Super Star Krishna best wishes to AndarubagundaliAnduloNenundali



 అందరూ బావుండాలి అందులో నేనుండాలి (వికృతి) వంటి మంచి సినిమాలో నటించిన నరేశ్‌కి, అలీకి ఆల్‌ ది బెస్ట్‌– సూపర్‌స్టార్‌ కృష్ణనరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. మలయాళంలో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.  సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది.   అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుని ఇప్పటివరకు 90 శాతం పూర్తి చేసుకుంది.  1100 సినిమాల్లో అనేక పాత్రల్లో నటించిన అలీ హీరోగా తన బ్యానర్‌లో నిర్మిస్తోన్న తొలిచిత్రం కావటంతో ఎంతో గ్రాండియర్‌గా సినిమాను తెరకెక్కించే ఉద్ధేశ్యంతో ఎక్కడ రాజీపడకుండా దాదాపు 20 మంది అగ్ర నటీనటులతో సినిమాను నిర్మిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఉగాది పండగ సందర్భంగా సూపర్‌స్టార్‌ కృష్ణ ఇంటివద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కృష్ణ మాట్లాడుతూ–‘‘ నేను హీరోగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘పండంటి కాపురం’ చిత్రంలోని ‘‘ఏవమ్మా జగడాల వదినమ్మో...పాటలో నరేశ్‌ని ఎత్తుకుని ఆడిపాడాను. అలాగే రాజమండ్రిలో అలీని కలిశాను. అప్పుడు అలీకి 7ఏళ్లు ఉంటాయేమో.  తర్వాత విజయనిర్మల దర్శకత్వంలో నేను,సుజాత హీరో,హీరోయిన్లుగా నటించిన ‘సిరిమల్లె నవ్వింది’ చిత్రంలో బాలనటునిగా అలీ నటించారు. ఇలా నా సినిమాల్లో బాలనటులుగా నటించిన ఇద్దరూ ఈ రోజున కలిసి ఓ సినిమాలో హీరోలుగా నటించటం ఆ సినిమాని అలీ నిర్మించటం చాలా ఆనందంగా ఉంది. ఉగాది రోజున నా దగ్గరికి వచ్చి వారి సినిమా  ‘అందరూ బావుండాలి, అందులో నేనుండాలి’కి నా బ్లెస్సింగ్స్‌ కావాలని అడిగారు. చక్కని టైటిల్‌తో ఎమోషనల్‌గా ఉండే కంటెంట్‌తో సినిమాను తెరకెక్కించారని తెలిసి హ్యాపీగా ఫీలయ్యాను. ఈ సినిమా ద్వారా దర్శకుడు శ్రీపురం కిరణ్‌కి చక్కని పేరు అలీకి నిర్మాతగా డబ్బు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. నరేశ్‌ మాట్లాడుతూ–‘‘ ఈ సినిమాలోని నా పార్టు షూటింగ్‌తో పాటు డబ్బింగ్‌ కూడా పూర్తి చేశాను. నా భార్య పాత్రలో పవిత్రా లోకేశ్‌ నటించారు. ఈ సినిమాలో నటించినందుకు మనస్ఫూర్తిగా అలీకి థ్యాంక్స్‌ చెప్తున్నాను. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి మన్ననలు పొందుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. అలీ మాట్లాడుతూ–‘‘ సూపర్‌స్టార్‌ కృష్ణ గారి చేయి గురించి సినిమా పరిశ్రమలో తెలియని వారుండరు. ఈ రోజు తెలుగువారి ఉగాదితో పాటు, ముస్లిం సోదరుల రంజాన్‌ నెల ప్రారంభరోజు కావటం విశేషం. ఈ సినిమాలో కూడా హిందూ ఫ్యామిలీ, ముస్లిం ఫ్యామిలీలకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఈ రోజు అన్నయ్య నరేశ్, నేను వచ్చి కృష్ణ గారి చేతులమీదుగా మా సినిమాని ఆశీర్వదించమని కోరుకున్నాం. ఆయన నిండు మనసుతో ఆశీర్వదించారు. మా సినిమాకు మాకు అదే పెద్ద బ్లెస్సింగ్‌లా ఫీలవుతున్నాను. ప్రస్తుతం మా సినిమా పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలతో పాటు కొద్దిగా షూటింగ్‌ బ్యాలెన్స్‌ ఉంది. మే నెల రెండో వారానికల్లా అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి’’ అన్నారు.  ఈ సినిమాలోని అన్ని పాటలను ప్రముఖ రచయిత భాస్కరభట్ల రవికుమార్‌ రచించటం విశేషం. ఏ.ఆర్‌ రెహమాన్‌ వద్ద సంగీత శాఖలో అనేక సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన రాకేశ్‌ పళిదం ఈ చిత్రంతో సంగీత దర్శకునిగా ఆరంగేట్రం చేస్తుండటం విశేషం.  ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌ ప్రణవి మానుకొండ నరేశ్‌ కూతురిగా కీలకపాత్రలో నటించారు.  మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి,సనా, వివేక్, శివారెడ్డి, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం,లాస్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి చీఫ్‌ క్రియేటివ్‌ హెడ్‌– ఇర్ఫాన్, కో డైరెక్టర్‌– ప్రణవానంద్‌  కెమెరా– ఎస్‌ మురళీమోహన్‌ రెడ్డి, ఆర్ట్‌– కెవి రమణ, డాన్స్‌ డైరెక్టర్‌– స్వర్ణ, ఎడిటర్‌– సెల్వకుమార్, ఫైట్స్‌–నందు, మేకప్‌–నంద్యాల గంగాధర్, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌– సయ్యద్‌ తాజ్‌ బాషా, విఎఫ్‌ఎక్స్‌– మాయాబజార్‌ స్టూడియో

Post a Comment

Previous Post Next Post