Chitrapatam Title Song Released

 


తండ్రి కూతుళ్ల మధ్య ఎమోషనల్ డ్రామా ‘చిత్రపఠం’ టైటిల్ సాంగ్ విడుదల.. 


శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌లో బండారు దానయ్య కవి తెరకెక్కిస్తున్న సినిమా చిత్రపఠం. ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది. ఈ చిత్రం అన్ని సినిమాల మాదిరి హీరో, హీరోయిన్ల చుట్టూ తిరిగే కథ కాదని.. తండ్రి కూతుళ్ల మధ్య సాగే అద్భుతమైన ఎమోషనల్ డ్రామా అని దర్శక నిర్మాత దానయ్య కవి తెలిపారు. సినిమాలో అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయని.. అలాగని ఆఫ్ బీట్ సినిమా కాదని.. కమర్షియల్ అంశాలు కూడా తమ సినిమాలో పుష్పలంగా ఉంటాయని తెలిపారు ఈయన. తన దృష్టిలో కమర్షియల్ అంశాలు అంటే మనసును తాకే ఎమోషన్ అని తెలిపారు ఈయన. తమ చిత్రపఠం సినిమాలో అద్భుతమైన 8 పాటలున్నాయని.. తండ్రి కూతుళ్ల మధ్య సాగే ఈ ఎమోషనల్ డ్రామా అందర్నీ అలరిస్తుందని ఈయన నమ్మకంగా చెప్తున్నారు. తాజాగా విడుదలైన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాకు మురళీ మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సంగీతం, సాహిత్యం, రచన, దర్శకత్వం బాధ్యతలు బండారు దానయ్య కవి తీసుకున్నారు. 


నటీనటులు: 

కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, నరీన్ (తమిళ ఫేమ్), శరణ్య పొన్నవన్ (తమిళ ఫేమ్), కాలకేయ ప్రభాకర్, పార్వతీషం, బాలా చారీ, సిరివల్లి తదితరులు.. 


టెక్నికల్ టీం: 

సంగీతం, సాహిత్యం, రచన, దర్శకత్వం: బండారు దానయ్య కవి

నిర్మాత: పుప్పాల శ్రీధర్ రావు 

బ్యానర్: శ్రీ క్రియేషన్స్ 

సినిమాటోగ్రఫీ: మురళీ మోహన్ రెడ్డి 

ఎడిటర్: వినోద్ అద్వయ్ 

పాట: నా పేరే చిత్రపఠం 

గాయకులు: బృంద, బండారు దానయ్య కవి 

ల్యాబ్: ప్రసాద్ ల్యాబ్, ప్రైమ్ ఫోకస్ (రామానాయుడు)

Post a Comment

Previous Post Next Post