'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' – హీరోయిన్ అనన్య నాగళ్ల థ్రిల్లింగ్ పాత్ర
వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' ఆసక్తికర కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటల ద్వారా మంచి హైప్ తెచ్చుకుంది.
సినిమా విశేషాలపై హీరోయిన్ అనన్య నాగళ్ల పంచుకున్న వివరాలు:
"ఇలాంటి కథను ఇప్పటివరకు వినలేదు. మోహన్ గారు కథ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. సంఘటనల వెనుక ఉన్న విభిన్న కోణాలు, పెర్స్పెక్టివ్‌లతో కథ సాగుతుంది. వినగానే 'ఓకే' చెప్పా. ఇది డిఫరెంట్ స్టోరీ, ఖచ్చితంగా ఆడియన్స్‌కు క్రిస్మస్ గిఫ్ట్ అవుతుంది" అని అనన్య తెలిపారు.
"ఇందులో డిటెక్టివ్ పాత్రకు షర్మిలమ్మ, లోకనాథ్, ఓం ప్రకాష్ అనే పేర్లు ఉన్నాయి. వాటి మొదటి అక్షరాలతో షెర్లాక్ హోమ్స్ అనే టైటిల్ పెట్టారు. ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. తెలుగు డిటెక్టివ్ సినిమాల్లో చిరంజీవి గారి చంటబ్బాయ్ గుర్తుకొస్తుంది. ఈ ట్యాగ్ ఆ భావనను అందించేలా ఉంటుంది."
"నా పాత్ర పేరు భ్రమరాంబ. చాలా విభిన్నమైన, ఇప్పటివరకు చేయని పాత్ర. కథనం చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఓ పెద్ద సంఘటన వెనుక ఉన్న చిన్న చిన్న కేసులు ఎలా బయటపడతాయనే క్రమంలో కథ సాగుతుంది. థ్రిల్, సస్పెన్స్‌తో పాటు క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది."
"ఇప్పటికే విడుదలైన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీకాకుళం పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. లవ్ స్టోరీ సాంగ్ కూడా అందరిని కట్టిపడేస్తుంది."
"కోర్టు సీన్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా యాక్టింగ్‌పై ప్రశంసలు చెప్పారు. 'మీ ఎమోషనల్ ఎక్స్ ప్రెషన్స్ చాలా రియల్‌గా ఉన్నాయి' అని చెప్పడం నా కెరీర్‌లో ప్రత్యేకం."
"తెలుగుతో పాటు హిందీలో ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తూ ఉన్నాను. ఇలాంటి చిత్రాలు మరింతగా చేస్తాననే ఆశయం ఉంది."
"వంశీ గారు సినిమాకు అవసరమైన సూచనలు ఇచ్చారు. అవి చాలా ఉపయోగపడ్డాయి. నిర్మాత రమణారెడ్డి గారు కూడా పూర్తి మద్దతు అందించారు. ఈ చిత్రం నాకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్."
"కథాకళి మరియు లేచింది మహిళా లోకం సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇవి కూడా మంచి కథలతో ఉంటాయి."
అనన్య చివరిగా చెప్పింది: "నా కెరీర్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. మంచి కథలు వస్తున్నాయి, ఇది మంచి శుభ సూచకం. ఆడియన్స్‌ను థ్రిల్ చేసే ఈ సినిమాను తప్పక థియేటర్లలో చూడండి."
ఆల్ ది బెస్ట్!
Post a Comment