"ఇడుపు కాయితం" నవ్విస్తూ, ఆలోచింపజేసే మంచి ఫ్యామిలీ డ్రామా ఫిలిం- టీజర్ లాంఛ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ బన్నీ వాస్
డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
ప్రొడ్యూసర్స్ బన్నీ వాస్, తబిత సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా "ఇడుపు కాయితం". ఈ సినిమాలో ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా "ఇడుపు కాయితం" సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు "ఇడుపు కాయితం" సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా
కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ మాట్లాడుతూ - ఈ సినిమాకు వర్క్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. బారాత్ సాంగ్ కు నాగదుర్గ తన డ్యాన్స్ స్టెప్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
నటుడు విద్యాసాగర్ మాట్లాడుతూ - మంచి కుటుంబ కథా చిత్రమిది. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలి. ఈ చిత్రంలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించే అవకాశం కలగడం సంతోషంగా ఉంది. అన్నారు.
నటి విజయ మాట్లాడుతూ - ఈ సినిమాలో సర్పంచ్ నవ్య పాత్రలో నటించాను. మహిళ సర్పంచ్ అయితే అధికారం భర్త చెలాయిస్తాడు అంటారు కానీ కాలం మారింది. మహిళలు సర్పంచులు అయితే మీరే అన్ని బాధ్యతలు తీసుకోండి. ఇలాంటి మంచి క్యారెక్టర్ చేసే అవకాశం కల్పించిన మా దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. అన్నారు.
నటుడు మైమ్ మధు మాట్లాడుతూ - మా సినిమా టైటిల్ పై ఆదరణ చూపించారు. శ్రీలత, గడప సాంగ్స్ హిట్ చేశారు. రీసెంట్ గా బారాత్ సాంగ్ ను ఎంజాయ్ చేశారు. డిసెంబర్ 11న రిలీజ్ అవుతున్న మా సినిమాను కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
నటుడు వినోద్ బాల మాట్లాడుతూ - మా సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఒక పాజిటివ్ వైబ్ మా అందరిలో ఉంది. సినిమా వంద రోజుల వేడుక చేసుకునే దాకా ఈ వైబ్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. మా చిత్రంలో పల్లెటూరి వాతావరణం, అక్కడి ఎమోషన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటాయి. ఇటీవల నేను సినిమాల్లో నటించడం తగ్గించాను. ఇలాంటి మంచి టీమ్ తో వర్క్ చేయడం నటుడిగా చాలా సంతోషాన్నిచ్చింది. అన్నారు.
నటి చంద్రవ్వ మాట్లాడుతూ - ఈ సినిమాలో హీరోయిన్ నాగజ్యోతి తల్లి పాత్రలో నటించాను. ఈ క్యారెక్టర్ గయ్యాలి అనుకుంటారు కానీ చాలా మంచిది. బిడ్డను అత్తవారింటికి పంపేప్పుడు తల్లి భయపడుతుంది. అక్కడ కూతురు ఎలా సర్దుకుపోతుందో అని వణుకుతుంది. ఈ ఎమోషన్స్ నా క్యారెక్టర్ లో చూస్తారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. అన్నారు.
డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి మాట్లాడుతూ - ఇండస్ట్రీకి వచ్చి ఒక సినిమా రూపొందించి, అందులో చిన్న శాంపిల్ గా టీజర్ మీకు చూపించాం. మా మూవీ టీజర్ మీకు నచ్చడం హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా నా పేరెంట్స్, టీచర్స్ తో పాటు నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన తబిత గారికి, సుకుమార్ గారికి, బన్నీ వాస్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. సినిమా చాలా బాగా వచ్చింది. డిసెంబర్ 11న చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం. ఇడుపుకాయితం అనేది ఒక జంట విడిపోవడానికి రాసుకునే పత్రం అనుకుంటాం. కానీ అదే జంట విడిపోయిన తర్వాత కొత్త జీవితం ప్రారంభించడానికి ఒక సర్టిఫికెట్ లాగ ఇడుపుకాయితాన్ని భావించాలి అనేది నా ఉద్దేశం. టైటిల్ ను మీరు అలాగే పరిగణించాలని కోరుతున్నా. అన్నారు
ప్రొడ్యూసర్ తబిత సుకుమార్ మాట్లాడుతూ - మా ఇడుపు కాయితం సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నేను మా సినిమా ఫస్ట్ హాఫ్ చూశాను. డైరెక్టర్ వంశీరెడ్డి కథ ఎంత బాగా చెప్పాడో, అంతే బాగా సినిమా తెరకెక్కించాడు. కథ చెబుతున్నప్పుడే సినిమా ఎలా ఉంటుందో ఊహించాను. నేను కథను ఎలా విజువలైజ్ చేసుకున్నానో అలాగే రూపొందించారు. ఇది బ్యూటిఫుల్ స్టోరీ. సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరూ ఈ కథను రిలేట్ చేసుకుంటారు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి పెళ్లి సంప్రదాయాలు, పెద్దవాళ్లు మాట్లాడుకునే మాటలు, ఆ చర్చలన్నీ ఎలా ఉంటాయో చిన్నప్పుడు చూశాను. అవన్నీ ఈ సినిమాలో మళ్లీ చూశాననే ఫీల్ కలిగింది. మీ అందరికీ అదే ఫీల్ కలుగుతుందని నమ్ముతున్నాను. డిసెంబర్ 11న రిలీజ్ కు వస్తున్న మా సినిమాను థియేటర్స్ లో చూడండి. అన్నారు.
ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మాట్లాడుతూ - ఈ సినిమాకు ఏది చేసినా కాంట్రవర్సీ అవుతుందనే భయం మొదలైంది. టైటిల్ నుంచే మాలో ఈ భయం మొదలైంది. ఈ వివాదాలు అన్నీ సిల్లీగా అనిపించాయి. నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు అని భార్య అడిగే ప్రశ్నకు ఏ భర్త దగ్గరా సమాధానం ఉండదు. ఈ సినిమాలో ఒక్క సీన్ లో మాత్రం ఆ ప్రశ్నకు ఒక క్యూట్ ఆన్సర్ వస్తుంది. ఇది చాలా మంచి సినిమా. కొత్తగా పెళ్లయిన జంట మీ అత్త మామతో కలిసి థియేటర్ కు రండి. ఈ సినిమాలో మన జీవితాల్లో జరిగే చిన్న చిన్న విషయాలను చూపిస్తూ అక్కడక్కడా నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ డైరెక్టర్ ఆకట్టుకునేలా తెరకెక్కించారు. మాటలు మన ఇంట్లో మాట్లాడుకున్నట్లే ఉంటాయి. ఎక్కడా సినిమాటిక్ గా ఉండదు. దర్శకుడిగా వంశీరెడ్డికి మంచి పేరొస్తుంది. హండ్రెడ్ పర్సెంట్ డిసెంబర్ 11న రిలీజ్ కు వస్తున్నాం. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తాం. టీజర్ కన్నా ట్రైలర్ ఇంకా బాగుంటుంది. మీ టికెట్ డబ్బులు మాత్రం వృథా కావు. ప్రియదర్శి, నాగదుర్గ పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రియదర్శి ఈ కథ తీసుకొచ్చి మాతో చేయించారు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ కూడా ఆయనకే వెళ్తుంది. ఇది ఫ్యామిలీ డ్రామా కదా అని మేము ఆలోచిస్తున్నప్పుడు అలాంటి మూవీస్ నే చూస్తారంటూ ముందుకొచ్చారు తబిత గారు. మా టీమ్ లోని జెన్ జీ బ్యాచ్ ఈ సినిమాను చేశారు. మేము ఫైనాన్స్ చూసుకున్నాం. నేను సినిమా చూశాను. చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా మా మూవీని ఇష్టపడతారు. అన్నారు.
హీరోయిన్ నాగదుర్గ మాట్లాడుతూ - మా మూవీ టీజర్ మీకు నచ్చిందని నమ్ముతున్నాం. మూవీ కూడా ఇలాగే మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మా మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్ ను సక్సెస్ చేస్తున్నారు. ఇంకా మంచి సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాం. ఒకదాని కంటే మరొక సాంగ్ బాగుంటుంది. సురేష్ బొబ్బిలి అన్న మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా హీరో ప్రియదర్శి, దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. అన్నారు.
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ - నిజాయితీగా ఒక కథను చెబితే అది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఇది చాలా సార్లు ఇండస్ట్రీలో ప్రూవ్ అయ్యింది. ఇది మన కథ, మనందరి ఇళ్లలో జరిగే కథ. ఫ్యామిలీ డ్రామాను మించిన డ్రామా మరొకటి ఉండదు. ఇలాంటి మంచి టీమ్ పనిచేసినందుకు గర్వంగా ఉంది. సినిమా బాగా వచ్చింది. నేను చిన్నప్పుడు బయటకు వెళ్తుంటే అమ్మ ఎదురొచ్చేది మంచి జరగాలని. అలా ఈ సినిమాకు ఎదురొచ్చారు తబిత అక్క. ఈ సినిమా చేయాల్సిందేనని మా అందరికీ ధైర్యం చెప్పినందుకు తబిత అక్కకు థ్యాంక్స్. ఈ సినిమాకు ఫస్ట్ పిల్లర్ బన్నీ వాస్ అన్న. ఆయన ప్రొడ్యూసర్ మాత్రమే కాదు ఆయనలో ఒక గొప్ప డైరెక్టర్ ఉన్నారు. ఆయనతో పనిచేసిన వారికే అది తెలుస్తుంది. మా వంశీరెడ్డి సుకుమార్ రైటింగ్స్ లో మరో సినిమా చేస్తున్నాడని చెబుతున్నారు. వంశీ లాంటి మంచి మనసున్న టెక్నీషియన్ తో కలిసి పనిచేశాననే సంతోషం నాలో ఎప్పటికీ మిగిలిపోతుంది. ఇదొక గొప్ప సినిమా అవుతుందని ప్రామిస్ చేస్తున్నా. అలాంటి గొప్ప టీమ్ కూడా ఈ సినిమాకు వర్క్ చేసింది. నాగదుర్గ మంచి డ్యాన్సర్ గానే కాదు మంచి పర్ ఫార్మర్ గా ఈ సినిమాతో పేరు తెచ్చుకుంటారు. అన్నారు.
నటీనటులు - ప్రియదర్శి, నాగదుర్గ, శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), వినోద్ బాల, అభినవ్ గోమటం, సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు, తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్ - అశ్వత్ భైరి
ఆర్ట్ డైరెక్టర్ - ఆశిష్ తేజ
ఎడిటర్ - శ్రీధర్ సొంపల్లి
డీవోపీ - ఎంఎన్ బాల్ రెడ్డి
మ్యూజిక్ - సురేష్ బొబ్బిలి
బ్యానర్స్ - సుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ వర్క్స్
ప్రొడ్యూసర్స్ - బన్నీవాస్, తబిత సుకుమార్
స్క్రిప్ట్, డైరెక్షన్ - వంశీరెడ్డి దొండపాటి
మార్కెటింగ్ - విష్ణు తేజ్ పుట్ట
పీఆర్ఓ - సురేష్ (ఎస్ కే మీడియా), మడూరి మధు


Post a Comment