హల్కా డాన్’గా ‘లెనిన్’లో విలక్షణ నటనతో మెప్పించిన ప్రమోద్.. అదిరిపోయిన మాస్ ఫస్ట్ కట్ టీజర్
రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘లెనిన్’ చిత్రంలో అద్భుతమైన నటనతో కన్నడ నటుడు ప్రమోద్ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కన్నడలో హీరోగా ప్రమోద్‌కి మంచి క్రేజ్ ఉంది. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ‘లెనిన్’ చిత్రంతో దగ్గరయ్యారు. అలాంటి ప్రమోద్ ఇప్పుడు హీరోగా ‘హల్కా డాన్’ అంటూ రాబోతోన్నారు. కన్నడ, తుళు, తెలుగు భాషల్లో ఈ చిత్రం రానుంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ఫస్ట్ కట్ టీజర్‌ను విడుదల చేశారు.
ఈ టీజర్ పూర్తిగా మాస్, యాక్షన్ లవర్స్‌కి ట్రీట్‌లా ఉంది. మాస్ ఆడియెన్స్‌కి నచ్చే, వారు మెచ్చే ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో టీజర్‌ను కట్ చేశారు. ప్రమోద్ రఫ్ లుక్, బాడీ లాంగ్వేజ్, హావభావాలు అన్నీ కూడా సరికొత్తగా ఉన్నాయి. సరికొత్త మాస్ అవతార్‌లో ప్రమోద్ కనిపించబోతోన్నారు. ఈ చిత్రాన్ని కన్నడ, తుళు, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ కేపీ, మాధవ్ సిరాన్, మాసిస్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో నిర్మించిన ఈ చిత్రానికి చాల రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అమృత అయ్యంగార్, కోస్తా స్టార్ రూపేష్ శెట్టి ముఖ్య పాత్రలు పోషించారు. ప్రతిష్టాత్మక ఆడియో లేబుల్ డి బీట్స్ ద్వారా విడుదలైన 'హల్కా డాన్' టీజర్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, మాస్ డైలాగులు, కామెడీ టైమింగ్, ప్రముఖ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.


Post a Comment