Top News

Baby Director Sai Rajesh Launched Romantic Song From Nenu-Keerthana

 "బేబి" స్థాయిలో "నేను-కీర్తన" 

మంచి బ్లాక్ బస్టర్ కావాలి!!!

సంచలన దర్శకనిర్మాత

సాయి రాజేష్




చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన "నేను కీర్తన" ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు సంచలన దర్శకుడు - నిర్మాత సాయి రాజేష్. ఈ చిత్రంలోని "సీతాకోకై ఎగిరింది మనసే" గీతం లిరికల్ వీడియోను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... "నేను - కీర్తన"లో సక్సెస్ కళ కనబడుతోంది. కులుమనాలిలో చిత్రీకరించిన పాట చాలా బాగుంది. చిమటా రమేష్ బాబుకి దర్శకుడిగా, హీరోగా ఉజ్వల భవిష్యత్ ఉందనిపిస్తోంది" అన్నారు!!


చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన చిత్రం "నేను-కీర్తన" !!


"ఎంతో బిజీ షెడ్యూల్ లో సైతం తమ కోసం సమయాన్ని కేటాయించిన సాయి రాజేష్ కు హీరో కమ్ డైరెక్టర్ చిమటా రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. "నేను - కీర్తన" చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని" చిత్ర కథానాయకుడు - దర్శకుడు చిమటా రమేష్ బాబు అన్నారు!!


మల్టీ జోనర్ ఫిల్మ్ గా తెరకెక్కి సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న "నేను కీర్తన" చిత్రానికి బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ ఏర్పడింది.  కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు... ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రం విడుదల తేది అతి త్వరలో ప్రకటించనున్నారు!!


సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, పోరాటాలు: నూనె దేవరాజ్, నృత్యాలు: అమిత్ కుమార్ - సి.హెచ్.ఆర్, పాటలు: సి.హెచ్.ఆర్ - అంచుల నాగేశ్వరరావు - శ్రీరాములు, సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, కూర్పు: వినయ్ రెడ్డి బండారపు, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, రచన - దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.)!!

Post a Comment

Previous Post Next Post