ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాతింగ్ బ్రాండ్ అంబాసిడర్ గా యంగ్ హీరో ఆకాష్ పూరి
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడిగా పలు సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఆకాష్ పూరి. హీరోగా మారి ఆంధ్రా పోరి, మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ వంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ బ్రాండింగ్ కోసం స్టైలిష్ ఫొటో షూట్ చేశాడు ఆకాష్ పూరి. ఈ కొత్త లుక్ లో ఆకాష్ పూరి ఆకట్టుకుంటున్నాడు. సోషల్ మీడియాలోనూ ఆకాష్ పూరి న్యూ లుక్ ఫొటో షూట్ స్టిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్ గా పేరు తెచ్చుకుంటోంది. త్వరలోనే ఆకాష్ పూరి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేయబోతున్నాడు.
Post a Comment