SeethaPayanam Pre Release Event Held Grandly

బంధాల విలువలను చాటి చెప్పే చిత్రమిది.. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది.. ‘సీతా పయనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శక, నిర్మాత యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాస్య బ్రహ్మ, పద్మశ్రీ డా. బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ హీరోలైన పర్యావరణ వేత్త, సామాజిక వేత్త డా. ప్రకాష్ ఆమ్టే, డా. మందాకిని ఆమ్టే, ట్యాంక్ బండ్ శివ, పర్యావరణ వేత్త దుశ్చర్ల సత్యనారాయణ తదితరులని ‘సీతా పయనం’ టీం సత్కరించి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో..

హాస్య బ్రహ్మ, పద్మశ్రీ డా. బ్రహ్మానందం మాట్లాడుతూ .. ‘మంచి మనిషి, రియల్ జెంటిల్మెన్ అర్జున్ గురించి ఈ ఈవెంట్‌కు వచ్చాను. రియల్ హీరోల్ని సత్కరిస్తున్నాను అని అర్జున్ చెప్పినప్పుడు ఎంతో సంతోషించాను. ఇలాంటి గొప్ప వారిని సత్కరించే అవకాశం అందరికీ లభించదు. అర్జున్ దర్శకత్వం వహించిన ‘జై హింద్ 2’ చిత్రంలో నేను నటించాను. అర్జున్ ఎప్పుడూ ఎవ్వరినీ డిమాండ్ చేయరు. ఎప్పుడూ సౌమ్యుడిగానే ఉంటారు. ఈ చిత్రంతో ఐశ్వర్యకు మంచి పేరు రావాలి, అర్జున్ పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీత దర్శకుడు. అచెంచలమైన భక్తి గల అర్జున్‌కి మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శక, నిర్మాత అర్జున్ సర్జా మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’ అనేది ఒక్కరి ప్రయాణం కాదు. నా కూతురిని ఓ మంచి కథతో, పాజిటివిటీ ఉన్న సినిమాతో పరిచయం చేయాలని అనుకున్నాను. ఇదొక డిఫరెంట్ జానర్ కథ. నా కూతురికి ఓ బహుమతిలా ఈ సినిమాని ఇవ్వాలని అనుకున్నాను. జనాలకు ఓ మంచి చిత్రాన్ని ఇవ్వాలనే బాధ్యతతో ఈ చిత్రాన్ని తీశాను. ఎంతో నిజాయితీతో ఈ మూవీని తీశాను. ఉపేంద్ర గారి అన్న కొడుకు నిరంజన్ చాలా టాలెంటెడ్ పర్సన్. అభి పాత్రలో అద్బుతంగా నటించాడు. నా కూతురి గురించి నేను కాకుండా ఆడియెన్స్ చెప్పాలి. ఈ చిత్రంలో ఐశ్వర్యను చూసి అందరూ మెచ్చుకుంటారని భావిస్తున్నాను. సత్య రాజ్ గారు చెప్పిన టైంకి, చెప్పిన డేట్లకు పర్‌ఫెక్ట్‌గా వచ్చారు. ఫాదర్ అండ్ డాటర్ ట్రాక్, ఆ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ఇందులో చాలా గొప్పగా ఉంటాయి. ప్రకాష్ రాజ్ గారి పాత్రను అందరూ ఇష్టపడుతారు. నేను, ధృవ ఇద్దరం కేమియో పాత్రల్ని చేశాం. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, ఆర్ఆర్ ఈ చిత్రానికి ప్రధాన బలం. నా ఏడీ మూర్తి ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాడు. మూర్తి, నేను కలిసే ఈ సినిమాని చేశాం. కెమెరామెన్ బాల కుమారన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. సున్నితమైన అంశాలతో తెరకెక్కించినా కూడా అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది మేం హృదయంతో తెరకెక్కించాం. బంధాల విలువలను చాటి చెప్పే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది. ఫిబ్రవరి 14న మా మూవీని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

హీరోయిన్ ఐశ్వర్యా అర్జున్ మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’ నాకు కేవలం ఓ సినిమా మాత్రమే కాదు. ఇది నాకొక ఎమోషన్. ప్రేమ గురించి, కుటుంబం గురించి, విలువల గురించి చెప్పే చిత్రమిది. ఈ సినిమాలో సత్య రాజ్ గారు మా నాన్న పాత్రను పోషించారు. ఈ మూవీలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు పని చేశారు. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత.. నేను గర్వంగా చెప్పుకునే నా తండ్రి అర్జున్ గారికి థాంక్స్. ఆయన పేరు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాను. మేం మనస్పూర్తిగా, నిజాయితీగా ఈ మూవీని చేశాం. ఫిబ్రవరి 14న ఈ సినిమాని థియేటర్లో అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

హీరో నిరంజన్ మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’ సినిమాకి మేమంతా ఎంతో కష్టపడి పని చేశాం. మా బాబాయ్ ఉపేంద్రని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ప్రేమిస్తుంటారు. అదే ప్రేమను నా మీద, మా సినిమా మీద కూడా చూపించాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 14న మా మూవీ రాబోతోంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. నన్ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న అర్జున్ గారికి థాంక్స్. ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన ఐశ్వర్య గారికి థాంక్స్. ధృవ్ అన్న కారణంగానే నాకు ఈ అభి పాత్ర లభించింది. అందరూ మా సినిమాని చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

పర్యావరణ వేత్త, సామాజిక వేత్త డా. ప్రకాష్ ఆమ్టే మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’ కార్యక్రమానికి పిలిచి మమ్మల్ని ఇలా సన్మానించినందుకు థాంక్స్. అడవుల్లో ఎంతో మంది అన్నం, సరైన బట్టలు లేకుండా బతుకుతున్నారు. మేం వారి కోసం ఇన్నేళ్లుగా శ్రమిస్తున్నాం. మనుషులకు సాయం చేసేందుకు అడవులకు వెళ్తే అక్కడ మాకు జంతువుల ప్రేమ కూడా లభించింది. ఈ చిత్రం కోసం మమ్మల్ని పిలిచిన అర్జున్ గారికి థాంక్స్’ అని అన్నారు.

పర్యావరణ వేత్త, సామాజిక వేత్త డా. మందాకిని ఆమ్టే మాట్లాడుతూ .. ‘‘మమ్మల్ని పిలిచిన అర్జున్ గారికి థాంక్స్. గడ్చిరోలిలోని అడవుల్లో మేం నివసిస్తుంటాం. అక్కడ మేం స్కూల్, హాస్పిటల్‌ను కట్టించాం. మేం అక్కడి అటవీ మనుషుల కోసం పని చేస్తున్నాం. మమ్మల్ని ఇక్కడకు పిలిచి సన్మానించిన ‘సీతా పయనం’ టీంకు థాంక్స్’ అని అన్నారు.

ట్యాంక్ బండ్ శివ మాట్లాడుతూ .. ‘నన్ను ఇక్కడకు పిలిచిన అర్జున్ గారికి థాంక్స్. అర్జున్ గారి కూతురు ఇండస్ట్రీలోకి రాబోతోంది. ఆమెకు మంచి విజయం దక్కాలి. నా ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన భార్య శాంతకు థాంక్స్’ అని అన్నారు.

పర్యావరణ వేత్త దుశ్చర్ల సత్యనారాయణ మాట్లాడుతూ .. ‘నన్ను ఈవెంట్‌కు పిలిచిన ‘సీతా పయనం’ ఈవెంట్‌కు థాంక్స్. పర్యావరణం కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలి’ అని అన్నారు.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’కి పని చేయడం ఆనందంగా ఉంది. అర్జున్ గారితో పని చేయడం వల్ల ఎంతో నేర్చుకోగలిగాను. ఆయనతో ఎంతో క్వాలిటీ టైంని గడిపే అవకాశం వచ్చింది. ఐశ్వర్యకి ఈ చిత్రంతో మంచి పేరు వస్తుంది. ఎన్నో విలువలతో కూడుకున్న చిత్రమిది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా’ అని అన్నారు.

సత్య రాజ్ మాట్లాడుతూ .. ‘రియల్ హీరోలని స్టేజ్ మీద సత్కరించిన అర్జున్ గారికి హ్యాట్సాఫ్. ‘సీతా పయనం’ గొప్ప చిత్రం అవుతుంది. నిరంజన్, ఐశ్వర్య జంట చూడముచ్చటగా ఉంది. నాలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు, నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’ టైటిల్ ఎంతో పాజిటివ్‌గా ఉంది. ఈ ఈవెంట్‌లోనూ అంతా పాజిటివిటీనే కనిపిస్తోంది. అర్జున్ గారి దర్శకత్వం, అతని కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా పరిచయం కాబోతోన్నారు. ఇదొక మంచి చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. ‘అర్జున్ గారు సెట్ మీద ఓ సాధారణ కార్మికుడిగా కష్టపడి పని చేస్తుంటారు. ఈ రోజు ఇక్కడ రియల్ హీరోలని సత్కరించడం ఆనందంగా ఉంది. ‘సీతా పయనం’ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

డైలాగ్ రైటర్ సాయి మాధవ్ మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’ టైటిల్‌‌లోనే ఎంతో పాజిటివిటీ ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లో చూడదగ్గ చిత్రమిది’ అని అన్నారు.

Post a Comment

Previous Post Next Post