‘సిద్ధార్థ్ రాయ్’ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేశాను. సినిమా తప్పకుండా ప్రేక్షకులందరినీ అలరించి నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తుందనే నమ్మకం వుంది: హీరో దీపక్ సరోజ్
టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ ‘సిద్ధార్థ్ రాయ్’ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్, పాటలు హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో దీపక్ సరోజ్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
‘సిద్ధార్థ్ రాయ్’ వరల్డ్ లోకి ఎలా ఎంటరయ్యారు ?
-చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశాను. 2016 వరకూ యాక్టివ్ గా చేస్తూనే వున్నాను. మిణుగురులు చిత్రంలో చేసిన పాత్రకు నంది అవార్డ్ కూడా వచ్చింది. అప్పుడే సినిమాలపై మరింత ప్యాషన్ పెరిగింది. తర్వాత ఓ ఐదేళ్ళు చదువుకున్నాను. ఎంబీఏ పూర్తయిన తర్వాత ఫ్యామిలీ బిజినెస్ లోకి వచ్చాను. ఈ సమయంలో దర్శకుడు యశస్వీ గారు సంప్రదించారు. కథ విన్నాక షాక్ అయ్యాను. అసలు అలాంటి పాత్ర చేయగలనా? అనుకున్నాను. యశస్వీ గారు నన్ను బలంగా నమ్మారు. అలా ‘సిద్ధార్థ్ రాయ్’ మొదలైయింది.
‘సిద్ధార్థ్ రాయ్’లో లోతైన తత్త్వం కనిపిస్తోంది..ఈ సినిమా కోసం ఎలా సిద్ధమయ్యారు? ఈ సినిమా చేసిన తర్వాత ఎలాంటి జ్ఞానోదయం కలిగింది ?
- సిద్ధార్థ్ రాయ్ పాత్ర చాలా లాజికల్ గా ఎక్స్ట్రీమిజంలో వుంటుంది. తను చాలా నాన్ రియాక్టివ్ గా ఉంటాడు. దాన్ని ప్రాక్టీస్ చేయడానికి నాకు చాలా సమయం పట్టింది. దాదాపు రెండు నెలలు పాటు చాలా విషయంలో నాన్ రియాక్టివ్ గా వుండటాని ప్రయత్నించాను. కొంత ఫిలాసఫీ కూడా చదివాను. రెండు నెలలు పాటు ఒక ఎమోషనల్ స్టెబిలిటీ అయితే వచ్చింది. కానీ మళ్ళీ పోయింది. ఎందుకంటే అదే ‘సిద్ధార్థ్ రాయ్’ మళ్ళీ ఎమోషనల్ అయిపోతాడు. మొదట్లో ఎంత కంట్రోల్ గా ఉంటాడో తర్వాత అంత అన్ కంట్రోల్ అయిపోతాడు. అలా జ్ఞానోదయం వచ్చినట్లే వచ్చి మళ్ళీ పోయింది(నవ్వుతూ). ఇది ప్లెయిన్ క్యారెక్టర్ కాదు. దిని కోసం చాలా ప్రిపేర్ అయ్యాను. అనుకున్నట్లు వస్తుందా రాదా అనే విషయంలో ఒత్తిడి కూడా వుండేది.
‘సిద్ధార్థ్ రాయ్’ టీజర్ ట్రైలర్ చూసినపుడు అర్జున్ రెడ్డి ఛాయలు కనిపించాయి? దిని ప్రభావం ఎలా వుంటుందని భావిస్తున్నారు?
-‘సిద్ధార్థ్ రాయ్’ లుక్ అలా అనిపించవచ్చు ఏమో కానీ ‘సిద్ధార్థ్ రాయ్’, అర్జున్ రెడ్డి కథలకు ఏ విషయంలోనూ పోలిక లేదు. రెండు భిన్నమైన కథలు. ట్రీట్ మెంట్ లో కూడా లింక్ వుండదు. సినిమా చూసినప్పుడు ప్రేక్షకులు కూడా పదో నిమిషం నుంచి మెల్లగా ‘సిద్ధార్థ్ రాయ్’ వరల్డ్ లోకి వచ్చేస్తారు.
‘సిద్ధార్థ్ రాయ్’ టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి ?
-ఈ సినిమాకి ‘సిద్ధార్థ్ రాయ్’ పేరుపెట్టడానికి బలమైన కారణం వుంది. ఇందులో సిద్ధార్థ్ అనేది రివర్స్ థీసెస్ అఫ్ గౌతమ బుద్ధ. దర్శకుడు యశస్వీ చాలా అద్భుతంగా స్క్రిప్ట్ చేశారు. సినిమా విడుదలైన తర్వాత దీనిని గురించి ఆయన ఇంకా వివరంగా చెబుతారు.
‘సిద్ధార్థ్ రాయ్’ పాత్ర అలా మారడాని కారణం చూపిస్తారా ?
-సామాజిక భాద్యతతోనే ఈ క్యారెక్టర్ ని డీల్ చేశాం. తను అలా మారడానికి, ప్రవర్తించడానికి మూలం ఎక్కడ మొదలైయింది ? అది ఎలా రూపాంతరం చెందిందనేది చూపించబోతున్నాం. ప్రేక్షకులు ఖచ్చితం యాక్సప్ట్ చేసే విధంగానే వుంటుంది. నా ప్రతిభను చూపించడానికి అద్భుతమైన అవకాశం ‘సిద్ధార్థ్ రాయ్’ రూపంలో దొరికింది. ఈ చిత్రం నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తుందనే నమ్మకం వుంది.
‘సిద్ధార్థ్ రాయ్’ పాత్ర కోసం దర్శకుడు మిమ్మల్నే ఎంచుకోవడానికి కారణం?
- ఇది రెగ్యులర్ స్టొరీ, హోమ్లీ క్యారెక్టర్ కాదు. దర్శకుడు కొందరిని సంప్రదించినప్పటికీ కుదరలేదు. ఫైనల్ గా కెమరా ఎక్స్పోజర్ వున్న చైల్డ్ ఆర్టిస్ట్ అయితే బావుటుందని బావించారు. అలా నన్ను సంప్రదించారు. ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ పాత్ర చేశాను. చాలా గొప్ప కన్విక్షన్ తో ఈ సినిమాని తీశారు. సినిమా చూసిన తర్వాత వర్త్ వాచింగ్ ఫీలింగ్ తో ప్రేక్షకులు బయటికి వెళ్తారు.
ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల కలయిక ‘సిద్ధార్థ్ రాయ్’ అనిపిస్తోంది ?
-లేదండీ. మీరు సినిమా చూసిన తర్వాత వాటితో పోలికే పెట్టారు. పాత్రల పరంగా చూసుకుంటే.. ఈ మూడు పాత్రల్లో ఎక్స్ ట్రీమిజం కామన్ గా అనిపించవచ్చు కానీ.. ఈ మూడు కథల నేపధ్యాలు వేరు. సిద్ధార్థ్ రాయ్ లో ప్రధాన సంఘర్షణ తను నమ్మి ఫిలాసఫీ, నమ్మకం పైన వుంటుంది. అది చాలా యూనిక్ చూపించాం.
దర్శకుడు యశస్వీ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-యశస్వీ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన చాలా కాన్ఫిడెంట్, గడ్సీ. గొప్ప కన్విక్షన్ తో సినిమాని తీశారు. మంచి వ్యక్తిత్వం వున్న మనిషి. మా జర్నీ వండర్ ఫుల్ గా సాగింది.
కొత్తగా చేయబోతున్న సినిమాలు ?
-రెండు సినిమాలు చేయబోతున్నాను. మార్చి, జూన్ లో మొదలౌతాయి. ఇవి ఫ్యామిలీ ఎంటర్ ఎంటర్ టైనర్స్.
ఆల్ ది బెస్ట్
-థాంక్స్