"Pushpa 2 Jathara Song: A Milestone in My Career" - Star Choreographer Vijay Polaki Master

 పుష్ప 2 జాతర పాట: నా కెరీర్‌లో మైల్‌స్టోన్  స్టార్ కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి మాస్టర్ 



"పుష్ప 2 టైటిల్ సాంగ్, జాతర పాటకు వచ్చిన అద్భుతమైన స్పందన నా కెరీర్‌లో ఒక మైల్స్టోన్‌గా నిలిచిపోతుంది" అని అన్నారు. ఇటీవల ఈ పాటలు ట్రెండింగ్‌లో నిలవడంతో విలేకరులతో మాట్లాడిన ఆయన, తన జర్నీ, సక్సెస్, మరియు భవిష్యత్ ప్రాజెక్టులపై ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.


 సక్సెస్‌పై స్పందన  

"ట్విట్టర్‌లో ట్రెండింగ్ కొరియోగ్రాఫర్‌గా నన్ను అందరూ అభినందించడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ గుర్తింపు నాకు మరింత బాధ్యతను పెంచింది. ప్రతీ సాంగ్‌కి నా శ్రద్ధ మరియు బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను," అన్నారు విజయ్ మాస్టర్.  


 జర్నీ ప్రారంభం  

"డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాను. కొరియోగ్రఫీకి ఛాన్స్ కోసం చాలా కష్టపడ్డాను. నా మొదటి పాట 'కొబ్బరిమట్ట'లో 'అఆ ఇఈ'. ఆ తర్వాత 'పలాస'లో అన్ని పాటలు చేశాను. 'నిక్కిలీసు గొలుసు' పాట హిట్ అయిన తర్వాత పుష్ప సినిమాలో అవకాశం వచ్చింది. 'ఊ అంటావా' పాట ద్వారా బన్నీ గారి స్టూడియోకి వెళ్ళి నా ప్రయాణం ప్రారంభమైంది," అని వివరించారు.


 పుష్ప 2 ప్రయాణం  

"సుకుమార్ గారు నాకు జాతర పాట గురించి చెప్పినప్పుడు, దాని వెనుక ఉన్న భావోద్వేగాన్ని అర్థం చేసుకున్నాను. పాట కోసం మూడు నెలల పాటు ప్రిపరేషన్ చేశాం. సుకుమార్ గారి విజన్‌ను అనుసరించి, పుష్ప క్యారెక్టర్‌కు అనుగుణంగా మాస్ స్టెప్పులు కంపోజ్ చేశాను. ఈ పాటకు మంచి స్పందన రావడంతో, టైటిల్ సాంగ్ కూడా నాకు ఇవ్వడం జరిగింది," అని చెప్పారు.


 జాతర సాంగ్ విశేషాలు  

"చిన్నప్పుడు ఊర్లో జరిగే జాతరలను గమనించేవాడిని. అక్కడి మూమెంట్స్‌కి ప్రేరణగా జాతర పాటను రూపొందించాం. చీర మూమెంట్, కాళ్లకు పసుపు నీరు రాయడం వంటి వాస్తవ సంఘటనలు పాటలో నిలబెట్టాం. ఇది ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంది," అని తెలిపారు.  


"చిరంజీవి గారి 'దాయి దాయి దామ్మ' స్టెప్ చూసి డ్యాన్స్‌పై ఆసక్తి పెరిగింది. రామ్ పోతినేని గారి ప్రోత్సాహంతో మాస్టర్‌గా మారాను. 2015లో డ్యాన్సర్ కార్డ్ తీసుకున్న తర్వాత కొరియోగ్రాఫర్‌గా మారి ఈ స్థాయికి చేరుకున్నాను," అన్నారు.


 ఫ్యూచర్ ప్రాజెక్ట్స్  

"సంబరాల ఏటిగట్టు, భైరవం, మ్యాడ్ 2, బేబీ వంటి ప్రాజెక్టులపై పని చేస్తున్నాను. చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారితో పనిచేయడం నా డ్రీమ్. ఇంకా కొరియోగ్రఫీలో పేరు తెచ్చుకోవాలని ఉంది," అని పేర్కొన్నారు.


ఆల్ ది బెస్ట్ విజయ్ మాస్టర్!

Post a Comment

Previous Post Next Post