చిత్రం: బ్లాక్ అండ్ వైట్
నటి నటులు: హెబ్బా పటేల్, సూర్య శ్రీనివాస్, లహరి శరీ, నవీన్ నేని తదితరులు...
ఎడిటర్: శివ శర్వాని
సంగీతం: అజయ్ అర్రసాడ
ఛాయాగ్రహణం: టి.సురేంద్ర రెడ్డి
డైరెక్టర్: ఎల్.యెన్.వి సూర్య ప్రకాష్
నిర్మాత: పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి
విడుదల తేదీ: ఏప్రిల్ 14 2023
యుంగ్ డైరెక్టర్ ఎల్.యెన్.వి సూర్య ప్రకాష్ దర్శకత్వంలో హెబ్బా పటేల్, సూర్య శ్రీనివాస్, లహరి శరీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్లాక్ అండ్ వైట్’. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి నిర్మాతలుగా, ఎస్ ఆర్ ఆర్ట్స్ మరియు ఏ యు & ఐ స్టూడియోస్ బ్యానర్‌లపై నిర్మించారు. ఏప్రిల్ 14న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.
కథ: వర్ధన్(సూర్య శ్రీనివాస్) & స్వరాంజలి(హెబ్బా పటేల్) ఇద్దరు మూడు సంవత్సరాల పాటు కలిసి ‘సహజీవనం’ చేస్తారు. ఒకరోజు ‘జాను’ అనే అమ్మాయి నుంచి వర్ధన్ కి మెసేజ్ రావడం, అది గమనించిన స్వరాంజలి అడగటంతో ఇద్దరు గొడవపడతారు. ఆ గొడవలో ‘వర్ధన్’ ని చంపేస్తుంది. ఇంతకీ, ఆ జాను ఎవ్వరు? వర్ధన్ ని చంపినా స్వరాంజలి జైలు కి వెళ్లిందా? పప్పువా(నవీన్ నేని) ఎందుకు ‘స్వరాంజలి’ హౌస్ చుట్టూ తిరుగుతుంటాడు? ఇవ్వన్నీ తెలియాలి అంటే, మీరు సినిమా ని ఖచ్చితంగా చుడాలిసిందే?
కథనం, విశ్లేషణ: ‘వెలుగు చూడాలి అంటే, చీకటి సాయం తీసుకోవాలి’ అనేదే ఈ సినిమా టైటిల్(బ్లాక్ అండ్ వైట్) కథ. ఇలాంటి, పాయింట్ మీద గతంలో సినిమాలు కొకళ్ళలో వచ్చాయి. కాకపోతే, దర్శకుడు ఎల్.యెన్.వి సూర్య ప్రకాష్ కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేసారు.
సినిమా ఓపినింగ్ లో స్వరాంజలి(హెబ్బా పటేల్) ని ఎవ్వరో చంపడానికి వస్తున్నట్టు భయంతో స్వరాంజలి పరిగెడుతూ పోలీసుల రక్షణ తీసుకుంటుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్. వర్ధన్ & స్వరాంజలి మధ్య కెమిస్ట్రీ చాలా చక్కగా తెర మీద చూపించారు. రెండు సాంగ్స్ సినిమాలో ఉన్నప్పటికీ పెద్దగా ప్లస్ అవ్వలేదనే చెప్పాలి. సినిమాలో అక్కడక్కడ ‘వర్ధన్’ భయపెట్టించే కొన్ని సీన్స్ రక్తి కట్టిస్తాయి. సినిమా మొత్తం ఒక ఎత్తు అయ్యితే, క్లైమాక్స్ లో స్టేషన్ దగ్గర వచ్చే ‘ట్విస్’ట్ రివీల్ చేసిన విధానం అదిరిపోతుంది. స్వరాంజలి కి ఎంతో ఇష్టమైన పెయింటింగ్ లైవ్ విజ్యువల్స్ బాగుంటాయి. సినిమా చుసిన ప్రతి ప్రేక్షకుడు కొన్ని సంద్రభాలలో పగలా, రాత్రా అని సందిగ్ధంలో ఉన్నప్పటికీ సినిమా ని తప్పకుండ తెర మీద చూడవచ్చు.
దర్శకుడు ఎంచుకున్న కథ చూపించిన విధానం బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే లో ఇంకాస్త గ్రిప్పింగ్ ఉంటే బాగుండేది.
నటి నటులు పెర్ఫామెన్స్: మునుపెన్నడు చూడని విధంగా ‘హెబ్బా పటేల్’ మల్టీపుల్ షేడ్స్ తో సినిమాలో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. బిగ్ బాస్ ఫెమ్ ‘లహరి శరీ’ తనదైన యాక్టింగ్ ముద్ర వేసుకుంటూనే ముఖ్య పాత్ర పోషించింది. ‘సూర్య శ్రీనివాస్’ ఫ్లాష్ బ్యాక్ వెర్షన్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తునే ప్రెజెంట్ లో భయపెట్టించిన వేరియేషన్ బాగుంది. నవీన్ నేని పాత్రను సరిగ్గా స్క్రీన్ మీద ఉపయోగించలేకపోయినప్పటికీ యాక్టింగ్ లో బాగానే రాణించారు.
సాంకేతిక విభాగం: డైరెక్టర్ ’ఎల్.యెన్.వి సూర్య ప్రకాష్' కథ, కాస్టింగ్ ఎంచుకున్న తీరు బాగుంది. కాకపోతే, కథ ని చెప్పడంలో కాస్త ఇబ్బంది పడినట్టు కనిపిస్తుంది. శివ శర్వాని 'ఎడిటింగ్' విభాగంలో బాగా రాణించారు. సంగీతం అందించిన 'అజయ్ అర్రసాడ' సాంగ్స్ పర్వాలేదు అనిపించినప్పటికీ, అక్కడక్కడ వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కథ స్థాయికి రీచ్ అవ్వలేదు. టి.సురేంద్ర రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్.
బాటమ్ లైన్: భయపెట్టిన హీరో సూర్య శ్రీనివాస్ (బ్లాక్ & వైట్)
రేటింగ్: 3 /5