Home » » Prithviraj Sukumaran's "The Goat Life" trailer has been released, pan-India release on March 28th

Prithviraj Sukumaran's "The Goat Life" trailer has been released, pan-India release on March 28th

 పృథ్వీరాజ్ సుకుమారన్ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) ట్రైలర్ రిలీజ్, ఈ నెల 28న పాన్ ఇండియా రిలీజ్ కు వస్తున్న మూవీ




ఇటీవల కాలంలో సినీ ప్రియుల దృష్టిని బాగా ఆకర్షించిన సినిమా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం). ఈ సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో  థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇవాళ  "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ట్రైలర్ విడుదల చేశారు.


అసాధారణ మేకింగ్ తో "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. "ది గోట్ లైఫ్" ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లేలా ట్రైలర్ కట్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ వివిధ గెటప్స్ లో కనిపించిన తీరు, అద్భుతమైన విజువల్ క్యాప్షర్, విశాలమైన ఎడారి లొకేషన్స్, హీరో క్యారెక్టర్ అయిన నజీబ్ జీవితంలోని భావోద్వేగాలను హార్ట్ టచింగ్ గా ట్రైలర్ లో చూపించారు. ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా


దర్శకుడు బ్లెస్సీ మాట్లాడుతూ - నా దృష్టిలో "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) లాంటి గొప్ప సర్వైవల్ అడ్వెంచర్ సినిమా ఇప్పటివరకు వెండితెరపై రాలేదు. ఇలాంటి ఘటనలు ఒక వ్యక్తి జీవితంలో జరుగుతాయా అని ఆశ్చర్యపోతారు. కల్పన కంటే నిజం వింతగా ఉంటుంది. 'మనకు ఎదురుకాని అనుభవాలన్నీ మిథ్యే అనుకుంటాం' అనేది ఈ సినిమాకు ఆధారమైన నవలలో ఒక ట్యాగ్ లైన్. గాంధీ సినిమాను రూపొందించేందుకు దర్శకుడు రిచర్డ్ అటెన్ బరోకు 20 ఏళ్లు పట్టింది. "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా మేకింగ్ కోసం మేము పదేళ్లు సమయం తీసుకున్నాం. తెరపై మేము ఆవిష్కరించబోతున్న కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.


హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ - ఈ సినిమా కోసం మా టీమ్ అంతా చాలా కష్టమైన సుదీర్ఘ ప్రయాణం చేశాం. పదేళ్ల మా శ్రమ తర్వాత మా సినిమాను ప్రేక్షకులు తెరపై చూడబోతున్నారనే సంతోషం కలుగుతోంది. కోవిడ్ టైమ్ నుంచి మేమంతా అనుకోని, మర్చిపోలేని ప్రయాణం ఈ సినిమాతో చేశాం. "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) లాంటి గొప్ప సినిమాలో భాగమవడం గర్వంగా ఉంది. దర్శకుడు బ్లెస్సీ అద్బుతమైన విజన్, ఆ విజన్ కు తన సంగీతంతో ఏఆర్ రెహమాన్ ప్రాణం పోశారు. "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) మా దృష్టిలో కేవలం సినిమా మాత్రమే కాదు మా మనసుల్ని తాకిన ఒక గొప్ప కథ. ఈ కథ మా జీవితాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రేక్షకులు కూడా ఇలాగే అనుభూతి చెందుతారని కోరుకుంటున్నాం. అన్నారు.


90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం)లో చూపించబోతున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు.


నటీనటులు - పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు


ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్

సినిమాటోగ్రఫీ - సునీల్ కేఎస్

సౌండ్ డిజైన్ - రసూల్ పూకుట్టి

మ్యూజిక్ - ఏఆర్ రెహమాన్

పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా

నిర్మాణం - విజువల్ రొమాన్స్

దర్శకత్వం - బ్లెస్సీ







Share this article :