Music Sensation Mani Sharma Appreciated Dr Naga Madhuri

సంగీత మాంత్రికుడు మణిశర్మ

మెప్పు పొందిన డా: నాగ మాధురి



శివ రాత్రి కానుకగా పరమ శివునికీ

"శంభో మహాదేవ" వీడియో ఆల్బమ్

సమర్పించిన వర్ధమాన గాయకి

డా: నాగ మాధురి


దక్షిణ భారత సుప్రసిద్ధ

స్ట్రింగ్ ప్లేయర్ 

మాండలిన్ ఎస్.ఎమ్.సుభాని

సంగీత సారధ్యంలో

మణిశర్మ చేతుల మీదుగా విడుదల


సర్వేంద్రియానాం నయనం ప్రధానం" అన్న విషయం తెలిసిందే. అందుకే ఆమె ఏరికోరి నేత్ర వైద్యురాలుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. కానీ వీనుల విందైన గానం ఆలపించడంలోనూ ఆమె సిద్ధహస్తురాలు. అందుకే వేలాదిమందికి కంటి చూపు ప్రసాదిస్తూ... సరి చేస్తూనే... సంగీతంలోనూ నిష్ణాతురాలిగా రాణిస్తున్నారు. 


ఈ బహుముఖ ప్రతిభాశాలి పేరు

డా: నాగ మాధురి


పువ్వు పుట్టగానే పరిమలిస్తుంది అనే నానుడిని నిజం చేస్తూ... ఉన్నత విద్యా సంపన్న కుటుంబంలో జన్మించిన నాగ మాధురి చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల మక్కువ చూపేవారు. చదువులో చాలా చురుగ్గా ఉంటూనే... చిత్ర కళ, గానంలో విశేష ప్రతిభ కనబరిచేవారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోడాక్టర్ వైఝర్సు సుబ్రహ్మణ్యం దగ్గర సంగీతంలో శిష్యరికం చేశారు. కర్నాటిక్ క్లాసిక్ మ్యూజిక్ లో డిప్లొమా చేయడంతోపాటు అందులో డిష్టింక్షన్ సాధించడం నాగ మాధురి ప్రతిభను చెప్పకనే చెబుతుంది. ఆప్తమాలజీ (కంటి వైద్యం) స్పెషలిస్ట్ గా ఒంగోలులోని స్మార్ట్ విజన్ హాస్పిటల్ కి మేనేజింగ్ పార్టనర్ కమ్ ఛీఫ్ కన్సల్టెంట్ గా సేవలందిస్తూనే.... సంగీతంలోనూ సాధన చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు!!


గడిచిన శివరాత్రికే లయబద్ధంగా ఒక త్యాగరాజ కృతిని ఆ లయకారునికి నివేదించుకోవాలని సంకల్పించిన నాగ మాధురి... ఆ దృశ్య పూర్వక గాన యజ్ఞాన్ని ఈ శివరాత్రికి పూర్తి చేసి, మహా శివుడికి సమర్పించుకున్నారు. దక్షిణ భారత సినీ సంగీతరంగంలో పేరెన్నికగన్న స్ట్రింగ్ ప్లేయర్ మాండలిన్ ఎస్.ఎమ్. సుభాని సారధ్యంలో "శంభో మహాదేవ... శంకర గిరిజా రమణ" త్యాగరాజ కృతిని ఆలపించి... "గాన మాధురి" అనే తన పిలుపును సార్ధకం చేసుకున్నారు నాగ మాధురి. 15 వాయిద్యాలలో నిష్ణాతులు కావడంతోపాటు... కర్నాటిక్ సంగీతంలో విద్వాంసులు, స్ట్రింగ్స్ ప్లేయర్ అయిన సుభాని... కీరవాణి, థమన్, రెహమాన్, అనిరుద్ వంటి దిగ్గజ దర్శకులకు తన వాద్య సహకారం అందిస్తుంటారు. ఈ కృతిని ప్రముఖ యువ దర్శకుడు విశ్వనాధ్ అరిగెల దర్శకత్వంలో వీడియో రూపంలోనూ తీర్చి దిద్దడం, ఆ కృతిని ఆమె ఆలపిస్తుండగా చిత్రీకరించడం ప్రశంసార్హం. ఆది సాయి కుమార్ తో "జోడి" చిత్రం రూపొందించిన విశ్వనాధ్... "పరంపర" వెబ్ సిరీస్ తో తన ప్రతిభను ప్రకటించుకున్నారు!!


ఇకపోతే... "శంభో మహాదేవ" ఆడియో అండ్ వీడియో ఆల్బమ్ ను మ్యూజిక్ మాంత్రికుడు మణిశర్మ ఆవిష్కరించి, అభినందించడం విశేషం. "శంభో మహదేవ" ఆల్బమ్ అనే తన కల సాకారం దాల్చడంలో మాండలిన్ సుభాని గారి స్ఫూర్తి, విశ్వనాధ్ అరిగెల సహకారం, మరీ ముఖ్యంగా తన ఫ్యామిలి సపోర్ట్ ఎంతైనా ఉందని పేర్కొన్న డాక్టర్ నాగ మాధురి... మణిశర్మ గారి మంచితనాన్ని, ఆయన అభినందనను ఎప్పటికీ మర్చిపోలేనని" అన్నారు!!

Post a Comment

Previous Post Next Post