Sampoornesh Babu Bazaar Rowdy Releasing in April Last week



 ఏప్రిల్ నెలాఖరులో సంపూర్ణేష్ బాబు 'బజార్ రౌడీ' విడుదల..

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా కె ఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా బజార్ రౌడీ. వసంత నాగేశ్వరరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యం లో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంపూర్ణేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. సీనియర్ రైటర్ మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాశారు. 1000 సినిమాలకు పైగా ఎడిటింగ్ చేసిన సీనియర్ ఎడిటర్ గౌతంరాజు బజార్ రౌడీ సినిమాకి పనిచేశారు. SS ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఏప్రిల్ నెలాఖరులో బజార్ రౌడీ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.


నటీనటులు: 

సంపూర్ణేష్ బాబు, సాయాజి షిండే, 30 ఇయర్స్ పృథ్వి, కత్తి మహేష్ తదితరులు..


టెక్నికల్ టీమ్: 

దర్శకుడు: వసంత నాగేశ్వరరావు

నిర్మాత: సంధిరెడ్డి శ్రీనివాసరావు 

Executive నిర్మాత- శేఖర్ అలవలపాటి

సమర్పణ: బోడెంపూడి కిరణ్ కుమార్ 

బ్యానర్: కె ఎస్ క్రియేషన్స్ 

మాటలు: మరుధూరి రాజా 

సంగీతం: ఎస్ఎస్ ఫ్యాక్టరీ 

ఎడిటింగ్: గౌతం రాజు 

సినిమాటోగ్రఫీ: ఏ విజయ్ కుమార్ 

పిఆర్ఓ: ఏలూరు శ్రీను

Post a Comment

Previous Post Next Post