Home » » Inti Number 13 Releasing with Good Buzz

Inti Number 13 Releasing with Good Buzz

 హాలీవుడ్‌ మూవీ రేంజ్‌లో ‘ఇంటి నెం.13’ ప్రమోషన్‌.. సినిమాపై క్రియేట్‌ అవుతున్న క్రేజ్‌!



హారర్‌ సినిమాల్లోనే విభిన్నంగా ఉండేలా ఒక కొత్త పాయింట్‌తో తెరకెక్కిన క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఇంటి నెం.13’. ఈ చిత్రం మార్చి 1న తెలుగు రాష్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండిరగ్‌లో ఉండడంతో సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రమోషన్‌ని కూడా డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశారు మేకర్స్‌. సాధారణంగా హాలీవుడ్‌లో రూపొందిన కొన్ని హారర్‌ సినిమాల కోసం ఆడియన్స్‌ రియాక్షన్‌ని క్యాప్చర్‌ చేసి దాన్ని ప్రమోషన్‌లో వాడడం చూస్తుంటాం. ఆ తరహాలోనే ‘ఇంటి నెం.13’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించి సినిమా చూస్తున్న సమయంలో ఆడియన్స్‌ రియాక్షన్‌ని క్యాప్చర్‌ చేశారు. ఈ ప్రక్రియ వల్ల ఆడియన్స్‌ని ఈ సినిమా ఏమేర భయపెట్టింది అనేది తెలుస్తుంది. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాకి మరింత హైప్‌ వచ్చింది. 


అంతేకాదు, నగరంలోని కొన్ని షాపింగ్‌ మాల్స్‌లో చేస్తున్న ‘ఇంటి నెం.13’ ప్రమోషన్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. సినిమాకి సంబంధించి గెటప్స్‌లో ఉన్న వ్యక్తులు ‘ఇంటి నెం.13’ ఫోటోకార్డ్స్‌తో అక్కడికి వచ్చే కస్టమర్స్‌ని విశేషంగా ఆకర్షిస్తున్నారు.  తెలుగు సినిమాని ఒక హాలీవుడ్‌ మూవీలా పబ్లిసిటీ చేస్తున్నారని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకుముందే సినిమాకి మంచి బజ్‌ ఉంది. ఈ రెండు ఈవెంట్స్‌ వల్ల రెండు రాష్ట్రాల్లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా బాగా పెరిగాయి. జనం ఈ సినిమా గురించి చర్చించుకోవడం కనిపిస్తోంది. 


కాలింగ్‌ బెల్‌, రాక్షసి వంటి డిఫరెంట్‌ హారర్‌ మూవీస్‌ని తెరకెక్కించిన పన్నా రాయల్‌.. ‘ఇంటి నెం.13’ చిత్రాన్ని మరింత ఇంట్రెస్టింగ్‌గా, ఒక డిఫరెంట్‌ పాయింట్‌తో రూపొందించారు. డా.బర్కతుల్లా సమర్పణలో రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై హేసన్‌ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది.




Share this article :