Home » » Inspector Rishi will Be Remarkable Web Series

Inspector Rishi will Be Remarkable Web Series

 హారర్ థ్రిల్లర్స్ లో "ఇన్స్ పెక్టర్ రిషి" ఒక స్పెషల్ వెబ్ సిరీస్ అవుతుంది - ప్రెస్ మీట్ లో వెబ్ సిరీస్ టీమ్
నవీన్ చంద్ర లీడ్ రోల్ లో నటిస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ "ఇన్స్ పెక్టర్ రిషి". సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారర్ క్రైమ్ కథతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు డైరెక్టర్ నందిని జె.ఎస్. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. అమోజాన్ ఒరిజినల్ గా "ఇన్స్ పెక్టర్ రిషి" ఈ నెల 29వ తేదీ నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఇవాళ హైదరాబాద్ లో వెబ్ సిరీస్ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో


నటుడు శ్రీ కృష్ణ దయాల్ మాట్లాడుతూ - "ఇన్స్ పెక్టర్ రిషి" వెబ్ సిరీస్ లో నేను సత్య అనే ఫారెస్ట్ రేంజర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఇది. మీకు తప్పకుండా నచ్చుతుంది. మరో రెండు రోజుల్లో అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వస్తోంది. చూడండి. అన్నారు.


నటుడు కన్నా రవి మాట్లాడుతూ - ఈ సిరీస్ లో నేను అయ్యనార్ అనే ఇన్సిపెక్టర్ రోల్ లో నటించాను. పది ఎపిసోడ్ల సిరీస్ ను డైరెక్టర్ నందిని గారు ఎంతో ఆసక్తికరంగా రూపొందించారు. చాలా పార్ట్ అడవిలో షూటింగ్ చేశాం. ఇందులో ప్రతి క్యారెక్టర్ కు ఒక ఆర్క్ ఉంటుంది. నవీన్ చంద్ర ఇన్స్ పెక్టర్ రిషిగా ఇరగదీశారు. సునైన గారు ఫారెస్ట్ ఆఫీసర్ గా ఆకట్టుకుంటారు. "ఇన్స్ పెక్టర్ రిషి" వెబ్ సిరీస్ ను మిస్ కావొద్దు. అన్నారు.


డైరెక్టర్ నందిని జేఎస్ మాట్లాడుతూ - తెలుగు ప్రేక్షకులు భాషలకు అతీతంగా వైవిధ్యమైన కంటెంట్ ను ఆదరిస్తారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగు సినిమా వరల్డ్ సినిమా అయ్యింది. సాగరసంగమం నా ఫేవరేట్ తెలుగు మూవీ. "ఇన్స్ పెక్టర్ రిషి" వెబ్ సిరీస్ ను మొదట మేము తమిళం వరకే చేద్దామని అనుకున్నాం. కానీ మేకింగ్ అయ్యాక మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. నాకు చిన్నప్పటి నుంచి హారర్ మూవీస్ చూడటం, హారర్ బుక్స్ చదవడం ఇంట్రెస్ట్. అలా హారర్ సబ్జెక్ట్ రెడీ చేసుకుని ఈ సిరీస్ చేశాను. ఈ సిరీస్ కథలో ఏ కులాన్నీ, మతాన్నీ, ఎవరి విశ్వాసాలను కించపరిచేలా సన్నివేశాలు ఉండవు. నవీన్ చంద్ర, సునైన తెలుగులో చాలా పాపులర్. నవీన్ చంద్ర టైటిల్ రోల్ చేశారు. తెలుగులో మంచి రీచింగ్ ఉంటుందని ఆశిస్తున్నాం.  ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. గుడ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సిరీస్ చూడండి, మీకు తెలిసిన వాళ్లకు చెప్పండి. మీ సపోర్ట్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.


హీరోయిన్ సునైన మాట్లాడుతూ - పాండమిక్ టైమ్ లో రాజ రాజ చోర సినిమా చేస్తున్నప్పుడు "ఇన్స్ పెక్టర్ రిషి" వెబ్ సిరీస్ స్క్రిప్ట్ విన్నాను. వినగానే ఈ సిరీస్ తప్పకుండా చేయాలని ఫిక్స్ అయ్యాను. ఈ కథలో నాకు మంచి రోల్ దొరికింది. ఫారెస్ట్ రేంజర్ గా కనిపిస్తాను. ఈ వెబ్ సిరీస్ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి. హారర్, థ్రిల్లర్, రొమాన్స్, యాక్షన్, కామెడీ ఇలాంటివన్నీ కుదిరిన సిరీస్ ఇది. నవీన్ చంద్రతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయన టాలెంటెడ్ ఆర్టిస్ట్. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ నందినీ గారు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి షూటింగ్ చేశారు. కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్ తో సెట్ లో సరదా వాతావరణం ఉండేది. "ఇన్స్ పెక్టర్ రిషి" వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తప్పకుండా చూడండి. తమిళంలో వరుసగా ప్రాజెక్ట్స్ చేయడం వల్ల తెలుగులో రెగ్యులర్ గా సినిమాలు చేయలేకపోతున్నా. ఇక్కడ నాకు నచ్చే, సరిపోయే ఆఫర్స్ రావడం లేదు. మంచి సినిమా చేయకుంటే మీ నుంచి విమర్శలు వస్తాయి. ఏ భాషలో నటిస్తున్నాను అనేది కాకుండా మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.


హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ - ఇవాళ రామ్ చరణ్ గారి బర్త్ డే. ఆయన నా విశెస్ చెబుతున్నా. గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఆయన గ్రేట్ యాక్టర్. నేను హారర్ కంటెంట్ చేసి చాలా రోజులవుతోంది. "ఇన్స్ పెక్టర్ రిషి" వెబ్ సిరీస్ కథ విన్నప్పుడు ఇందులో హారర్, థ్రిల్లర్, సస్పెన్స్, యాక్షన్ ...లాంటి అన్ని ఎమోషన్స్ ఉన్నాయనిపించింది. ఈ సిరీస్ ఎందుకు చేయకూడదు అని దూకేశాను. ఇలాంటి క్యారెక్టర్ దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ కథలోనే కాదు నా క్యారెక్టర్ లోనూ అనేక లేయర్స్ ఉంటాయి. హారర్ థ్రిల్లర్స్ లో ఇదొక స్పెషల్ సిరీస్ అవుతుంది. ఈ సిరీస్ కోసం దాదాపు 100 రోజులు వర్క్ చేశాను. రోజూ షూటింగ్ అయ్యి ఇంటికి వచ్చాక ఈ సిరీస్ లోని ఘోస్ట్ బెడ్ రూమ్ లో కనిపించిన ఫీల్ కలిగేది. ఎందుకంటే నాకు దెయ్యానికి చాలా కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను మా డైరెక్టర్ నందిని గారిపై నమ్మకంతో ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్ మేక్ బిలీవ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. 10 ఎపిసోడ్స్ సిరీస్ ఇది. ప్రతి ఎపిసోడ్ ముగిశాక నెక్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఏర్పడుతుంది. ఈ సినిమాకు సూపర్బ్ టాలెంటెడ్ టీమ్ వర్క్ చేసింది. వీఎఫ్ఎక్స్ టీమ్, మేకప్ టీమ్ కు థ్యాంక్స్ చెప్పాలి. "ఇన్స్ పెక్టర్ రిషి" వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలా మంది నాకు మెసేజ్ లు పంపారు. భయమేసేలా ఉంది కానీ మేము ఈ సిరీస్ చూస్తాం అంటూ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. మా సిరీస్ ట్రైలర్ ను కాజల్ చూశారు. చూసి చాలా బాగుంది నేను షేర్ చేస్తా అని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. తప్పకుండా ఈ సిరీస్ చూస్తానని కాజల్ చెప్పారు. ఆమెకు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ నెల 29న "ఇన్స్ పెక్టర్ రిషి" వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
Share this article :