Srikakulam Sherlock Holmes Trailer Success Meet Held Grandly

 శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన అందింది. ఈ సినిమాలో కథే హీరో. స్క్రీన్‌ప్లే అత్యంత ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమా అందరినీ ఇంప్రెస్ చేస్తుంది అని ట్రైలర్ సక్సెస్ ప్రెస్ మీట్‌లో వంశీ నందిపాటి తెలిపారు.



వెన్నెల కిషోర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. రచన మోహన్, దర్శకత్వం మోహన్. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌లో వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు వంటి విజయవంతమైన చిత్రాలతో ఉన్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ సృష్టించింది, తాజాగా విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ సక్సెస్ రైడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.


ప్రెస్ మీట్‌లో వంశీ నందిపాటి మాట్లాడుతూ, “అందరికీ నమస్కారం. 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. 3 మిలియన్ డిజిటల్ వ్యూస్‌ను దాటించడం సినిమాకు పెద్ద అర్జునం. ట్రైలర్‌కు మంచి సమీక్షలు వచ్చాయి. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. కథే హీరో అని చెప్పగలను. ఈ సినిమాతోనే కథపై నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళబోతున్నాను. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, సినిమా పూర్తయిన తర్వాత పార్ట్ 2పై ఆసక్తి ఉంటుంది. స్క్రీన్‌ప్లే మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ఇది చాలా ఆకట్టుకునే సినిమా. ఈ 25న అందరూ థియేటర్లలో వెళ్లి సినిమాను పెద్ద విజయంగా మార్చాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.


హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ, “నాకు పెర్ఫార్మెన్స్‌కు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమాలో నేను చాలా భిన్నమైన క్యారెక్టర్ పోషిస్తున్నాను. కథ, నా క్యారెక్టర్ రెండూ నాకు నచ్చాయి. క్యారెక్టర్ రూపకల్పన కొత్తగా ఉంటుంది. ఈ సినిమాతో మంచి విజయం వస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.


డైరెక్టర్ మోహన్ మాట్లాడుతూ, “ఈ కథ ఉత్తరాంద్ర నేపథ్యంతో ఉంటుంది. వెన్నెల కిషోర్ గారితో పాటు నటించిన అందరూ ఆ యాసని చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. ఇది చాలా నిజాయితీగా చేసిన సినిమా. ఈ కథ రాజీవ్‌గాంధీ హత్య జరిగిన రోజు జరిగింది. ఆయన విశాఖ పర్యటన ముగించుకుని శ్రీపెరంబుదూర్ వెళ్లారు. అక్కడ హత్యకు గురయ్యారు. అలాంటి పెద్ద సంఘటన జరిగినప్పుడు చిన్న సంఘటనలను పట్టించుకోరు. ఆ రోజు జరిగిన కొన్ని కల్పిత సంఘటనల చుట్టూ కథ అల్లబడ్డది. ఎమోషన్స్, థ్రిల్ అద్భుతంగా ఉంటాయి. రామ్ మోహన్ నాయుడు గారు 'శ్రీకాకుళం' పాటను విని అభినందించారు. వంశీ గారు చాలా మంచి సూచనలు ఇచ్చారు. ఆయన రావడంతో సినిమా కొత్త స్థాయికి చేరింది. ఈ సినిమాలో ఒక మ్యాజిక్ జరిగింది. సినిమా అన్‌ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది” అన్నారు.


నిర్మాత రామణారెడ్డి మాట్లాడుతూ, “మోహన్ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. కథపై నమ్మకం ఉంచి ఈ సినిమాను రూపొందించాం. సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది” అన్నారు.


యాక్టర్ అనీష్ కురివిల్లా మాట్లాడుతూ, “ఇంత వరకు కొన్ని పోలీసు పాత్రలు చేశాను, కానీ ఈ సినిమాలో ఫిజికల్ కామెడీ ఎలిమెంట్ ఉన్న రోల్ చేశాను. ఈ క్రెడిట్ మోహన్ గారికి చెందుతుంది. వెన్నెల కిషోర్ గారితో చాలా సీన్స్ ఉన్నాయి. ఆయనతో కామెడీ చేయడం కొత్త అనుభవం. చాలా ఎంజాయ్ చేశాను” అన్నారు.


యాక్టర్ రవితేజ మాట్లాడుతూ, “ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ను మోహన్ గారు ఆసక్తికరంగా డిజైన్ చేశారు. నా పాత్ర కథలో కీలకమైనది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాగలదని నమ్ముతున్నాను” అన్నారు.


యాక్టర్ నాగ మహేష్ మాట్లాడుతూ, “ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌కు ఫాదర్ పాత్ర పోషిస్తున్నాను. ఇది త్రూ అవుట్  ఉండే పాత్ర. ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ భిన్నంగా ఉంటాయి. ప్రేక్షకులు కొత్త కోణంలో చూస్తారు” అన్నారు.

Post a Comment

Previous Post Next Post