Home » » Aadujeevitham: The Goat Life is Najeeb Life story

Aadujeevitham: The Goat Life is Najeeb Life story

 మనసును కదిలించే నజీబ్ జీవిత కథతో తెరకెక్కిన పృథ్వీరాజ్ సుకుమారన్ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం).




మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో  థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాకు మూలమైన నజీబ్ గురించి ప్రచార కార్యక్రమాల్లో మూవీ టీమ్ చెబుతున్న విషయాలు ప్రేక్షకుల మనసులను కదలిస్తున్నాయి.


90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి అరబ్ దేశాలకు వలస వెళ్లాడు నజీబ్ అనే అమాయక యువకుడు. ఎంతోమంది యువకుల్లాగే అతనూ గల్ఫ్ ఉద్యోగాల పేరుతో మోసపోతాడు. రెండేళ్లు ఏడారిలో ప్రయాణిస్తూ అనేక కష్టాలు పడతాడు. 700 గొర్రెలను కాపాడుకుంటూ అతని ఎడారి ప్రయాణం ఎంతో శ్రమతో  సాగుతుంది. నజీబ్ కు ఉన్న ఒకే జత బట్టలతో స్నానం చేసి దుస్తులు మార్చుకునేందుకు కూడా వీలుండదు. తినేందుకు సరైన ఆహారం దొరక్క విపరీతమైన ఎడారి వాతావరణంలో నజీబ్ ఊహాతీతమైన కష్టాలు ఎదుర్కొంటాడు. ఒక దశలో నజీబ్ కు మనిషి మీద మానవత్వం మీద నమ్మకం పోతుంది. తాను కాపాడుకుంటున్న గొర్రెల్లో తానూ ఒక గొర్రెగానే భావించుకుంటాడు. 8 నెలల ప్రెగ్నెంట్ భార్యను వదిలి విదేశీ ఉద్యోగానికి బయలు దేరిన నజీబ్ కు ఇప్పుడు  తనకు పుట్టిన బిడ్డ ఎలా ఉందో తెలియదు. వారి జ్ఞాపకాలతో ఊరట చెందుతుంటాడు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రయత్నిస్తాడు. కొన్నేళ్ల తర్వాత చివరకు తన కుటుంబానికి చేరువవుతాడు. నజీబ్ సాగించిన ఈ సాహసోపేత ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తికరంగా నిలుస్తోంది. నజీబ్ జీవితంలోని ఈ భావోద్వేగాలన్నీ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాలో అత్యంత సహజంగా చిత్రీకరించారు.



నటీనటులు - పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు


ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్

సినిమాటోగ్రఫీ - సునీల్ కేఎస్

సౌండ్ డిజైన్ - రసూల్ పూకుట్టి

మ్యూజిక్ - ఏఆర్ రెహమాన్

పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా

నిర్మాణం - విజువల్ రొమాన్స్

దర్శకత్వం - బ్లెస్సీ



Share this article :