Home » » S 99 Pre Release Event Held Grandly

S 99 Pre Release Event Held Grandly

 వైభవంగా ‘ఎస్‌`99’ ప్రీ రిలీజ్‌ వేడుక



టెంపుల్‌ మీడియా - ఫైర్‌బాల్‌ ప్రో సంయుక్త నిర్మాణంలో సి. జగన్‌మోహన్‌ ప్రధానపాత్రను పోషిస్తూ.. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎస్‌`99’. ఈ చిత్రానికి నిర్మాతలు యతీష్‌`నందిని. ఈ చిత్రం టైటిల్‌ను ప్రసాద్‌ ల్యాబ్స్‌ అధినేత రమేష్‌ ప్రసాద్‌ గారు, ఫస్ట్‌ టీజర్‌ను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుగారు, రెండో టీజర్‌ను ప్రముఖ నటులు మురళీమోహన్‌గారు, మూడో టీజర్‌ను డి. సురేష్‌బాబు గారు లాంచ్‌ చేశారు. మార్చి 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. 


ఈ సందర్భంగా దర్శకుడు సి. జగన్‌మోహన్‌ మాట్లాడుతూ... 

రెగ్యులర్‌ సినిమాలు చూస్తున్న ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్‌ను ఎన్నుకున్నాం. ముందుగా ఈ చిత్రంలో మెయిన్‌ లీడ్‌ కోసం చాలా మందిని ఆడిషన్‌ చేశాం. ఈ క్యారెక్టర్‌ కోసం నున్నగా గుండు గీసుకోవాలి. కొందరు ఎస్టాబ్లిష్డ్‌ ఆర్టిస్ట్‌లకు కథ నచ్చినా ఈ ప్రాబ్లం వల్ల, వారికి కంటిన్యుటీ ఉండే క్యారెక్టర్‌లు వేరే సినిమాల్లో వేస్తున్న కారణంగా చేయలేక పోయారు. చివరికి మా డైరెక్షన్‌ టీం సజెషన్‌తో నేనే చేయాల్సి వచ్చింది. ఇదొక విజువల్‌ అండ్‌ సౌండ్‌ బేస్డ్‌ కాన్సెప్ట్‌ మూవీ. డిఫరెంట్‌ కలర్‌ టింట్‌తో తెరకెక్కించాం. మనం అనుకున్న దానిలో 50 శాతం తెరమీద పెట్టినా 100 శాతం సక్సెస్‌ అయినట్టే. జనరల్‌గా ఒక క్రైమ్‌ జరిగినప్పుడు దాన్ని చేసిన వ్యక్తి ఇంతకు ముందు నుంచే నేర వృత్తిలో ఉంటే అతన్ని గుర్తించడం ఈజీనే. కానీ అదే ఒక కొత్త వ్యక్తి క్రైమ్‌కు పాల్పడితే అతన్ని గుర్తించడం చాలా కష్టం. ఈ సినిమాలోని ప్రధాన క్యారెక్టర్‌ ఇలా ఏ విధమైన నేరచరిత్ర లేని ఓ సన్యాసి. అతను ఎందుకు ఇలా హత్యలకు తెగబడ్డాడు అన్నది ఆసక్తికరంగా చెప్పాము. ప్రేక్షకులను ఆకట్టుకునే థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో చిత్రాన్ని రూపొందించాం అన్నారు. 


నిర్మాత యతీష్‌ మాట్లాడుతూ...

వరుసగా సినిమాల నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఈ ఫీల్డ్‌లోకి వచ్చాము. సినిమా అంటే టీం స్పిరిట్‌తో చేయాల్సింది. ఈ విషయంలో మాకు మంచి టీం దొరికింది. అటు ఆర్టిస్ట్‌లు కానీయండి, ఇటు టెక్నీషియన్స్‌ కానీయండి ది బెస్ట్‌ దొరికారు. జగన్‌మోహన్‌గారి మల్టీ టాలెంట్‌ మా సినిమాకు చాలా ప్లస్‌ అవుతుంది అన్నారు. 


ఆర్టిస్ట్‌ దయానంద్‌రెడ్డి మాట్లాడుతూ... 

నేను ఇందులో నెగెటివ్‌ రోల్‌ చేశాను. జగన్‌మోహన్‌ గారు బేసిక్‌గా రంగస్థల కళాకారులు కావడం, దీనికితోడు వి.ఎఫ్‌.ఎక్స్‌లో మంచి ప్రావీణ్యం ఉండడంతో సినిమా అద్భుతంగా వచ్చింది. ఆయన ప్రతి క్యారెక్టర్‌, దాని బిహేవియర్‌, ఇతర మేనరిజమ్స్‌, మ్యాజిక్స్‌ ముందుగానే జాగ్రత్తగా పేపర్‌పైన పెట్టుకుని ఉండటం వల్ల మా అందరికీ పని చాలా సులువు అయిపోయింది. తప్పకుండా ప్రేక్షకులు కొత్తదనాన్ని ఫీలవుతారు అన్నారు.


నటి శ్వేత వర్మ మాట్లాడుతూ...

ఈ చిత్రంలో మన పక్కింటి తెలంగాణ పిల్ల క్యారెక్టర్‌ చేశాను. ఇందులో నేను క్యాబ్‌ డ్రైవర్‌ను. ఈ సినిమా కోసం ఆర్టిస్ట్‌లతో పాటు అనేకమంది టెక్నీషియన్స్‌ కూడా చాలా కష్టపడ్డారు. వారందరి సహకారంతోనే సినిమా ఇంత బాగా వచ్చింది. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌ అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ప్రసంగించారు. 

జగన్‌మోహన్‌, దేవిప్రసాద్‌, చంద్రకాంత్‌, ఛత్రపతి శేఖర్‌, శివన్నారాయణ, దయానంద్‌రెడ్డి, చక్రపాణి, కదిరి యోగి, శ్వేతావర్మ, రూపా లక్ష్మి, అల్లు రమేష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌ : ప్రణతి, ఎడిటర్‌: సి. యతీష్‌, డీఓపీ: శ్రీనివాస్‌, లిరిక్స్‌: రాంబాబు గోసల, స్టంట్స్‌: వింగ్‌ చున్‌ అంజి, సంగీతం: విజయ్‌ కూరాకుల, పీఆర్వో: బి. వీరబాబు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సంతోష్‌ గౌడ్‌.


Share this article :