Latest Post

Avika Gor As Sara in Shanmukha

ఆది సాయికుమార్ డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ష‌ణుఖ్మ‌లో శ‌క్తివంత‌మైన పాత్ర‌లో అవికాగోర్‌.

 


   వైవిధ్య‌మైన చిత్రాల‌కు, విభిన్న‌మైన క‌థ‌ల‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తుంటారు. ఆ కోవ‌లోనే రూపొందుతున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం ష‌ణ్ముఖ. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ క‌థానాయ‌కుడు. అవికాగోర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు. శాస‌న‌స‌భ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని  నిర్మిస్తుంది. సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ర‌మేష్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన చివ‌రి షెడ్యూల్‌తో ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న అవికాగోర్  పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్రంలో ఆమె లుక్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌.

 ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మ‌ట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ అద్భుత‌మైన పాయింట్‌తో రూపొందుతున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ఇది. విజువ‌ల్ వండ‌ర్‌లా, అద్బుత‌మైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో క‌థానాయిక అవికాగోర్ స‌ర పాత్ర‌లో సాహ‌సోపేత‌మైన ప‌నులు చేసే శ‌క్తివంత‌మైన అమ్మాయి పాత్ర‌లో  క‌నిపించ‌నుంది.  లక్ష్య సాధ‌న‌లో ఆది పాత్ర‌కు స‌పోర్ట్ చేస్తూ ఆయ‌నకు తోడుగా నిలిచే పాత్ర‌. త‌ప్పకుండా ఆమె కెరీర్‌లో ఈ పాత్ర , సినిమా మ‌రిచిపోలేని చిత్రంగా నిలిచిపోతుంది. ఈ చిత్రంలో అవికాగోర్ త‌న న‌ట‌న‌తో అంద‌రి హృద‌యాల‌ను హ‌త్త‌కుంటుంది.  ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ఈ చిత్రం కోసం ఎంతో రిచ్‌గా వేసిన ఓ సెట్‌లో చివ‌రి షెడ్యూల్‌ను పూర్తిచేసాం. కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల‌కు త‌న సంగీతంతో ప్రాణం పోసిన ర‌వి బ‌సూర్ ఈ చిత్రానికి స్ట‌నింగ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్ర‌స్తుతం అత్యున్న‌త సాంకేతిక నిపుణుల‌తో నిర్మాణనంత‌ర ప‌నులు మొద‌లుకానున్నాయి. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని, ఓ వండ‌ర్‌ఫుల్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుక‌రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. త‌ప్ప‌కుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది అన్నారు. 

  

The "Kalavedika NTR Film Awards" Held Grandly

 కళావేదిక, రాఘవి మీడియా - ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది



విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి . తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్"  2023, హైదరాబాద్ లోని హోటల్ "దసపల్లా" లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరిగింది. "కళావేదిక" (R.V.రమణ మూర్తి గారు), " రాఘవి మీడియా"  ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహింపబడింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుడికి పూజ చేసి దీపం వెలిగించి ఎన్టీఆర్ గారి పాటలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ గారు, నందమూరి మోహన రూప గారు, మురళి మోహన్ గారు, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు శ్రీ కే. ఎల్. దామోదర్ ప్రసాద్ గారు, కార్యదర్శి శ్రీ టి. ప్రసన్నకుమార్ గారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదాల రవి గారు మరియు కొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మురళీమోహన్ గారు మాట్లాడుతూ : ఎన్టీఆర్ గారి పేరు పైన అవార్డ్స్ పెట్టడం చాలా ఆనందకర విషయం. ప్రజలకు సేవ చేయడం కోసం పార్టీ పెట్టి 9 నెలల్లో ఘనవిజయాన్ని అందుకున్న నాయకుడు కూడా ఎన్టీఆర్. రెండు రూపాయలకే కిలో బియ్యం అదేవిధంగా పేదలకు ఉత్తమ చికిత్స అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇందిరాగాంధీని ఎదుర్కొన్న ఏకైక మగాడు మన తెలుగోడు ఎన్టీఆర్ గారు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి మేమందరం ముందుకు వస్తాము అంటే ఇందిరాగాంధీని ఎదుర్కొని నిలబడటం అంత తేలిక కాదు అని చెప్పిన ఏకైక మగాడు ఎన్టీఆర్ గారు. నాకు ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.


నందమూరి మోహన కృష్ణ గారు మాట్లాడుతూ : ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు చిత్రరంగమైన రాజకీయరంగమైన సంచలనానికి మారుపేరు. సినిమా రంగంలో ఆయన వేయని పాత్ర అంటూ ఏదీ లేదు. ప్రతి నాయకుడు పాత్రతో కూడా మెప్పించారు. అదేవిధంగా రాజకీయ రంగంలో పార్టీని పెట్టి తొమ్మిది నెలల్లో ఘనవిజయాన్ని సాధించారు. పేదల కోసం అదేవిధంగా ఆడవారి హక్కుల కోసం పోరాడి వారి హక్కులను వారికి అందించారు. అలాంటి మహానుభావుడికి కొడుకుగా పుట్టడం  ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం గా భావిస్తున్నాను. ఎన్టీఆర్ గారి పేరు మీద ఫిలిం అవార్డ్స్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన కళావేదిక వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.


అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత,  ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారు మాట్లాడుతూ : ఎన్టీఆర్ గారి పేరు మీద ఫిలిం అవార్డ్స్ ఇవ్వడం, ఈ ఈవెంట్ లో నేను కూడా స్పాన్సర్ గా ఉండడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. గతంలో కళావేదిక వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కళావేదిక తో పాటు రాఘవే మీడియా మధు గారు భాగమవడం. అదేవిధంగా ఈవెంట్ ఇంత ఘనంగా జరిపించడం చాలా మంచి విషయం. కళావేదిక, రాఘవి మీడియా సంయుక్తంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఎన్టీఆర్ గారి ఖ్యాతి పెంచాలని, వాటిలో నేను నేను భాగం అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.


నందమూరి మోహన్ రూప గారు మాట్లాడుతూ : తెలుగు జాతి కోసం పుట్టి తెలుగువారి ఆత్మగౌరవం కోసం బ్రతికిన వ్యక్తి తెలుగువారు దేవుడిగా భావించే నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ గారు ఒక లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వంగా తెలుగు వాళ్ళం అని చెప్పుకుంటున్నామంటే అది ఎన్టీఆర్ గారి వల్లే. ఆయన అప్పట్లో చేసినటువంటి మల్లీశ్వరి, పాతాళ భైరవి సినిమాలతోనే ఆ రోజుల్లోనే పాన్ ఇండియా స్టార్. కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రలు పోషించి అఖండ విజయం అందుకున్న సినిమా దానవీరశూరకర్ణ. ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ గారు తనదైన శైలిలో నటిస్తూ ఇటీవల కాలంలో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న హీరోగా నిలబడ్డారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కళావేదిక భువన గారు మరియు రాఘవ మీడియా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.


కళావేదిక మరియు రాఘవి మీడియా అధినేతలు మాట్లాడుతూ : ఈవెంట్ కి  పిలవగానే విచ్చేసిన మురళీమోహన్ గారికి, నందమూరి మోహన్ కృష్ణ గారికి, మోహన్ రూపా గారికి మరియు ఇతర ప్రముఖులకి ధన్యవాదాలు. అదేవిధంగా ఈవెంట్ ఎంత బాగా జరగడానికి మాకు సహకరించిన మా స్పాన్సర్స్ వేగ జువెలర్స్ నవీన్ గారు, మణిదీప్ గారు, కళ్యాణ్ గారు, అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ గణపతి రెడ్డి గారు, క్యాపిటల్ 45 గోల్డెన్ క్రెస్ట్ శోభన్ బాబు గారు, శ్రీని ఇన్ఫ్రా డెవలపర్స్ శ్రీను గారు, పవన్ ఈవెంట్స్ పవన్ గారు, లీడ్ స్పేస్ మరియు డి ఆర్ నెట్ వారికి సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.


ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ గెలుచుకున్న విజేతలు - ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గెలుచుకున్నారు మురళీమోహన్ గారు మరియు నందమూరి మోహన్ కృష్ణ గారు, ఉత్తమ కథానాయకుడిగా బేబీ చిత్రానికి ఆనంద్ దేవరకొండ, ఉత్తమ దర్శకుడిగా బేబీ చిత్రానికి సాయి రాజేష్, ఉత్తమ నిర్మాతగా భగవంతు కేసరి చిత్రానికి సాహు గారపాటి, ఉత్తమ విలన్ గా యక్షిని వెబ్ సిరీస్ నుంచి అజయ్, ఉత్తమ నూతన దర్శకుడిగా డాక్టర్ దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల, ఉత్తమ నూతన నటుడిగా తిరువీర్ కి ఎన్టీఆర్ ఫిలిం పురస్కారాలను గెలుచుకున్నారు. అవార్డులు గెలుచుకున్న వారికి శ్రీ మురళీమోహన్ గారు మరియు నందమూరి మోహన్ కృష్ణ గారి చేతుల మీదగా అందజేయడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ లిరిక్ రైటర్ గా కాసర్ల శ్యామ్ గారు, బెస్ట్ రైటర్ గా కళ్యాణ్ చక్రవర్తి గారు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా రఘుకుంచె గారు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫిమేల్ గా శరణ్య ప్రదీప్ గారు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా హర్షవర్ధన్ గారు, బెస్ట్ మేల్ సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్ గారు, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా దాశరధి శివేంద్ర గారు, బెస్ట్ ఆర్ డైరెక్టర్ గా నాగేంద్ర గారు, బెస్ట్ కమెడియన్ గా రచ్చ రవి గారు, బెస్ట్ ఎడిటర్ గా చోటా కే ప్రసాద్ గారు, బెస్ట్ ఫిమేల్ సింగర్ గా మంగ్లీ గారు, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా విజయ్ పొలాకి గారు, బెస్ట్ డెబ్యు మ్యూజిక్ డైరెక్టర్ గా ధ్రువన్ గారు, బెస్ట్ డెబ్యు సపోర్టింగ్ యాక్టర్ గా లక్ష్మణ్ మీసాల గారు, బెస్ట్ నెగటివ్ సపోర్టింగ్ రోల్ లో సాహితీ దాసరి గారు, స్పెషల్ జ్యూరీ ప్రొడ్యూసర్ గా గౌరీ కృష్ణ గారు, బెస్ట్ డెప్ యు రైటర్ గా అజ్జు మహకాళి గారు, బెస్ట్ రివ్యూ కమిటీ అనగా లక్ష్మణ్ టేకుమూడి గారు, స్పెషల్ జ్యూరీ డైరెక్టర్ గా త్రినాథ్ గారు ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ ని అందుకోవడం జరిగింది. 


Arya-Gautham Karthik Mr. X Shooting Completed

ఆర్య-గౌతమ్ కార్తీక్ పాన్ ఇండియన్ మూవీ “మిస్టర్. X” షూటింగ్ పూర్తి



స్టార్ హీరోలు ఆర్య & గౌతమ్ కార్తీక్ లీడ్ రోల్స్ లో మను ఆనంద్  దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియన్ మూవీ “మిస్టర్ X. స్టార్ యాక్టర్  శరత్ కుమార్, నటి మంజు వారియర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. షూటింగ్ లాస్ట్ డేని టీం అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఈ మేరకు స్టిల్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్.


"మిస్టర్ X” లోని  యాక్షన్ సన్నివేశాల్ని భారతదేశం, ఉగాండా, అజర్‌బైజాన్, జార్జియా దేశాల్లో చిత్రీకరించారు.  స్టంట్ సిల్వా యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ధిబు నినాన్ థామస్ (మరగధ నానయం, బ్యాచిలర్, కనా & నెంజుకు నీది ఫేమ్) ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, తన్వీర్ మీర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రసన్న జీకే ఎడిటర్.


రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్, ఇందులాల్ కవీద్ ఆర్ట్ డైరెక్టర్. కాస్ట్యూమ్ డిజైన్ ఉత్తరా మీనన్. ఏపీ పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్,  శ్రవంతి సాయినాథ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మిస్టర్ X చిత్రానికి ఎ. వెంకటేష్ సహ నిర్మాత.


మిస్టర్ X తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

 

Bachhala Malli Glimpse Unveiled Theatrical Release In September

 అల్లరి నరేష్, సుబ్బు మంగదేవీ, రాజేష్ దండా, బాలాజీ గుత్తా, హాస్య మూవీస్ 'బచ్చల మల్లి' మాస్-అప్పీలింగ్ బర్త్ డే గ్లింప్స్ విడుదల, సెప్టెంబర్‌లో థియేట్రికల్ రిలీజ్



హీరో అల్లరి నరేష్ ఈరోజు తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా, తన అప్ కమింగ్ మూవీ 'బచ్చల మల్లి' మేకర్స్ హీరో ఇంటెన్స్ క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ ఒక స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్ బస్టర్‌లను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.


హీరో ఇంటి దగ్గర లౌడ్‌స్పీకర్‌లో భగవద్గీత ప్లే చేయడంతో గ్లింప్స్ ఓపెన్ అవుతుంది, అది హీరో నిద్రకు భంగం కలిగిస్తుందని దానిని ఫెరోషియస్ గా రిమూవ్ చేస్తాడు. తర్వాత లోకల్ బార్‌లో స్టైల్‌గా ఆల్కహాల్ సేవించి, అక్కడ ఉన్న గూండాలతో ఫైట్ చేసిన ఎపిసోడ్ అదిరిపోయింది. “ఏయ్ ఎవడి కోసం తగ్గాలి... ఎందుకు తగ్గాలి' అంటూ అల్లరి నరేష్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ క్యారెక్టర్ మొండి వైఖరిని డిఫైన్ చేసింది.


అల్లరి నరేష్ ఇంతకు ముందు ఇలాంటి మాస్ క్యారెక్టర్ చేయలేదు. సుబ్బు అతన్ని మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రెజెంట్ చేశాడు. నరేష్ పాత్ర కోసం ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ సాలిడ్ గా ఉంది. గ్లింప్స్ మాస్ అప్పీలింగ్ గా వుంది. ఇది పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్, అల్లరి నరేష్ తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు.


అల్లరి నరేష్ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.


ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు 'సీతా రామం' చిత్రానికి మ్యూజిక్ ఇచ్చిన విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మానాడు, రంగం, మట్టి కుస్తి వంటి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ డీవోపీగా చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.


కథ, సంభాషణలు సుబ్బు స్వయంగా అందించగా, విప్పర్తి మధు స్క్రీన్‌ప్లే, ఎడిషనల్ స్క్రీన్‌ప్లే విశ్వనేత్ర అందించారు.


బచ్చల మల్లి సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.


తారాగణం: అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు.


సాంకేతిక సిబ్బంది:

కథ, మాటలు, దర్శకత్వం - సుబ్బు మంగదేవి

నిర్మాతలు - రాజేష్ దండా, బాలాజీ గుత్తా

బ్యానర్: హాస్య మూవీస్

స్క్రీన్ ప్లే: విప్పర్తి మధు

ఎడిషనల్ స్క్రీన్ ప్లే: విశ్వనేత్ర

సంగీతం- విశాల్ చంద్రశేఖర్

డీవోపీ- రిచర్డ్ M నాథన్

ఎడిటింగ్- ఛోటా కె ప్రసాద్

ప్రొడక్షన్ డిజైన్- బ్రహ్మ కడలి

పీఆర్వో - వంశీ-శేఖర్

మార్కెటింగ్-ఫస్ట్ షో


Allari Naresh-Sithara Entertainments Production No.29 Announced

అల్లరి నరేష్‌తో నూతన చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్



కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, విభిన్న చిత్రాలు, పాత్రలతో గొప్ప నటుడిగానూ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నరేష్ మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.


అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న "మీరు అతని కంటి నుండి తప్పించుకోలేరు" అంటూ విలక్షణమైన కాన్సెప్ట్ పోస్టర్‌తో నిర్మాణ సంస్థ ఈ చిత్ర ప్రకటన చేసింది. సంకేత భాషతో రూపొందించిన ఈ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉంది. ఒక్క పోస్టర్ తోనే విభిన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా రానుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సృజనాత్మక పోస్టర్ సినీ ప్రేమికులలో మరియు అల్లరి నరేష్ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంకేత భాషలో దాచిన సందేశాన్ని డీకోడ్ చేయడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు.


అల్లరి నరేష్ ఇటీవలి కాలంలో వైవిధ్యమైన, కొత్త కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తున్నారు. ఇక ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమా కేవలం ప్రకటనతోనే అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. "ఫ్యామిలీ డ్రామా" చిత్రంతో ప్రశంసలు పొందిన రచయిత-దర్శకుడు మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. నూతన కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించి, ఘన విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు.


అల్లరి నరేష్ యొక్క 63వ చిత్రంగా రానున్న ఈ సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.29 గా రూపొందనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

 

Odela 2 Crucial Action Schedule Begins in Hyderabad

 తమన్నా భాటియా, అశోక్ తేజ, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ హై బడ్జెట్ మల్టీ లింగ్వల్ ఫిల్మ్ 'ఓదెల 2' కీలకమైన యాక్షన్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం



తమన్నా భాటియా, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌తో కలిసి స్టైలిష్ మాస్ డైరెక్టర్ సంపత్ నంది క్రియేట్ చేసిన 2021 హిట్ 'ఒదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ అయిన 'ఒదెల-2 కోసం' కోసం చేతులు కలిపారు. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు


ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, షెడ్యూల్డ్ వర్కింగ్ వీడియోకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది,  సీక్వెల్‌పై ఎక్సయిట్మెంట్ ని పెంచింది.


హై-బడ్జెట్, మల్టీ లాంగ్వేజ్ మూవీ ఇప్పుడు హైదరాబాద్‌లో కీలకమైన యాక్షన్ షెడ్యూల్ ని ప్రారంభించింది. సినిమాలోని కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. టాప్ క్లాస్ యాక్షన్ డైరెక్టర్స్ తో కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా వుంటాయి. ఇన్నోవేటీవ్ స్టంట్స్ , బ్రీత్ టేకింగ్ సినిమాటోగ్రఫీ ఆడియన్స్ గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనున్నాయి.  


ఈ సన్నివేశాలు పెర్ఫెక్షన్, రియలిజంతో అద్భుతంగా చిత్రీకరించడానికి టీం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ యాక్షన్-ప్యాక్డ్ మూమెంట్స్‌కి ప్రాణం పోసేందుకు ఎక్స్ పర్ట్ స్టంట్ కోఆర్డినేషన్ టీం పని చేస్తోంది. ఆడియన్స్ కు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమా కోసం తమన్నా భాటియా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు.


ఆకట్టుకునే కథాంశంతో ఇంటెన్స్ యాక్షన్‌ని బ్లెండ్ చేయగల ఎబిలిటీ వున్న దర్శకుడు సంపత్ నంది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని సూపర్ విజన్ చేస్తున్నారు. అతని గైడెన్స్ లో, 'ఓదెల 2' ఎమోషన్స్, థ్రిల్స్, అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ సన్నివేశాల రోలర్-కోస్టర్ రైడ్‌ను అందించడానికి రెడీ అవుతోంది.


ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్ డీవోపీ కాగా రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్.


మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.


నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి


సాంకేతిక సిబ్బంది:

నిర్మాత: డి మధు

క్రియేటెడ్ బై: సంపత్ నంది

బ్యానర్లు: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్

దర్శకత్వం: అశోక్ తేజ

డీవోపీ: సౌందర్ రాజన్. ఎస్

సంగీతం: అజనీష్ లోక్‌నాథ్

ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో


Double Ismart First Single Steppa Maar on July 1st

 ఉస్తాద్ రామ్ పోతినేని, సంజయ్ దత్, పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్, పూరి కనెక్ట్స్  క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ జూలై 1న రిలీజ్



ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ ఫిల్మ్ 'డబుల్ ఇస్మార్ట్‌'తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ సగర్వంగా నిర్మించారు. ఈ మూవీ ఆగస్ట్ 15, 2024న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.


మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ పార్ట్ కి చార్ట్-బస్టర్ ఆల్బమ్‌, అద్భుతమైన బీజీఎం అందించిన మ్యాజికల్ కంపోజర్ మణిశర్మ ఇప్పుడు మళ్లీ అదరగొట్టబోతున్నారు. ఫస్ట్ సింగిల్ 'స్టెప్పా మార్' ని  జూలై 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.


శివుడి విగ్రహం ముందు రామ్ పోతినేని కంప్లీట్ స్టైలిష్ వైబ్‌లో డ్యాన్స్ చేస్తున్నట్లు ప్రజెంట్ చేసిన అద్భుతమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.


ఈ సాంగ్ ఎలక్ట్రిఫైయింగ్ ట్యూన్ గా మాస్ ప్రేక్షకులకు ఇన్స్టంట్ ఎడిక్షన్ కానుంది. రామ్ డ్యాన్స్ మూవ్స్ మెయిన్  హైలైట్‌గా ఉంటాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, భాస్కర భట్ల లిరిక్స్, అనురాగ్ కులకర్ణి వోకల్స్ ని అందించారు.


మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో సంజయ్ దత్ మెయిన్ విలన్, కావ్య థాపర్ ఫిమేల్ లీడ్ గా నటించారు.


డబుల్ ఇస్మార్ట్  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.


నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను, తదితరులు.


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్

నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్

బ్యానర్: పూరి కనెక్ట్స్

సిఈవో: విష్

సంగీతం: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి

స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా


Kalavedika, Raghavi Media - NTR Film Awards will be Grandly Held Tomorrow

కళావేదిక, రాఘవి మీడియా - ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం రేపు ఘనంగా జరగనుంది



విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి . తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్"  2024 , హైదరాబాద్ లోని హోటల్ "దసపల్లా" లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగును. "కళావేదిక" (R.V.రమణ మూర్తి గారు), " రాఘవి మీడియా"  ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహింపబడును. ముందుగా ఈ కార్యక్రమం యొక్క పోస్టర్ లాంచ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద జరిగింది. ఈ సందర్భంగా వేడుకకు విశిష్ట అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ (సీతక్క) గారు, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు, హీరో నారా రోహిత్ గారు, హీరోయిన్ అనన్య నాగళ్ళ గారు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గారు మరియు ఇంకొంత మంది ప్రముఖులు విచ్చేస్తున్నారు.


కళావేదిక భువన గారు మరియు రాఘవి మీడియా మధు గారు మాట్లాడుతూ :

విశ్వవిఖ్యాత, పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారక రామారావు గారు పేరు మీద అవార్డ్స్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈవెంట్ కి ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, దనసరి అనసూయ (సీతక్క) గారికి, దర్శకులు బోయపాటి శ్రీను గారికి, నారా రోహిత్ గారికి, రాహుల్ సిప్లిగంజ్ గారికి, అనన్య నాగళ్ళ గారికి, మరియు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కావున ఈ నెల 29 న సినీ ప్రముఖులు, NTR గారి అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందింగా విన్నపం అని అన్నారు.

 

Pratani Ramakrishna Goud Deeksha Movie Shooting Completed

ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వం లో "దీక్ష" మూవీ షూటింగ్ పూర్తి త్వరలో విడుదలకు సిద్ధం



ఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. పినిశెట్టి అశోక్‌ కుమార్‌, మదాడి కృష్ణారెడ్డి నిర్మాతలు. కిరణ్‌కుమార్‌, అలేఖ్యరెడ్డి  జంటగా నటిస్తున్నారు.ఇటీవల తెలంగాణ ఫిలింఛాంబర్ లో చిత్ర ప్రోగ్రెస్ ను తెలిపే కార్యక్రమంలో ఆర్ కే గౌడ్, హీరో కిరణ్, నటి తులసి,రైటర్ రామ్ ప్రసాద్  పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ - ‘దీక్ష’ సినిమా షూటింగ్ పూర్తయింది డబ్బింగ్ జరుగుతోంది. "దీక్ష" ఉంటే ఏదైనా సాధించగలం అనే పాయింట్ తో మూవీని తెరకెక్కించాం ఈ మూవీలో హీరో కిరణ్ చేసిన స్టంట్స్, భీముడు, ఆంజనేయుడు వంటి గెటప్స్ లో ఆకట్టుకునే సీన్స్ హైలైట్ అవుతాయి. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్  ను పరిచయం చేస్తున్నాం. ‘దీక్ష’ సినిమాను పూర్తి చేసి త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం.మూవీ పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం. అలాగే "మహిళా కబడ్డీ" అనే మరో చిత్రాన్ని18 భాషల్లో తెరకెక్కంచబోతున్నాం. కబడ్డీ ఆడగల యంగ్ హీరోయిన్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మహిళా కబడ్డిలో నటించే హీరోయిన్స్ కు నేషనల్ కబడ్డీ జట్టు కోచ్ తో శిక్షణ ఇప్పిస్తాం. అన్నారు


హీరో కిరణ్ మాట్లాడుతూ - నలభై సినిమాలకు దర్శకత్వం వహించిన రామకృష్ణ గౌడ్ గారు ‘దీక్ష’ మూవీతో మళ్లీ మెగాఫోన్ పట్టడం సంతోషంగా ఉంది. ఇప్పటి యంగ్ డైరెక్టర్స్ లా చాలా అప్డేటెడ్ గా, ప్లానింగ్ తో ‘దీక్ష’ మూవీ రూపొందిస్తున్నారు. గతంలో నేను తెలుగులో పది తమిళంలో రెండు సినిమాలు హీరోగా చేశాను ఈ సినిమాతో నాకు మంచి పేరుతో పాటు అవార్డ్స్ వస్తాయని ఆశిస్తున్నాను. మూవీ షూటింగ్  కంప్లీట్ అయ్యింది. రియలిస్టిక్ గా ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ చేశాం. స్టంట్ మాస్టర్ రవికుమార్ చాలా బాగా ఆ ఫైట్ చేయించారు. ఒక నిమిషం పాటు ఉండే డైలాగ్ ఒకటి ఈ మూవీలో నాతో చెప్పించారు. ఆ డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. నా లాంటి యంగ్ హీరోలకు అవకాశాలు ఇస్తున్న ఆర్ కే గౌడ్ గారికి థ్యాంక్స్, అలాగే మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. మహిళా కబడ్డీ సినిమాను ఆర్ కే గౌడ్ గారు 18 భాషల్లో రూపొందిస్తున్నారు. ఆ మూవీ కూడా బాగా రావాలని కోరుకుంటున్నా. అన్నారు.


రైటర్ రాంప్రసాద్ మాట్లాడుతూ -  గతంలో ఎన్ టి ఆర్ నటించిన "దీక్ష" టైటిల్ ఈ చిత్రానికి కరెక్టుగా యాప్ట్ అవుతుంది. కృషి ఉంటె మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు "దీక్ష" తో ఏదైనా సాధ్యమే అన్నదే ఈ కథ అన్నారు


నటి తులసి మాట్లాడుతూ - ఈ సినిమాలో హీరో కిరణ్, హీరోయిన్ అలేఖ్యరెడ్డి తో పాటు మరో లీడ్ రోల్ లో నేను నటించాను. నాకు మంచి డైలాగ్స్ ఉంటాయి. కథ కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. ‘దీక్ష’ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

 

Tremendous Response For Kalki2898AD

 కల్కి రిలీజ్ తో కళకళలాడుతున్న థియేటర్స్



రెబెల్ స్టార్ కల్కి సినిమా గ్రాండ్ రిలీజ్ తో మళ్లీ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా థియేటర్స్ కళకళలాడుతున్నాయి. నిన్నటి నుంచే కల్కి సినిమా థియేటర్స్ దగ్గర సందడి మొదలైంది. ఏ,బీ,సీ సెంటర్స్ మల్టీప్లెక్సులు అనే తేడా లేకుండా అన్ని థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కల్కి సినిమా ఎర్లీ మార్నింగ్ షోస్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సమ్మర్ ముందు నుంచి ప్రేక్షకులు లేక వెలవెలబోయిన థియేటర్స్ ఇప్పుడు హౌస్ ఫుల్ బోర్డులతో సందడిగా మారాయి. 


కల్కి రిలీజ్ తో ఎగ్జిబిటర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సకుటుంబంగా ప్రేక్షకులు కల్కి సినిమా చూసేందుకు థియేటర్స్ కు వెళ్తున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో టికెట్ అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. రికార్డ్ స్థాయిలో స్క్రీన్స్ ఉన్నా..టికెట్స్ దొరకనంత క్రేజ్ తో కల్కి ప్రదర్శితమవుతోంది. మైథాలజీ సైఫైగా కల్కి సినిమాను అద్భుతంగా రూపొందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ కు, హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించిన వైజయంతీ మూవీస్ కు అందరి దగ్గర నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

Good Bad Ugly Second Look Released

Ajith Kumar, Adhik Ravichandran, Mythri Movie Makers Crazy Entertainer, Telugu-Tamil Bilingual Movie 'Good Bad Ugly' Electrifying Second Look Released.



Ajith Kumar, in collaboration with director Adhik Ravichandran and the Indian Top Production House Mythri Movie Makers, is set to take audiences by storm with their next Crazy Entertainer, A Telugu-Tamil bilingual movie "Good Bad Ugly." This film is said to be one of the biggest entertainers in the making and has already generated a significant buzz with its first look.


The second look poster has now been revealed by the makers, featuring Ajith Kumar in an electrifying new avatar. Ajith is seen wearing black shades and a prisoner's uniform, exuding energy and intensity. The tattoo on his hand and the backdrop of blazing gunfire add to the drama


This look is currently trending across social media platforms, captivating fans and critics alike.


Good Bad Ugly boasts the involvement of top-class technicians. Rockstar Devi Sri Prasad is composing the music, while Abhinandan Ramanujam is handling the cinematography, and Vijay Velukutty is the editor.


 The film is progressing at a rapid pace and is scheduled for a grand release on Sankranti 2025.


Cast: Ajith Kumar


Technical Crew


Writer & Director : Adhik Ravichandran

DOP : Abinandhan Ramanujam

Music : Devi Sri Prasad

Editor : Vijay Velukutty

Production Designer : G M Sekhar

Stunts : Supreme Sundar, Kaloian Vodenicharov

Stylist : Anu Vardhan / Rajesh Kamarsu

PRO : Suresh Chandra

PRO (Telugu) : Vamsi Shekar

Marketing : First Show

Marketing (Tamil) : D'one

Sound design : Suren

Stills : G Anand Kumar

Publicity designs : ADFX Studio

Chief Executive Producer : Dinesh Narasimhan

CEO : Cherry

Producers : NAVEEN YERNENI-Y RAVI SHANKAR 

Bigg Boss Fame Amardeep Chowdary Victory In the Grand Finale Of Neethone Dance 2.0 Show Celebration

 షూటింగ్ లొకేషన్ లో బిగ్ బాస్ అమర్ దీప్ కు సన్మానం


ఎమ్ 3 (M3) మీడియా మరియు మహా మూవీస్ పతాకంపై మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి మరియు సుప్రియ సురేఖావాణి హీరో హీరోయిన్ గా నటిస్తున్న చిత్రానికి మహేంద్ర నాధ్ కూoడ్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే స్టార్ మా లో నిర్వహించిన నీతోనే డాన్స్ షో లో అమర్ దీప్ చౌదరి మరియు తన భార్య తేజు విజేతగా నిలిచారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ షూటింగ్ మధ్యలో కేక్ ని కట్ చేసి హీరో అమర్ డీప్ ని సన్మానించారు.  


ఈ సందర్భంగా అమర్ దీప్ చౌదరి మాట్లాడుతూ "నేను స్టార్ మా లో నిర్వహించిన నీతోనే డాన్స్ షో లో నేను నా భార్య విజేతగా నిలవటం చాలా సంతోషంగా ఉంది. నన్ను గెలిపించిన తెలుగు ప్రేక్షకులకి మరియు స్టార్ మా కి నా కృతజ్ఞతలు. మా సినిమా షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను" అని తెలిపారు


ఈ కార్యక్రమంలో నిర్మాత మహేంద్ర నాధ్ కూoడ్ల , డైరెక్టర్ మాల్యాద్రి రెడ్డి, హీరోయిన్ సుప్రీత తదితరులు లు పాల్గొన్నారు.


Disney+ Hotstar Launches its First Long-Format Show: "Agnisakshi"

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో జూలై 12 నుంచి స్ట్రీమింగ్ కు వస్తున్న "అగ్నిసాక్షి"


డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఫస్ట్ టైమ్ లాంగ్ ఫార్మేట్ షోగా అగ్ని సాక్షి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. జూలై 12వ తేదీ నుంచి అగ్నిసాక్షి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఈ షోలో పాపులర్ టెలివిజన్ జంట అర్జున్ అంబడి, ఐశ్వర్య నటిస్తున్నారు. డ్రామాతో కూడిన ఇంటెన్స్ స్టోరీలైన్, పవర్ పుల్ పర్ ఫార్మెన్స్ లతో అగ్నిసాక్షి ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది.


డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్ శంకర్ గా అర్జున్ అంబడి, జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయిన యువతి గౌరి పాత్రలో ఐశ్వర్య కనిపించనున్నారు. ఒక మిస్టీరియస్ మర్డర్ కేసు ఈ జంట జీవితాన్ని మలుపుతిప్పుతుంది. సస్పెన్స్, ఎమోషన్, ట్విస్టులతో అగ్నిసాక్షి ఆద్యంతం ఆసక్తికరంగా సాగనుంది. అగ్నిసాక్షికి అన్ని వర్గాల ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ వస్తుందని డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఆశిస్తోంది.


Prema Gaaradi Lyrical Song From Committee Kurrollu Unveiled

స్నేహం, ప్రేమ, భావోద్వేగాల కలయికగా రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ నుంచి ‘ప్రేమ గారడీ..’ అనే లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌






‘ అమ్మాయికి మనసులోని ప్రేమను చెప్పాలంటే, ఆమె ఆ ప్రేమకు వెంటనే ఎస్ చెప్పాలంటే సాధార‌ణ విష‌యం కాదు.. మ‌రీ పుట్టిన పెరిగిన ప‌ల్లెటూర్లో అయితే ఎవ‌రెక్క‌డ చూస్తారోన‌ని అమ్మాయి, అబ్బాయి ప్రేమ ఊసులు చెప్పుకోవ‌టం మ‌రీ క‌ష్టం. అలాంటి క‌ష్టాన్ని హాయిగా అనుభ‌విస్తోన్న కుర్రాడు మ‌న‌సులోని ‘ప్రేమ గారడీ..’ని న‌చ్చిన అమ్మాయికి ఎలా చెప్పాడ‌నేది తెలుసుకోవాలంటే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. 

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్నఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు.  ప‌క్కా ప్లానింగ్‌తో మేక‌ర్స్ అనుకున్న స‌మ‌యానికి క‌న్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయ‌టం విశేషం. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ బుధ‌వారం ఈ సినిమా నుంచి ‘ప్రేమ గారడీ..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. 

అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలోని ‘ప్రేమ గారడీ..’ పాటను కిట్టు విస్సాప్రగడ రాయగా అర్మాన్ మాలిక్ పాడారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది.  త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. రీసెంట్‌గా రిలీజైన ‘గొర్రెలా..’ అంటూ పాటకు, టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. రాజు ఎడురోలు ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 



నటీనటులు :

సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య,విషిక, షణ్ముకి నాగుమంత్రి ..ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు


సాంకతిక వర్గం :

సమర్పణ - నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు - పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక,  రచన, దర్శకత్వం - యదు వంశీ, సినిమాటోగ్రఫీ - రాజు ఎడురోలు, మ్యూజిక్ డైరెక్టర్ - అనుదీప్ దేవ్,  ప్రొడక్షన్ డిజైనర్ - ప్రణయ్ నైని, ఎడిటర్ - అన్వర్ అలీ, డైలాగ్స్ - వెంకట సుభాష్  చీర్ల, కొండల రావు అడ్డగళ్ల,  ఫైట్స్ - విజయ్, నృత్యం - జె.డి మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మన్యం రమేష్, సౌండ్ డిజైన‌ర్‌:  సాయి మ‌ణింద‌ర్ రెడ్డి, పోస్ట‌ర్స్‌:  శివ‌, ఈవెంట్ పార్ట్‌న‌ర్‌:  యు వి మీడియా, మార్కెటింగ్‌:  టికెట్ ఫ్యాక్ట‌రీ,  పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి).

14 Motion Poster Unveiled

" 14 " చిత్రం ఫస్ట్ లుక్  పోస్టర్ లాంచ్



రాయల్ పిక్చర్స్ పతాకంపై  లక్మీ శ్రీనివాస్ దర్శకత్వం లో,  సుబ్బారావు రాయన మరియు శివకృష్ణ నిచ్చన మెట్ల,  సంయుక్తం గా నిర్మించిన చిత్రం 14.  ఈ చిత్రం జులై 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది, ఈ సందర్భంగా   చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ డైరెక్టర్ వీర శంకర్  లాంచ్ చేశారు.ఈ సందర్భంగా

 వీరశంకర్  మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినటువంటి "14" చిత్రం కచ్చితంగా మంచి హిట్ కొడుతుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు.

     రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం లో నోయల్, విషాక ధీమాన్ ప్రధాన పాత్రలు పోషించగా.. రతన్, పోసాని కృష్ణ మురళి,శ్రీకాంత్ అయ్యంగర్, రూపాలక్ష్మి తదితరులు నటించారు.

ఈ చిత్రానికి కళ్యాన్ నాయక్ పాటలు అందించగా ఆదిత్య భార్గవ్ మాటలు రాశారు.. 

Kalki 2898 AD to bring two legends of Indian Cinema together after 39 years

ఇండియన్ సినిమాకి చెందిన ఇద్దరు లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ను39 సంవత్సరాల తర్వాత ఒకచోట చేర్చిన మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD'  



హైలీ యాంటిసిపేటెడ్ మాగ్నమ్ ఓపస్ కల్కి 2898 AD యూనిక్ స్టొరీ లైన్, థీమ్, బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో ఇండియన్ సినిమాలో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. విడుద‌ల‌కు ఒక్క రోజు మిగిలి ఉన్న నేప‌థ్యంలో ఈ సినిమా అన్ని రైట్ రీజన్స్ తో సంచ‌ల‌నం సృష్టిస్తోంది.


కల్కి 2898 AD మోస్ట్ ఎక్సయిటింగ్ అంశాలలో ఒకటి ఇండియన్ సినిమాకు చెందిన ఇద్దరు లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత రీయూనియన్ కావడం. వీరిద్దరూ 1985 కల్ట్ క్లాసిక్ గెరాఫ్తార్‌లో స్క్రీన్‌ షేర్ చేసుకున్నారు. బ్రదర్స్ కరణ్, కిషన్ పాత్రలను పోషించారు. సెప్టెంబరు 13, 1985న విడుదలైన ఈ చిత్రం నేటికీ అందరికీ ఇష్టమైన క్లాసిక్‌గా నిలిచింది.


కల్కి 2898 ADలో కమల్ హాసన్  సుప్రీం యాస్కిన్ పాత్రను పోషించారు. ఈ క్యారెక్టర్ లో కమల్ హసన్ లుక్, గెటప్ అందరినీ చాలా సర్ప్రైజ్ చేసింది.


సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ లో కమల్ హసన్ మేకోవర్ అన్ బిలివబుల్ అండ్ స్టన్నింగ్ గా వుంది. మునుపెన్నడూ చూడని మైండ్ బ్లోయింగ్ అవతార్ లో అద్భుతంగా అలరించబోతున్నారు కమల్ హసన్.    


ఇందులో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ గా కనిపించనున్నారు. ఈ లెజెండరీ స్టార్స్‌ని ఒకే ఫ్రేమ్‌లో కలిపి ఈ చిత్రం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. రెండు పాత్రల గ్లింప్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి, చాలా ఆసక్తిని రేకెత్తించాయి, సినిమా కోసం అంచనాలను పెంచాయి.


రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఎక్సయిట్మెంట్ పెరుగుతూనే ఉంది. కల్కి వినూత్న కథాంశం, స్టార్-స్టడెడ్ లైనప్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఆన్-స్క్రీన్ రీయునియన్ చూసే అవకాశం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి 2898 AD ఇండియన్ సినిమాపై గొప్ప ప్రభావాన్ని చూపడానికి సిద్ధంగా ఉంది. ఇది లెజెండరీ ట్యాలెంట్, భారతీయ పురాణాలను డిస్టోపియన్ ఫ్యూచర్‌తో బ్లెండ్ చేసిన గ్రౌండ్ బ్రేకింగ్ స్టొరీ టెల్లింగ్ ని అందిస్తోంది.


విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి 2898 AD జూన్ 27, 2024న థియేటర్లలోకి రానుంది. ఈ మాగ్నమ్ ఓపస్ లోబిగ్గెస్ట్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీ రోల్స్ పోషిస్తున్నారు.


Swayambhu New Schedule Begins in Maredumilli

 నిఖిల్, భారత్ కృష్ణమాచారి, పిక్సెల్ స్టూడియో పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం



నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'స్వయంభూ' మారేడుమిల్లిలోని బ్యూటీఫుల్ లోకేషన్స్ లో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది.


మారేడుమిల్లిలోని దట్టమైన అడవులలో నిఖిల్ పై కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు నెరేటివ్ కి కీలకం, ఛాలెంజ్ తో కూడిన లాండ్ స్కేప్ మూవీ అథెంటిసిటీ, ఇంటన్సిటీని పెంచుతుంది.


ట్యాలెంటెడ్ భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న 'స్వయంభూ' నిఖిల్  20వ మైల్ స్టోన్ మూవీగా గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ప్రామిస్ చేస్తూ గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కుతున్న పీరియాడికల్ ఫిల్మ్.


నిఖిల్ లెజెండరీ వారియర్ పాత్రను పోషిస్తున్నారు, ఈ పాత్ర కోసం నిఖిల్ ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. పాత్ర పట్ల అతని అంకితభావం, డైనమిక్ పెర్ఫార్మెన్స్ ని తెరపైకి తీసుకొస్తోంది.

 

ఈ మూవీ లో సంయుక్త, నభా నటేష్  హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాకరన్ ప్రొడక్షన్ డిజైనర్.


ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న 'స్వయంభూ' అత్యున్నత ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందుతోంది.


తారాగణం: నిఖిల్, సంయుక్త, నభా నటేష్


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి

నిర్మాతలు: భువన్ మరియు శ్రీకర్

బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్

సమర్పణ: ఠాగూర్ మధు

సంగీతం: రవి బస్రూర్

డీవోపీ: KK సెంథిల్ కుమార్

ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాకరన్

సహ నిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జిటి ఆనంద్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో


Double ISMART Title Song Shoot Progressing in Hyderabad

 ఉస్తాద్ రామ్ పోతినేని, సంజయ్ దత్, పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్, పూరి కనెక్ట్స్  క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్'- హైదరాబాద్‌లో టైటిల్ సాంగ్ షూటింగ్



ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ మ్యాసీవ్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌ గా 'డబుల్ ఇస్మార్ట్" తో తిరిగి వస్తున్నారు. ఈ కొత్త వెంచర్ గ్రిప్పింగ్ స్టోరీలైన్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఎక్సయిట్మెంట్, ఎంటర్టైన్మెంట్ ని న్యూ లెవల్ కి పెంచుతుందని ప్రామిస్ చేస్తోంది.


సంజయ్ దత్‌ విలన్ గా చేరడం వలన స్టార్ పవర్ లేయర్ ని యాడ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాస్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.


ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు, ఇది సినిమా విడుదలకు పెర్ఫెక్ట్ టైం. ఈరోజు 50 రోజుల కౌంట్‌డౌన్‌ను మార్కింగ్ చేస్తూ మేకర్స్ రామ్ పోతినేని స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తన ఊజ్స్ స్వాగ్ & స్టైల్ తో శంకర్ పాత్రకు ప్రాణం పోశారు రామ్ పోతినేని.


టైటిల్ సాంగ్ షూట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది, ఇది ప్రేక్షకులకు విజువల్, ఆడిటరీ ట్రీట్ ఉండేలా చూసేందుకు టీమ్ కేర్ తీసుకుంటుంది. పక్కా చార్ట్‌బస్టర్ అయ్యే ఈ పాటలో రామ్ పోతినేని సిగ్నేచర్ ఎనర్జిటిక్ స్టైల్‌లో ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూవ్‌లు, విజువల్స్‌ అద్భుతంగా ఉండబోతున్నాయి.


మణిశర్మ కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ మాస్ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. త్వరలో సాంగ్ రిలీజ్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.  


రామ్ కు జోడిగా కావ్య థాపర్ నటిస్తోంది.  


ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించారు. సామ్ కె నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రాఫర్‌లు.


డబుల్ ఇస్మార్ట్ ఆగస్ట్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.


నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను, తదితరులు.


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్

నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్

బ్యానర్: పూరి కనెక్ట్స్

సిఈవో: విష్

సంగీతం: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి

స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా


Vintage Vizag sets built in RFC worth 15crs For Matka

 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ 'మట్కా', 35 రోజుల లాంగ్ షెడ్యూల్ కోసం RFCలో 15 కోట్లతో వింటేజ్ వైజాగ్ సెట్‌లు నిర్మాణం



వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'మట్కా'  ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇది 35 రోజుల లాంగ్ షూటింగ్ షెడ్యూల్, ఈ ఒక్క ఫేజ్ కే 15 కోట్ల మ్యాసీవ్ బడ్జెట్‌ను కేటాయించారు. ప్రొడక్షన్ టీం వింటేజ్ వైజాగ్ లోకేషన్స్ ని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో మ్యాసీవ్ సెట్‌లలో రిక్రియేట్ చేస్తోంది. ప్రేక్షకులకు అథెంటిసిటీ, గ్రాండియర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే లక్ష్యంతో టీం వర్క్ చేస్తోంది.


'మట్కా' హై బడ్జెట్‌ పాన్-ఇండియా చిత్రంగా రూపొందుతోంది. వింటేజ్ సెట్లలో ఇన్వెస్ట్మెంట్ విజువల్ వండర్ ని అందిస్తోంది. వైజాగ్‌లోని ఎసెన్స్ ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ సెట్‌లు సినిమా హైలైట్‌లలో ఒకటిగా నిలుస్తాయి. మేకింగ్ వీడియో ఇంటెన్సీవ్  ప్రీ-ప్రొడక్షన్, గ్రాండ్-స్కేల్ మేకింగ్‌ను ప్రజెంట్ చేసింది. ఇందులో వరుణ్ తేజ్ గ్లింప్స్ కూడా చూపించారు.


వెర్సటైల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే వరుణ్ తేజ్ 'మట్కా'లో మరో మరపురాని పాత్రకు జీవం పోయనున్నారు. ఈ చిత్రంలో అతని పాత్ర దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించబోతోంది.


దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు కరుణ కుమార్ మ్యాసీవ్ స్క్రిప్ట్‌ను రూపొందించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటి నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది.


హ్యుజ్ బడ్జెట్‌తో నిర్మించిన సెట్స్‌తో పాటు యూనిక్  కాన్సెప్ట్‌తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుందని 'మట్కా' మేకర్స్  నమ్మకంగా ఉన్నారు. వారి లక్ష్యం కేవలం ఎంటర్ టైన్మెంట్ మాత్రమే కాదు, ఇండియన్  సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాటిక్ అనుభూతిని క్రియేట్ చేయడం.


టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, వింటేజ్ వైజాగ్ రిక్రియేషన్ హైలైట్‌లుగా ఉంటూ వరుణ్ తేజ్ కెరీర్‌లో 'మట్కా' ఒక మైల్ స్టోన్ మూవీ కాబోతోంది.


నటీనటులు: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు


సాంకేతిక సిబ్బంది:

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్

నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి

బ్యానర్లు: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్

సంగీతం: జివి ప్రకాష్ కుమార్

డీవోపీ: A కిషోర్ కుమార్

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్

సీఈఓ: ఈవీవీ సతీష్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్కే జానా, ప్రశాంత్ మండవ, సాగర్

కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి

పీఅర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా


Koncham Koncham Lyrical Song From Nenu-Keerthana Unveiled by Jayabheri Murali Mohan

 "నేను-కీర్తన"తో చిమటా రమేష్ బాబు

విజయభేరి మ్రోగించాలి!!

జయభేరి అధినేత మురళీమోహన్




"ఏ భాషలోనైనా డైరెక్టర్స్ కమ్ హీరోస్ చాలా అరుదుగా ఉంటారు. చిమటా రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన "నేను - కీర్తన" ట్రైలర్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మరీ ముఖ్యంగా నేను విడుదల చేసిన ఐటమ్ సాంగ్ థియేటర్స్ లో కచ్చితంగా విజిల్స్ వేయిస్తుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు ప్రముఖ నటులు - మాజీ పార్లమెంటు సభ్యులు - జయభేరి అధినేత మాగంటి మురళీమోహన్. "నేను - కీర్తన" చిత్రం నుంచి "కొంచెం కొంచెం గుడుగుడు గుంజం" అనే ఐటమ్ సాంగ్ ను మురళీమోహన్ ఆవిష్కరించారు!!


చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన "నేను-కీర్తన" చిత్రాన్ని అతి త్వరలో విడుదల కానుంది!!


సినిమాలు, స్థిరాస్తి, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రతిభాశాలి మాగంటి మురళీమోహన్ తమ చిత్రం నుంచి ఐటమ్ సాంగ్ విడుదల చేసి, తమ సినిమా ఘన విజయం సాధించాలని అభిలషించడం పట్ల  చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు చిమటా రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "నేను - కీర్తన" చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని, కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు... ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని ఆయన అన్నారు!!


సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, పోరాటాలు: నూనె దేవరాజ్, నృత్యాలు: అమిత్ కుమార్ - సి.హెచ్.ఆర్, పాటలు: సి.హెచ్.ఆర్ - అంచుల నాగేశ్వరరావు - శ్రీరాములు, సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, కూర్పు: వినయ్ రెడ్డి బండారపు, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, రచన - దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.)!!

1000Waala Teaser Launched

 టెర్రిఫిక్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో

"1000 వాలా" టీజర్ విడుదల!!



సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మాణంలో కత్తి లాంటి కొత్త కుర్రాడు "అమిత్" హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం "1000వాలా". యువ ప్రతిభాశాలి అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అమిత్, షారుఖ్, నవిత, కీర్తి, సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది!!


ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. "మా 1000 వాలా చిత్రం టీజర్ సోషల్ మీడియా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. లైక్స్ మరియు కామెంట్స్ చూసి మా సినిమా తప్పక విజయం సాధిస్తుంది అనే నమ్మకం కలిగింది. త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం" అని తెలిపారు!!



ఈ చిత్రానికి కథ :- అమిత్, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కథనం, మాటలు : గౌస్ ఖాజా, కెమెరా : చందు ఏజె, డి ఐ : రవితేజ, డాన్స్ : బాలు మాస్టర్ & సూర్య కొలుసు, ఫైట్స్ : డైనమిక్ మధు, సంగీతం : వంశీకాంత్ రేఖాన, నిర్మాత : షారుఖ్, దర్శకత్వం : అఫ్జల్!!

Shanmukha Shooting Wrapped

 ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి



వైవిధ్య‌మైన చిత్రాల‌కు, విభిన్న‌మైన క‌థ‌ల‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తుంటారు. ఆ కోవ‌లోనే రూపొందుతున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం ష‌ణ్ముఖ. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ క‌థానాయ‌కుడు. అవికాగోర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు. శాస‌న‌స‌భ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని  నిర్మిస్తుంది. సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ర‌మేష్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన చివ‌రి షెడ్యూల్‌తో ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మ‌ట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ అద్భుత‌మైన పాయింట్‌తో రూపొందుతున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ఇది. విజువ‌ల్ వండ‌ర్‌లా, అద్బుత‌మైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ఈ చిత్రం కోసం ఎంతో రిచ్‌గా వేసిన ఓ సెట్‌లో చివ‌రి షెడ్యూల్‌ను పూర్తిచేసాం. కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల‌కు త‌న సంగీతంతో ప్రాణం పోసిన ర‌వి బ‌సూర్ ఈ చిత్రానికి స్ట‌నింగ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్ర‌స్తుతం అత్యున్న‌త సాంకేతిక నిపుణుల‌తో నిర్మాణనంత‌ర ప‌నులు మొద‌లుకానున్నాయి. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని, ఓ వండ‌ర్‌ఫుల్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుక‌రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. త‌ప్ప‌కుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది అన్నారు.  

Minister Komati Reddy Venkat Reddy Attending NTR Film Awards Event

కళావేదిక, రాఘవి మీడియా - ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా  తెలంగాణ రాష్ట్రా  రోడ్లు, భవనాలు మరియు  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి  గారు



విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి . తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్"  2024 , హైదరాబాద్ లోని హోటల్ "దసపల్లా" లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగును. "కళావేదిక" (R.V.రమణ మూర్తి గారు), " రాఘవి మీడియా"  ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహింపబడును . ఈ సందర్భంగా  వేడుకకు విశిష్ట అతిథిగా రావాలన్న మా ఆహ్వానాన్ని మన్నించి అంగీకరించినందుకు తెలంగాణ రాష్ట్రా  రోడ్లు, భవనాలు మరియు  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతోనే ఆయన ఈ కార్యక్రమానికి రావడానికి ఒప్పుకున్నారు. కావున ఈ నెల 29 న సినీ ప్రముఖులు, NTR అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందింగా విన్నపం. 


Casting Call Announced for VD14

 కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసిన హీరో విజయ్ దేవరకొండ భారీ పాన్ ఇండియా మూవీ "వీడీ 14" టీమ్




హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14 ఇటీవలే అనౌన్స్ అయ్యింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వీడీ 14 నుంచి ఈ రోజు కాస్టింగ్ కాల్ ప్రకటన చేశారు. ఔత్సాహిక నటీనటులను ఎంపిక చేసి వీడీ 14లో నటించే అవకాశం కల్పించనున్నారు.


తిరుపతి, అనంతపురం, కడప, కర్నూల్ లో జూలై 1వ తేదీ నుంచి జూలై 9వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్ జరగనున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొత్తం రాయలసీమలోనే జరగనుంది. నటనలో ప్రతిభ గల కొత్త టాలెంట్ కు ఇది గొప్ప అ‌వకాశం అని చెప్పుకోవచ్చు.


ఒక వీరుడి పోరాటాన్ని చూపిస్తూ 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు రాహుల్ సంకృత్యన్. 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు.


ప్రేక్షకులకు ఒక ఎపిక్ లాంటి ఎక్సీపీరియన్స్ ఇవ్వనుందీ సినిమా. త్వరలో వీడీ 14 చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Allu Sirish "Buddy Trailer Launched Grandly

 ఘనంగా అల్లు శిరీష్ "బడ్డీ" సినిమా ట్రైలర్ లాంఛ్, జూలై 26న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ




అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. జూలై 26న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో


ఎడిటర్ రూబెన్ మాట్లాడుతూ - బడ్డీ సినిమాకు వర్క్ చేయడం కష్టంగానే అనిపించింది. ఎడిటింగ్ టేబుల్ పై నేను దర్శకుడు శామ్ రోజూ డిస్కస్ చేసుకునేవాళ్లం. ఇదొక డిఫరెంట్ మూవీ. బడ్డీ లాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాలో మంచి కాస్టింగ్ ఉంది. వాళ్లతో పాటు మూవీలో బడ్డీది ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇలాంటి కొత్త తరహా సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారికి అభినందనలు. మా మూవీ మిమ్మల్ని డిజప్పాయింట్ చేయదు. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అన్నారు.


రైటర్ సాయి హేమంత్ మాట్లాడుతూ - నేను చిన్నప్పుడు యముడు, నా పేరు శివ సినిమాల్లో కేఈ జ్ఞానవేల్ రాజా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అని చూసేవాడిని. ఇదేదో కొత్తగా ఉందని అనిపించేది. ఇవాళ ఆయన తెలుగులో ప్రొడ్యూస్ చేసిన సినిమాకు నేను రైటర్ ను కావడం నాకు గర్వంగా ఉంది. ఈ సినిమాలో గుర్తుండే డైలాగ్స్ చాలా ఉన్నాయి. బడ్డీ చెప్పే ప్రతి డైలాగ్ పంచ్ లా పేలుతుంది. డైరెక్టర్ శామ్ గారు మరిన్ని తెలుగు సినిమాలు చేయాలి, ఆ సినిమాలకు నేను వర్క్ చేయాలని కోరుకుంటున్నా. మా శిరీష్ గారిని కెప్టెన్ అని పిలుస్తాను. ఆయన కెరీర్ లో టిల్ డేట్ ది బెస్ట్ మూవీ బడ్డీ అని చెప్పగలను. అన్నారు.


నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ - హైదరాబాద్ లోని మీడియా మిత్రులను, తెలుగు ఆడియెన్స్ ను, ఇక్కడి మంచి ఫుడ్ ను మిస్ అవుతుంటాను. మీరంతా ఎన్నో ఏళ్లుగా మా స్టూడియో గ్రీన్ సంస్థను ఆదరిస్తున్నారు. మా మూవీస్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ మా ప్రోగ్రాం హోస్ట్ చేస్తున్న ఆధ్య శ్రేయాస్ శ్రీనివాస్ వాళ్ల పాప. తను బాగా హోస్టింగ్ చేస్తోంది. సుమ గారి ఈవెంట్స్ నెంబర్ ఆధ్య క్రాస్ చేయాలని కోరుకుంటున్నా. గీతా ఆర్ట్స్, స్టూడియో గ్రీన్ కలిసి శామ్ ఆంటోన్ దర్శకత్వంలో ప్రేమకథా చిత్రమ్ సినిమాను తమిళంలో రీమేక్ చేశాం. ఆ సినిమాలో జీవీ ప్రకాష్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేశాం. సంక్రాంతికి రిలీజైన ఆ సినిమా తమిళంలో మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు బడ్డీ మూవీ చేస్తున్నాం. ఈ చిత్రంలో అలీ, అజ్మల్ బాగా సపోర్ట్ చేశారు. శామ్ బడ్డీతో మా సంస్థకు మరో మంచి సినిమా ఇస్తున్నాడు. నేను ఈ కథ కంటే శామ్ ను ఎక్కువ నమ్మాను. ఎడిటర్ రూబెన్, సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్ ప్రేమకథా చిత్రమ్ రీమేక్ తర్వాత మరోసారి మా సంస్థలో పనిచేస్తున్నారు. రూబెన్ పుష్ప, జవాన్ సినిమాలకు వర్క్ చేశారు. హిప్ హాప్ తమిళ మా బడ్డీ మూవీకి బ్యాక్ బోన్. ఆయన సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇవాళ ఈ కార్యక్రమానికి ఆయన రాలేకపోయారు. ఫైట్ మాస్టర్ శక్తి శరవణన్ ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్సులు చేశారు. మా కంగువ మూవీ వీఎఫ్ఎక్స్ కు  వర్క్ చేసిన హరిహర సుతన్ బడ్డీకి కూడా పనిచేశారు. విజువల్ ఎఫెక్టులు న్యాచురల్ గా ఉంటాయి. హీరోయిన్స్ గాయత్రి, ప్రిషా లకు వాళ్ల కెరీర్ లో ఇంపార్టెంట్ ఫిలిం అవుతుంది. అల్లు  శిరీష్ మా కుటుంబ సభ్యుడు లాంటి వారు. ఆయన ఫేవరేట్ హీరో సూర్య. మా జర్నీలో గుడ్ బ్యాడ్ టైమ్స్ లో శిరీష్ సపోర్ట్ గా ఉన్నారు. ఆయన థ్యాంక్స్ చెబుతున్నా. బడ్డీ సినిమా ఫుటేజ్ కొంతమందికి చూపించాను. శిరీష్ బడ్డీలో బాగా కనిపించారు, బాగా నటించారు అని వాళ్లు చెప్పారు. మధుర శ్రీధర్ గారు మా ఆవారా సినిమా టైమ్ నుంచి పరిచయం. ఆవారా సాంగ్స్ మధుర ఆడియోలో రిలీజ్ చేశాం. అప్పటి నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ గా ఉన్నారు. శ్రీధర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. జూలై 26న బడ్డీ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాం. మీరంతా మా సినిమాను సపోర్ట్ చేసి బ్లాక్ బస్టర్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.


నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - నా ఫ్రెండ్ జ్ఞానవేల్ రాజా ఎన్నో తమిళ చిత్రాలను తెలుగులోకి తీసుకొచ్చి సక్సెస్ అందుకున్నారు. బడ్డీతో ఆయన స్ట్రైట్ తెలుగు సినిమా చేయడం సంతోషంగా ఉంది. అల్లు శిరీష్ కొత్త తరహా కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. మేము ఆయనతో ఏబీసీడీ అనే సినిమా చేశాం. జ్ఞానవేల్ రాజా, శిరీష్ బడ్డీ సినిమాకు కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉంది. కొత్త తరహా చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు బిగ్ ఓపెనింగ్స్ ఇచ్చి ఆదరిస్తారు. జూలై 26న బడ్డీ సినిమాకు ఆ సపోర్ట్ దక్కుతుందని ఆశిస్తున్నా. దర్శకుడు శామ్ వర్క్ చాలా బాగుంటుంది. అందరితో టీమ్ వర్క్ చేయిస్తాడు. ఆయన మరిన్ని తెలుగు సినిమా చేయాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.


సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్ మాట్లాడుతూ - బడ్డీ సినిమా ట్రైలర్ ను మీ అందరి ముందు రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి వర్క్ చేయడం మా అందరికీ కొత్త ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. బడ్డీ సినిమా యాక్షన్ అడ్వెంచర్ గా ఉంటుంది. బడ్డీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది ఊహించుకుంటూ విజువల్స్ క్యాప్చర్ చేశారు. విజువల్ ఎఫెక్టుల ప్రాధాన్యత ఉంటే చిత్రమిది. ప్రేక్షకులకు బడ్డీ సినిమా న్యూ ఫీల్ కలిగిస్తుంది. అన్నారు.


హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ మాట్లాడుతూ - బడ్డీ సినిమా కథను దర్శకుడు శామ్ చెప్పినప్పుడే ఇదొక స్పెషల్ ఫిల్మ్ అవుతుందని నమ్మాను. ఈ కథ వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా ఉంటుంది. డైరెక్టర్ శామ్, రైటర్ హేమంత్ కలిసి మరింత ఇంట్రెస్టింగ్ గా స్క్రిప్ట్ చేశారు. పిల్లలు పెద్దలు యూత్ ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అల్లు శిరీష్ మంచి కోస్టార్. ఆయన నుంచి యాక్టింగ్ పరంగా చాలా విషయాలు నేర్చుకున్నాను. బడ్డీని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.


హీరోయిన్ ప్రిషా రాజేశ్ సింగ్ మాట్లాడుతూ - స్టూడియో గ్రీన్ లాంటి బిగ్ ప్రొడక్షన్ లో ఫస్ట్ మూవీ హీరోయిన్ గా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు శామ్ ఆంటోన్ కు థ్యాంక్స్. శిరీష్ మంచి కోస్టార్. అతనితో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. సినిమాలో శిరీష్ కెప్టెన్ ఆదిత్యరామ్ గా కనిపిస్తారు. నాకు  శిరీష్ కంటే ఆదిత్యరామ్ క్యూట్ గా కనిపించాడు. బడ్డీ మూవీ మీ అందరికీ నచ్చుతుంది. థియేటర్ చూసి రెస్పాన్స్ చెప్పండి. అన్నారు.


యాక్టర్ అజ్మల్ మాట్లాడుతూ - స్టూడియో గ్రీన్ సంస్థలో ఇప్పటికే నేను ఒక సినిమా చేయాల్సింది. ఆ మూవీ అనివార్య కారణాలతో చేయలేకపోయాను. ఈ మూవీకి జ్ఞానవేల్ గారు ఫోన్ చేసి పిలిచినప్పుడు హ్యాపీగా అనిపించింది. నేను విలన్ రోల్స్ చేసి విసిగిపోయాను. ఈ సినిమాలో అలాంటి ఉండొద్దని కోరుకున్నా. డైరెక్టర్ శామ్ చెప్పిన ప్రతి డైలాగ్ నచ్చింది. సాయి హేమంత్ చెప్పిన స్క్రిప్ట్ కు గూస్ బంప్స్ వచ్చాయి. వెంటనే ఈ మూవీ చేస్తున్నానని చెప్పాను. గాయత్రి, ప్రిషా గుడ్ యాక్ట్రెసెస్. అల్లు శిరీష్ తో ఫైట్ సీక్వెన్సులు ఉంటాయి. ఆయనతో ఎదురుగా నిల్చుని ఫైట్ చేస్తున్నప్పుడు నా ముందు టామ్ క్రూయిజ్ ఉన్నట్లు అనిపించేది. ఈ క్యారెక్టర్ కోసం శిరీష్ తనను తాను మార్చుకుని తీరు బాగా నచ్చింది. జూలై 26న బడ్డీని థియేటర్ లో మీరంతా లవ్  చేస్తారు. అని చెప్పారు.


నటుడు అలీ మాట్లాడుతూ - దర్శకుడు శామ్ నాకు ఈ సినిమా గురించి ఫోన్ చేసినప్పుడు తమిళ్ మూవీ అనుకున్నా. శిరీష్ గారు హీరో అని చెప్పారు. ఈ సినిమాలో బడ్డీ చాలా స్పెషల్ గా ఉంటుంది. బడ్డీ క్యారెక్టర్ ను పిక్చరైజ్ చేసేప్పుడు దర్శకుడు చాలా ప్రతిభావంతంగా వర్క్ చేశారు. బడ్డీ అంత ఎత్తున్న వ్యక్తిని అక్కడ పెట్టి షూట్ చేసేవాళ్లు. మేము థాయ్ లాండ్ షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడ జపనీస్, చైనీస్ వాళ్లు బడ్డీతో ఫొటోస్ తీసుకునేవారు. ఈ సినిమాను జపాన్, చైనాలో రిలీజ్ చేస్తే అక్కడ కూడా సక్సెస్ అవుతుంది. బడ్డీ సినిమాకు బాగా డబ్బులు రావాలి, సీక్వెల్ చేసేంత సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.


దర్శకుడు శామ్ ఆంటోన్ మాట్లాడుతూ- జ్ఞానవేల్ రాజా గారి ప్రొడక్షన్ లో డార్లింగ్ మూవీ చేశాను. అది నా మొదటి సినిమా. ఫస్ట్ మూవీ నుంచే నాపై జ్ఞానవేల్ రాజా గారికి నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం డిస్కషన్ జరిగినప్పుడు నన్ను స్క్రిప్ట్ కూడా అడగలేదు. కేవలం నా మీద నమ్మకంతో ఈ మూవీ ఇచ్చారు. సీజీ అయ్యాక ఫైనల్ వెర్షన్ సినిమా చూశారు. జ్ఞానవేల్ గారికి బడ్డీ సినిమా నచ్చింది. ఆయన తర్వాత నా మీద నమ్మకం ఉంచిన మరో పర్సన్ శిరీష్ గారు. ఆయన నేను చెప్పిన ఐడియాస్ కు చాలా బాగున్నాయని ఎంకరేజ్ చేశారు. నేను డైరెక్టర్ రాజమౌళి గారి ఫ్యాన్ ను. ఆయన చేసిన ఈగ సినిమా ఈ బడ్డీ మూవీకి ఇన్సిపిరేషన్. బడ్డీకి సీజీ వర్క్ చేసినప్పుడు ఈగ మూవీతో పోల్చి సజెషన్స్ చెప్పేవాడిని. బడ్డీ మూవీకి వర్క్ చేసిన అజ్మల్, అలీ, హీరోయిన్స్, ఇతర కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. మా మూవీని సపోర్ట్ చేయాలని కోరుతున్నా. అన్నారు.


హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ - లాస్ట్ ఇయర్ బడ్డీ పోస్టర్ రిలీజైనప్పుడు మళ్లీ రీమేక్ సినిమా చేస్తున్నావా అని అడిగారు. ఓటీటీలో ఇలాంటి సినిమా ఉందని చెప్పారు. నేను వారికి ఎన్ని చెప్పినా అనేది అనుకుంటారు అని వదిలేశా. బడ్డీ విషయంలో నాకు కూడా కొంచెం డౌట్ ఉండేది. టెడ్డీ బేర్ తో అడ్వెంచర్ యాక్షన్ మూవీ, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా. కానీ ఇవాళ బడ్డీ ట్రైలర్ చూశాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. కొత్త తరహా సినిమా ఎప్పుడు వచ్చినా మన ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు. ఇది రెగ్యులర్ టైప్ మూవీ కాదు. కొత్తగా ఉంటుంది. శామ్ గారి 100 అనే సినిమా చూసి చాలా బాగా చేశాడే అనుకున్నా. అలాగే శామ్ గారి ట్రిగ్గర్ ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యాను. రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉన్న అథర్వాతో యాక్షన్ మూవీ చేశాడు అనుకున్నా. నేను శామ్ కు ఫోన్ చేసి మాట్లాడాను. మంచి స్క్రిప్ట్ ఉంటే చెప్పు సినిమా చేద్దామని అన్నా.  బడ్డీతో మా కాంబో కుదిరింది. ఈ సినిమాలో హీరో నేను కాదు టెడ్డీ బేర్. ఆ క్యారెక్టర్ కు ఇంప్రెస్ అయ్యే నేనీ సినిమా చేశా. నా హీరోయిజం చూపించాలని కాదు. జ్ఞానవేల్ గారికి థ్యాంక్స్. మా నాన్న కూడా నాపై ఇంత ఖర్చు పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయలేదు. నాతో భారీ ఖర్చుతో బిగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేశారు జ్ఞానవేల్ గారు. పుష్ప 2 గురించి నేను ఇప్పుడు మాట్లాడను. మాట్లాడితే మరింత హైప్ క్రియేట్ చేస్తారు. టీజర్, ట్రైలర్ చూసి మీరే డిసైడ్ చేసుకోవాలి. అన్నారు.



నటీనటులు - అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ముఖేష్ కుమార్, అలీ తదితరులు



టెక్నికల్ టీమ్


ఎడిటర్ - రూబెన్

సినిమాటోగ్రఫీ - కృష్ణన్ వసంత్

ఆర్ట్ డైరెక్టర్ - ఆర్ సెంథిల్

మ్యూజిక్ - హిప్ హాప్ తమిళ

బ్యానర్ - స్టూడియో గ్రీన్ ఫిలింస్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

కో ప్రొడ్యూసర్ - నేహా జ్ఞానవేల్ రాజా

ప్రొడ్యూసర్ - కేఈ జ్ఞానవేల్ రాజా, అధన్ జ్ఞానవేల్ రాజా

రచన, దర్శకత్వం - శామ్ ఆంటోన్


Bharateeyudu2 Trailer Unveiled

 యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ , రెడ్ జెయింట్ బ్యాన‌ర్స్ భారీ పాన్ ఇండియా చిత్రం ‘భారతీయుడు 2’ ట్రైలర్ విడుదల... లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం




యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. జీరో టాల‌రెన్స్ ట్యాగ్ లైన్‌.


‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ క్ర‌మంలో  ‘భారతీయుడు 2’ ట్రైల‌ర్‌ను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేశారు..


Bharateeyudu2 Trailer




ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే... ‘ఊరారా ఇది.. చ‌దువుకు త‌గ్గ జాబ్ లేదు.. జాబ్‌కు త‌గ్గ జీతం లేదు..క‌ట్టిన ట్యాక్స్ త‌గ్గిన‌ట్లు సౌక‌ర్యాలు లేవు..దొంగ‌లించేవాడు దొంగ‌లిస్తూనే ఉన్నాడు, త‌ప్పు చేస్తున్న‌వాడు త‌ప్పు చేస్తూనే ఉంటాడు’’ అని ఓ మ‌హిళ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తుంది.

మ‌రో వైపు హీరో సిద్ధార్థ్ ‘మ‌నం ఒక్కొక్క‌రినీ త‌ప్పు ప‌డుతూనే ఉంటాం. సిస్ట‌మ్ స‌రిగా లేదు. స‌రి చేయాల‌ని నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతుంటాం. కానీ దాన్ని స‌రి చేయ‌టానికి కొంచెం కూడా ప్ర‌య‌త్నించ‌టం లేదు’  త‌న బాధ‌ను వ్య‌క్తం చేస్తాడు.


కొంత మంది యువ‌త రోడ్ల పైకి వ‌చ్చి పోరాటం చేస్తుంటే పోలీసులు వారిపై కాల్పులు జ‌రుపుతారు. మ‌నం మొరిగే కుక్క‌లం మాత్ర‌మే.. అందుకే అరుస్తున్నా అని అందులో ఓ యువ‌కుడు త‌న ఆక్రోశాన్ని వెల్ల‌గ‌క్కుతాడు. ఇలా దేశ‌మంతా అల్ల‌ర్లతో అట్టుడికి పోతుంటుంది. ఆ స‌మ‌యంలో వీరంద‌రినీ చీల్చి చెండాడే ఓ వేట కుక్క రావాలి అని సిద్ధార్థ్ అంటాడు. అలా ఎవ‌రుంటార్రా అని ప్రియా భ‌వానీ శంక‌ర్ అంటే ఉండేవారు అని సిద్ధార్థ్ స‌మాధానం చెబుతాడు. ఆయ‌నే మ‌ళ్లీ రావాలి. ఓ త‌ప్పు చేస్తే దాన్నుంచి త‌ప్పించుకోలేమ‌నే భ‌యం రావాలి అంటూ సిద్ధార్థ్ చెబుతాడు. అప్పుడు సేనాప‌తి (క‌మ‌ల్ హాస‌న్)ని చూపించారు. పార్ట్ వ‌న్ భార‌తీయుడులో ఆయ‌నేం చేశాడ‌నే దాన్ని సింపుల్‌గా చూపించారు.


సేనాప‌తి త‌నొక ఫ్రీడ‌మ్ ఫైట‌ర్‌గా త‌న గురించి చెబుతూ ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు.. నేతాజీ మార్గంలో నేను అనే ప‌వ‌ర్‌ఫుల్, ఎమోష‌న‌ల్ డైలాగ్స్ ‘భారతీయుడు 2’ ట్రైల‌ర్‌లో ఉన్నాయి. ఇక ట్రైల‌ర్‌లో సేనాప‌తి పాత్ర‌లో క‌మ‌ల్ హాస‌న్ యాక్ష‌న్ స‌న్నివేశాలు, వాటిని అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించిన శంక‌ర్ మేకింగ్ స్టైల్ నెక్ట్స్ రేంజ్‌లో ఉన్నాయి. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆస‌క్తిని ట్రైల‌ర్ రేకెత్తిస్తోంది.


‘భారతీయుడు 2’ ట్రైల‌ర్‌లో సేనాప‌తి పాత్ర‌తో పాటు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌మ‌ల్ హాస‌న్ త‌న‌దైన అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇక మ‌ర్మ‌క‌ళ‌తో విల‌న్స్ భ‌ర‌తం ప‌ట్ట‌డాన్ని కూడా ఈ సినిమాలో మ‌రింత విస్తృతంగా చూపించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ, అనిరుద్ సంగీతం, నేప‌థ్య సంగీతం స‌న్నివేశాల‌ను మ‌రో లెవ‌ల్‌లో ఆవిష్క‌రించాయి. దీంతో సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారంటూ ట్రైలర్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది.


క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్  సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ క‌ల‌యిక ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంద‌న‌టంలో సందేహం లేదని ట్రైల‌ర్‌తో స్ప‌ష్ట‌మైంది.


 లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్  రూపొందిస్తోన్న భారీ బ‌డ్జెట్‌తో ‘భార‌తీయుడు 2’ సినిమా ప్ర‌పంచంలో ఓ స‌రికొత్త మైలురాయిని క్రియేట్ చేయ‌టానికి సిద్ధంగా ఉంది. సినిమా చూసే ప్రేక్ష‌కుల్లో గొప్ప ఆలోచ‌న రేకెత్తించేలా సినిమాలు చేస్తూ త‌న అభిరుచి చాటుకుంటున్న లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ జూలై 12న‌ ఇండియన్ 2 పేరుతో త‌మిళంలో, భార‌తీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.


 సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లో సంద‌డి చేస్తున్నాయి.


న‌టీన‌టులు:


క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:


క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం:  ఎస్‌.శంక‌ర్‌, స్క్రీన్ ప్లే: ఎస్‌.శంక‌ర్‌, బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌, మ్యూజిక్ : అనిరుద్ ర‌విచంద్ర‌న్‌, ఎడిటింగ్:  ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ర‌వివ‌ర్మ‌న్‌, ఆర్ట్‌:  ముత్తురాజ్‌, స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, అన్బ‌రివు, రంజాన్ బుల‌ట్‌, పీట‌ర్ హెయిన్స్‌, స్టంట్ సిల్వ‌, డైలాగ్ రైట‌ర్‌:  హ‌నుమాన్ చౌద‌రి, వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌:  వి.శ్రీనివాస్ మోహ‌న్‌, కొరియోగ్ర‌ఫీ:  బాస్కో సీజ‌ర్‌, బాబా భాస్క‌ర్‌, పాట‌లు:  శ్రీమ‌ణి, సౌండ్ డిజైన‌ర్‌:  కునాల్ రాజ‌న్‌, మేక‌ప్ :  లెగ‌సీ ఎఫెక్ట్‌-వాన్స్ హర్ట్‌వెల్‌- ప‌ట్ట‌ణం ర‌షీద్‌, కాస్టూమ్ డిజైన్‌:  రాకీ-గ‌విన్ మ్యూగైల్‌- అమృతా రామ్‌-ఎస్‌బి స‌తీష‌న్‌-ప‌ల్లవి సింగ్-వి.సాయి, ప‌బ్లిసిటీ డిజైన‌ర్: క‌బిల‌న్ చెల్ల‌య్య ,పి.ఆర్‌.ఒ (తెలుగు):  నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సుంద‌ర్ రాజ్‌, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌:  జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, రెడ్ జైంట్ మూవీస్‌:  సెన్‌బ‌గ మూర్తి, నిర్మాత‌:  సుభాస్క‌ర‌న్‌.

35-Chinna Katha Kaadu Theatrical Release On August 15th

రానా దగ్గుబాటి  ప్రౌడ్లీ ప్రెజెంట్స్ - నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ మూవీ టైటిల్ "35-చిన్న కథ కాదు"- ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల



60 ఇయర్స్ సక్సెస్ ఫుల్ లెగసీ గల సురేష్ ప్రొడక్షన్స్, 2 ఇయర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత వారి కొత్త చిత్రం క్లీన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామాతో వస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్‌తో పాటు ఎస్ ఒరిజినల్స్,  వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ మూవీలో నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమని రైటర్, డైరెక్టర్.


ఈ మూవీకి "35 - చిన్న కథ కాదు" అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ప్లజెంట్ గా డిజైన్ చేసిన పోస్టర్ ద్వారా మేకర్స్  టైటిల్ ని రివిల్ చేశారు. గుడి మెట్లపై కూర్చున్న ఫ్యామిలీని ప్రజెంట్ చేస్తూ క్యారికేచర్‌గా దీన్ని రూపొందించారు. థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.


స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.


పెళ్లి చూపులు, సమ్మోహనం, అంటే సుందరానికీ తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఆకాశం నీ హద్దు రా, అంటే సుందరానికి, సర్ఫీరా, కుబేర తదితర చిత్రాలకు గ్రేట్ విజువల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న నికేత్ బొమ్మి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. విజువల్ అప్పీల్‌ ని యాడ్ చేస్తూ ప్రొడక్షన్ డిజైన్‌ను లతా నాయుడు నిర్వహిస్తున్నారు. టి సి ప్రసన్న ఎడిటర్.


"35-చిన్న కథ కాదు" మూవీ  తెలుగు, తమిళం,  మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.


నటీనటులు : నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: నంద కిషోర్ ఈమాని

నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి

బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్

సంగీతం: వివేక్ సాగర్

డీవోపీ: నికేత్ బొమ్మి

ఎడిటర్: టి సి ప్రసన్న

డైలాగ్స్: నంద కిషోర్ ఈమాని, ప్రశాంత్ విఘ్నేష్ అమరావతి

ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు

పబ్లిసిటీ డిజైనర్: శక్తి గ్రాఫిస్ట్, అనీష్ పెంటి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ సౌమిత్రి

క్రియేటివ్ ప్రొడ్యూసర్: శివాని దోభాల్

లిరిక్స్: కిట్టు విస్సాప్రగడ, భరద్వాజ్ గాలి

కాస్ట్యూమ్ డిజైనర్: ప్రిన్సి వైద్

లైన్ ప్రొడ్యూసర్: విన్సెంట్ ప్రవీణ్

పీఆర్వో: వంశీ-శేఖర్

డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా