం:

ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌

నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది

సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌

ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి

ఆర్ట్‌: సాహి సురేష్‌

ఫైట్స్‌: వెంక‌ట్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌)

కో- డైరెక్ట‌ర్‌: ల‌క్ష్మ‌ణ్‌ ముసులూరి

క్యాస్టూమ్ డిజైన‌ర్‌: నీర‌జ కోన‌

పిఆర్ఓ: వంశీ-శేఖ‌ర్‌.

Ishq Releasing on April 23rd



 ఏప్రిల్‌23న విడుద‌ల‌వుతున్న తేజ స‌జ్జా, ప్రియా వారియ‌ర్‌, మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ `ఇష్క్`.


సౌత్ ఇండియాలోని ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్ల‌లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామం త‌ర్వాత మ‌ళ్లీ తెలుగులో వ‌రుస‌గా చిత్రాలు నిర్మించేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేసింది.


ఇటీవ‌ల 'జాంబీ రెడ్డి' మూవీతో సూప‌ర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ స‌జ్జాతో  'ఇష్క్‌` అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. నాట్ ఎ ల‌వ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌.


ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.


ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని విడుద‌ల‌చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ ఉగాది సంద‌ర్భంగా పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌.  తేజ స‌జ్జా, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ వేరు వేరు త‌లుపుల నుండి  బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా మ‌ధ్య‌లో ఒక కారుతో ఉన్న ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.


మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ బాణీలు స‌మ‌కూరుస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎ. వ‌ర‌ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.


తారాగ‌ణం:

తేజ స‌జ్జా, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌


సాంకేతిక బృందం:

డైరెక్ట‌ర్‌: య‌స్‌.య‌స్‌. రాజు

నిర్మాత‌లు: ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌

స‌మ‌ర్ప‌ణ‌: ఆర్‌.బి. చౌద‌రి

బ్యాన‌ర్‌:  మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్‌

మ్యూజిక్‌: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌

సినిమాటోగ్ర‌ఫీ:  శ్యామ్ కె. నాయుడు

ఎడిటింగ్‌: ఎ. వ‌ర‌ప్ర‌సాద్‌

ఆర్ట్‌:  విఠ‌ల్ కొస‌నం

లిరిక్స్‌: శ్రీ‌మ‌ణి

పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్.