Vijay Sethupathi Super Deluxe Grand Release on 9th August in 400+ Theaters

 మాస్టర్ పీస్ మూవీ సూపర్ డీలక్స్ 400+ థియేటర్లలో ఆగస్టు 9న గ్రాండ్ రిలీజ్



దైవసెల్వితీర్థం ఫిలిమ్స్ బ్యానర్ పై దైవసిగమణి, తీర్థమలై, పూల మధు నిర్మాతలుగా త్యాగరాజ కుమార రాజా దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ సేతుపతి, పుష్ప ఫేమ్ ఫహద్ ఫాసిల్, సమంత ముఖ్య పాత్రల్లో రమ్యకృష్ణ, మిస్కిన్, గాయత్రి, భగవతి పెరుమాళ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా మాస్టర్ పీస్ మూవీగా నిలిచిన సూపర్ డీలక్స్ ఆగస్టు 9న తెలుగు లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది.


తమిళం లో పెద్ద విజయం అందుకున్న సినిమా సూపర్ డీలక్స్. విజయ్ సేతుపతి ఈ సినిమాలో స్పెషల్ లేడీ క్యారెక్టర్ రోల్ లో నటించారు. అదేవిధంగా ఆ క్యారెక్టర్ గాను ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. ఫహద్ ఫాసిల్, సమంత, రమ్యకృష్ణ పాత్రలు ప్రత్యేక ఆకర్షణ. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించగా పి. ఎస్. వినోద్, నీరవ్ షా  డిఓపి గా పని చేశారు. నాలుగు విభిన్న కథలను జోడించి చిత్రీకరించిన ఈ చిత్రం ఎన్నో అవార్డులను క్రిటిక్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సూపర్ డీలక్స్ సినిమాని ఈనెల 9న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.


నటీనటులు : విజయ్ సేతుపతి, ఫహద్ పజిల్, సమంత, రమ్యకృష్ణ, మిస్కిన్, గాయత్రి, భగవతి పెరుమాళ్ తదితరులు


టెక్నీషియన్స్ :

నిర్మాణం : దైవసెల్వితీర్థం ఫిలిమ్స్

నిర్మాతలు : దైవసిగమణి, తీర్థమలై, పూల మధు

సినిమాటోగ్రఫీ : పి. ఎస్. వినోద్, నీరవ్ షా

మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా

దర్శకత్వం : త్యాగరాజ కుమార రాజా

పి ఆర్ ఓ : మధు VR 


Post a Comment

Previous Post Next Post