TFCC Felicitation to Music Director MM Keeravani and Lyricist Chandra Bose

 ప్రెస్ నోట్




సుస్వరవాణి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎం.ఎం కీరవాణి గారికి, సరస్వతి పుత్రులు గేయరచయిత శ్రీ చంద్రబోస్ గారికి,  "నాటు నాటు" పాటకు గాను ప్రతిష్టాత్మక ఆస్కార్ రావడాన్ని పురస్కరించుకుని, ఏప్రిల్ 9వ తారీఖున సాయంత్రం 6:00 గంటల నుండి, హైదరాబాద్ లోని శిల్పకళావేదిక లో తెలుగు సినీ పరిశ్రమ, వారికి సన్మానం చేసి గౌరవించనుంది. ఈ సన్మాన కార్యక్రమంలో సినీ పరిశ్రమకు సంబంధించిన నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, రచయితలు మరియు సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు.

తెలుగు సినిమాను ప్రేమించే ఆహూతులైన ప్రతి ఒక్కరికి ఈ సన్మాన కార్యక్రమం ఒక మంచి జ్ఞాపకం, గర్వించ దగిన ఉత్సాహం కానుంది.

       తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్

          (కె. ఎల్. దామోదర్ ప్రసాద్)

               గౌరవ కార్యదర్శి

Post a Comment

Previous Post Next Post